సెల్‌ చార్జింగ్‌ పెడుతూ వ్యక్తి మృతి | man died due to phone charger | Sakshi
Sakshi News home page

సెల్‌ చార్జింగ్‌ పెడుతూ వ్యక్తి మృతి

Published Fri, Sep 9 2016 1:33 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

man died due to phone charger

పెంచికలపాడు (గట్టు): సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతూ ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన గట్టు మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. పెంచికలపాడుకి చెందిన చాకలి నాగన్న అలియాస్‌ దుబ్బన్న(30) గ్రామంలో వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతడే ఆ కుటుంబానికి ఆధారం. గురువారం ఉదయం ఆయన ఇంట్లో నిద్రలేవగానే సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అక్కడిక్కడే మృత్యువాతపడ్డాడు. కళ్ల ఎదుటే కట్టుకున్న భర్త మృత్యువాత పడడంతో ఆ ఇల్లాలి రోదనలు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. మృతుడికి భార్య దుర్గమ్మతో పాటుగా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement