శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8 వచ్చేసింది! | Samsung Galaxy Note 8 launch event LIVE: Note 8 first smartphone ever to feature OIS tech in both cameras | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8 వచ్చేసింది!

Published Tue, Sep 12 2017 2:01 PM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM

Samsung Galaxy Note 8 launch event LIVE: Note 8 first smartphone ever to feature OIS tech in both cameras



సాక్షి: 
కొరియా మొబైల్‌ మేకర్‌ శాంసంగ్‌  గెలాక్సీ నోట్‌8 స్మార్ట్‌ఫోన్‌ను  ఇండియాలో మంగళవారం లాంచ్‌ చేసింది.   ఇప్పటికే భారీ బుకింగ్స్‌ను సొంతం చేసుకున్న ఈ డివైస్‌పై  భారీ ఆసక్తి నెలకొంది.  ‘బిగ్స్‌బీ’  వాయిస్‌ యాప్‌ తో దీన్ని లాంచ్‌ చేసింది.  అలాగే  అద్భుతమైన డిస్‌ప్లే,  ఐరిస్‌ స్కానర్‌, వాటర్‌ అండ్‌ డస్ట్‌ రెసిస్టెంట్‌  స్పెషల్‌ ఫీచర్‌గా శాంసంగ్‌ చెబుతోంది. దీని ధర  రూ.67,900తు. సెప్టెంబర్‌ 21 నుంచి ఇది కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది.  ఈరోజు నుంచే సెప్టెంబర్‌12నుంచి మొదలయ్యాయి.

ఇక లాంచింగ్‌ ఆఫర్ల  విషయానికి వస్తే వైర్‌లెస్‌ చార్జర్‌  ఉచితం. వన్‌టైం స్క్రీన్‌ రిప్లేస్‌మెంట్‌  ఉచితం. హెచ్‌డీఎఫ్‌సీ   వినియోగదారులకు రూ.4వేల క్యాఫ్‌బ్యాక్‌ ఆపర్‌ ను అందిస్తోంది .   రిజిస్ట్రేషన్ల సంఖ్య 6 లక్షల 50వేలను  దాటేసిందని శాంసంగ్‌ వెల్లడించింది. నోట్‌ బుకింగ్స్‌ ఇదే అత్యధికమని పేర్కొంది  



శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8  ఫీచర్లు
 6.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే
కార్నింగ్‌  గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌
1440 x 2960 రిజల్యూషన్‌
6 జీబీ ర్యామ్‌
64 జీబీ స్టోరేజ్
256  జీబీ దాకా విస్తరించుకునే  అవకాశం
12 +12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ
 ఫాస్ట్ చార్జింగ్‌, వైర్ లెస్ చార్జింగ్ వంటి ప్ర‌త్యేక‌త‌లు గెలాక్సీ నోట్‌8లో ఉన్నాయి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement