ఆ ర్యాలీలో మా ‘కమ్యూనికేషన్’ పేలవం
యూఎస్ సీక్రెట్ సరీ్వస్ అంగీకారం
వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జూలైలో హత్యాయత్నం జరిగిన ర్యాలీలో భద్రతా వైఫల్యాలను యూఎస్ సీక్రెట్ సర్వీస్ అంగీకరించింది. తమ సమీక్షలో వెల్లడైన వైఫల్యాలను శుక్రవారం వివరించింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ నిర్వహించిన ఔట్‌డోర్ కార్యక్రమంలో షూటర్ థామస్ మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరపడం, కుడి చెవికి గాయంతో ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం తెలిసిందే.
పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఈ ర్యాలీలో కాల్పుల్లో ఇద్దరు గాయపడగా, అగి్నమాపక సిబ్బంది మరణించారు. కాల్పులు జరిపిన క్రూక్స్‌ను సీక్రెట్ సరీ్వస్ సిబ్బంది కాల్చి చంపారు. ఈ ఘటన తరువాత సీక్రెట్ సరీ్వస్ డైరెక్టర్ కింబర్లీ చీట్లే రాజీనామా చేశారు. సీక్రెట్ సరీ్వస్ ఏజెంట్లు సెలవులో వెళ్లారు. దీనిపై సమీక్ష నిర్వహించిన సీక్రెట్ సర్వీస్ ప్రణాళిక, దాని అమలులో లోపాలను గుర్తించిందని తాత్కాలిక డైరెక్టర్ రోనాల్డ్ రోవ్ జూనియర్ తెలిపారు. అడ్వాన్స్ టీంలోని కొందరు చాలా శ్రద్ధగా వ్యవహరించగా, మరికొందరి అలసత్వం భద్రతా ప్రోటోకాల్స్ ఉల్లంఘనకు దారితీసిందన్నారు.
హెచ్చరికలు లేవు..
స్థానిక యంత్రాంగంతో పేలవమైన కమ్యూనికేషన్, మొబైల్ పరికరాలపై అతిగా ఆధారపడటం, సమాచారం పక్కదారి పట్టడం వంటి సమస్యలను గుర్తించామని రోవ్ తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం సుమారు 18:10 గంటలకు కౌంటర్ స్నైపర్ రెస్పాన్స్ ఏజెంట్‌కు సీక్రెట్ సరీ్వస్ సెక్యూరిటీ రూమ్ కాల్ చేసి.. ఏజీఆర్ భవనం పైకప్పుపై ఒక వ్యక్తి ఉన్నట్లు తెలిపింది. అయితే సీక్రెట్ సరీ్వస్ రేడియో నెట్‌వర్క్ ద్వారా ఆ కీలక సమాచారం ప్రసారం కాలేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు దానికి ప్రతిస్పందించేందుకు కాక, ఏదీ జరగకుండా నివారించేందుకు సీక్రెట్ సర్వీస్‌కు అదనపు నిధులు, సిబ్బంది, పరికరాలు అవసరం... ట్రంప్‌పై హత్యాయత్నాన్ని దర్యాప్తు చేస్తున్న కాంగ్రెషనల్ టాస్‌్కఫోర్స్ తెలిపింది. ఉద్యోగులను జవాబుదారీ చేయడం విషయంలో రోవ్‌ను అనుసరించాలని, స్వతంత్ర దర్యాప్తునకు సహకరించాలని, సీక్రెట్ సరీ్వస్‌లో అలసత్వానికి స్థానం ఉండకూడదని సూచించింది.
అధ్యక్షుడితో సమాన భద్రత..
గత వారాంతంలో ఫ్లోరిడాలోని వెస్ట్‌పామ్ బీచ్‌లోని గోల్ఫ్‌కోర్స్‌లో ట్రంప్‌పై రెండోసారి హత్యాయత్నం జరగడంతో భద్రతకు డిమాండ్ పెరిగింది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షులతో సమానంగా అధ్యక్ష అభ్యర్థులకు సీక్రెట్ సరీ్వస్ భద్రతను పెంచే బిల్లును అమెరికా ప్రతినిధుల సభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. సెనేట్‌లో ఓటింగ్, అధ్యక్షుడు జో బైడెన్ సంతకం పూర్తయితే ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుంది. అయితే ట్రంప్‌కు ఇప్పుడు అధ్యక్షుడితో సమానమైన రక్షణ కలి్పస్తున్నామని రోవ్ చెప్పారు. సీక్రెట్ సర్వీస్ పనిచేసే వాతావరణానికి ముప్పు విపరీతంగా ఉందని ఆదివారం జరిగిన ఘటన రుజువు చేస్తోందని రోవ్ అన్నారు. ఇక ఫ్లోరిడాలో గన్‌మెన్ ట్రంప్‌వైపు చూడను కూడా చూడలేదని, ముందే అతన్ని అరెస్టు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment