తన చాకచక్యంతో ఓ మహిళా క్లర్కు దొంగోడిని పరుగులు పెట్టించింది. తన సాహసంతో.. అతడు ఎత్తుకుపోయిన సొమ్ము తిరిగి యజమానికి చేరేలా చేసింది. ఈ ఘటన అమెరికాలోని కెంటకీలోని ఓ హోటల్‌లో చోటుచేసుకుంది. వివరాలు... కోరీ ఫిలిప్స్ అనే వ్యక్తి ఓ హోటల్‌లో చొరబడ్డాడు. కౌంటర్ వద్ద ఎవరూ లేకపోవడంతో డబ్బులు కొట్టేసేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో అక్కడికి హోటల్ క్లర్కు రావడంతో ఆమెను తుపాకీతో బెదిరించి... సొమ్ము మొత్తం తన చేతిలో పెట్టాల్సిందిగా ఆదేశించాడు.ఈ క్రమంలో సదరు మహిళ ఏమాత్రం భయపడకుండా కౌంటర్‌లో ఉన్న డబ్బు తీసి ఫిలిప్స్‌కు చూపించింది.