highschool
-
అమెరికా హైస్కూల్లో కాల్పుల మోత
బెన్టన్: అగ్రరాజ్యం అమెరికా కొత్త ఏడాదిలో మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కెంటకీ రాష్ట్రంలోని మార్షల్ కౌంటీలో ఉన్న హైస్కూల్లో ఓ విద్యార్థి(15) హ్యాండ్‌గన్‌తో జరిపిన కాల్పుల్లో ఇద్దరు తోటివిద్యార్థులు చనిపోగా, 17 మంది గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం 8.57 గంటలకు హైస్కూల్‌కు చేరుకున్న నిందితుడు పాఠశాల ప్రాంగణంలో ఉన్న వారందరిపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బుల్లెట్లు పూర్తిగా అయిపోయేంతవరకూ అతను కాల్పులు జరుపుతూనే ఉన్నాడన్నారు. అయితే సదరు విద్యార్థి ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడన్న దానిపై పోలీసులు అధికారులు ఎలాంటి వివరాలు చెప్పలేదు. -
మెక్సికోలో కాల్పులు: ముగ్గురు మృతి!
మెక్సికో సిటీ: మెక్సికోలోని ఓ పాఠశాలలో గురువారం ఉదయం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మృతిచెందారు. డజను మందికి పైగా గాయపడినట్లు తెలిసింది. న్యూ మెక్సికోలోని అల్బుకుర్కేకు సుమారు 180 మైళ్ల దూరంలో ఉన్న అజ్టెక్ హైస్కూల్లో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు విద్యార్థులతో పాటు కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే షూటర్ ఎలా చనిపోయాడన్నదానిపై స్పష్టత రాలేదు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడా లేక యాదృచ్ఛికంగా జరిగిందా అన్నది తెలియరాలేదు. విద్యార్థులందరినీ పాఠశాల నుంచి బయటికి పంపించి ప్రత్యేక బస్సుల్లో ఇళ్లకు తరలించారు. -
19 నుంచి బాలల సైన్స్ కాంగ్రెస్‌పై వర్కుషాపు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని అన్ని యాజమాన్య ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సైన్స్ ఉపాధ్యాయులకు 24వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ నిర్వహణపై వర్కుషాపు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.రవీంద్రనాథ్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి పాఠశాల నుంచి కచ్చితంగా ఒక ఉపాధ్యాయుడు వర్కు షాపునకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ రంగమ్మ లేదా జిల్లా విద్యా సమన్వయకర్త కె.వి.సుబ్బారెడ్డిని 8790111331, 9948605546 సెల్‌ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. డివిజన్ల వారీగా వర్కు షాపుల వివరాలు డివిజన్ తేదీ వర్కుషాపు నిర్వహించే స్థలం ఆదోని 19.10.16 ప్రభుత్వ బాలికల పాఠశాల కర్నూలు 20.10.16 బి.క్యాంపు ప్రభుత్వ బాలుర పాఠశాల డోన్ 21.10.16 శేషారెడ్డి హైస్కూల్, బేతంచెర్ల నంద్యాల 22.10.16 ఎస్పీజీ హైస్కూల్