సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ త్వరలోనే తన పాపులర్ గెలాక్సీ ఏ సిరీస్‌లో కొత్త ఎడిషన్లను లాంచ్ చేయనుంది. జనవరిలో రెండవ వారంలో 2018 ఎడిషన్ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కేవలం ఆన్‌లైన్ లోనే మాత్రమే ఇవి లభ్యంకానున్నాయి.
ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్లో అందుబాటులో ఉన్న 'ఎ' సిరీస్ ఈ డివైస్ మొదటిది. గెలాక్సీ ఎ8,గెలాక్సీ ఎ8 + గెలాక్సీ ఎస్8, ఎస్8 + నోట్ 8 2018ఎడిషన్లను గత నెలలో గ్లోబల్‌గా ప్రారంభించింది. జనవరి 10వ తేదీన వీటిని లాంచ్ చేయనుంది. అయితే ఇండియాలో అమెజాన్‌లో ప్రత్యేకంగా ఒక వేరియంట్‌ను మాత్రమే అందించనుందట. ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే, ఫస్ట్ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా ,లైవ్ ఫోకస్ లాంటి ఆకర్షణీయ ఫీచర్లతో తీసుకొస్తున్నట్టు శాంసంగ్ గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్ వైస్ ప్రెసిడెంట్, మొబైల్ కమ్యునికేషన్స్ బిజినెస్ జున్హో పార్కు ఒక ప్రకటనలో తెలిపారు. డస్ట్ రెసిస్టెంట్, వాటర్ ప్రూఫ్, మొబైల్ పేమెంట్ డిజిటల్ వాలెట్, యూఎస్‌బీ టైప్ సీ( ఫాస్ట్ చార్జింగ్)ను కూడా వీటిల్లో జోడించినట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment