న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెల్లడి అయ్యాయి. ట్రంప్‌ను హత్యచేస్తానని కొన్ని నెలల ముందే నిందితుడు ర్యాన్ రౌత్.. లేఖ రాసినట్లు అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు. ట్రంప్‌ను హత్య చేయాడానికి గల ఉద్దేశాలను ఆ లేఖలో నిందితుడు రాశాడు. ఇక..దాడికి ముందు మందుగుండు సామగ్రి, ఒక మెటల్ పైపు, ఇతర నిర్మాణ సామగ్రి, నాలుగు ఫోన్లతో ఉన్న బాక్స్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఇంటిముందు నిందితుడు పడేశాడని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
ట్రంప్‌పై హత్యాయత్నం ఘటన వెలుగులోకి వచ్చాక.. ఆ గుర్తు తెలియని వ్యక్తి బాక్స్‌ను తెరవగా అందులో ఈ లేఖ బయటపడినట్లు తెలిపారు. ఆ లేఖలో.. ‘‘ఇది డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాప్రయత్నం. కానీ విఫలం చేశాను. నేను నా వంతు ప్రయత్నం చేశాను. నేను సేకరించిన అన్ని ఇందులో ఉన్నాయి. ఇక.. ట్రంప్‌ను అంతం చేయటం మీ ఇష్టం. ట్రంప్ హత్య పూర్తి చేసినవారికి 150,000 డాలర్లు అందిస్తా’’ అని రాసినట్లు తెలిపారు. ఇక.. ఇరాన్‌తో చిన్నపిల్లల మాదిరిగానే ట్రంప్ సంబంధాలను ముగించారని ఆ లేఖలో పేర్కొనటం గమనార్హం.
సెప్టెంబర్ 15న ట్రంప్ వెస్ట్ పామ్ బీచ్ కోర్స్‌లో గోల్ఫ్ ఆడుతున్నప్పుడు సమయంలో నిందితుడు ర్యాన్ రౌత్ అక్కడే సంచరిస్తూ.. హత్యాయత్నానికి ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ట్రంప్‌ను కాపాడిన విషయం తెలిసిందే. 58 ఏళ్ల నిందితుడిపై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో నిందితుడు విచారణ ఎదుర్కొనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment