
మినియా పొలిస్‌లో దుకాణాలకు నిప్పుపెట్టి నినాదాలు చేస్తున్న ఆందోళనకారులు
లూయిస్ విల్లే: పోలీసుల చేతుల్లో కాల్పులకు గురై మరణించిన బ్రియాన్న టేలర్‌కు మద్దతుగా గురువారం రాత్రి కెంటకీ నగర వీధుల్లో 400 నుంచి 500 మంది నల్లజాతీయులు నిరసనలు జరిపారు. ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఏడుగురు గాయాలపాలైనట్లు పోలీసులు తెలిపారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఈ ఘటనకు సంబంధించి కొంత మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బ్రియన్నా టేలర్ ఇంట్లో మత్తుపదార్థాలు ఉన్నాయని పోలీసులు కాల్చి చంపినప్పటికీ, ఇంట్లో మాత్రం మత్తు పదార్థాలు దొరకలేదు. దీంతో అమెరికాలో నల్ల జాతీయులపై తెల్ల జాతీయులు హింసకు పాల్పడుతున్నారంటూ నిరసనలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment