Galaxy Note 8
-
శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 పై రూ. 32వేలు తగ్గింపు
సాక్షి, ముంబై : ఫ్లిప్‌కార్ట్ శాంసంగ్ గెలాక్స్ నెట్ 8 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న 'నేషనల్ షాపింగ్ డేస్ సేల్' లో శాంసంగ్ గెలాక్స్ నోట్ 8 ను రూ. 34,990లకే అందిస్తోంది. 2017లో లాంచ్ అయిన గెలాక్సీ నోట్ 8పై రూ.32,910 ల ప్రత్యేక తగ్గింపును అందిస్తోందన్నమాట. ఈ సేల్ రేపు(శనివారం) ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు మరికొన్ని స్మార్ట్ఫోన్లపై కూడా డిస్కౌంట్లను అందిస్తోంది. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ , క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. నిబంధనలకు లోబడి పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి సమయంలో రూ .17,900 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. గెలాక్సీ నోట్ 8 ఫీచర్ల విషయానికి వస్తే 6.3 ఇంచెస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ప్లే,1440x2960 పిక్సెల్స్ రిజల్యూషన్, ఐపి 68 సర్టిఫికేషన్, డబుల్ రియర్ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ మెయిన్ ఫీచర్లుగా ఉన్నాయి. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ గెలాక్సీ నోట్ 8 ను సెప్టెంబర్, 2017 లో రూ .67,900 ధర వద్ద లాంచ్ చేసింది. -
ఐఫోన్ ఎక్స్ అద్దె రూ.4,299
ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్, వెహికిల్స్‌ను అద్దెకు తీసుకుని వాడుకోవడం తెలిసే ఉంటుంది. కానీ స్మార్ట్‌ఫోన్ అద్దెకు తీసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. కన్జ్యూమర్ రెంటల్ వెబ్సైట్ రెంటోమోజో, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్, వెహికిల్స్‌తో పాటు స్మార్ట్ఫోన్లను అద్దెకు ఇవ్వడం ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫామ్ ఫ్లాగ్షిప్ డివైజ్‌లు ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8, గూగుల్ పిక్సెల్ 2, శాంసంగ్ గెలాక్సీ ఎస్9, శాంసంగ్ గెలాక్సీ నోట్ 8లను ఆరు నెలలకు, ఏడాదికి, రెండేళ్లకు అద్దెకు ఇవ్వడం ఆఫర్ చేస్తోది. ఈ స్మార్ట్ఫోన్ల అద్దె నెలకు రూ.2,099 నుంచి ప్రారంభమై, రూ.9,299 వరకు ఉంది. రెండేళ్ల అద్దె తర్వాత ఆ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ సొంతం కూడా చేసుకునే ఆప్షన్‌ను రెంటోమోజో ఆఫర్ చేస్తోంది. రెంటోమోజో వెబ్సైట్లో ఐఫోన్ ఎక్స్ అద్దె నెలకు 4,299 రూపాయలుగా ఉంది. ఒకవేళ 24 నెలలు పాటు అద్దెకు దీన్ని బుక్ చేసుకోవాలంటే 4,299 రూపాయలను నెల నెలా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆరు నెలలకు దీన్ని అద్దెకు తీసుకోవాలనుకుంటే, నెలకు రూ.9,299ను చెల్లించాలి. ఎక్కువ కాలం పాటు అద్దెలు, వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నాయి. ఒకవేళ 24 నెలల తర్వాత ఈ ఐఫోన్ ఎక్స్ మీకు కావాలంటే అదనంగా రూ.15,556ను చెల్లించాలి. తొలుత రీఫండబుల్ డిపాజిట్‌గా 9,998 రూపాయలను కూడా రెంటోమోజో తీసుకుంటోంది. అత్యంత తక్కువ అద్దె గూగుల్ పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్‌పై ఉంది. 24 నెలల కాలానికి నెలవారీ 2,099 రూపాయలను చెల్లించాలి. ఆరు నెలలకు దీని అద్దె నెలవారీ 5,398 రూపాయలుగా ఉంది. గూగుల్ పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్‌కు కూడా రూ.5,398 రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి. అలాగే ఐఫోన్ 8, శాంసంగ్ గెలాక్సీ ఎస్9, గెలాక్సీ నోట్ 8లు కూడా అద్దెకు అందుబాటులో ఉన్నాయి. రెంటోమోజో అద్దెకు ఉంచిన డివైజ్‌లన్నీ ఖరీదైనవే. కొంత కాలమైనా ఆ ఫోన్లను వాడాలనే ఆశ కలిగి వారికి, రెంటోమోజో ఈ బంపర్ కానుకను అందిస్తుంది. -
ఆ పాపులర్ స్మార్ట్ఫోన్లపై 8వేల క్యాష్‌బ్యాక్
పాపులర్ శాంసంగ్ డివైజ్‌లపై అమెజాన్ ఇండియా క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. మార్చి 5 నుంచి ప్రారంభమైన శాంసంగ్ కార్నివల్ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన శాంసంగ్ స్మార్ట్ఫోన్లపై 8వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు అమెజాన్ తెలిపింది. అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో ఈ క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. గెలాక్సీ ఏ సిరీస్, గెలాక్సీ ఆన్ సిరీస్, గెలాక్సీ నోట్ సిరీస్ స్మార్ట్ఫోన్లపై ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తించనుంది. స్మార్ట్ఫోన్లపై మాత్రమే కాకుండా.. ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లు టెలివిజన్లు, హోమ్ అప్లియెన్స్, టాబ్లెట్లు, వేరియబుల్స్, స్టోరేజ్ గాడ్జెట్లను కూడా శాంసంగ్ డిస్కౌంట్లలో అందుబాటులో ఉంచింది. అమెజాన్ ఎక్స్‌క్లూజివ్ స్మార్ట్ఫోన్లు- శాంసంగ్ గెలాక్సీ ఏ8ప్లస్‌పై 4వేల రూపాయల అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఈ క్యాష్‌బ్యాక్ అనంతరం దీని ధర 28,990 రూపాయలకు దిగొచ్చింది. గెలాక్సీ ఆన్7 ప్రైమ్(32జీబీ) స్మార్ట్‌ఫోన్ ధర కూడా రెండు వేల రూపాయల క్యాష్‌బ్యాక్ అనంతరం 10,990 రూపాయలుగా ఉంది. గెలాక్సీ ఆన్7 ప్రైమ్ 64జీబీ వేరియంట్ అమెజాన్ ఇండియాలో 12,990 రూపాయలకు అందుబాటులోకి వచ్చింది. గెలాక్సీ నోట్ 8పై అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ 8వేల రూపాయలను అందిస్తోంది. దీంతో దీని ధర కూడా 59,900 రూపాయలకు దిగొచ్చింది. అదనంగా గెలాక్సీ ఆన్5 ప్రొ, గెలాక్సీ ఆన్7 ప్రొలపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. గెలాక్సీ జే7 ప్రైమ్, గెలాక్సీ జే7 ప్రొ, గెలాక్సీ జే5 ప్రైమ్‌తో పాటు పలు శాంసంగ్ మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 1,500 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై అమెజాన్ 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. అయితే అది స్మార్ట్ఫోన్లు, వేరియబుల్స్, టాబ్లెట్లకు వర్తించడం లేదు. కేవలం టెలివిజన్లు, హోమ్ అప్లియెన్స్, ఫర్నీచర్, ల్యాప్‌టాప్‌లకు మాత్రమే అందిస్తోంది. పేటీఎం మాల్ కూడా శాంసంగ్ ఫోన్లపై 10వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. -
శాంసంగ్ ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది
సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 8 ధరను కంపెనీ తగ్గించింది. ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.3000 మేర ధరను తగ్గిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.67,900 కాగ, ధర తగ్గింపు అనంతరం గెలాక్సీ నోట్ 8 రూ.64,900కు అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో ఇప్పటి వరకు శాంసంగ్ లాంచ్ చేసిన అన్ని ఫోన్లలో గెలాక్సీ నోట్ 8 మాత్రమే అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్. ఎక్స్‌క్లూజివ్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇండియాలో మాత్రమే అందుబాటులో ఉంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లకు అమెజాన్ 4000 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఆఫర్ చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఫీచర్లు.. 6.3 అంగుళాల క్వాడ్ హెచ్‌డీప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ప్లే ఆక్టా-కోర్ క్వాల్కామ్ 835 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్ 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ 12 ఎంపీ సెన్సార్లతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ 8ఎంపీ ఫ్రంట్ కెమెరా 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేసియల్ రికగ్నైజేషన్, ఐరిష్ స్కానర్ శాంసంగ్ పే సపోర్టు కంపెనీ సొంత డిజిటల్ అసిస్టెంట్ బిక్స్బీ -
గెలాక్సీ ఎస్8, నోట్8 లలో కొత్త ఎడిషన్
న్యూఢిల్లీ : శాంసంగ్ కంపెనీ యూజర్లకు ఆశ్చర్యకరమైన కానుక ఇచ్చింది. అమ్మకాల్లో దూసుకుపోతున్న గెలాక్సీ నోట్8, గెలాక్సీ ఎస్8లలో 'ఎంటర్ప్రైజ్ ఎడిషన్' వేరియంట్లను శాంసంగ్ విడుదల చేసింది. ఈ కొత్త బిజినెస్ టూ బిజినెస్ ప్రొడక్ట్‌లు, బిజినెస్ వాడకాన్ని లక్ష్యంగా చేసుకుని మార్కెట్లోకి వచ్చాయి. గెలాక్సీ ఎస్8, నోట్ 8 ఎంటర్ప్రైజ్ ఎడిషన్ల తయారీ గ్యారెంటీని శాంసంగ్ మూడేళ్లు పొడిగించింది. అయితే ఈ కొత్త వేరియంట్ల ధరలను కంపెనీ వెల్లడించలేదు. సాఫ్ట్‌వేర్‌ను మినహాయిస్తే, మిగతా స్పెషిఫికేషన్లన్నీ ముందస్తు వెర్షన్లకు ఈ వేరియంట్లకు ఒకేవిధంగా ఉన్నాయి. గెలాక్సీ ఎస్8 ఫీచర్లు.. 5.8 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ డిస్ప్లే కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఆక్టా-కోర్ ఎక్సీనోస్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరుజ్ 12 ఎంపీ డ్యూయల్-పిక్సెల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ గెలాక్సీ నోట్8 ఫీచర్లు... 6.3 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ప్లే ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ 12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ షూటర్ 3300 ఎంఏహెచ్ బ్యాటరీ -
రికార్డ్స్ : ఐఫోన్ 8ను దాటేసింది
న్యూఢిల్లీ : ఐఫోన్ 8, 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్‌లు గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ అయిన రోజే, శాంసంగ్ తన గెలాక్సీ నోట్ 8ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ రిజిస్ట్రేషన్లలోనే దుమ్మురేపింది. ప్రస్తుతం విక్రయాల్లోనూ దూసుకుపోతుంది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ మించిపోయి గెలాక్సీ నోట్ 8 విక్రయాలు జరుగుతున్నాయని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. డీలర్స్ సమాచారం మేరకు ఐఫోన్ 8, 8 ప్లస్లతో పోల్చి చూస్తే గెలాక్సీ నోట్ 8 స్మార్ట్ఫోనే ముందంజలో ఉన్నట్టు తెలిసింది. 100 గెలాక్సీ నోట్ 8 ఫోన్లను వినియోగదారులు కొనుగోలు చేస్తుంటే, కేవలం 60 నుంచి 70 వరకు ఐఫోన్ 8, 8 ప్లస్‌లు అమ్ముడుపోతున్నట్టు దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ డీలర్ చెప్పారు. ఐఫోన్ 8కు, నోట్ 8కు మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉన్నట్టు మొబైల్ డివైజస్, ఎకోసిస్టమ్స్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పథక్, కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. గెలాక్సీ నోట్8, ఐఫోన్ 8 మధ్య తీవ్ర పోటీ నెలకొందని, ఒకవేళ ఐఫోన్ ఎక్స్ మార్కెట్లోకి వస్తే పరిస్థితి మారవచ్చని, ప్రస్తుతానికైతే నోట్8 భారత్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నట్టు పథక్ తెలిపారు. ఆపిల్ యూజర్లు ఐఫోన్ ఎక్స్ కోసం వేచిచూస్తున్నారన్నారు. సెప్టెంబర్ 29 నుంచి కొత్త ఐఫోన్ 8, 8 ప్లస్‌లు మార్కెట్లోకి వచ్చాయి. పెద్దగా మార్పులేమీ లేకుండా వీటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 10వ వార్షికోత్సవ సందర్భంగా తీసుకొచ్చిన స్పెషల్ ఐఫోన్ ఎక్స్ వచ్చే నెలలో మార్కెట్లోకి వస్తుంది. ఐఫోన్ 8 64జీబీ ధర రూ.64వేల కాగ, 256జీబీ వేరియంట్ ధర రూ.77వేలు. అదేవిధంగా ఐఫోన్ 8 ప్లస్ ప్రారంభ ధర రూ.73వేలుగా ఉంది. కొత్త ఆవిష్కరణలు ఏం లేకుండా వచ్చిన ఈ ఫోన్లకు అంత మొత్తంలో ధరలు పెట్టడానికి వినియోగదారులు శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ నోట్8 అమ్మకాలతో రికార్డు సృష్టించాలని చూస్తోంది. ఒకవేళ నోట్8 అమ్మకాలు ఇదే స్థాయిలో దూసుకెళ్తే శాంసంగ్‌కు ఈ ఏడాది 'రికార్డు ఇయర్' గ్యారెంటీ అని విశ్లేషకులు చెబుతున్నారు. -
శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 వచ్చేసింది!
సాక్షి: కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ గెలాక్సీ నోట్8 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో మంగళవారం లాంచ్ చేసింది. ఇప్పటికే భారీ బుకింగ్స్‌ను సొంతం చేసుకున్న ఈ డివైస్‌పై భారీ ఆసక్తి నెలకొంది. ‘బిగ్స్‌బీ’ వాయిస్ యాప్ తో దీన్ని లాంచ్ చేసింది. అలాగే అద్భుతమైన డిస్ప్లే, ఐరిస్ స్కానర్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ స్పెషల్ ఫీచర్‌గా శాంసంగ్ చెబుతోంది. దీని ధర రూ.67,900తు. సెప్టెంబర్ 21 నుంచి ఇది కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఈరోజు నుంచే సెప్టెంబర్12నుంచి మొదలయ్యాయి. ఇక లాంచింగ్ ఆఫర్ల విషయానికి వస్తే వైర్లెస్ చార్జర్ ఉచితం. వన్‌టైం స్క్రీన్ రిప్లేస్మెంట్ ఉచితం. హెచ్డీఎఫ్సీ వినియోగదారులకు రూ.4వేల క్యాఫ్‌బ్యాక్ ఆపర్ ను అందిస్తోంది . రిజిస్ట్రేషన్ల సంఖ్య 6 లక్షల 50వేలను దాటేసిందని శాంసంగ్ వెల్లడించింది. నోట్ బుకింగ్స్ ఇదే అత్యధికమని పేర్కొంది శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఫీచర్లు 6.3 ఇంచ్ క్వాడ్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ 1440 x 2960 రిజల్యూషన్ 6 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 12 +12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ చార్జింగ్, వైర్ లెస్ చార్జింగ్ వంటి ప్రత్యేకతలు గెలాక్సీ నోట్8లో ఉన్నాయి -
పోటాపోటీగా ఒకే రోజు వస్తున్న ఆ ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ దిగ్గజాలు ఆపిల్, శాంసంగ్‌లు హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి. పోటాపోటీగా ఒకేరోజు ఈ రెండు స్మార్ట్‌ఫోన్ దిగ్గజాలు తమ కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయబోతున్నాయి. అయితే దీనిలో ఒక లాజిక్ ఉంది. ఆపిల్ తన అభిమానులు ఎంతో కాలంగా వేచిచూస్తున్న కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 12న కాలిఫోర్నియాలో లాంచ్ చేస్తుండగా.. శాంసంగ్ అత్యంత ప్రతిష్టాత్మక మార్కెట్ అయిన భారత్‌లో తన గెలాక్సీ నోట్ 8ను విడుదల చేస్తుంది. డీలర్ వర్గాల సమాచారం మేరకు శాంసంగ్ ఈవెంట్ పేరు చెప్పకుండా.. ఆహ్వానాలు పంపుతుందని తెలిసింది. ఈ ఆహ్వానాల మేరకు శాంసంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ డివైజ్‌నే లాంచ్ చేయబోతుందని తెలుస్తోంది. ఐఫోన్8 లాంచ్ గురించి ముందే తెలిసిన శాంసంగ్, సెప్టెంబర్ 12నే ఈ లాంచ్ ఈవెంట్‌ను ఏర్పాటుచేసిందని మార్కెట్ వర్గాల టాక్. భారత్‌లో శాంసంగ్‌కు బలమైన స్థానం ఉంది. 43 శాతం మార్కెట్ షేరుతో ఆధిపత్య స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు శాంసంగ్‌కు ఎప్పడికప్పుడూ ఆపిల్ గట్టిపోటీ ఇస్తూనే ఉంది. ఆగస్టులో అంతర్జాతీయంగా లాంచ్ అయిన గెలాక్సీ నోట్ 8 ప్రస్తుతం భారత్‌లోకి వస్తుంది. ఆపిల్ ఐఫోన్ 8 మరీ భారత్‌లోకి ఎప్పుడు వస్తుందో ఇంకా తెలియరాలేదు. శాంసంగ్ తన గెలాక్సీ నోట్ 8ను బిక్స్బీ ఇంటిలిజెంట్ అసిస్టెంట్, వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌తో మార్కెట్లోకి తీసుకొచ్చింది. 6.3 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 64 బిట్ ఎక్సీనోస్ 8895 ఆక్టాకోర్ ప్రాసెసర్ చిప్సెట్, 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, దీనిలో ఫీచర్లు. -
గెలాక్సీ నోట్ 8 లాంచింగ్..
న్యూఢిల్లీ : గెలాక్సీ నోట్ 7 ఫెయిల్యూర్‌తో తర్వాత, దాని తర్వాత స్మార్ట్‌ఫోన్‌గా శాంసంగ్ తీసుకురాబోతున్న గెలాక్సీ నోట్ 8 నేడే విడుదల కాబోతుంది. న్యూయార్క్ వేదికగా స్పెషల్ ఈవెంట్లో ఈ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేయబోతుంది. ఈ గెలాక్సీని అన్ని అంశాల పరంగా ఎక్కువ శక్తివతంగా, మెరుగ్గా కంపెనీ తీర్చిదిద్దింది. ఇప్పటికే ఈ ఫోన్‌పై పలు లీకేజీలు, రూమర్లు మార్కెట్లో చక్కర్లు కొట్టాయి. కొన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లే ధృవీకరించారు. ఈ గెలాక్సీ 8 ధర గెలాక్సీ నోట్ 7 కంటే ఎక్కువ ఉండొచ్చని తెలుస్తోంది. వెంచర్ బీట్ రిపోర్టు ప్రకారం ఈ డివైజ్ సుమారు 1000 డాలర్లు అంటే సమారు రూ.64వేల మధ్యలో ఉండొచ్చని టాక్. మార్కెట్లు, వేరియంట్ల బట్టి ధరల్లో మార్పులు కూడా చోటుచేసుకోనున్నాయి. నేడు లాంచ్ అయ్యే ఈ ఫోన్ సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్‌లో భారత మార్కెట్లోకి రానుంది. శాంసంగ్‌కు భారత్ అదిపెద్ద మార్కెట్లలో ఒకటి. శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ డివైజ్‌లకు ఉన్నమాదిరే ఈ ఫోన్ వెనుకవైపు మెటల్ గ్లాస్‌తో రూపొందుతుంది. అంచనాల ప్రకారం గెలాక్సీ నోట్ 8 మిగతా ఫీచర్లు... 6.3 అంగుళాల క్యూహెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ కొన్ని మార్కెట్లలో ఎక్సీనోస్ ప్రాసెసర్ వేరియంట్లు కూడా 12మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ 4జీబీ ర్యామ్ లేదా 6జీబీ ర్యామ్ 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 256జీబీ వరకు విస్తరణ 3300ఎంఏహెచ్ బ్యాటరీ -
శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 కమింగ్...
శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలుళ్లతో భారీ నష్టాలను మూటగట్టుకున్న శాంసంగ్ నోట్ సిరీస్‌ను కొనసాగించనున్నట్టు అధికారికంగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో గెలాక్సీ 8నోట్‌ను లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2017 సంవత్సరం ద్వితీయార్థంలో ఈ స్మార్ట్‌ఫోన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు సమాచారం. ముఖ్యంగా శాంసంగ్ ఫలితాల సందర్భంగా శాంసంగ్ చీఫ్ డీజే కో ఈ విషయాన్ని సూచన ప్రాయంగా ప్రకటించారు. శాంసంగ్ గురువారం మార్చి 31 తో ముగిసిన త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. ఈ సందర్బంగా తన కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నామని సంస్థ తెలిపింది. 2017 రెండవ భాగంలో దీన్ని విడుదల చేస్తామని పేర్కొంది. కాగా గత ఏడాది ఆగస్టులో గెలాక్స్ నోట్ 7 లాంచ్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోన్బ్యాటరీ పేలుడు ఘటనలు నమోదు కావడంతో మొత్తం డివైస్‌ను వెనక్కి తీసుకుంది. దీంతో ఈ సంక్షోభంతో నోట్ సిరీస్‌కు శాంసంగ్ ఇక స్వస్తి పలికినట్టేనని ఊహాగానాలు వచ్చాయి. అలాగే గెలాక్సీ నోట్ 8 ఏప్రిల్ 2017 లో రానుందని మొదట అంచనాలు చెలరేగాయి. మరోవైపు గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ వైఫల్యం కారణంగా వినియోగదారుల విశ్వసనీయతను కోల్పొ వటంతో ఈసారి బ్యాటరీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం.