బెన్‌టన్: అగ్రరాజ్యం అమెరికా కొత్త ఏడాదిలో మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కెంటకీ రాష్ట్రంలోని మార్షల్ కౌంటీలో ఉన్న హైస్కూల్‌లో ఓ విద్యార్థి(15) హ్యాండ్‌గన్‌తో జరిపిన కాల్పుల్లో ఇద్దరు తోటివిద్యార్థులు చనిపోగా, 17 మంది గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
మంగళవారం ఉదయం 8.57 గంటలకు హైస్కూల్‌కు చేరుకున్న నిందితుడు పాఠశాల ప్రాంగణంలో ఉన్న వారందరిపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బుల్లెట్లు పూర్తిగా అయిపోయేంతవరకూ అతను కాల్పులు జరుపుతూనే ఉన్నాడన్నారు. అయితే సదరు విద్యార్థి ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడన్న దానిపై పోలీసులు అధికారులు ఎలాంటి వివరాలు చెప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment