
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లలోకి పవర్‌ఫుల్ ఛార్జర్‌ను సోమవారం(నవంబర్ 29)న లాంచ్ చేసింది. శాంసంగ్ 35వాట్ పవర్ అడాప్టర్ డుయో ఛార్జర్ ఏకకాలంలో రెండు గాడ్జెట్స్‌ను ఛార్జ్ చేస్తుందని శాంసంగ్ పేర్కొంది. టాబ్లెట్స్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్‌లే కాకుండా ఆండ్రాయిడ్, ఐఫోన్ స్మార్ట్‌ఫోన్స్‌ను ఛార్జ్ చేయగలదని శాంసంగ్ వెల్లడించింది.
ఇది వైర్‌లెస్ ఛార్జర్‌లకు కూడా అనుకూలంగా ఉండనుంది. అంతేకాకుండా టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్, పవర్ బ్యాంక్స్‌ను కూడా ఛార్జ్ చేయవచ్చును. శాంసంగ్ 35వాట్ పవర్ అడాప్టర్ డుయో ఒక యూఎస్‌బీ టైప్-C , ఒక యూఎస్‌బీ టైప్-A ఛార్జింగ్ పోర్ట్‌తో రానుంది.
శాంసంగ్ 35వాట్ పవర్ అడాప్టర్ డుయో ధర ఎంతంటే..!
శాంసంగ్ 35వాట్ పవర్ అడాప్టర్ డుయో ధర రూ. 2,299గా నిర్ణయించారు. శాంసంగ్‌కు చెందిన అన్ని రిటైల్ దుకాణాల్లో, కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చును.
చదవండి: జియో నుంచి స్మార్ట్‌టీవీలు, టాబ్లెట్స్..! లాంచ్ ఎప్పుడంటే..!
Comments
Please login to add a commentAdd a comment