Kentucky
-
‘చచ్చి’ బతికాడు!
అమెరికాలోని కెంటకీలో థామస్ హోవర్ అనే 36 ఏళ్ల వ్యక్తి డ్రగ్ ఓవర్‌డోస్ వల్ల గుండెపోటుకు గురయ్యాడు. హుటాహుటిన బాప్టిస్ట్ హెల్త్ రిచ్మండ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతనిక బతికి బట్ట కట్టడం కల్లేనని వైద్యులు తేల్చారు. అవయవ దానం చేసి ఉండటంతో ముందుగా గుండెను సేకరించాలని నిర్ణయించారు. ఆపరేషన్ టేబుల్‌పైకి తీసుకెళ్లి సరిగ్గా కత్తులూ, కటార్లకు పని చెప్పబోయే సమయానికి మనవాడు ఉన్నట్టుండి కళ్లు తెరిచాడు! కాళ్లూ చేతులూ కదిలించేందుకు ప్రయతి్నంచాడు. తన పరిస్థితి అర్థమై కన్నీరు పెట్టుకున్నాడు. ఇదంతా చూసి డాక్టర్లంతా దిమ్మెరపోయారు. దాంతో అవయవ సేకరణ ప్రయత్నాలకు స్వస్తి చెప్పారు. ఇది 2021 అక్టోబర్‌లో జరిగితే ఆస్పత్రి వర్గాలు మాత్రం వెలుగులోకి రానివ్వలేదు. కనీసం హూవర్ కుటుంబీకులకు కూడా సమాచరమివ్వలేదు. పైగా అతనిలో కనిపిస్తున్న ప్రాణ లక్షణాలను పట్టించుకోకుండా అవయవాలను సేకరించాల్సిందిగా డాక్టర్లపై ఒత్తిడి తెచ్చాయి. వారు నిరాకరించడంతో వేరే వైద్యులను నియోగిస్తే వాళ్లు కూడా చేతులెత్తేశారు. దీనికి ప్రత్యక్ష సాక్షి అయిన ఆస్పత్రి మాజీ ఉద్యోగి ఒకరు గత జనవరిలో హూవర్ సోదరి డోనాకు విషయం చేరవేయడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది. చివరికి వైద్యుల సలహా మేరకు అతన్ని ఇంటికి తీసుకెళ్లిందామె. హూవర్ బ హుశా ఇంకెంతో కాలం బతక్కపోవచ్చన్న డాక్టర్ల అంచనాలను వమ్ము చేస్తూ సోదరి సంరక్షణలో అతను చాలావరకు కోలుకున్నాడు. ఈ ఉదంతం ఇప్పుడు కెంటకీలో టా కాఫ్ ద టౌన్‌గా మారింది. కెంటకీ అటార్నీ జనరల్ కార్యాలయం దీనిపై విచారణ కూడా జరుపుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కోర్టులో జడ్జిని కాల్చి చంపిన పోలీసు
ఫ్రాంక్ఫర్ట్: అమెరికాలో తుపాకీ సంస్కృతికి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. గతంలో జరిగిన ఘటనల్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోగా ఈసారి ఏకంగా న్యాయమూర్తి బలయ్యారు. న్యాయమూర్తి పైకి ఆ ప్రాంత పోలీసు ఉన్నతాధికారి బులñ æ్లట్ల వర్షం కురిపించడం గమనార్హం. గురువారం కెంటకీ రాష్ట్రంలోని లెట్చర్ కౌంటీలోని వైట్స్‌బర్గ్ జిల్లా కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న 54 ఏళ్ల జిల్లా జడ్జి కెవిన్ ములిన్స్‌ను ఆయన ఛాంబర్‌లోనే లెట్చర్ కౌంటీ షరీఫ్ షాన్ ఎం.స్టైన్స్ కాలి్చచంపారు. విషయం తెల్సి పోలీసులు పక్కనే ఉన్న పాఠశాలలోని విద్యార్థులను వెంటనే ఇళ్లకు పంపించేశారు. కాల్పులు జరిగినప్పుడు కోర్టులో దాదాపు 50 మంది ఉన్నారు. అసలేం జరిగిందంటే? గత ఎనిమిదేళ్లుగా అదే కౌంటీలో షరీఫ్‌గా పనిచేస్తున్న షాన్ గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వైట్స్‌బర్గ్ కోర్టు భవనానికి వచ్చి జడ్జి ములిన్స్‌తో విడిగా అత్యవసరంగా మాట్లాడాలని అనుమతి కోరాడు. దీంతో జడ్జి ఆయనను తన ఛాంబర్‌కు తీసుకెళ్లి గది తలుపులు మూసేశారు. చాలాసేపు వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని బయట వరండాలో వేచి ఉన్న వ్యక్తులు చెప్పారు. అయితే ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించిందని, తర్వాత షరీఫ్ షాన్ చేతులు పైకెత్తి బయటికొచ్చి లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. ఛాంబర్ లోపలికి వెళ్లి చూస్తే బుల్లెట్ల గాయాలతో రక్తమోడి జడ్జి నిర్జీవంగా పడి ఉన్నారని కెంటకీ రాష్ట్ర పోలీసు అధికార ప్రతినిధి మ్యాట్ గేహార్ట్ శుక్రవారం వెల్లడించారు. జడ్జిని షరీఫ్ ఎందుకు చంపారనే కారణం ఇంకా తెలియరాలేదు. ఏ విషయం మీద జడ్జి, షరీఫ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందన్న విషయం ఇంకా వెల్లడికాలేదు. షరీఫ్‌ను అరెస్ట్ చేసి పోలీసులు హత్యానేరం కింద దర్యాప్తు మొదలుపెట్టారు. -
అమెరికాలో కాల్పులు.. ఏడుగురికి గాయాలు
లండన్(యూఎస్ఏ): అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్న కాల్పుల ఘటన నిందితుడి కోసం ముమ్మర వేట కొనసాగుతోంది. ఇంటర్ స్టేట్–75పై లండన్ నగరానికి 9 మైళ్ల దూరంలోని లారెల్ కౌంటీలో రోడ్డు ప్రమాదం, అనంతరం జరిగిన కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. కాల్పులకు కారణమైన జోసెఫ్ ఎ కౌచ్(32) అనే శ్వేతజాతీయుడు అప్పటి నుంచి ఉన్నాడని పోలీసులు వివరించారు. తీవ్రంగా గాలిస్తోంది. అతడున్న ప్రాంతం తెలిసిందని అధికారులు తెలిపారు. వాహనదారులు ఇంటర్ స్టేట్–75, యూఎస్ 25పైకి వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు..అనంతరం వాటిని ఉపసంహరించుకున్నారు. -
అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి
ఫ్లోరెన్స్: అమెరికాలో కెంటకీ రాష్ట్రం ఫ్లోరెన్స్‌లోని ఓ ఇంట్లో బర్త్ డే పార్టీ సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం వేకువజామున ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు కారకుడిగా భావిస్తున్న యువకుడిని పోలీసులు వెంటాడారు. ఛేజింగ్ సమయంలో అతడు కారు సహా లోయలో పడిపోయాడని పోలీసులు తెలిపారు. అతడు తనను తాను కాల్చుకున్నాడని, గాయాలతో ఆస్పత్రిలో మృతి చెందాడని చెప్పారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. -
40 అస్తిపంజరాలతో ఇల్లు డెకరేషన్.. తీగలాగితే..
వాషింగ్టన్: అమెరికాలో ఎఫ్.బి.ఐ అధికారులకి ఒక విచిత్రమైన కేసు ఎదురైంది. కెంటక్కీలోని ఒక వ్యక్తి మీద అనుమానంతో అతడి తలుపు తట్టి లోపల ఎవరున్నారని అడగగా నేను, నాతో పాటు చనిపోయిన నా స్నేహితులు ఉన్నారని చెప్పడంతో అధికారులు ఖంగుతిన్నారు. ఇంటి లోపలికి వెళ్లి తనిఖీలు నిర్వహించగా మొత్తం 40 పుర్రెలు, వెన్నుపూసలు చక్కగా అలంకరించి ఉన్నాయి. దీంతో అధికారులు అతడిని వెంటనే అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఇటీవల హార్వార్డ్ మెడికల్ స్కూల్ శవాగారం నుండి చాలా వరకు మృతదేహాల అవశేషాలు దొంగిలించబడుతున్నాయని ఎఫ్.బి.ఐకి ఫిర్యాదు చేశారు సదరు స్కూలు సిబ్బంది. అప్పటి నుండి కేసు దర్యాప్తు చేసున్న ఎఫ్.బి.ఐ అధికారులకు కెంటక్కీకి చెందిన జేమ్స్ నాట్(39) పై అనుమానం వచ్చింది. పోలీసులు అతడి తలుపు తట్టి లోపల ఎవరున్నారని అడగగా చనిపోయిన నా స్నేహితులు ఉన్నారని విచిత్రమైన సమాధానమిచ్చాడట. ఇంకేముంది పోలీసులు దౌర్జన్యంగా ఇంటిలోకి చొరబడి చూస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి నిండా ఎక్కడ చూసినా ఆస్తిపంజరాలు, పుర్రెలే. ఫర్నీచర్ చుట్టూ మానవ అవశేషాలను చక్కగా అలంకరించుకున్నాడట జేమ్స్. ఒక హార్వార్డ్ స్కూలుకు సంబంధించిన బ్యాగ్ కూడా అక్కడ దొరకడంతో తాము వెతుకుతున్న నేరస్తులలో జేమ్స్ ఉండి ఉంటాడని అనుమానంతో దర్యాప్తు చేశారు అధికారులు. తీగలాగితే.. జేమ్స్ నాట్ ఇల్లంతా తనిఖీలు నిర్వహించగా మొత్తం 40 పుర్రెలు, వెన్నుపూసలు దొరికాయి. అతడి పేస్ బుక్ మెసేజులన్నీ పరిశీలించగా అతడు జెరెమి పాలీ అనే వ్యక్తితో మానవ అవశేషాల కొనుగోలుకు సంబంధించి లావాదేవీలు నడుపుతున్న విషయం బయటపడింది. ఇంటిలో కొన్ని మారణాయుధాలు కూడా దొరకడంతో అక్రమ్మగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న నెపంతోనూ, నిషేధిత వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నాడన్న నేరం కింద జేమ్స్ నాట్ ని అరెస్టు చేశారు. జెరెమి పాలీ కోసం గాలిస్తున్నారు. జెరెమి పాలీ, జేమ్స్ నాట్ వీరంతా మానవ అవశేషాలను విక్రయించే ముఠాకు చెందిన వారిని.. వీరు శరీరంలోని ఎముకల తోపాటు చర్మాన్ని కూడా అమ్ముకుంటారని తెలిపారు ఎఫ్.బి.ఐ అధికారులు. ఇది కూడా చదవండి: భారత ప్రధానికి ఫ్రాన్స్ అధ్యక్షుడి అపురూప కానుక.. -
అమెరికాలోని కెంటకీలో కాల్పుల కలకలం.. ఐదుగురి మృతి
అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో కాల్పులు కలకలం రేపాయి. డౌన్‌టౌన్ లూయిస్విల్లే ప్రాంతంలోని ఓల్డ్ నేషనల్ బ్యాంక్‌లో సోమవారం ఉదయం ఓ గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలైనట్లు సమాచారం. పోలీసుల కాల్పుల్లో దుండగుడు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. -
ఆర్మీ హెలికాప్టర్లు ఢీకొని..9 మంది మృతి
ఫోర్ట్కాంప్బెల్(అమెరికా): కెంటకీలో అమెరికా ఆర్మీకి చెందిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ఢీకొన్న ఘటనలో 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పోర్ట్ కాంప్‌బెల్‌కు 30 మైళ్లదూరంలో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. 101 ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు చెందిన హెచ్‌హెచ్–60 బ్లాక్ హాక్ హెలికాప్టర్లు రెండూ రాత్రి వేళ జరుగుతున్న రోజువారీ శిక్షణ సమయంలో ప్రమాదానికి గురికావడంపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొంత అటవి, కొంతమైదానం ఉన్నాయని కెంటకీ గవర్నర్ ఆండీ చెప్పారు. -
సర్వస్వం కోల్పోయినా పెంపుడు కుక్కను మాత్రం వదల్లేదు..
వాషింగ్టన్: వరదల్లో సరస్వం కోల్పోయినా పెంపుడు శునకాన్ని మాత్రం వదల్లేదు ఓ 17 ఏళ్ల అమ్మాయి. తన ప్రాణాలు కాపాడుకోవడమే గాక.. ప్రాణంగా ప్రేమించే సాండీని కూడా క్షేమంగా బయటకు తీసుకొచ్చింది. ఈ బాలిక చేసిన పనికి సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా కెంటకీలో గ్రాండ్‌పేరెంట్స్‌లో కలిసి నివసిస్తోంది క్లో అడమ్స్. గురువారం ఉదయం నిద్ర లేచే సమయంలో ఇంట్లోకి వస్తున్న వరదనీటి ప్రవాహం చూసి విస్మయానికి గురైంది. క్షణాల్లోనే కిచెన్‌తో పాటు ఇల్లు మొత్తం జలమయం అయింది. నీళ్లు మోకాలి లోతుకు చేరాయి. వెంటనే తన పెంపుడు కుక్క సాండీ దగ్గరకు వెళ్లింది అడమ్స్. దాన్ని చేతితో పట్టుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే వరదనీటి స్థాయి అంతకంతకూ పెరుగుతోంది. సాండీ ఈదగలదేమోనని అడమ్స్ చెక్ చేసింది. దాన్నినీటిలో వదిలితే ఈదలేకపోయింది. దీంతో ఓ చిన్న ప్లాస్టిక్ కంటైనర్‌లో సాండీని వేసి దాన్ని ముందుకుపంపుతూ వరద నీటిలో ఈదుకుంటూ స్టోరేజీ బిల్డింగ్ పైకప్పుకు చేరుకుంది అడమ్స్. వాళ్లకు రూఫ్ మాత్రమే ఆధారంగా మిగిలింది. ఆ తర్వాత కొన్ని గంటలపాటు అక్కడే సాయం కోసం ఎదురు చూసింది. చివరకు ఈ ఇంటికి దగ్గర్లోనే ఉన్న ఆమె కజిన్ సహాయక బృందాల సాయంతో వాళ్లను రెస్క్యూ చేశాడు. ఆ తర్వాత గ్రాండ్ పేరెంట్స్ అప్పటికే తలదాచుకుంటున్న తన మామయ్య ఇంటికి అడమ్స్ వెళ్లింది. ఆమె తండ్రి టెర్రీ అడమ్స్ కూడా అక్కడే ఉన్నాడు. తన కూతురు పెంపుడు శునకాన్ని కాపాడిన విషయాన్ని ఫేస్బుక్లో వెల్లడించాడు టెర్రీ. ఆమె హీరో అని అభివర్ణించాడు. అడమ్స్ శునకాన్ని పట్టుకుని రూఫ్‌పై ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. వాటిని చూసి నెటిజన్లు బాలికను ప్రశంసలతో ముంచెత్తారు. సాండీని క్లో అడమ్స్ బాల్యం నుంచి ఆప్యాయంగా చూసుకుంటోంది. చిన్నప్పుడు ఆమె సాండీతో దిగిన ఫోటో కూడా వైరల్‌గా మారింది. మరోవైపు కెంటకీలో గురువారం భారీ వర్షాలు కురిసి ఆకస్మిక వరదలు సంభవించాయి. వివిధ ప్రమాదాల్లో 16 మంది మరణించారు. వందల మంది నిరాశ్రయులయ్యారు. వరదల వల్ల తాము సర్వస్వం కోల్పోయినా.. అంతకంటే ముఖ్యమైన తన కూతురు, సాండీ ప్రాణాలతో బయటపడటం ఆనందంగా ఉందని టెర్రీ అడమ్స్ భావోద్వేగానికి లోనయ్యాడు. చదవండి: 40 నుంచి 10 శాతానికి పడిపోయిన రిషి సునాక్.. 90% లిజ్ ట్రస్‌కే ఛాన్స్! -
Covid-19: కరోనా అంతు చూసే మాస్కు!
కరోనా ఇక కాస్త మందగించిందంటూ మూడో వేవ్ దాటిన తర్వాత ప్రజలంతా కొద్దిగా హాయిగా ఊపిరి తీసుకుంటున్న సమయంలో... తన ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోలేదంటూ అది అడపాదడపా సందడి చేస్తూనే ఉంది. దేశంలో చాలా చోట్ల కేసులు మళ్లీ పెరుగుతున్నాయంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. దాంతో మూలన విసిరేసిన మాస్కుల డబ్బాలు మళ్లీ తెరవాల్సిందేనంటూ ఆరోగ్య నిపుణులూ, ప్రభుత్వ పెద్దలూ హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ తాకిన కొద్దిసేపటికి అది నిర్వీర్యం అయిపోయే కొత్త మాస్కులను శాస్త్రవేత్తలు రూపొందించారు. వైద్యులు వాడే ఎన్–95 మాస్కులూ, ప్రజలు ఉపయోగించే మూడు పొరల మాస్కుల తరహాలో కరోనాను అరికట్టే రసాయనంతో మరో పొరను చేర్చుతూ వీటిని రూపొందించామంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కెంటకీకి చెందిన కెమికల్ ఇంజనీర్ దిబాకర్ భట్టాచార్య. ‘కొత్తగా రూపొందించిన ఈ పొర మీదికి ‘సార్స్–సీవోవీ–2’వైరస్ లేదా దానికి సంబంధించిన అంశాలేవైనా చేరి... అక్కడ దాని మీద కనీసం 30 సెకండ్ల పాటు ఉంటే దాని స్పైక్ ప్రోటీన్ నిర్వీర్యమవుతుంది. కొమ్ముల్లా ఉండే ఈ స్పైక్ ప్రోటీన్‌ను ఓ తాళం చెవిలా ఉపయోగించుకునే వైరస్ మన జీవకణాల్లోకి చేరుతుందన్న విషయం తెలిసిందే. ఇది ఎన్–95లా పనిచేస్తున్నప్పటికీ దీనిపైని అదనపు పొరపై యాంటీవైరస్ ఎంజైమ్ పూత ఉంటుంది. అది కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేస్తుంది. తద్వారా ‘సార్స్–సీవోవీ–2’వ్యాప్తిని గణనీయంగా అరికడుతుంది’అంటున్నారు దిబాకర్ భట్టాచార్య. దీనిని మరింత అభివృద్ధి చేస్తే మరింత సమర్థంగా వ్యాప్తిని అరికడుతుందనే భరోసా ఇస్తున్నారు. దీన్లో వాడిన ‘స్మార్ట్ ఫిల్టరేషన్ మెటీరియల్’కేవలం గాల్లో వ్యాపించి కరోనాను వ్యాప్తిచేసే ఏరోసాల్స్‌ను మాత్రమే నిర్వీర్యం చేస్తుంది తప్ప శ్వాసప్రక్రియకు ఎలాంటి అవరోధం కల్పిందంటూ పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. ఇవి అటు డ్రాప్లెట్స్(సన్నటి లాలాజల తుంపర్ల)తో పాటు ఇటు ఏరోసాల్స్ (గాల్లో ఉండే అతి సూక్ష్మమైన కణాలు) ద్వారా కలిగే వైరస్ వ్యాప్తులను అరికడుతుందంటున్నారు. విశ్వసనీయమైన ఎన్–95 కంటే సమర్థమైందని, కరోనా వైరస్ సహా, 100 నానోమీటర్ల సైజులో ఉన్న అన్ని పార్టికిల్స్నూ 98.9 శాతం సమర్థంగా అడ్డుకుంటుందనేది పరిశోధకుల మాట. ఈ వివరాలన్నీ ‘కమ్యూనికేషన్స్ మెటీరియల్స్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విలయ విధ్వంసం.. 94కు చేరిన మరణాలు, వైరలైన దృశ్యాలు
వాషింగ్టన్/శాన్ఫ్రాన్సిస్కో: అమెరికాలోని ఆరు రాష్ట్రాలను టోర్నడోలు వణికిస్తున్నాయి. కెంటకీ, ఇల్లినాయిస్, టెన్నెస్సీ, మిస్సోరి, అర్కాన్సస్, మిస్సిసిపీ రాష్ట్రాల్లో టోర్నడోల ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. మృతుల సంఖ్య 94కు చేరింది. కెంటకీలోని మేఫీల్డ్ పట్టణంలో కొవ్వొత్తుల ఫ్యాక్టరీ ధ్వంసం కావడంతో 80 మంది మరణించారని గవర్నర్ ఆండీ బెషియర్ చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. Another video from my cousins house. #kywx #Tornado This historic tornado ripped through our small community. pic.twitter.com/ly2IID2N64 — H🏀🏀P There it is (@TotallyTwitched) December 11, 2021 ఇల్లినాయిస్ రాష్ట్రం ఎడ్వర్డ్స్‌విల్లేలోని అమెజాన్ గిడ్డంగి పైకప్పు కూలిపోవడంతో ఆరుగురు ఉద్యోగులు, ఆర్కాన్సస్‌లో ఓ నర్సింగ్ హోమ్ తీవ్రంగా దెబ్బతినడంతో ఇద్దరు, టెన్నెస్సీలో నలుగురు, మిస్సోరీలో ఇద్దరు టోర్నడోల కారణంగా కన్నుమూసినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రధానంగా కెంటకీలో టోర్నడో బీభత్సం సృష్టిస్తోంది. Dawson Springs, Ky is 70 miles away from #Mayfield and was also devastated by the #Tornado #WX pic.twitter.com/kBwBxcxURi — WxChasing- Brandon Clement (@bclemms) December 11, 2021 మేఫీల్డ్ పట్టణం పూర్తిగా ధ్వంసమయ్యింది. పైకప్పులు ఎగిరిపోయాయి. ఇళ్లు, కార్యాలయాలు నేలమట్టమయ్యాయి. పట్టణంలో ఎటుచూసినా విధ్వంసమే కళ్ల ముందు కనిపిస్తోంది. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఆరు రాష్ట్రాల్లో ప్రకృతి విలయం అమెరికాలో చరిత్రలోనే అతిపెద్ద విలయాల్లో ఒకటని అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఇక టోర్నడో విధ్వంసానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. MUST WATCH: A man from #Kentucky lost his home after the #tornado Yet, here he sits at his piano playing the @Gaithermusic tune, “There’s Something About That Name.” The peace that passes understanding. #ARwx @FOX16News @KARK4News @NWS @HaydenNix pic.twitter.com/LiGHMmKDzb — Cassandra Webb (@cassandrawebbtv) December 12, 2021 Mayfield, KY at daybreak - drone. The town has basically been flattened, no words. Video: LiveStormsMedia#Mayfield #Kentucky #Tornado #tornadoemergency #severewx #SevereWeather #tornadoemergency #tornadooutbreak #longtracktornado pic.twitter.com/DBadxT9pSD — AC 😷 (@ACinPhilly) December 11, 2021 చదవండి: అమెరికాలో టోర్నడో బీభత్సం.. చైనాలో విరుచుకుపడ్డ టోర్నడోలు, 12 మంది మృతి -
అమెరికాలో టోర్నడో బీభత్సం..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో పలు రాష్ట్రాలను భీకర తుపాను వణికిస్తోంది. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలుల ధాటికి ఇళ్లు, కార్యాలయాల పైకప్పులు ఎగిరిపోతున్నాయి. సుడిగాలు లు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కెంటకీలో పరిస్థితి భీతావహంగా మారింది. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన తుపాను అని కెంటకీ గవర్నర్ ఆండీ బెషియర్ శనివారం చెప్పారు. మేఫీల్డ్ నగరంలో ఓ క్యాండిల్ ఫ్యాక్టరీ ధ్వంసమయ్యిందని, శిథిలాల కింద 110 మంది చిక్కుకుపోయారని, వారిలో 70 మందికిపైగా మరణించినట్లు భావిస్తున్నామని తెలిపారు. మృతుల సంఖ్య 100దాటవచ్చన్నారు. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించామన్నారు. 227 మైళ్ల మేర తుపాను ప్రభావం కనిపించిందని గవర్నర్ తెలిపారు. 10 కౌంటీల్లో మరణాలు సంభవించే ప్రమాదం కనిపిస్తోందన్నారు. స్థానిక అధికారులు, నేషనల్ గార్డు సభ్యులు, ఎమర్జెన్సీ వర్కర్స్ మేఫీల్డ్ సిటీలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇల్లినాయిస్ రాష్ట్రం ఎడ్వర్డ్స్‌విల్లేలోని అమెజాన్ సంస్థ గోదాము శుక్రవారం ధ్వంసమయ్యిందని అధికారులు చెప్పారు. పైకప్పుతోపాటు ఒక గోడ కూలిపోయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో తుపాను హెచ్చరిక అమల్లోనే ఉంది. 100 మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. క్రిస్మస్ పండగ సందర్భంగా ఆర్డర్లు అధికంగా ఉండడంతో వారంతా రాత్రిపూట కూడా పనిచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కార్మికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు శనివారం తెల్లవారుజాము నుంచి అధికారులు చర్యలు చేపట్టారు. ఎవరైనా చనిపోయారా? గాయపడ్డారా? అనేది ఇంకా తెలియరాలేదు. ఎడ్వర్డ్స్‌విల్లే ప్రజల క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జర్ అన్నారు. రాష్ట్ర పోలీసులు, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ స్థానిక అధికారులతో కలిసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదంలో చిక్కుకున్న తమ కార్మికులను రక్షించుకోవడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అమెజాన్ అధికార ప్రతినిధి రిచర్డ్ రోచా చెప్పారు. ఆర్కాన్సస్ రాష్ట్రంలో తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. మోనెట్టి మానర్ నర్సింగ్ హోమ్ ధ్వంసం కావడంతో ఒకరు మరణించారు. మరో 20 మంది లోపలే ఉండిపోగా వారిని రక్షించారు. వీరిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. టెన్నెస్సీ రాష్ట్రంలో తుపాను కారణంగా ముగ్గురు మృతిచెందారు. లేక్ కౌంటీలో ఇద్దరు, ఒబియోన్ కౌంటీలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తుపాను బీభత్సంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలకు అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. -
అమెరికా ఎన్నికలు: మేయర్‌గా ఎన్నికైన కుక్క..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడలేదు. కానీ ఓ చిన్న పట్టణం మాత్రం విల్బర్ బీస్ట్ అనే కుక్కను తన మేయర్‌గా ఎన్నుకుంది. ఫాక్స్ న్యూస్ ప్రకారం, కెంటకీలోని రాబిట్ హాష్ అనే ఓ చిన్న పట్టణం ఫ్రెంచ్ బుల్‌డాగ్‌ను తమ కొత్త నాయకుడిగా ఎన్నుకుంది. ఇక మేయర్‌గా ఎన్నికైన విల్బర్ బీస్ట్ ఈ ఎన్నికల్లో 13,143 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు రాబిట్ హాష్ హిస్టారికల్ సొసైటీ తెలిపింది. "రాబిట్ హాష్‌లో మేయర్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. మొత్తం 22, 985 ఓట్లు పోలవ్వగా.. విల్బర్ 13,143 ఓట్లతో (అత్యధికంగా గెలిచిన మొత్తం)మేయర్‌గా గెలుపొందింది" అంటూ రాబిట్ హాష్ హిస్టారికల్ సొసైటీ బుధవారం ఫేస్బుక్లో ప్రకటించింది. జాక్ రాబిట్ బీగల్, గోల్డెన్ రిట్రీవర్ అనే రెండు కుక్కలు వరుసగా రెండవ, మూడవ స్థానంలో నిలిచాయి. లేడీ స్టోన్, 12 ఏళ్ల బార్డర్ కోలీ అనే కుక్క, పట్టణానికి రాయబారిగా తన స్థానాన్ని నిలుపుకుంది. కెంటకీ.కామ్ ప్రకారం, ఒహియో నది వెంబడి ఉన్న ఒక ఇన్కార్పొరేటెడ్ కమ్యూనిటీ అయిన రాబిట్ హాష్, 1990 ల నుంచి కుక్కను దాని మేయర్‌గా ఎన్నుకుంటుంది. కమ్యూనిటీ నివాసితులు హిస్టారికల్ సొసైటీకి $ 1 విరాళం ఇవ్వడం ద్వారా ఓటు వేస్తారు. ఇక మేయర్‌గా ఎన్నికైన విల్బర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, రాబిట్ హాష్ హిస్టారికల్ సొసైటీ, ఇతర స్వచ్ఛంద సంస్థల కోసం డబ్బును సేకరించడంలో సహాయపడుతుంది. విల్బర్ ప్రతినిధి అమీ నోలాండ్ అనే వ్యక్తి ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘స్థానికంగా, ప్రపంచవ్యాప్తంగా తనకు మద్దతు తెలుపుతూ.. నమ్మకంతో ఓటు వేసిన అందరికి పూచ్ కృతజ్ఞతలు తెలిపారు’ అన్నారు. (యూఎస్ ఎలక్షన్స్: చరిత్ర సృష్టించిన నల్లజాతి గే) "కెంటకీలోని నది కుగ్రామ పట్టణమైన రాబిట్ హాష్‌ను సంరక్షించడానికి ఇది చాలా అర్ధవంతమైన కారణం, ఉత్తేజకరమైన సాహసం" అని వ్రాతపూర్వక ప్రకటనలో తెలిపారు. అలానే ‘ఈ పట్టణం సందర్శకులకు స్వాగతం పలుకుతుంది. అన్ని వయసుల వారికి మేం సంతోషాన్ని కలిగించే కార్యక్రమాలను నిర్వహిస్తాం. ఈ పట్టణాన్ని సందర్శించి గొప్ప అనుభూతులను సొంతం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం’ అని అమీ నోలాండ్ తెలిపారు. -
కెంటకీతో సెరెనా ఆట షురూ
లెక్సింగ్టన్: అమెరికా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ కెంటకీ ఓపెన్‌తో పునరాగమనం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఆగస్టు 10 నుంచి జరుగనున్న ఈ టోర్నీలో 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల (సింగిల్స్) విజేత సెరెనాతో పాటు 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ కూడా పాల్గొననున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. -
అమెరికాలో నిరసనలు
లూయిస్ విల్లే: పోలీసుల చేతుల్లో కాల్పులకు గురై మరణించిన బ్రియాన్న టేలర్‌కు మద్దతుగా గురువారం రాత్రి కెంటకీ నగర వీధుల్లో 400 నుంచి 500 మంది నల్లజాతీయులు నిరసనలు జరిపారు. ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఏడుగురు గాయాలపాలైనట్లు పోలీసులు తెలిపారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఈ ఘటనకు సంబంధించి కొంత మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బ్రియన్నా టేలర్ ఇంట్లో మత్తుపదార్థాలు ఉన్నాయని పోలీసులు కాల్చి చంపినప్పటికీ, ఇంట్లో మాత్రం మత్తు పదార్థాలు దొరకలేదు. దీంతో అమెరికాలో నల్ల జాతీయులపై తెల్ల జాతీయులు హింసకు పాల్పడుతున్నారంటూ నిరసనలు జరుగుతున్నాయి. -
ఫ్రిజ్ డోర్ తెరవమంటే ఏకంగా ఫ్రిజ్నే లాక్కొచ్చింది
వాషింగ్టన్: శునకాన్ని కాపలా సింహంగానే చూడకుండా రకరకాల పనులు అప్పజెప్పుతున్నారు దానికి. పాల ప్యాకెట్ తీసుకురమ్మనో, పేపర్ పట్టుకురమ్మనో, ఫ్రిజ్‌లో నుంచి మంచినీళ్లు తెమ్మనో లేదా కాసేపు కలిసి ఆడుకోవడమో ఇలా చాలా రకాలుగానే ఉపయోగించుకుంటున్నారు శునకాలను. మనదేశంలో ఇది అరుదేమో కానీ విదేశాల్లో మాత్రం సర్వసాధారణం. ఇక శునకాలకు ఈమేరకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక సంస్థలు కూడా ఉంటాయి. అలా అమెరికాలోని కెంటకీలో ‘డబుల్ హెచ్ కెనైన్’ అనే ట్రైనింగ్ అకాడమీ ఉంది. ఇది కుక్కలకు రకరకాల పనులను నేర్పించే శిక్షణ సంస్థ. ఇందులో రైకర్ అనే శునకం శిక్షణకు వచ్చింది. దానికి పనులు చేయాలన్న ఆరాటమే కానీ ఏ ఒక్కటీ సరిగ్గా చేయలేకపోయింది.(ప్రియురాళ్లకు బాయ్‌ఫ్రెండ్స్ సర్ప్రైజ్) పైగా ప్రయత్నించే క్రమంలో అది చేస్తున్న పనులు నవ్వులు తెప్పిస్తున్నాయి. ఫ్రిజ్ డోర్ తెరవమంటే ఏకంగా ఫ్రిజ్నే లాక్కు రావడం, విసిరేసిన బంతి పట్టుకురమ్మంటే అది పరిగెత్తే క్రమంలో యజమానిని కింద పడేయడంలాంటివి చేస్తూ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. జెర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన ఈ శునకానికి శిక్షణ ఇస్తున్న వీడియోను ట్రైనింగ్ సభ్యులు సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఒకరకంగా కుక్కకు ట్రైనింగ్ ఇవ్వడానికి వారి తల ప్రాణం తోక్కొచ్చిందనుకోండి. కానీ గమ్మత్తైన విషయమేంటంటే మరో వీడియోలో ఈ రైకర్ అలవోకగా అన్ని పనులు చేస్తూ వావ్ అనిపించుకుంది. తన సాయశక్తులా కష్టపడి ఎట్టకేలకు అన్ని విద్యల్లో ఆరితేరిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కుక్కలకు ట్రైనింగ్ ఏంటి? శునకాలకు ఇచ్చే శిక్షణలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. గైడ్ డాగ్స్: దృష్టి లోపం ఉన్న వాళ్లకు, అంధులకు సహాయపడే విధంగా శునకాలకు శిక్షణ నిస్తారు. హియరింగ్ డాగ్స్: వినికిడి సమస్య ఉన్నవాళ్లకు సహాయపడేలా శిక్షణ నిస్తారు. సర్వీస్ డాగ్స్: పైన వాటిలా ప్రత్యేకంగా ఒక పనికి కాకుండా రకరకాల పనులకు ఉపయోగపడేలా శునకాలకు శిక్షణ నిస్తారు. వీటితో పాటు మెడికల్ అలర్ట్ డాగ్స్, సైకియాట్రిక్ సర్వీస్ డాగ్స్... పేరుతో శునకాలకు శిక్షణ నిస్తారు. -
దొంగను భలే బురిడీ కొట్టించారు..
-
దొంగతనానికి వచ్చి.. ఇరుక్కుపోయాడుగా!
వాషింగ్టన్ : తన చాకచక్యంతో ఓ మహిళా క్లర్కు దొంగోడిని పరుగులు పెట్టించింది. తన సాహసంతో.. అతడు ఎత్తుకుపోయిన సొమ్ము తిరిగి యజమానికి చేరేలా చేసింది. ఈ ఘటన కెంటకీలోని ఓ హోటల్లో చోటుచేసుకుంది. వివరాలు... కోరీ ఫిలిప్స్ అనే వ్యక్తి ఓ హోటల్లో చొరబడ్డాడు. కౌంటర్ వద్ద ఎవరూ లేకపోవడంతో డబ్బులు కొట్టేసేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో అక్కడికి హోటల్ క్లర్కు రావడంతో ఆమెను తుపాకీతో బెదిరించి... సొమ్ము మొత్తం తన చేతిలో పెట్టాల్సిందిగా ఆదేశించాడు.ఈ క్రమంలో సదరు మహిళ ఏమాత్రం భయపడకుండా కౌంటర్లో ఉన్న డబ్బు తీసి ఫిలిప్స్‌కు చూపించింది. అనంతరం అతడిపై డబ్బులను విసురుతూ వాటిని కిందపడేలా చేసింది. అంతేగాకుండా డబ్బు భద్రపరచుకునేందుకు అతడికి ఓ కవర్ కూడా ఇచ్చింది. దీంతో క్లర్కు తనను చూసి హడలిపోయిందనుకున్న ఫిలిప్స్ తుపాకీని కౌంటర్‌పై పెట్టి తాపీగా కిందపడిన క్యాష్‌ను ఏరుకునేందుకు సిద్ధమయ్యాడు. వెంటనే అప్రమత్తమైన క్లర్కు టేబుల్‌పై ఉన్న తుపాకీ తీసుకుని అతడికి గురిపెట్టింది. అయితే తొలుత ఆమెను ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన దొంగ... ఆమె ధైర్యాన్ని చూసి కాలికి బుద్ధిచెప్పాడు. డబ్బుతో సహా బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు హోటల్లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. హోటల్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి ఆచూకీ కనుగొనేందుకు సదరు వీడియోను తమ ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేశారు. తద్వారా నేరం జరిగిన మరుసటి రోజే అతడిని అరెస్టు చేసి.. చోరీ అయిన సొమ్మును రికవరీ చేశారు. ఇక మహిళా క్లర్కు సాహసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘హ్యాట్సాఫ్ మేడమ్.. మీరు సూపర్.. మీ ఇంటర్వ్యూ కావాలి. దొంగను భలే బురిడీ కొట్టించారు. అందరూ మీలాగా ధైర్యంగా ఉంటే దొంగలకు చుక్కలే ఇక. అయినా వీడేం దొంగ. చోరీ చేయడానికి వచ్చి ఇలా ఎవరైనా మూర్ఖంగా వ్యవహరిస్తారా’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. -
విద్యార్థికి నగ్నచిత్రాలు పంపిన టీచర్!
కెంటకీ : విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ టీచర్ వక్రబుద్దిని ప్రదర్శించింది. పూర్వ విద్యార్థికి తన నగ్నచిత్రాలు పంపి కటకటాలపాలైంది. కెంటకీ అందాల పోటీ విజేత అయిన సదరు టీచర్ ఈ పాడు పనిచేసి ఉద్యోగం పోడగొట్టుకుంది. ఈ ఘటన అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వెస్ట్ వెర్జినాలోని ఆండ్రూ జాక్సన్ మిడిల్ స్కూల్లో పార్ట్‌టైం టీచర్ అయిన 28 ఏళ్ల రామ్సీ బియర్స్ 6,7 గ్రేడ్లకు పాఠాలు చెప్పేది. తన పూర్వ విద్యార్థి అయిన ఓ 15 ఏళ్ల కుర్రాడికి ఈ మాజీ మిస్ కెంటకీ స్నాప్ చాట్ ద్వారా తన టాప్ లెస్ ఫొటోలను పంపించింది. వీటిని సదరు అబ్బాయి తల్లిదండ్రులు అతని ఫోన్లో గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు రామ్సీ బియర్స్ ఆగస్టు, అక్టోబర్ల మధ్య నాలుగు టాప్‌లెస్ ఫొటోలను పంపించినట్లు గుర్తించారు. అశ్లీల కంటెంట్‌ను మైనర్‌కు పంపిందనే అభియోగంపై ఆమెను అరెస్ట్ చేశారు. స్కూల్ యాజమాన్యం సదరు టీచర్‌ను ఉద్యోగం నుంచి తీసేసింది. రామ్సీ బియర్స్ 2014లో జరిగిన అందాల పోటీల్లో మిస్కెంటకీగా విజయం సాధించింది. -
50 ఏళ్ల క్రితం విడాకులు.. మళ్లీ ఇప్పుడు పెళ్లి!
దేవుడు వేసిన ముడి ఎప్పటికి విడిపోదు. ఆ ముడిని తెంచుకోవడం మానవమాత్రులకు ఎలా సాధ్యమవుతుంది. కానీ మారుతున్న కాలంతో పాటు మనిషిలో కూడా మార్పులు వస్తున్నాయి. బ్రహ్మ వేసిన ముడులు విప్పడానికి విడాకులను సృష్టించాడు మానవుడు. విడాకులు మనషికి మాత్రం పరిమితం. మనసుకి కాదు. ఆ మనసులు ఎప్పడూ కలిసే ఉంటాయి. లేదా ఎప్పటికైనా కలుస్తాయి. దీనికి నిదర్శనమే ఈ జంట. అమెరికా కెంటుకీలోని లెక్సింగ్టన్కు చెందిన హరోల్డ్ హోలాండ్, లిల్లియన్ బర్న్స్ లు 1968లో విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరికి ఐదుగురు సంతానం ఉంది. విడాకుల అనంతరం వీరిద్దరు వేరే వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. అయితే వారిద్దరు 2015లో చనిపోయారు. అయితే ఆ జంట విడిపోయినా మధ్యమధ్యలో పిల్లలకోసం కలిసేవారు. మాట్లాడుకునే వారు. హోలాండ్ ప్రతీ సంవత్సరం తన కుటుంబంతో గెట్ టుగేదర్ ప్రోగ్రాంను ఏర్పాటుచేసేవాడు. అయితే ఈ ఏడాది కూడా ఏర్పాటుచేశాడు. అయితే దీనికి మాజీ భార్య బర్న్స్ కూడా హాజరయ్యారు. వీరికి పది మంది పిల్లలు, 20కి పైగా మనవళ్లు, 30కి పైగా ముని మనవళ్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వీరు ఒంటరిగా మాట్లాడుకోవడం వల్ల మరింత సన్నిహితులం అయ్యామని హోలాండ్ తెలిపారు. ఇప్పటికి వీరిద్దరు యువకుల్లానే ప్రేమించుకుంటున్నారనీ, కలిసినప్పుడు చేతులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తారనీ, ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నప్పుడు కళ్లలో వెలుగులు కనబడతాయని వారి మనవళ్లు చెబుతున్నారు. వీరిద్దరి పెళ్లి వచ్చే వారం చర్చిలో జరగనుంది. పాస్టర్ కూడా వీరి మనవడే. గ్రాండ్ పేరెంట్స్ వివాహం నా చేతులపై జరపడం చాలా ఆనందంగా ఉందనీ, నేను చేసిన అన్ని పెళ్లిళ్లలోనూ ఇది ఎంతో ప్రత్యేకమైందని తెలిపారు. -
అమెరికా హైస్కూల్లో కాల్పుల మోత
బెన్టన్: అగ్రరాజ్యం అమెరికా కొత్త ఏడాదిలో మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కెంటకీ రాష్ట్రంలోని మార్షల్ కౌంటీలో ఉన్న హైస్కూల్లో ఓ విద్యార్థి(15) హ్యాండ్‌గన్‌తో జరిపిన కాల్పుల్లో ఇద్దరు తోటివిద్యార్థులు చనిపోగా, 17 మంది గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం 8.57 గంటలకు హైస్కూల్‌కు చేరుకున్న నిందితుడు పాఠశాల ప్రాంగణంలో ఉన్న వారందరిపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బుల్లెట్లు పూర్తిగా అయిపోయేంతవరకూ అతను కాల్పులు జరుపుతూనే ఉన్నాడన్నారు. అయితే సదరు విద్యార్థి ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడన్న దానిపై పోలీసులు అధికారులు ఎలాంటి వివరాలు చెప్పలేదు. -
ఏ చిన్నారికి ఇలా కాకూడదు!
న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఉపయోగించని సమయంలో జాగ్రత్త చేయాలని.. మరీ ముఖ్యంగా చిన్నారులకు దూరంగా ఉంచాలని చెప్పే ఘటన ఇది. అభంశుభం తెలియని 19 నెలల చిన్నారి ఆపిల్ ఐ ఫోన్ చార్జింగ్ కేబుల్‌ను నోట్లో పెట్టుకోవడం వల్ల జరిగిన ప్రమాదం దృశ్యాలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. అమెరికాలోని కెన్టస్కీ ప్రాంతానికి చెందిన కర్ట్నీ ఎన్ డేవిస్.. అక్టోబర్ 5న ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్న తరువాత కేబుల్‌ను అలాగే వదిలేసింది. అదేసమయంలో నేల మీద ఆడుకుంటున్న 19 నెలల చిన్నారి ఆమె కుమార్తె.. ఛార్జింగ్ కేబుల్‌ను నోట్లో పెట్టుకుంది. కొన్ని క్షణాల్లో చిన్నారి బిగ్గరగా ఏడుస్తుండడంతో ఏం జరిగిందని వచ్చిన డేవిస్.. పాపను చూడగానే షాక్ గురయింది. నోట్లో కుడివైపు పూర్తిగా కాలిపోయి కనిపించింది. చిన్నారిని తీసుకుని.. డేవిస్ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లింది. పాపను పరీక్షించిన వైద్యులు.. ప్రమాదం లేదని.. సాధారణ చికిత్సతో తగ్గిపోతుందని చెప్పారు. ఇదంతా పూర్తయ్యాక.. డేవిస్ తనకు జరిగిన ఘటనను సోషల్ మీడియాలో ఫొటోలతో సహా వివరిస్తూ పోస్ట్ చేశారు. చిన్నారులకు సమీపంలో ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉంచకండి అంటూ విజ్ఞప్తి చేశారు. నా చిన్నారికి జరిగినట్లు మరెవరీ ఇలా జరక్కూడదు అంటూ సోషల్ మీడియాలో ఆమె విజ్ఞప్తి చేశారు. డేవిస్ పోస్ట్ ప్రస్తుతంఫేస్బుక్లో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ ఈ పోస్ట్‌ని 3 లక్షల మంది షేర్ చేశారు. -
అమెరికాలో కిరాతకం
-
అమెరికాలో కిరాతకం
లెగ్జింటన్: అమెరికా స్పింటర్ టైసన్ గే కుమార్తె ట్రినిటీ గే(15) దారుణ హత్యకు గురైంది. కెంటకీ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ లో ఆమెను కాల్చిచంపినట్టు టైసన్ గే ప్రతినిధి మార్క్ వెట్ మోర్ తెలిపారు. రెస్టరెంట్ పార్కింగ్ ప్రాంతంలో ట్రినిటీ మృతదేహాన్ని గుర్తించినట్టు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగినట్టు లెగ్జింటన్ పోలీసులు తెలిపారు. రెండు వాహనాల్లోని వ్యక్తుల మధ్య కాల్పులు జరిగినట్టు ప్రత్యక్షసాక్షి ఒకరు వెల్లడించారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరిని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. మరో వాహనం కోసం గాలిస్తున్నామని, దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. గత మూడు సమ్మర్ ఒలింపిక్ క్రీడల్లో టైసన్ గే పోటీ పడ్డాడు. 2012 లండన్ ఒలింపిక్స్ లో 4X100 మీటర్ల రిలే పరుగు పందెంలో వెండి పతకం గెలిచిన అమెరికా అథ్లెట్ల బృందంలో అతడు కూడా ఉన్నాడు. ట్రినిటీ కూడా తండ్రి మాదిరిగానే స్పింటర్ గా మారింది. రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొంది. ఆమె మృతి పట్ల కెంటకీ హైస్కూల్ అథ్లెటిక్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. -
భారత విద్యార్ధులకు అమెరికా వర్సిటీ షాక్
వాషింగ్టన్: అమెరికాలో చదువుకోసం వెళ్లిన భారత విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రోగ్రామింగ్ లో సరైన పట్టులేకపోవడంతో యూఎస్ లోని వెస్టర్న్ కెంటకీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో ఎమ్మెస్ చేయడానికి వెళ్లిన 25 మంది విద్యార్థులను వెనక్కు వెళ్లిపోవాలని లేదా వేరే ఏదైనా ఇన్ స్టిట్యూట్ లో అడ్మిషన్ కోసం ప్రయత్నించుకోవాలని వర్సిటీ కోరింది. ఈ ఏడాది జనవరిలో 60 విద్యార్థులు కోర్సులో చేరేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 40 మంది కనీస ప్రమాణాలు అందుకోలేకపోయారని యూనివర్సిటీ చైర్మన్ జేమ్స్ గ్యారీ తెలిపారు. విద్యార్థులకు ప్రత్యామ్నాయాలను సూచించిన వాటిలో కూడా విఫలం కావడంతో వారిని వెనక్కు పంపడం తప్ప మరో దారి కనిపించలేదని వెల్లడించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధికి ఉండాల్సిన కనీస ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా వాళ్లకు లేవని ఇది తన డిపార్ట్ మెంట్ ను ఇబ్బందికి గురిచేసినట్లు వివరించారు. యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న వాళ్లంతా అంతర్జాతీయ రిక్రూటర్ల ద్వారా స్పాట్ అడ్మిషన్ల ద్వారా తీసుకున్నవేనని చెప్పారు. ఇక నుంచి విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చే ముందు యూనివర్సిటీ నుంచి ఫ్యాకల్టీ భారత్ కు వెళ్లి విద్యార్ధుల అకడమిక్ రికార్డులను పరిశీలించిన తర్వాతే ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన కెంటకీ యూనివర్సిటీ ఇండియన్ స్టూడెంట్ అసోషియేషన్ చైర్మన్ ఆదిత్య శర్మ విద్యార్ధులను యూనివర్సిటీ నుంచి వెళ్లిపోమనడం బాధకరమైన విషయం అని అన్నారు. గ్రాడ్యుయేషన్ గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ) లేని విద్యార్ధులు డబ్బులు పోసి సీట్లు కొనుక్కున్నారని తెలిపారు. కాగా, ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు పర్యటన కోసం అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే.