Phone charger
-
చిన్నారి ప్రాణం తీసిన సెల్‌ఫోన్ ఛార్జర్
నిర్మల్ జిల్లా, కడెం మండలం కొత్త మద్దిపడగలో విషాదం చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ ఛార్జర్ చిన్నారి ప్రాణం తీసింది. చిన్నారి సెల్‌ఫోన్ ఛార్జర్ కేబుల్‌తో ఆడుకుంటూ నోట్లో పెట్టుకుంది. దీంతో విద్యుత్ షాక్‌కు గురై చిన్నారి ప్రాణాలు కొల్పోయింది. ఈ విషాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మొబైల్ ఫోన్ చార్జర్ల కష్టాలకు చెక్.. ఈ ఐడియా అదిరింది!
న్యూఢిల్లీ: త్వరలో మొబైల్ ఫోన్ చార్జర్ల కష్టాలకు తెరపడనుంది. ఉన్నట్టుండి చార్జింగ్ అయిపోతే, మరొకరి ఫోన్ చార్జర్‌తో అవసరం గట్టెక్కవచ్చు. ఇందుకు వీలుగా ఒకేరకమైన చార్జింగ్ పోర్ట్‌ను దశలవారీగా అమలు చేయడానికి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ కంపెనీలు అంగీకారం తెలిపాయి. ఈ విషయాన్ని కేంద్ర విని యోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఏకరూప చార్జింగ్ పోర్ట్ సాధ్యా సాధ్యాలను పరిశీలించడానికి ఉప కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలోని అంతర్గత మంత్రిత్వశాఖల టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంఏఐటీ, ఫిక్కీ, సీఐఐ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ భువనేశ్వర్, ఐఐటీ వారణాసి విద్యా సంస్థల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు తదితర ఎలక్ట్రానిక్ డివైజ్‌లను యూఎస్బీ టైప్–సీ చార్జింగ్ పోర్ట్‌తో తీసుకొచ్చేందుకు పరిశ్రమ ప్రతినిధులు సమ్మతి తెలిపారు. చదవండి: IT Layoffs 2022: ‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు! -
శాంసంగ్ నుంచి పవర్ఫుల్ ఛార్జర్..! దీంతో అన్నింటీకి ఛార్జ్ చెయోచ్చు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లలోకి పవర్ఫుల్ ఛార్జర్‌ను సోమవారం(నవంబర్ 29)న లాంచ్ చేసింది. శాంసంగ్ 35వాట్ పవర్ అడాప్టర్ డుయో ఛార్జర్ ఏకకాలంలో రెండు గాడ్జెట్స్‌ను ఛార్జ్ చేస్తుందని శాంసంగ్ పేర్కొంది. టాబ్లెట్స్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్‌లే కాకుండా ఆండ్రాయిడ్, ఐఫోన్ స్మార్ట్‌ఫోన్స్‌ను ఛార్జ్ చేయగలదని శాంసంగ్ వెల్లడించింది. ఇది వైర్లెస్ ఛార్జర్లకు కూడా అనుకూలంగా ఉండనుంది. అంతేకాకుండా టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్, పవర్ బ్యాంక్స్‌ను కూడా ఛార్జ్ చేయవచ్చును. శాంసంగ్ 35వాట్ పవర్ అడాప్టర్ డుయో ఒక యూఎస్బీ టైప్-C , ఒక యూఎస్బీ టైప్-A ఛార్జింగ్ పోర్ట్‌తో రానుంది. శాంసంగ్ 35వాట్ పవర్ అడాప్టర్ డుయో ధర ఎంతంటే..! శాంసంగ్ 35వాట్ పవర్ అడాప్టర్ డుయో ధర రూ. 2,299గా నిర్ణయించారు. శాంసంగ్‌కు చెందిన అన్ని రిటైల్ దుకాణాల్లో, కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చును. చదవండి: జియో నుంచి స్మార్ట్‌టీవీలు, టాబ్లెట్స్..! లాంచ్ ఎప్పుడంటే..! -
ఏ చిన్నారికి ఇలా కాకూడదు!
న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఉపయోగించని సమయంలో జాగ్రత్త చేయాలని.. మరీ ముఖ్యంగా చిన్నారులకు దూరంగా ఉంచాలని చెప్పే ఘటన ఇది. అభంశుభం తెలియని 19 నెలల చిన్నారి ఆపిల్ ఐ ఫోన్ చార్జింగ్ కేబుల్‌ను నోట్లో పెట్టుకోవడం వల్ల జరిగిన ప్రమాదం దృశ్యాలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. అమెరికాలోని కెన్టస్కీ ప్రాంతానికి చెందిన కర్ట్నీ ఎన్ డేవిస్.. అక్టోబర్ 5న ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్న తరువాత కేబుల్‌ను అలాగే వదిలేసింది. అదేసమయంలో నేల మీద ఆడుకుంటున్న 19 నెలల చిన్నారి ఆమె కుమార్తె.. ఛార్జింగ్ కేబుల్‌ను నోట్లో పెట్టుకుంది. కొన్ని క్షణాల్లో చిన్నారి బిగ్గరగా ఏడుస్తుండడంతో ఏం జరిగిందని వచ్చిన డేవిస్.. పాపను చూడగానే షాక్ గురయింది. నోట్లో కుడివైపు పూర్తిగా కాలిపోయి కనిపించింది. చిన్నారిని తీసుకుని.. డేవిస్ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లింది. పాపను పరీక్షించిన వైద్యులు.. ప్రమాదం లేదని.. సాధారణ చికిత్సతో తగ్గిపోతుందని చెప్పారు. ఇదంతా పూర్తయ్యాక.. డేవిస్ తనకు జరిగిన ఘటనను సోషల్ మీడియాలో ఫొటోలతో సహా వివరిస్తూ పోస్ట్ చేశారు. చిన్నారులకు సమీపంలో ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉంచకండి అంటూ విజ్ఞప్తి చేశారు. నా చిన్నారికి జరిగినట్లు మరెవరీ ఇలా జరక్కూడదు అంటూ సోషల్ మీడియాలో ఆమె విజ్ఞప్తి చేశారు. డేవిస్ పోస్ట్ ప్రస్తుతంఫేస్బుక్లో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ ఈ పోస్ట్‌ని 3 లక్షల మంది షేర్ చేశారు. -
సెల్ చార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి
పెంచికలపాడు (గట్టు): సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన గట్టు మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. పెంచికలపాడుకి చెందిన చాకలి నాగన్న అలియాస్ దుబ్బన్న(30) గ్రామంలో వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతడే ఆ కుటుంబానికి ఆధారం. గురువారం ఉదయం ఆయన ఇంట్లో నిద్రలేవగానే సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అక్కడిక్కడే మృత్యువాతపడ్డాడు. కళ్ల ఎదుటే కట్టుకున్న భర్త మృత్యువాత పడడంతో ఆ ఇల్లాలి రోదనలు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. మృతుడికి భార్య దుర్గమ్మతో పాటుగా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
సెల్ చార్జర్ పేలి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
భోజనం చేస్తుండగా ఫోన్ సెల్ అందుకుని ఎడమచేత్తో ప్లగ్ నొక్కడంతో పేలుడు బి.కొత్తకోట, న్యూస్‌లైన్: ఫోన్ చార్జర్ పేలడంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. మండలంలోని బండారువారిపల్లె పంచాయతీ పెద్దపల్లెలో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పెద్దపల్లెకు చెందిన మిట్టపల్లె శ్రీనివాసులురెడ్డి, సుశీల దంపతులకు గోవర్దన్‌రెడ్డి (22) ఒక్కడే కుమారుడు. అనంతపురంలో పాలిటెక్నిక్ పూర్తిచేసి, అంగళ్లులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చేస్తున్నాడు. శనివారం ర్రాతి సెల్‌ఫోన్‌ను చార్జ్‌కు ఉంచాడు. అనంతరం భోజనం చేస్తుండగా ఫోన్‌కాల్ వచ్చింది. అన్నం పూర్తిగా తినకుండానే సెల్‌ఫోన్‌ను కుడి చేతితో అందుకున్నాడు. చార్జర్ ప్లగ్ నుంచి ఊడిపోతుండటంతో ఎడమ చేత్తో ప్లగ్‌ను విద్యుత్ సరఫరా పిన్లోకి నెట్టాడు. చార్జర్ ఒక్కసారిగా పేలింది. అందులోని రెండు సరఫరా పిన్నులు గోవర్దన్ ఎడమ అరచేతిలోకి చొచ్చుపోయి కరెంట్ షాక్‌కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం మదనపల్లెకు తరలిస్తుండగానే మార్గమధ్యంలో మృతి చెందాడు. నా బిడ్డను విడిచి ఉండలేను దేవుడా గోవర్దన్ మరణంతో తల్లి సుశీల రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. నా బిడ్డను విడిచి వుండలేను దేవుడా.. అంటూ బోరున విలపించింది. సోదరి హరిత అన్నను కోల్పోయిన దుఃఖంలో సొమ్మసిల్లి పడిపోయింది. ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే అయినప్పటికీ కష్టపడి గోవర్దన్‌ను చదివిస్తున్నారు. ఈ ఏడాదితో చదువు పూర్తవుతుంది. జీవితంలో స్థిరపడతాడని కుటుంబీకులు ఆశలు పెట్టుకున్నారు. అంతలోనే ఆ ఇంట్లో చీకట్లు అలుముకున్నాయి.