
మిస్ కెంటకీ రామ్సీ బియర్స్
కెంటకీ : విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ టీచర్ వక్రబుద్దిని ప్రదర్శించింది. పూర్వ విద్యార్థికి తన నగ్నచిత్రాలు పంపి కటకటాలపాలైంది. కెంటకీ అందాల పోటీ విజేత అయిన సదరు టీచర్ ఈ పాడు పనిచేసి ఉద్యోగం పోడగొట్టుకుంది. ఈ ఘటన అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వెస్ట్ వెర్జినాలోని ఆండ్రూ జాక్సన్ మిడిల్ స్కూల్‌లో పార్ట్‌టైం టీచర్ అయిన 28 ఏళ్ల రామ్సీ బియర్స్ 6,7 గ్రేడ్‌లకు పాఠాలు చెప్పేది. తన పూర్వ విద్యార్థి అయిన ఓ 15 ఏళ్ల కుర్రాడికి ఈ మాజీ మిస్ కెంటకీ స్నాప్ చాట్ ద్వారా తన టాప్ లెస్ ఫొటోలను పంపించింది.
వీటిని సదరు అబ్బాయి తల్లిదండ్రులు అతని ఫోన్‌లో గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు రామ్సీ బియర్స్ ఆగస్టు, అక్టోబర్‌ల మధ్య నాలుగు టాప్‌లెస్ ఫొటోలను పంపించినట్లు గుర్తించారు. అశ్లీల కంటెంట్‌ను మైనర్‌కు పంపిందనే అభియోగంపై ఆమెను అరెస్ట్ చేశారు. స్కూల్ యాజమాన్యం సదరు టీచర్‌ను ఉద్యోగం నుంచి తీసేసింది. రామ్సీ బియర్స్ 2014లో జరిగిన అందాల పోటీల్లో మిస్‌కెంటకీగా విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment