
ఆగంతకుడి కోసం పోలీసుల ముమ్మర గాలింపు
లండన్(యూఎస్‌ఏ): అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్న కాల్పుల ఘటన నిందితుడి కోసం ముమ్మర వేట కొనసాగుతోంది. ఇంటర్ స్టేట్–75పై లండన్ నగరానికి 9 మైళ్ల దూరంలోని లారెల్ కౌంటీలో రోడ్డు ప్రమాదం, అనంతరం జరిగిన కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు.
వీరిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. కాల్పులకు కారణమైన జోసెఫ్ ఎ కౌచ్(32) అనే శ్వేతజాతీయుడు అప్పటి నుంచి ఉన్నాడని పోలీసులు వివరించారు. తీవ్రంగా గాలిస్తోంది. అతడున్న ప్రాంతం తెలిసిందని అధికారులు తెలిపారు. వాహనదారులు ఇంటర్ స్టేట్–75, యూఎస్ 25పైకి వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు..అనంతరం వాటిని ఉపసంహరించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment