వచ్చేశాయి..శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌..! సూపర్‌ ఫీచర్స్‌తో ఇంకా.. | Samsung Galaxy S22 Series Smartphones Launched | Sakshi
Sakshi News home page

వచ్చేశాయి..శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌..! సూపర్‌ ఫీచర్స్‌తో ఇంకా..

Published Thu, Feb 10 2022 1:45 PM | Last Updated on Thu, Feb 10 2022 1:45 PM

Samsung Galaxy S22 Series Smartphones Launched - Sakshi

ఎట్టకేలకు శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ను శాంసంగ్‌ లాంచ్‌ చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్22 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను శాంసంగ్‌ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2022 ఈవెంట్‌లో విడుదల చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్22 సిరీస్‌లో భాగంగా...శాంసంగ్‌ గెలాక్సీ ఎస్22,  గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22 అల్ట్రా మూడు స్మార్ట్‌ఫోన్లను శాంసంగ్‌ రిలీజ్‌ చేసింది. ఫ్లాగ్‌షిప్‌ స్పెసిఫికేషన్లతో హైఎండ్ మోడల్స్‌గా నిలవనున్నాయి. 

ధర ఎంతంటే..?

  • శాంసంగ్‌ గెలాక్సీ ఎస్22 స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో రానుంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్ + 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్లలో రానుంది.  శాంసంగ్‌ గెలాక్సీ ఎస్22 స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర 799డాలర్లు (దాదాపు రూ.59,800)గా ఉండనుంది.
     
  • శాంసంగ్‌ గెలాక్సీ ఎస్22 ప్లస్ కూడా 8జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ, 8జీబీ ర్యామ్ + 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ రెండు వేరియంట్లలో రానుంది. ఈ ఫోన్‌ ప్రారంభ ధర 999డాలర్లు (సుమారు రూ.74,800)గా ఉంది. 
     
  • శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ 8జీబీ ర్యామ్‌ + 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 12జీబీ ర్యామ్‌ + 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 12జీబీ ర్యామ్‌ + 512జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 12జీబీ ర్యామ్‌ + 1టీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్లలో రానుంది. ఈ ఫోన్‌ ప్రారంభ ధర 1199 డాలర్లు(దాదాపు రూ. 89, 700)గా ఉంది. బ్లాక్‌, వైట్‌, పింక్ గోల్డ్, ఫాంటమ్ గ్రీన్ కలర్లలో లభించనున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్స్‌ భారత్‌లో ఎప్పుడూ లభ్యమవుతాయనే విషయంపై కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 స్మార్ట్‌ఫోన్స్‌ అమ్మకాలు ఫిబ్రవరి 25న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్22 స్ఫెసిఫికేషన్స్‌..!

  • 6.1-అంగుళాల పూర్తి-HD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే
  •  గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణ
  • ఆండ్రాయిడ్‌ 12
  • ఆక్టా-కోర్ 4nm ప్రాససర్‌
  • 50 ఎంపీ+ 12 ఎంపీ+ 10 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌
  • 10 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 8జీబీ ర్యామ్‌+ 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 5జీ సపోర్ట్‌
  • బ్లూటూత్ v5.2
  • యూఎస్‌బీ టైప్‌ సీ సపోర్ట్‌
  • అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
  • 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ విత్‌ వైర్‌లెస్‌ పవర్‌షేర్‌
  • 3,700mAh బ్యాటరీ

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్22ప్లస్‌ స్పెసిఫికేషన్స్‌..!

  • 6.6-అంగుళాల పూర్తి-HD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే
  • గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణ
  • ఆండ్రాయిడ్‌ 12
  • ఆక్టా-కోర్ 4nm ప్రాససర్‌
  • 50 ఎంపీ+ 12 ఎంపీ+ 10 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌
  • 10 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 12జీబీ ర్యామ్‌+ 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 5జీ సపోర్ట్‌
  • బ్లూటూత్ v5.2
  • యూఎస్‌బీ టైప్‌ సీ సపోర్ట్‌
  • అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • 45 W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
  • 15 W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ విత్‌ వైర్‌లెస్‌ పవర్‌షేర్‌
  • 4,500mAh బ్యాటరీ

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 అల్ట్రా స్పెసిఫికేషన్స్‌

  • 6.8-అంగుళాల QHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే
  • గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణ
  • ఆండ్రాయిడ్‌ 12
  • ఆక్టా-కోర్ 4nm ప్రాససర్‌
  • 108 ఎంపీ+ 12 ఎంపీ+ 10 ఎంపీ+ 10 ఎంపీ క్వాడ్‌ రియర్‌ కెమెరా సెటప్‌
  • 40 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 12జీబీ ర్యామ్‌+ 1 టీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 5జీ సపోర్ట్‌
  • బ్లూటూత్ v5.2
  • యూఎస్‌బీ టైప్‌ సీ సపోర్ట్‌
  • అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
  •  45W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
  • 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ విత్‌ వైర్‌లెస్‌ పవర్‌షేర్‌
  • 5,000mAh బ్యాటరీ

చదవండి: వచ్చేశాయి..రెడ్‌మీ నోట్‌ 11 స్మార్ట్‌ఫోన్స్‌..! బడ్జెట్‌ ధరలో అద్బుతమైన ఫీచర్స్‌తో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement