న్యూఢిల్లీ : శాంసంగ్ కంపెనీ యూజర్లకు ఆశ్చర్యకరమైన కానుక ఇచ్చింది. అమ్మకాల్లో దూసుకుపోతున్న గెలాక్సీ నోట్8, గెలాక్సీ ఎస్8లలో 'ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్' వేరియంట్లను శాంసంగ్ విడుదల చేసింది. ఈ కొత్త బిజినెస్ టూ బిజినెస్ ప్రొడక్ట్‌లు, బిజినెస్ వాడకాన్ని లక్ష్యంగా చేసుకుని మార్కెట్‌లోకి వచ్చాయి. గెలాక్సీ ఎస్8, నోట్ 8 ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్‌ల తయారీ గ్యారెంటీని శాంసంగ్ మూడేళ్లు పొడిగించింది. అయితే ఈ కొత్త వేరియంట్ల ధరలను కంపెనీ వెల్లడించలేదు. సాఫ్ట్‌వేర్‌ను మినహాయిస్తే, మిగతా స్పెషిఫికేషన్లన్నీ ముందస్తు వెర్షన్లకు ఈ వేరియంట్లకు ఒకేవిధంగా ఉన్నాయి.
గెలాక్సీ ఎస్8 ఫీచర్లు..
5.8 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే
కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
ఆక్టా-కోర్ ఎక్సీనోస్ ప్రాసెసర్
4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరుజ్
12 ఎంపీ డ్యూయల్-పిక్సెల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
గెలాక్సీ నోట్8 ఫీచర్లు...
6.3 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే
ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్
12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ షూటర్
3300 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment