న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక‍్ డివైజ్‌లను ఉపయోగించని సమయంలో జాగ్రత్త చేయాలని.. మరీ ముఖ్యంగా చిన్నారులకు దూరంగా ఉంచాలని చెప్పే ఘటన ఇది. అభంశుభం తెలియని 19 నెలల చిన్నారి ఆపిల్ ఐ ఫోన్ చార్జింగ్ కేబుల్‌ను నోట్లో పెట్టుకోవడం వల్ల జరిగిన ప్రమాదం దృశ్యాలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. అమెరికాలోని కెన్‌టస్కీ ప్రాంతానికి చెందిన కర్ట్‌నీ ఎన్ డేవిస్.. అక్టోబర్ 5న ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్న తరువాత కేబుల్‌ను అలాగే వదిలేసింది. అదేసమయంలో నేల మీద ఆడుకుంటున్న 19 నెలల చిన్నారి ఆమె కుమార్తె.. ఛార్జింగ్ కేబుల్‌ను నోట్లో పెట్టుకుంది. కొన్ని క్షణాల్లో చిన్నారి బిగ్గరగా ఏడుస్తుండడంతో ఏం జరిగిందని వచ్చిన డేవిస్.. పాపను చూడగానే షాక్ గురయింది. నోట్లో కుడివైపు పూర్తిగా కాలిపోయి కనిపించింది.
చిన్నారిని తీసుకుని.. డేవిస్ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లింది. పాపను పరీక్షించిన వైద్యులు.. ప్రమాదం లేదని.. సాధారణ చికిత్సతో తగ్గిపోతుందని చెప్పారు. ఇదంతా పూర్తయ్యాక.. డేవిస్ తనకు జరిగిన ఘటనను సోషల్ మీడియాలో ఫొటోలతో సహా వివరిస్తూ పోస్ట్ చేశారు. చిన్నారులకు సమీపంలో ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉంచకండి అంటూ విజ్ఞప్తి చేశారు. నా చిన్నారికి జరిగినట్లు మరెవరీ ఇలా జరక్కూడదు అంటూ సోషల్ మీడియాలో ఆమె విజ్ఞప్తి చేశారు. డేవిస్ పోస్ట్ ప్రస్తుతంఫేస్బుక్లో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ ఈ పోస్ట్‌ని 3 లక్షల మంది షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment