న్యూఢిల్లీ : ఐఫోన్ 8, 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్‌లు గ్లోబల్ మార్కెట్‌లోకి లాంచ్ అయిన రోజే, శాంసంగ్ తన గెలాక్సీ నోట్ 8ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ రిజిస్ట్రేషన్లలోనే దుమ్మురేపింది. ప్రస్తుతం విక్రయాల్లోనూ దూసుకుపోతుంది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ మించిపోయి గెలాక్సీ నోట్ 8 విక్రయాలు జరుగుతున్నాయని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. డీలర్స్ సమాచారం మేరకు ఐఫోన్ 8, 8 ప్లస్‌లతో పోల్చి చూస్తే గెలాక్సీ నోట్ 8 స్మార్ట్‌ఫోనే ముందంజలో ఉన్నట్టు తెలిసింది. 100 గెలాక్సీ నోట్ 8 ఫోన్లను వినియోగదారులు కొనుగోలు చేస్తుంటే, కేవలం 60 నుంచి 70 వరకు ఐఫోన్ 8, 8 ప్లస్‌లు అమ్ముడుపోతున్నట్టు దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ డీలర్ చెప్పారు. ఐఫోన్ 8కు, నోట్ 8కు మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉన్నట్టు మొబైల్ డివైజస్, ఎకోసిస్టమ్స్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పథక్, కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. గెలాక్సీ నోట్8, ఐఫోన్ 8 మధ్య తీవ్ర పోటీ నెలకొందని, ఒకవేళ ఐఫోన్ ఎక్స్ మార్కెట్‌లోకి వస్తే పరిస్థితి మారవచ్చని, ప్రస్తుతానికైతే నోట్8 భారత్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నట్టు పథక్ తెలిపారు. ఆపిల్ యూజర్లు ఐఫోన్ ఎక్స్ కోసం వేచిచూస్తున్నారన్నారు.
సెప్టెంబర్ 29 నుంచి కొత్త ఐఫోన్ 8, 8 ప్లస్‌లు మార్కెట్‌లోకి వచ్చాయి. పెద్దగా మార్పులేమీ లేకుండా వీటిని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. 10వ వార్షికోత్సవ సందర్భంగా తీసుకొచ్చిన స్పెషల్ ఐఫోన్ ఎక్స్ వచ్చే నెలలో మార్కెట్‌లోకి వస్తుంది. ఐఫోన్ 8 64జీబీ ధర రూ.64వేల కాగ, 256జీబీ వేరియంట్ ధర రూ.77వేలు. అదేవిధంగా ఐఫోన్ 8 ప్లస్ ప్రారంభ ధర రూ.73వేలుగా ఉంది. కొత్త ఆవిష్కరణలు ఏం లేకుండా వచ్చిన ఈ ఫోన్లకు అంత మొత్తంలో ధరలు పెట్టడానికి వినియోగదారులు శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ నోట్8 అమ్మకాలతో రికార్డు సృష్టించాలని చూస్తోంది. ఒకవేళ నోట్8 అమ్మకాలు ఇదే స్థాయిలో దూసుకెళ్తే శాంసంగ్‌కు ఈ ఏడాది 'రికార్డు ఇయర్' గ్యారెంటీ అని విశ్లేషకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment