ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్‌లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ సిరీస్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ఫోన్ విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్9, ఆసుస్ రాగ్ ఫోన్ 5 స్మార్ట్‌ఫోన్లకు పోటీగా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ధర రూ. రూ.49,999 నుంచి ప్రారంభంకానుంది. ఈ మొబైల్ కోసం ముందస్తు బుకింగ్‌లు ఇప్పటికే మొదలయ్యాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ జనవరి 11 నుంచి శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, ఈ-కామర్స్ సైట్ అమెజాన్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉండనుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5,000 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌ను శాంసంగ్ అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ వైట్, గ్రాఫైట్, ఆలివ్ కలర్ వేరియంట్లలో కొనుగోలుదారులకు లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 8GBర్యామ్+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ల్లో లభించనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ఫీచర్స్..!
- 6.4-అంగుళాల AMOLED 2X డిస్‌ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్
- ఎక్సినోస్ 2100 ప్రాసెసర్
- 8GBర్యామ్+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్
- 12ఎంపీ+12ఎంపీ+8ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
- 32-ఎంపీ ఫ్రంట్ కెమెరా
- ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ రీడర్
- డ్యూయల్-రికార్డింగ్ మోడ్
- 4,500mAh బ్యాటరీ
- 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
చదవండి: Samsung: శాంసంగ్ సంచలన నిర్ణయం..! ఇకపై ఆ సేవలు పూర్తిగా బంద్..!
Comments
Please login to add a commentAdd a comment