బోస్టన్: ఒకరు ‘టైటానిక్’ నిపుణుడు.. మరొకరు సాహసి..ఇంకొకరు సీఈవో..ఇంకా ప్రముఖ వ్యాపారవేత్త, ఆయన కొడుకు..! వీరంతా ‘టైటాన్’అనే మినీ సబ్‌మెరైన్‌లో టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్తూ అట్లాంటిక్ సముద్రంలో గల్లంతయ్యారు. ఈ అయిదుగురూ మృతి చెందినట్లు భావిస్తున్నామని అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
న్యూఫౌండ్‌ల్యాండ్ రాష్ట్రం సెంట్ జాన్స్‌కు సుమారు700 కిలోమీటర్ల దూరంలో ఆదివారం ఉదయం ‘టైటాన్’సముద్రాంతర యాత్రకు బయలుదేరింది. టైటానిక్ వైపుగా నీటి అడుగుకు ప్రయాణం ప్రారంభించిన 1.45 గంటలకే ప్రధాన నౌక పోలార్ ప్రిన్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. అందులోని ఆక్సిజన్ నిల్వలు గురువారం ఉదయం 6 గంటల వరకు మాత్రమే సరిపోతాయి. దీంతో, అమెరికా, కెనడా విమానాలు, నౌకలు, రోబోల సాయంతో టైటాన్ జాడ కోసం అన్వేషణ మొదలుపెట్టాయి.
చివరికి, టైటాన్ శకలాలను తమ రోబో టైటాన్ శకలాలను గుర్తించినట్లు అమెరికా కోస్ట్‌గార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఉన్న ఓషన్ గేట్ సంస్థ చీఫ్ పైలట్, సీఈవో స్టాక్టన్ రష్, సాహసి హామిష్ హార్డింగ్,, పాక్ జాతీయుడైన వాణిజ్యవేత్త షహ్‌జాదా దావూద్, ఆయన కొడుకు సులేమాన్, టైటానిక్ నిపుణుడు నర్గియెలెట్ మృతి చెందారని తెలిపింది. అయితే, అది ఎందుకు? ఎలా? ఎప్పుడు? ప్రమాదం బారిన పడి ఉంటుందనే విషయం తెలుసుకునేందుకు అన్వేషణ కొనసాగిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment