samsung galaxy s series
-
వచ్చేశాయి..శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్..! సూపర్ ఫీచర్స్‌తో ఇంకా..
ఎట్టకేలకు శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ను శాంసంగ్ లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ స్మార్ట్ఫోన్లను శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ 2022 ఈవెంట్లో విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్‌లో భాగంగా...శాంసంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22 అల్ట్రా మూడు స్మార్ట్ఫోన్లను శాంసంగ్ రిలీజ్ చేసింది. ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్లతో హైఎండ్ మోడల్స్‌గా నిలవనున్నాయి. ధర ఎంతంటే..? శాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో రానుంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో రానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర 799డాలర్లు (దాదాపు రూ.59,800)గా ఉండనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్ కూడా 8జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8జీబీ ర్యామ్ + 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ రెండు వేరియంట్లలో రానుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర 999డాలర్లు (సుమారు రూ.74,800)గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 1టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో రానుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర 1199 డాలర్లు(దాదాపు రూ. 89, 700)గా ఉంది. బ్లాక్, వైట్, పింక్ గోల్డ్, ఫాంటమ్ గ్రీన్ కలర్లలో లభించనున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్స్ భారత్‌లో ఎప్పుడూ లభ్యమవుతాయనే విషయంపై కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాలు ఫిబ్రవరి 25న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్ఫెసిఫికేషన్స్..! 6.1-అంగుళాల పూర్తి-HD+ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణ ఆండ్రాయిడ్ 12 ఆక్టా-కోర్ 4nm ప్రాససర్ 50 ఎంపీ+ 12 ఎంపీ+ 10 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 10 ఎంపీ సెల్ఫీ కెమెరా 8జీబీ ర్యామ్+ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 5జీ సపోర్ట్ బ్లూటూత్ v5.2 యూఎస్బీ టైప్ సీ సపోర్ట్ అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ విత్ వైర్లెస్ పవర్‌షేర్ 3,700mAh బ్యాటరీ శాంసంగ్ గెలాక్సీ ఎస్22ప్లస్ స్పెసిఫికేషన్స్..! 6.6-అంగుళాల పూర్తి-HD+ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణ ఆండ్రాయిడ్ 12 ఆక్టా-కోర్ 4nm ప్రాససర్ 50 ఎంపీ+ 12 ఎంపీ+ 10 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 10 ఎంపీ సెల్ఫీ కెమెరా 12జీబీ ర్యామ్+ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 5జీ సపోర్ట్ బ్లూటూత్ v5.2 యూఎస్బీ టైప్ సీ సపోర్ట్ అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 45 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 15 W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ విత్ వైర్లెస్ పవర్‌షేర్ 4,500mAh బ్యాటరీ శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా స్పెసిఫికేషన్స్ 6.8-అంగుళాల QHD+ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణ ఆండ్రాయిడ్ 12 ఆక్టా-కోర్ 4nm ప్రాససర్ 108 ఎంపీ+ 12 ఎంపీ+ 10 ఎంపీ+ 10 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ 40 ఎంపీ సెల్ఫీ కెమెరా 12జీబీ ర్యామ్+ 1 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 5జీ సపోర్ట్ బ్లూటూత్ v5.2 యూఎస్బీ టైప్ సీ సపోర్ట్ అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ విత్ వైర్లెస్ పవర్‌షేర్ 5,000mAh బ్యాటరీ చదవండి: వచ్చేశాయి..రెడ్మీ నోట్ 11 స్మార్ట్‌ఫోన్స్..! బడ్జెట్ ధరలో అద్బుతమైన ఫీచర్స్‌తో -
శాంసంగ్ నుంచి నయా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్..! కొనుగోలుపై రూ. 5 వేల తగ్గింపు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ సిరీస్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ఫోన్ విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్9, ఆసుస్ రాగ్ ఫోన్ 5 స్మార్ట్ఫోన్లకు పోటీగా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ధర రూ. రూ.49,999 నుంచి ప్రారంభంకానుంది. ఈ మొబైల్ కోసం ముందస్తు బుకింగ్‌లు ఇప్పటికే మొదలయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ జనవరి 11 నుంచి శాంసంగ్ అధికారిక వెబ్సైట్, ఈ-కామర్స్ సైట్ అమెజాన్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. లాంచ్ ఆఫర్లో భాగంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5,000 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌ను శాంసంగ్ అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ వైట్, గ్రాఫైట్, ఆలివ్ కలర్ వేరియంట్లలో కొనుగోలుదారులకు లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 8GBర్యామ్+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ల్లో లభించనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ఫీచర్స్..! 6.4-అంగుళాల AMOLED 2X డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ 8GBర్యామ్+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ 12ఎంపీ+12ఎంపీ+8ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32-ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ రీడర్ డ్యూయల్-రికార్డింగ్ మోడ్ 4,500mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చదవండి: Samsung: శాంసంగ్ సంచలన నిర్ణయం..! ఇకపై ఆ సేవలు పూర్తిగా బంద్..! -
శామ్సంగ్ గెలాక్సీ ఎస్5 వచ్చేసింది...
బార్సిలోనా: శామ్సంగ్ కంపెనీ గెలాక్సీ ఎస్ సిరీస్‌లో ఐదవ జనరేషన్ మోడల్ ఎస్5ను ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్‌లో తాజా వెర్షన్, 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌ను ఇక్కడ జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో కంపెనీ డిస్ప్లే చేసింది. వరల్డ్ మొబైల్ కాంగ్రెస్(డబ్ల్యూఎంసీ) ఈవెంట్ తర్వాతనే గెలాక్సీ మోడల్ ఫోన్లను శామ్సంగ్ కంపెనీ విడుదల చేయడం సాధారణం. ఈసారి ఈ రివాజుకు భిన్నంగా డబ్ల్యూఎంసీలోనే ఈసారి గెలాక్సీ తాజా మోడల్‌ను శామ్సంగ్ విడుదల చేయడం విశేషం. ఫింగర్ స్కానర్, వేగవంతమైన కెమెరా, దుమ్ము, నీటి నిరోధకత వంటి వినూత్న ఫీచర్లతో ఈ ఫోన్‌ను కంపెనీ రూపొందించింది. భారత్‌తో సహా ఇతర దేశాల్లో ఏప్రిల్ 11 నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభిస్తామని పేర్కొంది. ధర ఎంతనేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు. జీవన శైలి పరికరం... రోజువారీ దైనందిన కార్యకలాపాలను మరింత సౌకర్యవంతం చేసే మొబైల్ ఫోన్లకే వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా శామ్సంగ్ ప్రెసిడెంట్, హెడ్(ఐటీ, మొబైల్ కమ్యూనికేషన్స్ డివిజన్) జె.కె. షిన్ పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నవాటి కంటే అత్యుత్తమంగా ఉండేలా గెలాక్సీ ఎస్5 ఫోన్‌ను రూపొందించామని ఆయన చెప్పారు. ఇదొక జీవనశైలి పరికరమని ఆయన అభివర్ణించారు. ప్రత్యేక ఫీచర్లు ఇవీ... ఫింగర్ స్కానింగ్: సురక్షితమైన బయోమెట్రిక్ స్క్రీన్ లాకింగ్ ఫీచర్. ఇది భద్రమైన మొబైల్ చెల్లింపు ఫీచర్ కూడా(యాపిల్ ఐఫోన్ 5ఎస్‌లో ఈ ఫీచర్ ఉంది) ఎస్ హెల్త్: ఆరోగ్యంగా ఉండటానికి వినియోగదారులకు తోడ్పడే ఒక టూల్. పెడో మీటర్, డైట్, ఎక్సర్సైజ్ రికార్డులు, గుండె స్పందనలను లెక్కించే హార్ట్ రేట్ మానిటర్లతో కూడిన ఈ తరహా ఫీచర్‌ను తర్వాతి ఐ ఫోన్ మోడల్లో తేవాలని యాపిల్ కంపెనీ కసరత్తు చేస్తోందని సమాచారం. కిడ్స్ మోడ్: పిల్లలకు సంబంధించిన అప్లికేషన్(యాప్)లకే ఫోన్లో యాక్సెస్ ఉంటుంది. పవర్ సేవింగ్ మోడ్: డిస్ప్లే బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటుంది. తరచుగా వాడే యాప్స్‌నే డిస్ప్లేలో ఉంచుకోవచ్చు. ఈ ఫీచర్ కారణంగా విద్యుత్ వినియోగం సగం తగ్గుతుందని కంపెనీ పేర్కొంది. గెలాక్సీ ఎస్5 ప్రత్యేకతలు... 5.1 అంగుళాల(13 సెం.మీ.) సూపర్ అమోలెడ్ డిస్ప్లే(గెలాక్సీ ఎస్4 మొబైల్ స్క్రీన్ సైజ్) 2.5 గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్.. 2 జీబీ ర్యామ్ 16జీబీ, 32 జీబీ మెమరీ(రెండు వేరియంట్లు).. 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ 16 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా(వెనక వైపు), 2.1 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అమర్చారు. వేగవంతమైన ఆటో ఫోకస్(0.3 సెకన్ల స్పీడ్ ) 2800 ఎంఏహెచ్ బ్యాటరీ.. 4 రంగుల్లో లభ్యమవుతుంది.