Titanic
-
ఎముకలు కొరికే చలి! ఆ ఫీల్ కావలంటే ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!
గడ్డకట్టే చలిలో గజగజలాడిపోయిన ప్రజలు అని వార్తల్లో వింటుంటాం. అంతెందుకు అందరూ ఇష్టపడే టైటానిక్ మూవీలో 1912 నాటి విపత్తు ఘన చూపించారు. ఆ మూవీలో అంట్లాంటిక్ మహా సముద్రంలో మంచు పర్వతం ఢీకొని టైటానిక్ ఓడ మునిగిపోయిన సీన్లోని హృదయవిదారక దృశ్యాలు అందర్ని కంటతడి పెట్టిస్తాయి. అయితే దీని గురించి సినిమాల్లోనూ, వార్తల్లో వినటమే గానీ గడ్డకట్టే చలి ఎలా ఉంటుందో అనేది రియల్‌గా తెలియదు. ఆ ఫీల్ కావాలనుకుంటే ఈ మ్యూజియం వద్దకు వెళ్లిపోండి. అమెరికాలో టెన్నెస్సీలోని టైటానిక్ మ్యూజియం ఈ సరికొత్త అనుభూతిని సందర్శకులకు అందిస్తోంది. టైటానిక్ ఓడ మునిగినప్పుడు అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఉష్ణోగ్రత(రెండ డిగ్రీల సెల్సియస్)ని చవిచూడొచ్చు. 400కి పైగా టైటానిక్ ప్రామాణిక కళాఖండాలు కలిగి ఉన్న మ్యూజియం సందర్శకులకు ఓ గొప్ప అనుభూతిని అందిస్తోంది. గడ్డకట్టే నీటిలో అనుభవాన్ని పొందుతున్న సందర్శకులు వీడియోలు నెట్టింట తెగ చక్కెర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలో ప్రతి సందర్శకుడు మంచుకొండను తాకిని ఫీల్ కలుగుతుందని చెబుతుండటం చూడొచ్చు. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి టైటానిక్ ఓడ మునిగిపోయినప్పుడూ చనిపోయిన యాత్రికులు ఎంత బాధ అనుభవించి ఉంటారో అని తలుచుకుంటేనే కన్నీళ్లు వస్తున్నాయి అంటూ పోస్టులు పెట్టారు.At the Titanic Museum you can find this basin filled with water, set to the exact temperature that the people in the surrounding waters would have had to swim in after the ship sank. The ocean temperature was about 30°F.pic.twitter.com/38e9jjXjEh— Massimo (@Rainmaker1973) September 11, 2024 (చదవండి: ఈ పీతను కొనాలంటే ఆస్తులుకు ఆస్తులే అమ్ముకోవాలి..!) -
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
టైటానిక్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సినిమాలతో చాలా పేరు తెచ్చుకున్న నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. వృద్ధ్యాప్య సమస్యల కారణంగా ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈయన అభిమానులు, పలువురు నెటిజన్స్ సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)యూకేకి చెందిన బెర్నార్డ్ హిల్.. దాదాపు ఐదు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. టీవీ, సినిమా, థియేటర్ రంగాల్లో నటుడిగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. హాలీవుడ్లో క్లాసిక్ సినిమాలైన 'టైటానిక్'లో షిప్ కెప్టెన్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ట్రాయాలజీలో కింగ్ పాత్రల్లో ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన ఇప్పుడు మనల్ని వదిలి వెళ్లిపోయారు.(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)It’s with great sadness that I note the death of Bernard Hill. We worked together in John Paul George Ringo and Bert, Willy Russell marvellous show 1974-1975. A really marvellous actor. It was a privilege to have crossed paths with him. RIP Benny x#bernardhill pic.twitter.com/UPVDCo3ut8— Barbara Dickson (@BarbaraDickson) May 5, 2024 -
టైటానిక్ ప్రమాదంలో మరణించిన వ్యాపారవేత్త గోల్డ్ వాచ్ వేలం : ధర తెలిస్తే
ప్రపంచంలోని అత్యంత విషాదాల్లోఒకటి టైటానిక్ నౌక మునిగిపోయిన ఘటన. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక కథనాలు, విశేషాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. టైటానిక్‌లోప్రయాణించిన అత్యంత ధనవంతుడికి బంగారు పాకెట్ వాచ్ రికార్డు ధరకు అమ్ముడు కావడం వార్తల్లో నిలిచింది. టైటానిక్ నౌక ప్రమాదంలో మరణించిన ,న్యూయార్క్‌లోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త , రియల్ ఎస్టేట్ డెవలపర్ జాన్ జాకబ్ ఆస్టర్ (47)కు చెందిన గోల్డ్ పాకెట్ వాచ్ వేలంలో సరికొత్త రికార్డు సృష్టించింది. జేజేఏ అనే లక్షరాలతో రూపొందించిన ఈ వాచ్ అమెరికాలోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ వేలం సంస్థ శనివారం నిర్వహించిన వేలంలో ఈ వాచీని రూ.12.17 కోట్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నారు. గతంలో వాలెస్ హార్ట్లీ బ్యాగ్‌ను , ఓడ మునిగిపోయేటపుడు బ్యాండ్‌మాస్టర్ వాయించిన ప్రసిద్ధ టైటానిక్ వయోలిన్‌ను కూడా వేలం వేశారు. ఏప్రిల్ 15, 1912న సౌతాంప్టన్ నుండి న్యూయార్క్ నగరానికి బయలుదేరిన తొలి ప్రయాణంలో ఓడ మంచుకొండను ఢీకొట్టి ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమంలో1500 మందిమరణించారు. గర్భవతి అయిన జాకబ్ భార్య మడేలిన్ ప్రాణాలతో బయటపడింది. జాకబ్‌పై శరీరంపై గడియారం, బంగారు కఫ్లింక్లు, డైమండ్ రింగ్, డబ్బు, పాకెట్‌బుక్ తదితర వస్తువులను తరువాతి కాలంలో ఆస్టర్ కుమారుడు విన్సెంట్ ఆస్టర్‌కు అప్పగించారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్‌షిప్.. ప్రత్యేకతలివే..
సముద్ర అలలతో పోటీపడేలా ఆశలు ఉప్పొంగేవారికి ఇదో అద్భుతమైన అవకాశం. సముద్ర జలాల్లో ప్రయాణానికి ప్రపంచంలోనే అతి పెద్ద నౌక సిద్ధమైంది. టైటానిక్ కంటే ఇది ఐదు రెట్లు పెద్దది. ఈ నౌకలోనే సకల సదుపాయాలు ఉన్నాయి. ప్రపంచంలోని నౌకల్లో స్వర్గధామంగా మారిన ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’ ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మయామీ పోర్టు నుంచి బయలుదేరి వారం రోజులపాటు సముద్ర జలాలాపై విహరిస్తూ తూర్పు కరేబియన్ దీవులగుండా ప్రయాణించి ఫిబ్రవరి 3న తిరిగి మయామీకి చేరుకోనుంది. రకరకాల ధరల శ్రేణుల్లో ఈ విలాసనౌకలో అద్భుత ప్రయాణానికి ఏర్పాట్లున్నాయి. ప్రత్యేకతలివీ.. ఫిన్లాండ్లో మెయర్ తుర్కు షిప్‌యార్డ్ ఈ నౌకని నిర్మించింది. రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన ఈ నౌక పేరు ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’. నౌక పొడవు 1200 అడుగులు, బరువు 2,50,800 టన్నులు. ఈ నౌకలో 2,350 మంది సిబ్బంది ఉంటారు. 7,600 మంది ప్రయాణించగలరు. ప్రపంచ వ్యాప్తంగా 40 ప్రాంతాలకు చెందిన విభిన్న ఆహార పదార్థాలు ఈ షిప్లో లభిస్తాయి. నౌకలో వాటర్‌పార్క్‌లు, స్విమ్మింగ్‌పూల్‌లు, ఫ్యామిలీలు ఎంజాయ్ చేసే సకల సదుపాయాలున్నాయి. ఈ నౌకలో ప్రపంచంలోనే అతి పెద్ద వాటర్ పార్క్ ఉంది. దీన్ని ‘కేటగిరీ 6’ అని పిలుస్తారు. ఈ వాటర్ పార్కులో ఆరు స్లైడ్లు ఉన్నాయి. ఒక వాటర్ స్లయిడ్ నుంచి నేరుగా సముద్రంలోకి డైవ్ చేసేలా పెట్టారు. కానీ ప్రయాణికుల భద్రత రీత్యా దీనిని వారికి అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాల్లేవు. 2023 జూన్ 22న ఈ నౌక విజయవంతంగా మొదటి ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. నౌకలో ఉద్యానవనాలు ఉన్నాయి. పార్కుల్లోనూ ప్రయాణికులు సేద తీరవచ్చు. కాలుష్య నివారణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)ను ఇంధనంగా వాడుకుంటూ ఈ నౌక ప్రయాణం కొనసాగిస్తుంది. ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియెనల్ మెస్సీ ఈ నౌకకు పేరుపెట్టడం విశేషం. వివిధ రకాల ప్యాకేజీల కింద ధరలున్నాయి. అన్నింటికంటే తక్కువగా ఏడు రాత్రులు ఓడలో గడపాలంటే 3 వేల పౌండ్ల (కనిష్టంగా దాదాపు రూ.3.2 లక్షలకు పైన) వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇదీ చదవండి: ఈ దేశాల్లో డబ్బులన్నీ వ్యాపార కుటుంబాలవే.. కరేబియన్‌లో అత్యంత అందమైన దీవులైన బహమాస్, కొజుమెల్, ఫిలిప్స్బర్గ్, సెయింట్ మార్టెన్, రోటన్, హోండురస్ వంటి వాటి మీదుగా ఈ నౌక ప్రయాణిస్తుంది. -
‘టైటానిక్’ ఆఖరి డిన్నర్ మెనూ వేలం.. ఎంత పలికిందో తెలుసా?
Titanic Dinner Menu: టైటానిక్ ఓడ గురించి దాదాపుగా అందరికీ తెలుసు. సుమారు 110 ఏళ్ల క్రితం మంచుకొండను ఢీకొట్టి సముద్రంలో మునిగిపోయిందీ భారీ ఓడ. ఈ ప్రమాదంలో వందలాది మంది చనిపోయారు. ఈ ఓడ ప్రమాద ఉదంతం గురించి పాతికేళ్ల క్రితమే హాలీవుడ్లో ఓ సినిమా సైతం వచ్చింది. అది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తెలిసిందే. ఆఖరి విందు టైటానిక్ ఆఖరి ఫస్ట్-క్లాస్ డిన్నర్ మెనూను ఇంగ్లండ్‌లో శనివారం (నవంబర్11) వేలం వేయగా 83,000 పౌండ్లు (రూ. 84.5 లక్షలు) పలికినట్లు యూకేకి చెందిన వార్తాపత్రిక ‘ది గార్డియన్’ పేర్కొంది. టైటానిక్ ఓడలో ఫస్ట్-క్లాస్ ప్రయాణికుల కోసం తయారు చేసిన ఆఖరి విందు ఇది. ఈ ఓడ తన తొలి అట్లాంటిక్ సముద్రయానంలో 1912 ఏప్రిల్ 14న మంచుకొండను ఢీకొట్టి మునిగిపోవడానికి కేవలం మూడు రోజుల ముందు నాటిది. ఈ చారిత్రక మెనూ ఐర్లాండ్‌లోని క్వీన్స్టౌన్ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరిన టైటానిక్ మరుసటి రోజు ప్రయాణికులకు అందించిన వంటకాల గురించి తెలియజేస్తోంది. విల్ట్‌షైర్‌కు చెందిన హెన్రీ ఆల్డ్రిడ్జ్ & సన్ అనే సంస్థ ఈ మెనూను వేలం వేసింది. రకరకాల వంటకాలు వేలానికి వచ్చిన టైటానిక్ ఆఖరి ఫస్ట్-క్లాస్ డిన్నర్ మెనూలో వివిధ దేశాలకు చెందిన రకరకాల వంటకాలు ఉన్నాయి. ఆప్రికాట్లు, ఫ్రెంచ్ ఐస్‌క్రీమ్ వంటి డెసర్ట్లతోపాటు ఆయిస్టర్లు, సాల్మన్, బీఫ్, స్క్వాబ్, బాతు, చికెన్ వంటి నాన్‌వెజ్ రుచులతో పాటు నోరూరించే వెజిటేరియన్ వంటరాలు ఇందులో ఉన్నాయి. ఈ మెనూ నీటిలో తడిసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
టైటానిక్ సబ్‌మెరైన్ విషాదం: యూఎస్ కోస్ట్‌గార్డ్ కీలక ప్రకటన
టైటానిక్ సబ్‌మెరైన్‌కు విషాదానికి సంబంధించిన అన్వేషణలోయూఎస్ కోస్ట్‌గార్డ్ కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ ప్రమాదంలో చివరి అవశేషాన్ని స్వాధీనం చేసుకున్నామని కోస్ట్ గార్డ్ వెల్లడించింది. టైటాన్ సబ్మెర్సిబుల్ నుండి మానవ అవశేషాలు భావిస్తున్నవాటితోపాటు, కొన్ని శిథిల భాగాలను సేకరించినట్టు తెలిపింది. అలాగే వీటిని వైద్య నిపుణుల విశ్లేషణ కోసం పంపింది. గత వారం వాటిని స్వాధీనం చేసుకుని కోస్ట్ గార్డ్ అధికారులు యుఎస్ ఓడరేవుకు తరలించినట్లు బీబీసీ రిపోర్ట్ చేసింది. అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ శిధిలాల అన్వేషణకు వెళ్లి మార్గమధ్యలో సబ్‌మెరైన్ పేలిపోయిన ఘటన విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఇప్పటికే కొన్నింటిని సేకరించగా మిగిలిన శిధిలాల చివరి భాగాలను యూఎస్ కోస్ట్ గార్డ్ తాజాగా గుర్తించింది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఓషన్ ఆపరేటర్ అయిన Ocean Gate అప్పటినుండి వ్యాపారాన్ని నిలిపివేసింది. ఈ ఏడాది జూన్ 18న ఉత్తర అట్లాంటిక్ జలాల్లోకి ప్రవేశించినప్పుడు జరిగిన పేలుడులో మరణించిన వారిలో సబ్మెర్సిబుల్ పైలట్, కంపెనీ సీఈవో స్టాక్టన్ రష్ కూడా ఉన్నారు. మిగిలిన నలుగురు ప్రయాణికుల్లో బ్రిటిష్-పాకిస్తానీ వ్యాపారవేత్త షాజాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్, బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, పాల్-హెన్రీ నార్గోలెట్, మాజీ ఫ్రెంచ్ నౌకాదళ డైవర్ ఉన్నారు.ఈ విషాదంపై ప్రపంచ వ్యాప్త విచారణ కొనసాగుతోంది. కాగా 1912లో టైటినిక్ షిప్‌ను మొదటిసారిగా ప్రవేశపెట్టినపుడు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రయాణనౌకగా పేరు గాంచింది. అయితే ఇంగ్లాండ్‌లోని సౌత్‌హాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు బయలుదేరిన తొలి ప్రయాణంలోనే 1912 ఏప్రిల్ 14న ప్రమాదవశాత్తూ ఒక మంచు కొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయిన ఘటనలో 1517 మంది మృత్యువాత పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాదంపై 1997లో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శక నిర్మాత జేమ్స్ కామెరూన్ తీసిన‘ టైటానిక్’ సినిమా భారీ హిట్ అందుకుంది. -
టైటాన్ విషాదం: నా భర్త, బిడ్డ చివరి రోజులు తలచుకుంటే..
వాషింగ్టన్: అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ అవశేషాలను సందర్శించడానికి వెళ్లిన టైటాన్ సబ్ మెర్సిబుల్ వాహనం విస్ఫోటం చెందడంతో అందులో ప్రయాణిస్తోన్న అయిదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే జలాంతర్గామి శకలాలను కూడా వెలికితీశారు. ఈ సందర్బంగా మృతులలో ఒకరైన పాకిస్తాన్ వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ భార్య భర్త, కుమారుడు చివరి రోజుల అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పాకిస్తాన్ కు చెందిన బిలియనీర్ షాహ్జాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్ ఈ నాలుగు గంటల సాహస యాత్రకు ముందు మానసికంగా చాలా సిద్ధపడ్డారని తెలిపారు షాహ్జాదా భార్య క్రిస్టీన్ దావూద్. మా అబ్బాయి అయితే టైటానిక్ చూడటానికి వెళ్తున్నానని తెలియగానే చాలా సంబరపడ్డాడు. వాస్తవానికి నేను కూడా వారితో వెళ్లాల్సి ఉండగా అనుకోని పరిస్థితుల్లో ఈ ట్రిప్ వాయిదా పడటంతో నాకు బదులుగా మా అబ్బాయి అందులో ప్రయాణించాడు. ఈ ట్రిప్ జరిగిన రోజున కూడా ఫ్లైట్ ఆలస్యం కావడంతో పోలార్ ప్రిన్స్ (టైటాన్ జలాంతర్గామి మొదలైన చోటు) చేరుకోవడానికి ఆలస్యమైంది. ఆరోజు ఫ్లైట్ మరింత ఆలస్యమైనా బాగుండేది. ఓషన్ గేట్ సంస్థ వారు దీని వలన ఏ ప్రమాదం ఉండడదని చెబుతూ రావడంతో మాకు దాని పనితీరుపై కొంచెమైనా అనుమానం కలగలేదు. కానీ అందులో ప్రయాణం ఇంజిన్ సరిగా పనిచేయని ఫ్లైట్‌లో ఎగరడమేనని ఆరోజు గ్రహించలేకపోయాము. షాహ్జాదా , సులేమాన్ ఇద్దరూ చివరి రోజుల్లో బంక్ బెడ్ ల మీద పడుకోవడం, బఫెట్ తరహా భోజనాలు అలవాటు చేసుకోవడం, తరచుగా టైటానిక్ సినిమాను చూసేవారని చెప్పుకొచ్చారు. జలాంతర్గామి నీటిలోపలికి వెళ్ళగానే అందులోని లైట్లన్నిటిని ఆర్పేస్తారని మీకు నచ్చిన మ్యూజిక్ వింటూ చిన్న వెలుతురులో చుట్టూ ఉన్న చేపలను మాత్రం చూడవచ్చని ఓషన్ గెట్ సంస్థ చెప్పినట్లు తెలిపారు క్రిస్టీన్. ఏదైతేనేం సరైన ప్రమాణాలు పాటించని ఈ ట్రిప్ నిర్వాహకుల అజాగ్రత్త, ప్రయాణికుల అవగాహనలేమి కలగలిసి విహారయాత్ర కాస్తా విషాద యాత్రగా ముగిసింది. ఇది కూడా చదవండి: రగులుతోన్న ఫ్రాన్స్.. దొంగలకు దొరికిందే ఛాన్స్.. -
ఒడ్డుకు చేరిన టైటాన్ శకలాలు
-
ఒడ్డుకు చేరిన టైటాన్, కుళ్లిన స్థితిలో అవశేషాలు?
న్యూయార్క్: అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ పడవ సందర్శనం కోసం వెళ్లి.. ఐదుగురు దుర్మరణం పాలైన ఉదంతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ ఐదుగురిని నీటి అడుగునకు మోసుకెళ్లిన టైటాన్ సబ్ మెర్సిబుల్.. వాళ్ల పాలిట మృత్యు శకటంగా మారింది. అయితే ఎట్టకేలకు ఆ శకలాలను అధికారులు బయటకు తీసుకొచ్చారు!. జూన్ 18వ తేదీ ప్రారంభమైన టైటాన్ ప్రయాణం.. కాసేపటికే విషాదంగా ముగిసింది. తీవ్ర ఒత్తిడితో ఈ మినీ జలంతర్గామి పేలిపోగా.. అందులోని ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. కానీ, నాలుగు రోజుల తర్వాత టైటాన్ ప్రమాదంపై యూఎస్ కోస్ట్‌గార్డ్ అధికారికంగా ప్రకటన చేసింది. ఇక అట్లాంటిక్‌లో నీటమునిగిన టైటానిక్ పడవ ముందుభాగంలో 1,600 అడుగుల వద్ద.. దాదాపు 6.5 మీటర్ల పొడవు, 10,431 కిలోల దాకా బరువున్న టైటాన్ కూరుకుపోయినట్లు గుర్తించినట్లు ఇంతకు ముందు అధికారులు ప్రకటించారు. అతికష్టం మీద ఆ శకలాలను బయటకు తెచ్చినట్లు అమెరికా తీర రక్షణ దళం అధికారికంగా బుధవారం ఉదయం ప్రకటించింది. ఎస్యూవీ కారు సైజులో ఉండే టైటాన్ సబ్‌ను అతికష్టం మీద బయటకు తెచ్చారట. న్యూయార్క్‌కు చెందిన పెలాజిగ్ రీసెర్చ్ కంపెనీ తన ఒడీస్సెస్ రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్‌ను సబ్మెర్సిబుల్ వెతుకలాట కోసం ఉపయోగించింది. శకలాలను బయటకు తీయగానే.. అది తన ఆపరేషన్ ముగిసినట్లు ప్రకటించింది. అతిజాగ్రత్తగా బయటకు తీసిన శకలాల నుంచి మానవ అవశేషాలను బయటకు తీస్తారని, వాటిని వైద్య పరిశోధకులు పరిశీలిస్తారని యూఎస్ కోస్ట్‌గార్డ్ ప్రకటించింది. తద్వారా ప్రమాదం జరిగిన తీరు.. వాళ్లెలా చనిపోయారనేదానిపై ఓ అంచనానికి రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే కెనడా అధికారులు మాత్రం శకలాల వెలికితీత అంశంపై స్పందిచకపోవడం గమనార్హం. బ్రిటిష్ సాహసికుడు హమీష్ హర్దింగ్, ఫ్రెంచ్ సబ్‌మెరిన్ ఎక్స్పర్ట్ పాల్ హెన్రీ, పాక్-బ్రిటిష్ బిలియనీర్ షాహ్జాదా దావూద్.. అతని థనయుడు సులేమాన్, ఈ మొత్తం ప్రయాణానికి కారణమైన ఓషన్‌గేట్ సీఈవో స్టాక్టన్ రష్‌లు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై యూఎస్కోస్ట్ గార్డు హయ్యెస్ట్ లెవల్ దర్యాప్తు ‘‘ మెరైన్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’’కు ఆదేశించింది కూడా. The US Coast Guard said on Wednesday that it has recovered "presumed human remains" from the wreckage of the #Titan submersible. https://t.co/I9Hh5U8iku pic.twitter.com/9eCWdaMOFj — China Daily (@ChinaDaily) June 29, 2023 ఇదీ చదవండి: అట్లాంటిక్‌లో టైటాన్ ప్రమాదం.. అసలు జరిగింది ఇదే -
టైటానిక్ - ముందు మరియు తరువాత ఫోటోలు
-
టైటాన్ విషాదం: వాళ్ళ చివరి మాటలు వింటే కన్నీళ్లు ఆగవు
యూఎస్: ఇటీవల అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లి దురదృష్టవశాత్తూ అటునుంచటే అనంత లోకాలకు వెళ్ళిపోయారు ఐదుగురు. వారిలో పాకిస్తాన్ వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ అతని కుమారుడు కూడా ఉన్నారు. దావూద్ తన కుమారుడితో చివరిగా మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు ఆయన భార్య క్రిస్టీన్ దావూద్. గంటలు గడిచే కొద్దీ.. పాకిస్తాన్ వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ అతని కుమారుడు సులేమాన్ దావూద్ సముద్ర గర్భంలోకి సాహసయాత్రకు వెళ్లగా వారు యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని తిరిగి వస్తారని పోలార్ ప్రిన్స్ (టైటాన్ జలాంతర్గామికి అనుబంధ పడవ) పైన క్రిస్టీన్ కూతురితో ఎదురుచూస్తూ ఉన్నారు. టైటాన్ జలాంతర్గామి తప్పిపోయిందనగానే ఏమాత్రం భయపడని ఆమె గతంలో కూడా ఒకసారి తన భర్త విమాన ప్రమాదం నుండి తప్పించుకున్నారని తాను ధైర్యం కూడదీసుకుని అందరికీ ధైర్యం చెప్పారు. కానీ ఎప్పుడైతే 96 గంటలు గడిచాయో అప్పుడే ఆశలు వదులుకున్నట్లు ఆమె తెలిపారు. అమ్మా గిన్నిస్ రికార్డు సాధిస్తా.. ఈ సందర్బంగా చివరిగా తన భర్త, కుమారుడితో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ.. టైటానిక్ శకలాలను చూడటానికి వెళ్తున్నానని సులేమాన్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. తనతో పాటు రూబిక్ క్యూబ్ ని తీసుకుని వెళ్లి సముద్రగర్భంలో రూబిక్ క్యూబ్ అమర్చిన మొట్టమొదటిగా వ్యక్తిగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలని సంబరపడ్డాడని, అందుకోసం దరఖాస్తు కూడా చేశాడని తెలిపారు. ఆ సన్నివేశాన్ని రికార్డ్ చేయాలని తన భర్త తనతోపాటు కెమెరాని కూడా తీసుకు వెళ్లినట్లు చెప్పారు. చివరికి.. వారు వెళ్లి 96 గంటలు గడిచాయని చెప్పగానే నాకు కీడు శంకించింది, విపత్తును గ్రహించాను. కానీ నా కూతురు మాత్రం వాళ్ళు తిరిగి వస్తారని నమ్మకంతోనే ఉంది. తీర రక్షక దళాలు జలాంతర్గామి శకలాలు కనిపించాయని చెప్పాక గాని తను నమ్మలేదని చెప్పి భావోద్వేగానికి గురయ్యారు. Christine Dawood wanted to talk to the BBC and pay tribute to the son and husband she lost. #Titan Longer interview running on @BBCWorld on-air and online 🎥 @robtaylortv @EloiseAlanna pic.twitter.com/q1LW946xpn — Nomia Iqbal (@NomiaIqbal) June 25, 2023 ఇది కూడా చదవండి: ఒక్కరి కోసం రెండు విమానాలు.. అదే వెరైటీ.. -
అందులో అలా... ఇప్పుడు ఇలా
సముద్రగర్భంలో టైటానిక్ శిథిలాలను చూడడానికి ‘టైటాన్’ అనే జలాంతర్గామిలో వెళ్లిన అయిదుగురు సాహసికుల ప్రయాణం విషాదాంతం అయిన నేపథ్యంలో యానిమేటెడ్ సిట్కాం ‘ది సింప్సన్’ లోని చిత్రాలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం... 2006లో వచ్చిన ‘ది సింప్సన్’ సీజన్ 17లోని పదో ఎపిసోడ్లో హీరో హోమర్ సింప్సన్ తన తండ్రి మాసన్‌తో కలిసి జలాంతర్గామిలో సముద్రగర్భంలోకి వెళతాడు. ఒకచోట నిధులతో కూడిన శిథిలమైన నావ కనిపిస్తుంది. ఆ తరువాత వీరి జలాంతర్గామి పగడపు దిబ్బల మధ్యలో చిక్కుకు పోతుంది. మరోవైపు జలాంతర్గామిలో ‘లో ఆక్సిజన్’ సైన్ ఫ్లాష్ అవుతుంటుంది. ఈ ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు తండ్రీకొడుకులు బయటపడతారు. ‘ది సింప్సన్స్’లోని తండ్రీకొడుకులు మాసన్, హోమర్ సింప్సన్లను, టైటాన్లో ప్రయాణించిన తండ్రీకొడుకులు షెహ్జాదా దావూద్, సులేమాన్ దావూద్లతో పోల్చి నెటిజనులు పోస్ట్‌లు పెడుతున్నారు. ‘ది సింప్సన్’ రచయిత మైక్ రీస్ టైటానిక్ శిథిలాలను చూడడానికి గత సంవత్సరం భార్యతో కలిసి సముద్ర గర్భంలోకి వెళ్లివచ్చాడు. వారు ప్రయాణించిన జలాంతర్గామిలో కొద్ది సమయం పాటు కమ్యూనికేషన్ సమస్యలు వచ్చినా ఆ తరువాత సర్దుకుంది. -
‘టైటాన్ మునుగుతుందని ముందే చెప్పా’.. అందుకే జాబ్ నుంచి పీకేశారు!
అట్లాంటిక్ మహా సముద్రంలో ఇటీవల జరిగిన టైటాన్ జలాంతర్గామి ప్రమాదంలో ఓషన్ గేట్ యజమాని సహా ఐదుగురు యాత్రికులు మృతి చెందిన విషయం తెలిసిందే. టైటానిక్ ఓడ శిథిలాల ఉన్న చోటుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన టైటాన్ జలాంతర్గామి నిర్మాణ సమయంలోనే అందులో లోపాలు ఉన్నట్లు ఓ నిపుణుడు గుర్తించాడు. ఈ విషయాన్ని యాజమాన్యం వద్దకు తీసుకెళ్లగా.. వారు ఆయన మాటలను వినిపించుకోలేదు. పైగా లోపాలను చెప్పిన ఆ నిపుణుడిని ఆ ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. అసలేం జరిగిందంటే.. ‘టైటాన్’ జలాంతర్గామి నిర్మాణ జరుగుతుండగా… దాని సామర్థత మీద ఆ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న ఓ నిపుణుడికి సందేహాలు మొదలయ్యాయి. దాంతో టైటాన్‌కు మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి అవసరం ఉందని, నౌక తీవ్రమైన లోతులకు చేరినప్పుడు ప్రయాణికులకు ముప్పు తలెత్తే అవకాశముందని 2018లోనే ‘ఓషన్ గేట్’ సంస్థ మెరైన్ ఆపరేషన్స్ డైరెక్టర్ తన నివేదికలో విశ్లేషించాడు. దీనిపై అప్పట్లో అమెరికాలోని సియాటెల్ జిల్లా కోర్టులో వ్యాజ్యం సైతం దాఖలైంది. కంపెనీ విషయాలను బహిర్గతం చేస్తూ ఒప్పందాన్ని ఉల్లంఘించాడంటూ ఆ నిపుణుడు మీద ‘ఓషన్ గేట్’ సంస్థ వ్యాజ్యం వేసింది. మరో వైపు ‘టైటాన్’ భద్రత గురించి, దాని లోపాలు ఎత్తిచూపానని, పరీక్షల గురించి ప్రశ్నించినందుకు తనను ఉద్యోగం నుంచి అక్రమంగా తొలగించారంటూ సదరు వ్యక్తి కూడా కౌంటర్ దాఖలు చేశాడు. కంపెనీ ఆ రోజే నిర్మాణంలో నాణ్యత, భద్రత విషయంలో శ్రద్ధ చూపించి ఉంటే ఐదుగురు ప్రాణాలు గాల్లో కలిసేవి కాదని నెటిజన్లు మండిపడుతున్నారు. చదవండి: ప్రయాణం.. విషాదాంతం -
టైటాన్ జలాంతర్గామిలో మేము వెళ్ళాలి.. కానీ అదృష్టవశాత్తూ..
అమెరికా: అట్లాంటిక్ మహా సముద్రంలో ఇటీవల జరిగిన టైటాన్ జలాంతర్గామి ప్రమాదంలో ఓషన్ గేట్ యజమాని సహా ఐదుగురు యాత్రికులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇందులో పాకిస్తాన్ కు చెందిన వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ అతని కుమారుడు సులేమాన్ ల స్థానంలో తానూ తన కుమారుడు ప్రయాణించాల్సి ఉందని కానీ చివరి నిముషంలో తప్పుకోవడంతో ప్రాణాలు నిలుపుకున్నామాని అన్నారు లాస్ వేగాస్ కు చెందిన పెట్టుబడిదారుడు జే బ్లూమ్. జీవితంలో ఇలాంటి అనుభూతిని ఒక్కసారైనా పొందాలని, సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ శకలాలను చూడటమంటే అదృష్టముండాలని ఎలాగైనా తనను ఈ సాహస యాత్రకు ఒప్పించే ప్రయత్నం చేశారు ఓషన్ గేట్ అధినేత స్టాక్ టన్ రష్. అయినా కూడా నాకెందుకో ఆ బుల్లి జలాంతర్గామి భద్రత విషయమై ఎక్కడో అనుమానం ఉండేది. రష్ మాత్రం అలాంటిదేమీ లేదని.. ఒక హెలికాఫ్టర్‌లో ప్రయాణం కంటే ఇది చాలా సురక్షితమైనది చెప్పేవారు. కానీ ఎందుకో నా మనసు అంగీకరించక నేను చివరి నిముషంలో అతడి అభ్యర్ధనను తిరస్కరించానని చెప్పుకొచ్చారు జే బ్లూమ్. లేదంటే పాకిస్తాన్ వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ స్థానంలో తానూ.. అతని కుమారుడు సులేమాన్ స్థానంలో 20 ఏళ్ల మా అబ్బాయి సీన్ ఉండేవారమని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు బ్లూమ్. ఓషన్ గేట్ అధినేత స్టాక్ టన్ ఎంతగా చెప్పినా కూడా బ్లూమ్ ఒప్పుకోవకపోవడానికి ఆ వాహనం రిమోట్ ఆపరేటింగ్ వాహనం కావడం కూడా ఒక కారణమని చెప్పారు జె బ్లూమ్. సొంతంగా ఒక హెలికాఫ్టర్ ఉన్న బ్లూమ్ కు టైటాన్ భద్రతా ప్రమాణాలపై చాలా అనుమానాలు ఉండేవి. ఆరోజు నాకున్న స్పష్టమైన అవగాహన కారణంగానే నేను ఈ యాత్రకు ఒప్పుకోలేదు. అందుకే ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామని, షాహ్జాదా దావూద్ - సులేమాన్ ఫోటోలు చూసిన ప్రతిసారి నాకు అదే గుర్తుకు వస్తోందని అన్నారు. ఇది కూడా చదవండి: ఈజిప్టులో మోదీ తొలి అడుగు -
టైటాన్ సబ్ మెరైన్ దుర్ఘటనలో అయిదుగురు దుర్మరణం
-
టైటాన్ మినీ సబ్‌మెరైన్...పైలట్ సహా ఐదుగురు పర్యాటకులు జలసమాధి
-
ప్రయాణం.. విషాదాంతం
బోస్టన్: ఒకరు ‘టైటానిక్’ నిపుణుడు.. మరొకరు సాహసి..ఇంకొకరు సీఈవో..ఇంకా ప్రముఖ వ్యాపారవేత్త, ఆయన కొడుకు..! వీరంతా ‘టైటాన్’అనే మినీ సబ్‌మెరైన్‌లో టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్తూ అట్లాంటిక్ సముద్రంలో గల్లంతయ్యారు. ఈ అయిదుగురూ మృతి చెందినట్లు భావిస్తున్నామని అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. న్యూఫౌండ్‌ల్యాండ్ రాష్ట్రం సెంట్ జాన్స్‌కు సుమారు700 కిలోమీటర్ల దూరంలో ఆదివారం ఉదయం ‘టైటాన్’సముద్రాంతర యాత్రకు బయలుదేరింది. టైటానిక్ వైపుగా నీటి అడుగుకు ప్రయాణం ప్రారంభించిన 1.45 గంటలకే ప్రధాన నౌక పోలార్ ప్రిన్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. అందులోని ఆక్సిజన్ నిల్వలు గురువారం ఉదయం 6 గంటల వరకు మాత్రమే సరిపోతాయి. దీంతో, అమెరికా, కెనడా విమానాలు, నౌకలు, రోబోల సాయంతో టైటాన్ జాడ కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. చివరికి, టైటాన్ శకలాలను తమ రోబో టైటాన్ శకలాలను గుర్తించినట్లు అమెరికా కోస్ట్‌గార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఉన్న ఓషన్ గేట్ సంస్థ చీఫ్ పైలట్, సీఈవో స్టాక్టన్ రష్, సాహసి హామిష్ హార్డింగ్,, పాక్ జాతీయుడైన వాణిజ్యవేత్త షహ్జాదా దావూద్, ఆయన కొడుకు సులేమాన్, టైటానిక్ నిపుణుడు నర్గియెలెట్ మృతి చెందారని తెలిపింది. అయితే, అది ఎందుకు? ఎలా? ఎప్పుడు? ప్రమాదం బారిన పడి ఉంటుందనే విషయం తెలుసుకునేందుకు అన్వేషణ కొనసాగిస్తామన్నారు. -
అపుడు తప్పింది..ఇపుడు మింగేసింది: పాకిస్తాన్ టైకూన్ విషాద గాథ
టైటాన్ సబ్మెర్సిబుల్ ప్రమాదం తీవ్ర విషాదాన్నినింపింది. అట్లాంటిక్ మహాసముద్రంలో వందేళ్ల క్రితం మునిగిన టైటానిక్ షిప్ శిథిలాలను చూసేందుకు వెళ్లి పేలిపోయిన టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లోని ఐదుగురూ మరణించినట్లు యుఎస్ కోస్ట్ గార్డ్ గురువారం ధృవీకరించింది. చనిపోయిన వారిలో ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ సీఈఓ స్టాక్టన్ రష్, బ్రిటీష్ బిలియనీర్ హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ డైవర్ పాల్ హెన్రీ నార్గోలెట్ పాకిస్థాన్ బిలియనీర్ షహజాద్ దావూద్, ఆయన కుమారుడు సులేమాన్ ఉన్నారు. యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసిన ఈ ప్రమాదంలో తండ్రీ కుమారులిద్దరూ ప్రాణాలు కోల్పోయారనే అంచనా మరింత విషాదాన్ని నింపింది. అయితే చనిపోయారని భావిస్తున్న దావూద్‌కి సంబంధించి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. పాకిస్తానీ టైకూన్ షాజాదా దావూద్, భార్య ప్రకారం భయంకరమైన విమాన ప్రమాదం నుండి బయట పడ్డారు. ది డైలీ బీస్ట్ రిపోర్ట్ మేరకు క్రిస్టీన్ దావూద్ జనవరి 2019లో జరిగిన సంఘటన గురించి బ్లాగ్ పోస్ట్లోరాశారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. విమానం అటూ ఇటూ ఊగిపోవడంతో క్యాబిన్ మొత్తం ఒక్కసారిగా కేకలు పెట్టింది. బాక్సర్‌ని అన్ని దిక్కుల నుండి పంచ్‌లు కొట్టినట్లుగా అనిపించింది. చివరకు సురక్షితంగా ల్యాండ్ అయ్యేంత వరకు ఆ క్షణాలు ఎలా గడిచాయో తెలియదని క్రిస్టీన్ వెల్లడించింది. ఈ ఫ్లైట్ నా జీవితంలో మరచిపోలేని భయకంరమైన వాటిలో ఒకటి అని చెప్పుకొచ్చారు. అయితే ఏ విమానంలో, ఎక్కడికి పోతుండగా జరిగిందనేది ఆమె వివరించలేదు. (రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్) అంతేకాదు ఈ యాత్రకు సులేమాన్ వెళ్లాలని అనుకోలేదని, బలవంతంగా వెళ్లాడని హజాద్ సోదరి, సులేమాన్ అత్తయ్య అజ్మే దావూద్ ప్రమాదానికి ముందు చెప్పుకొచ్చారు. అసలు టైటాన్లో సముద్రగర్భంలోకి వెళ్లడానికి సులేమాన్ బాగా భయపడ్డాడని కూడా తెలిపారు. అయితే ఫాదర్స్ డే సందర్భంగా తండ్రికి యాత్ర చాలా ముఖ్యం కావడం తోనే తాను వెళ్లడానికి అంగీకరించాడట. చివరకు వీరి సాహస ప్రయాణం విషాదాంతమైంది. (అపుడు కరోడ్‌పతి షో సెన్సేషన్: మరి ఇపుడు) -
వామ్మో టైటానిక్ దగ్గరకా? నాకు అలాంటి అనుభవమే: జేమ్స్ కామెరూన్
టైటానిక్ షిప్ శకలాలని చూసేందుకు వెళ్లిన టైటాన్ అనే జలాంతర్గామి కథ విషాదాంతమైంది. నీటి అడుగున పీడన తీవ్రత పెరగడం వల్ల ఈ టైటాన్ పేలిపోయి, అందులోని ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్ గార్డ్ తాజాగా ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలని గుర్తించారు. ఇప్పుడు ఈ విషయమై టైటానిక్ సినిమా డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ స్పందించాడు. (ఇదీ చదవండి: టైటాన్ ఆశలు జల సమాధి) 'ఈ విషయం(సబ్ మెరైన్ పేలిపోవడం) జీర్ణించుకోవడానికే నాకు చాలా కష్టంగా ఉంది. ఇంతకుముందే సదరు ఓషియన్ గేట్ కంపెనీకి చాలామంది ఇంజినీర్లు లెటర్స్ రాశారు. మీరు చేస్తున్నది చాలా విపరీతమైన ప్రయోగం అని ఆయా లేఖల్లో పేర్కొన్నారు' అని జేమ్స్ కామెరూన్ చెప్పుకొచ్చారు. 'టైటాన్ సబ్ మెరైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 33 సార్లు ఆ ప్రాంతానికి వెళ్లొచ్చాను. అక్కడ 13వేల అడుగుల లోతు ఉంటుంది. సబ్ మెరైన్ పై చాలా ఒత్తిడి పడుతుంది. ఏ మాత్రం కంట్రోల్ తప్పినా ఆచూకీ దొరకడం అసాధ్యం. ఇది సాహసంతో కూడిన ప్రయాణం. టైటానికి షిప్ దగ్గర్లో ఏదో తెలియని శక్తి ఉంది. అక్కడ మిస్ అయితే దొరకడం కష్టమని నేను ముందే ఊహించాను. ఎందుకంటే నాక్కూడా గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి' అని జేమ్స్ కామెరూన్ చెప్పుకొచ్చాడు. James Cameron believes OceanGate Titan imploded before reaching Titanic. #OceanGate #OceansGate #Titan #Titans📷 #submarino #Submarine #Submersible #implosion #imploded #Titanic #TitanicRescue #titanicsubmarine #sousmarin pic.twitter.com/wGtWvXR0V7 — Ak Cheema (@AkCheema777) June 23, 2023 (ఇదీ చదవండి: సాగర గర్భంలో కలిసిన సాహస వీరులు) -
టైటాన్ షిప్ పక్కనే శకలాలను గుర్తించిన అమెరికా కోస్ట్ గార్డ్
-
సాగర గర్భంలో కలిసిన సాహస వీరులు
ఎప్పుడో వందేళ్ల కిందట.. అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి ఐదుగురు మృత్యువాత పడ్డారు. టైటాన్ అనే మినీ సబ్‌మెరిన్(సబ్ మెర్సిబుల్)లో వీక్షణకు బయల్దేరి.. సముద్ర గర్భంలోనే కలిపిపోయారు వాళ్లు!. దాదాపు ఐదురోజులపాటు ప్రపంచం మొత్తం వాళ్ల జాడ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చింది. అమెరికా తీర రక్షణ దళం ఆధ్వర్యంలో పలు దేశాలకు చెందిన రెస్క్యూ టీంలు సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. గురువారం నాడు గంట గంటకు ఉత్కంఠ రేపిన ఈ వ్యవహారం.. చివరకు శకలాల గుర్తింపు ప్రకటనతో విషాదాంతంగా ముగిసింది. యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రకటన ప్రకారం.. టైటానిక్ శకలాల సమీపంలోనే ఓడ ముందుభాగం నుంచి సుమారు 1,600 అడుగుల దూరంలో టైటాన్ శిథిలాలు పడి ఉన్నాయి. రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్(ROV) వీటిని గురువారం ఉదయం గుర్తించినట్లు ప్రకటించింది కోస్ట్‌గార్డ్. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం కెనడాలోని న్యూఫౌండ్లాండ్ నుంచి ఐదుగురితో కూడిన ‘టైటాన్’ సాహసయాత్ర ప్రారంభం అయ్యింది. పోలార్ ప్రిన్స్ అనే నౌక సాయంతో టైటాన్‌ను నీటి అడుగుకు పంపించారు. గంటన్నర తర్వాత.. పోలార్‌ప్రిన్స్‌తో టైటాన్‌కు సంబంధాలు తెగిపోయాయి. ఈ విషయాన్ని వెంటనే అమెరికా తీర రక్షణ దళం దృష్టికి తీసుకెళ్లింది ఈ యాత్ర నిర్వాహణ సంస్థ ఓషన్‌గేట్. న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి 400 మైళ్ల దూరంలో ఉత్తర అట్లాంటిక్‌లో టైటాన్ అదృశ్యమై ఉంటుందని భావించింది కోస్ట్‌గార్డ్. అప్పటి నుంచి 13,000 అడుగుల (4,000 మీటర్లు) లోతుల్లో టైటాన్ జాడ కనిపెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. సముద్ర అగాథంలోకి చేరుకుని జలాంతర్గామిని కనిపెట్టడం అత్యంత కష్టమని నిపుణులు మొదటి నుంచి వేసిన అంచనా కొంతవరకు నిజమైంది కూడా. ఇలా జరిగిందేమో.. విపత్తు పేలుడు..Catastrophic Implosion టైటాన్ ప్రమాదానికి కారణం ఇదేనని యూఎస్ కోస్ట్‌గార్డ్ ఓ అంచనా వేస్తోంది. నీటి అడుగుకు వెళ్లే క్రమంలో.. ఛాంబర్లోని ఒత్తిడి వల్లే మినీసబ్‌మెర్సిబుల్ పేలిపోయి ఉంటుందని ప్రకటించింది. అయితే.. నీటి అడుగున సబ్మెర్సిబుల్(మినీజలంతర్గామి) విషయంలోనే కాదు.. సబ్మెరిన్ల(జలంతర్గాముల) విషయంలోనూ ఇది జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అధిక అంతర్గత ఒత్తిడి వల్ల సబ్మెరిన్లు ఒక్కోసారి ఆగిపోయి.. నీటి అడుగుకు వెళ్లిపోతాయట. ఒక్కోసారైతే ఆ ఒత్తిడి భరించలేక అవి పేలిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. టైటాన్ పేలిపోయిన ఖచ్చితమైన క్షణం మాత్రం చరిత్రలో ఓ మిస్టరీగా మిగిలిపోయే అవకాశమే ఉంది. ఒకవేళ టైటాన్ శకలాల చెంత మృతదేహాల జాడ కనిపించినా.. అట్లాంటిక్ అడుగున ఉన్న వాతావరణం నుంచి బయటకు తేలేని పరిస్థితి ఉందని యూఎస్ కోస్ట్‌గార్డ్ అధికారికంగా ప్రకటించింది. 🚨 Breaking News All five people onboard on #Submersible are all very sadly died, #OceanGate confirms. This video shows how the accident happened with the submarine. 💔#Titanic #Titan pic.twitter.com/W82X9OawuD — WOLF™️ (@thepakwolf) June 22, 2023 ఆది నుంచి విమర్శలే.. వాషింగ్టన్ ఎవరెట్టెకు చెందిన ప్రైవేట్ కంపెనీ ఓషన్‌గేట్. 2009లో స్టాక్టన్ రష్, గుయిలెర్మో సోహ్నలెయిన్‌లు దీనిని స్థాపించారు. నీటి అడుగున టూరిజంతో పాటు అన్వేషణలకు, పరిశోధనలు ఈ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. అందుకుగానూ ఛార్జి చేస్తుంటుంది. 2021 నుంచి టైటానిక్ శకలాలను చూసేందుకు టైటాన్ అనే సబ్ మెర్సిబుల్ ద్వారా యాత్రికులను తీసుకెళ్తూ వస్తోంది. ఈ అడ్వెంచర్ టూర్లో 400 మైళ్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. టైటాన్లో.. ముగ్గురు ప్రయాణికులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. వాళ్లకు తగ్గట్లే సీటింగ్ ఉంటుంది. దాదాపు 6.5 మీటర్ల పొడవున్న ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల దాకా బరువు ఉంటుంది. కార్బన్, టైటానియం కలయిక గోడలు ఉన్నాయి. సోనార్ నేవిగేషన్ సిస్టమ్, హైఎండ్ కెమెరా ఎక్విప్మెంట్, పవర్ఫుల్ ఎల్ఈడీ లైట్లు.. వీటితో పాటు లోపలికి ప్రవేశించడానికి, బయటకు రావడానికి ఒక్కటే ద్వారం ఉంటుంది. ఇది 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. తాజాగా వెళ్లిన ఐదుగురికి(ఒక పైలట్, మిగిలిన నలుగురు యాత్రికులు) 2.50 లక్షల డాలర్లు చెల్లించారు. మన కరెన్సీ లెక్కలో.. అది రూ.2 కోట్లకు పైమాటే. అయితే టైటాన్ నిర్మాణం అట్లాంటిక్ అగాధంలోకి వెళ్లడానికి పనికిరాదంటూ మొదటి నుంచి కొందరు నిపుణులు మొత్తుకుంటున్నా.. ఓషన్‌గేట్ మాత్రం యాత్రలు నిర్వహిస్తూనే వస్తోంది. అంతేకాదు దానిని ఆపరేట్ చేసేందుకు ఉపయోగించే రిమోట్ విషయంలోనూ తీవ్ర విమర్శలు.. మరోవైపు సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. టైటానిక్ శకలాలకు చూసేందుకు గతంలో ఇతర దేశాలకు చెందిన కంపెనీలు ప్రయత్నించి భంగపడ్డాయి. అయితే చాలామంది నిపుణులు ఈ యాత్రను ఆత్మహత్య సదృశ్యంగా వర్ణించారు కూడా. ఇదీ చదవండి: టిక్.. టిక్.. టిక్.. సస్పెన్స్ థ్రిల్లర్‌లా టైటాన్ కోసం.. డబ్బే కాదు.. గుండెధైర్యం ఉన్నోళ్లు కూడా! ‘టైటాన్ సబ్మెర్సిబుల్’ మొత్తం ఐదుగురు టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లారు. సాధారణంగా ఇలాంటి యాత్రలకు ఎంపిక ప్రక్రియ కూడా పకడ్బందీగానే జరుగుతుంది. అయితే ఈసారి యాత్రలో వెళ్లిన వాళ్లంతా.. గతంలో సాహస యాత్రలు చేసిన అనుభవం ఉన్నవాళ్లూ ఉన్నారు. కానీ, ఈసారి సాహసయాత్ర వాళ్లను ప్రాణాలను బలిగొంది. డాషింగ్ అండ్ డేరింగ్ హార్డింగ్.. బ్రిటన్‌కు చెందిన 58ఏళ్ల బిలియనీర్ హమీష్ హార్డింగ్ ప్రస్తుతం యూఏఈలో ఉంటున్నారు. దుబాయ్‌కు చెందిన యాక్షన్ ఏవియేషన్స్ కంపెనీ చైర్మన్‌గా వ్యహరిస్తున్నారు. వైమానిక రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలతోపాటు వివిధ రకాల సేవలను ఈ సంస్థ అందిస్తోంది. ఆయన మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించారు. అతను ఒక సాహసికుడు. 2022లో జెఫ్ బెజోస్ నిర్వహించిన బ్లూ ఆరిజిన్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. అనేకసార్లు దక్షిణ ధ్రువాన్ని కూడా సందర్శించారు. మహాసాగరంలో అత్యంత లోతైన ‘మరియానా ట్రెంచ్’లో ఎక్కువసేపు గడిపారు. ఈయన ఆస్తి సుమారు ఒక బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. నమీబియా నుంచి భారత్‌కు 8 చీతాలను తెప్పించే కసరత్తులో ఆయన భారత ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి షెహజాదా దావూద్, అతడి కుమారుడు సులేమాన్‌లు. బ్రిటిష్-పాకిస్థానీ బిలియనీర్ షాజాదా దావూద్(48), ఆయన కుమారుడు సులేమాన్(19) కూడా మినీ జలాంతర్గామిలో ఉన్నారు. షాజాదా.. కరాచీ కేంద్రంగా.. పాక్‌లో అతిపెద్ద కంపెనీ అయిన ఇంగ్రో కార్పొరేషన్‌కు వైస్ ఛైర్మన్. ఇంగ్రో సంస్థ శక్తి, వ్యవసాయం, పెట్రోకెమికల్స్ టెలికమ్యూనికేషన్స్‌లో భారీగా పెట్టుబడులను కలిగి ఉంది. 2022లో ఈ సంస్థ 350 బిలియన్ రూపాయల ($1.2 బిలియన్) ఆదాయాన్ని ప్రకటించింది. పాకిస్థాన్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలో షాజాదా తండ్రి హుస్సేన్ దావూద్ పేరు ప్రతిసారీ ఉంటుంది. సర్రేలో భార్యా, ఓ కూతురు, కొడుకుతో ఆయన సెటిల్ అయ్యారు. దావూద్‌కు యూకేలోని ఉన్నతవర్గాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన పలు సాహస యాత్రల్లో పాల్గొన్నారు కూడా. ఓషియన్ గేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్టన్ రష్.. ఓషన్‌గేట్ సహవ్యవస్థాపకుడు. ట్రైనింగ్ పైలట్ అయిన రష్.. గతంలో టైటానిక్ శకలాలను చూసి వచ్చారు కూడా. నిపుణుడి హోదాలో ఆయన ఆ బృందం వెంట వెళ్లారు. ఫ్రెంచ్ సబ్మెర్సిబుల్ పైలట్ పాల్ హెన్రీ నార్జిలెట్.. నౌకాదళంలో కమాండర్‌గా పని చేసిన అనుభవం ఉంది ఈయనకి. అత్యంత లోతైన ప్రదేశాల్లో పని చేసే టీంలకు ఈయన కెప్టెన్‌గా వ్యవహరించారు. నావికుడిగా పాతికేళ్ల అనుభవమూ ఉంది. ది ఫ్రెంచ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ సీలో చేరి.. ప్రపంచవ్యాప్తంగా పలు శాస్త్రీయ పర్యటనలకు వెళ్లారాయన. విలాసవంతమైన టైటానిక్ నౌక.. 1912 ఏప్రిల్ 14న అట్లాంటిక్ మహాముద్రంలో ఓ మంచుకొండను ఢీ కొట్టి మునిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 1500 మంది జలసమాధి అయ్యారు. ఈ భారీ ఓడ శిథిలాలను 3,800 మీటర్ల లోతులోని సముద్ర గర్భంలో 1985లో గుర్తించారు. ఇదీ చదవండి: వేల అడుగుల లోతుల్లో టైటానిక్.. మీరూ చూసేయండి -
టైటాన్ విషాదం.. అయిదుగురూ ప్రాణాలు కోల్పోయినట్లే!
-
టైటాన్ ఆశలు జల సమాధి
దుబాయ్/బోస్టన్: ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉదంతం.. విషాదాంతం అయ్యింది. అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ ఓడ శకలాలను తిలకించడానికి టైటాన్ మినీజలాంతర్గామిలో వెళ్లిన అయిదుగురూ ప్రాణాలు కోల్పోయినట్లే!. టైటాన్ శకలాలను టైటానిక్ సమీపంలోనే గుర్తించినట్లు అమెరికా తీర రక్షక దళం అధికారికంగా ప్రకటించింది. ఓవైపు ఉత్కంఠగా అన్వేషణ కొనసాగుతున్న తరుణంలో.. ప్రాణవాయువు(ఆక్సిజన్) ముగిసిపోయే అంచనా గడువు దగ్గరపడుతున్న సమయంలోనే ఈ ప్రకటన వెలువడంది. తాము నీటి అడుగుకు పంపించిన రిమోటెడ్ ఆపరేటెడ్ వెహికిల్.. శకలాలను గుర్తించిందని వెల్లడించింది. అవి టైటాన్వేనని భావిస్తున్నట్లు తెలిపింది. ‘తమ సంస్థ చీఫ్ పైలట్.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్టన్ రష్, ప్రయాణికులైన షహ్జాదా దావూడ్, ఆయన కొడుకు సులేమాన్ దావూద్, హామిష్ హార్డింగ్, పౌల్–హెన్రీ నర్గియెలెట్ మృతి చెందారు’అని ఓషన్ గేట్ తెలిపింది. అయితే, వారు ఎలా ప్రాణాలు కోల్పోయారనే విషయం మాత్రం వెల్లడించలేదు. ఆదివారం ఉదయం బయలుదేరిన సమయంలో టైటాన్లో దాదాపు 96 గంటలపాటు మాత్రమే శ్వాసించేందుకు అవసరమైన ఆక్సిజన్ ఉంది. ఆ సమయం కూడా ముగిసిపోయింది. గురువారం ఉదయానికల్లా జలాంతర్గామిలో ఆక్సిజన్ ఇక పూర్తిగా నిండుకున్నట్లే. అయితే, టైటాన్ గల్లంతైన రోజే వారు మరణించారా? అంటే..ఆ పరిస్థితిని కూడా కొట్టిపారేయలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టైటాన్ ఆదివారం ఉదయం కెనడాలోని న్యూఫౌండ్లాండ్ నుంచి 700 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో గల్లంతైన సంగతి తెలిసిందే. టైటాన్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించడం ఒక పెద్ద సవాలుగా మారింది. అమెరికా కోస్ట్‌గార్డ్ సిబ్బంది సముద్రంలో టైటాన్ కోసం తీవ్ర అన్వేషణ కొనసాగించింది. సెర్చ్ ఆపరేషన్ కోసం మరిన్ని నౌకలు, విమానాలను, ఇతర పరికరాలను రంగంలోకి దించారు. ఫ్రెంచ్ పరిశోధక సంస్థ కెమెరాలు, లైట్లతో కూడిన డీప్–డైవింగ్ రోబోట్‌ను సముద్రంలోకి పంపించింది. A debris field was discovered within the search area by an ROV near the Titanic. Experts within the unified command are evaluating the information. 1/2 — USCGNortheast (@USCGNortheast) June 22, 2023 Coast Guard holds press briefing about discovery of debris belonging to the 21-ft submersible, Titan. #Titanic https://t.co/aPSeEaBuG8 — USCGNortheast (@USCGNortheast) June 22, 2023 -
ఆక్సిజన్ అయిపోయింది.. అయిదుగురి ప్రాణాలపై సన్నగిల్లుతున్న ఆశలు
అట్లాంటిక్ మహా సముద్రం గల్లంతైన టైటానిక్ సబ్‌మెరైన్ ఆచూకీ కోసం భారీ ఎత్తున రెస్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయిదుగురు పర్యాటకులతో ఆదివారం బయల్దేరిన జలంతర్గామి కనిపించకుండా పోయి 96 గంటలు కావొస్తుంది. అయినా దీని ఆచూకీ లభించలేదు. మరో వైపు మినీ సబ్‌మెరైన్‌లోని ఆక్సిజన్ సరఫరా కూడా దగ్గర పడింది. జలాంతర్గామిలో 96 గంటలకు సరిపడా మాత్రమే ఆక్సిజన్ ఉంది. ఆ సమయం కాస్తా గడిచిపోవడంతో సందర్శకుల క్షేమంపై క్షణం క్షణం ఉత్కంఠ కొనసాగుతోంది. ఆక్సిజన్ అయిపోవడంతో వారు ప్రాణాలతో తిరిగొస్తారనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. కాగా టైటాన్ జలాంతర్గామి సముద్ర ఉపరితలం నుంచి 12,500 అడుగుల(3,800 మీటర్లు) లోతున ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీనిని కనుగునేందుకు యూఎస్ కోస్ట్ గార్డుతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెస్క్యూసిబ్బంది రంగంలోకి దిగి పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. అమెరికా, కెనడాకు చెందిన యుద్ధ విమానాలు, ఉపగ్రహాలు, భారీ నౌకలను రంగంలోకి దించిసముద్రాన్నే జల్లెడ పడుతున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన సముద్రపు రోబోలను సైతం మోహరించారు. అయితే గల్లంతైన టైటాన్ సముద్ర గర్భంలో ఏవైనా శకలాల మధ్య చిక్కుకుపోయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన ఈ రోబో జలాంతర్గామి సహాయం తీసుకున్నారు. సముద్రంలో దాదాపు 4 కిలోమీటర్ల లోతు వరకు రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయి. గాలిస్తున్న ప్రాంతం.. అమెరికాలోని ఓ రాష్ట్రంకంటే పెద్దగా ఉంటుందట. అందుకే ఆ ప్రాంతాన్నంతా గాలించడం అత్యంత కష్టంగా మారింది. టైటానిక్ నౌక శిథిలాల ఉన్న ప్రాంతాన్ని మిడ్నైట్ జోన్‌గా పిలుస్తారు. అక్కడ ఉష్ణోగ్రతలు అత్యంత శీతలంగా ఉంటాయి. అంతేగాక పూర్తిగా చీకటి ఉంటుంది. సబ్మెర్సిబుల్లో ఉన్న లైట్లతో కేవలం కొంత దూరం వరకే కనిపిస్తుందని, దాదాపు రెండున్నర గంటల పాటు కటిక చీకల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చదవండి: ఉడికి ఉక్కిరిబిక్కిరవుతున్న జనం.. మొత్తం 9 దేశాలు.. టాప్‌లో మనమే! మరోవైపు టైటానిక్ నౌక శకలాలు ఉన్న 12వేల అడుగుల లోతున వాతావరణ పీడనం అధికంగా ఉటుందని నిపుణులు చెబుతున్నారు. భూ ఉపరితలంతో పోలిస్తే అక్కడి పీడనం 380 రెట్లు అధికంగా ఉంటుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక అయిదుగురు వ్యక్తులతో బయల్దేరిన సబ్‌మెరైన్ కేవలం రెండు గంట్లోనే కమ్యూకేషన్ కోల్పోయిన విషయం విదితమే. ఈ మినీ సబ్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు సంపన్నులు, బ్రిటన్ బిలియనర్ హమీష్ హార్డింగ్ మరో ముగ్గురు ఉన్నారు. వీరి ఆచూకీ కోసం భారీగా రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సిబ్బందికి కొన్ని ప్రాంతాల్లో శబ్దాలు వినిపిస్తున్నప్పటికీ అవి కచ్చితంగా ఎక్కుడనుంచి వస్తున్నాయనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. -
సస్పెన్స్ థ్రిల్లర్‌లా టైటాన్ రెస్క్యూ ఆపరేషన్
-
సస్పెన్స్ థ్రిల్లర్‌లా టైటాన్ రెస్క్యూ ఆపరేషన్
బోస్టన్: ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ ఓడ సందర్శన కోసం వెళ్లి గల్లంతయిన జలాంతర్గామి ‘టైటాన్’ జాడ ఇంకా తెలియరాలేదు. టైటాన్‌లోని ఐదుగురు సందర్శకుల పరిస్థితి ఏమిటన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వారి ఆచూకీ గుర్తించేందుకు అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి తమ కార్యాచరణను ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా, సముద్ర అంతర్భాగం నుంచి శబ్దాలు వెలువడుతున్నట్లు కెనడా సైనిక నిఘా విమానం కనిపెట్టడం ఆశలు రేకెత్తిస్తోంది. టైటాన్ గల్లంతయినట్లు భావిస్తున్న ప్రాంతం నుంచి ప్రతి 30 నిమిషాలకోసారి బిగ్గరగా శబ్దాలు వెలువడుతున్నట్లు సమాచారం. అయితే, ఈ శబ్దాలు టైటాన్‌కు సంబంధించినవేనా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. టైటాన్లో కొంత ప్రాణవాయువు ఇంకా మిగిలే ఉందని, సందర్శకుల ప్రాణాలకు ఇప్పటికిప్పుడు అపాయం వాటిల్లకపోవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. గురువారం ఉదయానికల్లా ఆక్సిజన్ మాయం! టైటాన్ ఆచూకీ కోసం జాన్ కాబోట్, స్కాండీ విన్‌ల్యాండ్, అట్లాంటక్ మెర్లిన్ అనే మూడు పడవలను అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బంది రంగంలోకి దించారు. టైటాన్ జలాంతర్గామి ప్రస్తుతం సముద్ర ఉపరితలం నుంచి 12,500 అడుగుల(3,800 మీటర్లు) లోతున ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది సామాన్యమైన లోతు కాదు. అక్కడిదాకా సురక్షితంగా చేరుకోవడం కష్టమైన పని అని చెబుతున్నారు. అండర్‌వాటర్ రోబోను పంపించినట్లు తెలుస్తోంది. సహాయక చర్యల కోసం అమెరికా సైన్యానికి చెందిన మూడు సి–17 రవాణా విమానాలను పంపించినట్లు యూఎస్ ఎయిర్ మొబిలిటీ కమాండ్ అధికార ప్రతినిధి చెప్పారు. ఒక పెట్రోలింగ్ విమానం, రెండు ఓడలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని కెనడా సైన్యం ప్రకటించింది. గురువారం ఉదయానికల్లా టైటాన్లో మొత్తం ఆక్సిజన్ ఖర్చయిపోతుంది. అప్పటిలోగా దాని జాడ తెలియకపోతే అందులోని సందర్శకులు ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ఈ జలాంతర్గామి టైటానిక్ దిశగా తన ప్రయాణం ప్రారంభించింది. సరిగ్గా నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే అందులో ఉంది. టైటాన్లో రెండు రకాల కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నాయి. నీటిలోకి వెళ్లిన 1.45 గంటల లోపే అవి పనిచేయడం ఆగిపోయింది. క్షేమంగా రావాలంటూ.. టైటాన్ గల్లంతు కావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఐదుగురు సందర్శకులు క్షేమంగా తిరిగిరావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వివిధ దేశాల అధినేతలు పేర్కొన్నారు. సందర్శకుల క్షేమాన్ని కోరుతూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టైటాన్లో ఓషియన్గేట్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్, బ్రిటిష్ వ్యాపారవేత్త హమిష్ హర్డింగ్, పాకిస్తాన్‌కు చెందిన తండ్రీకొడుకులు షహజాదా, సులేమాన్ దావూద్, ఫ్రెంచ్ నావికాదళం మాజీ అధికారి పాల్–హెన్రీ నార్జియోలెట్ ఉన్నారు. వీరంతా 1912లో అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడ శిథిలాలను సందర్శించడానికి టైటాన్ జలాంతర్గామిలో వెళ్లారు. ఆదివారం రాత్రి కెనడా తీరానికి 700 కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ సముద్రంలో టైటాన్ గల్లంతయ్యింది. ఇదీ చదవండి: సాహస వీరుడు.. మహాసాగరంలో ఇరుక్కుని.. -
గల్లంతైన టైటాన్లో బ్రిటిష్ బిలియనీర్.. ఏవరీ హమీష్ హార్డింగ్?
అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ శకలాల్ని చూడటానికి వెళ్లిన పర్యాటక జలంతర్గామి (Submarine)ఆదివారం అదృశ్యమైన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో అందులో ముగ్గురు టూరిస్ట్లతోపాటు మరో ఇద్దరు ఉన్నారు. సబ్ మెర్సిబుల్ గల్లంతై మూడు రోజులు దాటినా ఇప్పటికీ ఆచూకీ తెలియరాలేదు. దీంతో అంట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైన జలాంతర్గామిని గుర్తించేందుకు అమెరికా, కెనాడా కోస్ట్‌గార్డ్ దళాలు ముమ్మరంగా జల్లెడపడుతున్నాయి. దాదాపు 13 వేల అడుగుల లోతున్న జలగర్భాల్లో ఆ మినీ జలాంతర్గామి చప్పుళ్లు వినేందుకు సోనార్లను, పీ-8 నిఘా, సీ-130 రవాణా విమానాలను కూడా రంగంలో దించారు. కాగా మిస్సైన జలంతర్గామి ‘టైటానిక్ సబ్మెర్సిబుల్’లో పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి షెహజాదా దావూద్, అతడి కుమారుడు సులేమాన్, బ్రిటిష్ సంపన్నుడు, వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఓషియన్ గేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్టన్ రష్, ఫ్రెంచ్ సబ్మెర్సిబుల్ పైలట్ పాల్ హెన్రీ నార్జిలెట్ సహా మొత్తం ఐదుగురు ఉన్నారు. చదవండి: టైటాన్ మిస్సింగ్.. ఎలాన్ మస్క్‌కు బిగ్ ఫెయిల్యూర్..? బ్రిటిష్ బిలియనీర్ అయితేబ్రిటన్కు చెందిన 58ఏళ్ల బిలియనీర్ హమీష్ హార్డింగ్ ప్రస్తుతం యూఏఈలో ఉంటున్నారు. దుబాయ్‌కు చెందిన యాక్షన్ ఏవియేషన్స్ కంపెనీ చైర్మన్‌గా వ్యహరిస్తున్నారు. వైమానిక రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలతోపాటు వివిధ రకాల సేవలను ఈ సంస్థ అందిస్తోంది. ఆయన మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించారు. అతను ఒక సాహసికుడు. 2022లో జెఫ్ బెజోస్ నిర్వహించిన బ్లూ ఆరిజిన్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. అనేకసార్లు దక్షిణ ధ్రువాన్ని కూడా సందర్శించారు. మహాసాగరంలో అత్యంత లోతైన ‘మరియానా ట్రెంచ్’లో ఎక్కువసేపు గడిపారు. ఈయన ఆస్తి సుమారు ఒక బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. నమీబియా నుంచి భారత్‌కు 8 చీతాలను తెప్పించే కసరత్తులో ఆయన భారత ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. పాక్ సంపన్నులు బ్రిటిష్-పాకిస్థానీ బిలియనీర్ షాజాదా దావూద్(48), ఆయన కుమారుడు సులేమాన్(19) కూడా మినీ జలాంతర్గామిలో ఉన్నారు. ఈ మేరకు వారి కుటుంబం ధృవీకరించింది. షాజాదా.. పాక్‌లో అతిపెద్ద కంపెనీ అయిన ఇంగ్రో కార్పొరేషన్‌కు వైస్ ఛైర్మన్. ఇంగ్రో సంస్థ శక్తి, వ్యవసాయం, పెట్రోకెమికల్స్ టెలికమ్యూనికేషన్స్‌లో భారీగా పెట్టుబడులను కలిగి ఉంది. చదవండి: Titanic Sub: ఆక్సిజన్ అయిపోతోంది.. టైటాన్ జాడేది? కాగా ఓషియన్ గేట్ అనే సంస్థ టైటానిక్ శకలాల సందర్శన యాత్రను నిర్వహిస్తోంది. ఇందుకు ‘టైటాన్’ పేరుతో 21 అడుగుల పొడవైన మినీ జలంతర్గామిని వాడుతోంది. ఈ ఈ యాత్ర టికెట్ ధర 2.50 లక్షల డాలర్లుగా నిర్ణయించింది. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.2 కోట్లకు పైమాటే. ఈ యాత్రలో భాగంగా 400 మైళ్ల దూరం ప్రయాణిస్తారు. ఈ జలాంతర్గామిలో ముగ్గురు ప్రయాణికులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల బరువు ఉంటుంది. 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. ఆదివారం సాయంత్రం కెనడాలోని న్యూఫౌండ్లాండ్ నుంచి ఈ సాహసయాత్ర ప్రారంభం కాగా.. రెండు గంటల్లోనే జలంతార్గామితో పోలార్ ప్రిన్స్‌కు సంబంధాలు ఎతగిపోయాయి. దీంతో టైటాన్ ఆచూకీ కనుగునేందుకు కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి 400 మైళ్ల దూరంలో 13,000 అడుగుల (4,000 మీటర్లు) నీటి లోతున ఉన్న ఉత్తర అట్లాంటిక్‌లో కోస్ట్‌గార్డ్‌లు గాలిస్తున్నారు. ఇక విలాసవంతమైన టైటానిక్ షిప్ 1912 ఏప్రిల్ 14న అట్లాంటిక్ మహాముద్రంలో ఓ మంచుకొండను ఢీ కొట్టి మునిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 1500 మంది జలసమాధి అయ్యారు. ఈ భారీ ఓడ శిథిలాలను 3,800 మీటర్ల లోతులోని సముద్ర గర్భంలో 1985లో గుర్తించారు. అక్కడి శిథిలాలను చూసేందుకు వెళ్తున్నప్పడే జలాంతర్గామి అదృశ్యమైంది. ఇక జలాంతర్గామిలో కొద్ది గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉండటంతో సమయం గడుస్తున్నా కొద్దీ వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది. -
టైటాన్ మిస్సింగ్.. ఎలాన్ మస్క్‌కు బిగ్ ఫెయిల్యూర్..?
111 ఏళ్ల కిత్రం సముద్రంలో మునిగిపోయిన భారీ నౌక టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లిన జలాంతర్గామి మంగళవారం గల్లంతయ్యింది. ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ నిర్వహిస్తున్న ఈ టూరిస్ట్ క్రాఫ్ట్ ఆదివారం యాత్రను ప్రారంభించింది. మొదలైన రెండు గంటలలోపే కమ్యూనికేషన్ కోల్పోయింది. అయితే.. ప్రముఖ స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సర్వీస్ టైటాన్ యాత్రకు కమ్యునికేషన్ సర్వీస్‌ను అందిస్తోంది. దీంతో స్టార్‌లింక్ సర్వీస్ నిర్వాహణ తీరుపై కూడా విమర్శలు ఎదురువుతున్నాయి. Despite being in the middle of the North Atlantic, we have the internet connection we need to make our #Titanic dive operations a success - thank you @Starlink! pic.twitter.com/sujBmPr3JD — OceanGate Expeditions (@OceanGateExped) June 1, 2023 సాంకేతిక సమస్యా..? జలాంతర్గామి గల్లంతవడానికి ఇంటర్నెట్ ఒకటే సమస్య అని ఖచ్చితంగా చెప్పలేం. ఇతర సాంకేతిక సమస్యలు కూడా ఉండొచ్చు. కమ్యునికేషన్ కోల్పోయిన తర్వాత కూడా సబ్‌మెరైన్ పైకి రావడానికి కావాల్సిన వ్యవస్థ అందులో ఉంది. కానీ ఇప్పటివరకు జలాంతర్గామి జాడ తెలియకపోవడం ఇతర టెక్నికల్ సమస్యలను సూచిస్తోంది. The wreck of the Titanic lies about 400 miles off the coast of Newfoundland. Without any cell towers in the middle of the ocean, we are relying on @Starlink to provide the communications we require throughout this year’s 2023 Titanic Expedition. More: https://t.co/F7OtKI0En7 pic.twitter.com/wr7HeKlGjj — OceanGate Expeditions (@OceanGateExped) June 14, 2023 ఈ ప్రమాదంపై కమాండ్ షిప్లో విధులు నిర్వహించిన డేవిడ్ పోగ్ మరో కోణాన్ని వెల్లడించారు. జలాంతర్గామికి కమ్యూనికేషన్ పోయిన తర్వాత కూడా షార్ట్ మెసేజ్ చేయడానికి అవకాశం ఉంటుందని పోగ్ తెలిపారు. కానీ అదేమీ జరగలేదని చెప్పారు. అయితే.. సబ్‌మెరైన్ పరిస్థితులను బయటకు చెప్పకుండా కమాండ్ షిప్లో ఇంటర్నెట్ను నిలుపుదల చేస్తారని చెప్పారు. ఇదీ చదవండి: టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన సబ్ మెరైన్ గల్లంతు.. అందులో పాక్ అత్యంత ధనవంతుడు ఖాతరు చేయలేదు..? జలాంతర్గామి వెల్లదలచిన లోతుపై గతంలో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఓషన్‌గేట్‌కు చెందిన ఉద్యోగి డేవిడ్ లిచర్డ్ తెలిపారు. గతంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన షాంపిల్స్‌లో కూడా ఆయన అనేక లోపాలను గుర్తించినట్లు చెప్పారు. 4 వేల మీటర్ల వరకు జలాంతర్గామిని తీసుకువెళ్లడానికి సంస్థ నిర్ణయించింది. కానీ 1300 మీటర్ల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశంపై మాట్లాడిన ఉద్యోగులను సంస్థ తొలగించినట్లు డేవిడ్ తెలిపారు. చర్చలతో ఆ వివాదం ముగిసినట్లు వెల్లడించారు. Wow. OceanGate, the company that owns the missing submersible, fired an employee a few years ago after he filed safety complaints against them. The employee specifically said the sub was not capable of descending to such extreme depths before he was fired.https://t.co/c3s2H3eVEr — Caroline Orr Bueno, Ph.D (@RVAwonk) June 20, 2023 స్టార్ లింక్కూ వైఫల్యమే..? ఏదేమైనా ప్రస్తుతం జలాంతర్గామి గల్లంతవడంతో అనేక లోపాలు బయటపడుతున్నాయి. ఈ అంశంపై స్టార్ లింక్ సంస్థ గానీ, ఎలాన్ మస్క్ గానీ ఇప్పటివరకు స్పందించలేదు. మరి.. కమ్యునికేషన్ అంశంలో లోపాలపై ఎలాన్ మస్క్ సంస్థ స్టార్ లింక్‌కు కూడా ఇది పెద్ద వైఫల్యంగా మారుతుంది. ఇదీ చదవండి: టైటాన్ మిస్సింగ్‌కి రెండురోజులు.. ఆక్సిజన్ అయిపోతోంది.. కొన్ని గంటలే! వాళ్ల జాడేది? -
టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన సబ్ మెరైన్ గల్లంతు..
111 ఏళ్ల కిత్రం సముద్రంలో మునిగిపోయిన భారీ నౌక టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లిన ఓ సబ్ మెరైన్ (జలాంతర్గామి) మంగళవారం గల్లంతయ్యింది. అయిదుగురితో బయల్దేరిన జలంతర్గామి అట్లాంటిక్ మహా సముద్రంలో ఆచూకీ లేకుండా పోయింది. అందులో ప్రయాణిస్తున్న వారిలో ప్రముఖ పాకిస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త, అతని కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తప్పిపోయిన వారిలో మరో ప్రయాణికుడిని బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్‌గా గుర్తించారు. కరాచీ ప్రధాన కార్యాలయం కలిగిన ఎంగ్రో కార్పొరేషన్ వైస్ చైర్మన్ షాజాదా దావూద్‌తోపాటు అతని కుమారుడు సులేమాన్ సముద్రంలో తప్పిపోయిన ఓడలో ఉన్నారని వారి కుటుంబం ఓ ప్రకటనలో తెలిపింది. సబ్ మెరైన్ క్రాఫ్ట్తో సంబంధాలు తెగిపోయాయని వీటిని పునరుద్ధరించేందుకు, మిస్ అయిన వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి పలు సంస్థలు, డీప్-సీ కంపెనీలు సంయుక్తంగా రెస్క్యూ ప్రయత్నం జరుపుతున్నాయని తెలిపింది. వారి క్షేమం కోసం ప్రార్థించమని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నట్లు వెల్లడించింది. కాగా ఎంగ్రో అనే సంస్థ శక్తి, వ్యవసాయం, పెట్రోకెమికల్స్ టెలికమ్యూనికేషన్స్‌లో పెట్టుబడులను కలిగి ఉంది. 2022లో ఈ సంస్థ 350 బిలియన్ రూపాయల ($1.2 బిలియన్) ఆదాయాన్ని ప్రకటించింది. పాకిస్థాన్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలో షాజాదా తండ్రి హుస్సేన్ దావూద్ పేరు ప్రతిసారీ ఉంటుంది. చదవండి: అమెరికా పర్యటన వేళ.. రష్యాతో బంధంపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..? ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ నిర్వహిస్తున్న ఈ టూరిస్ట్ క్రాఫ్ట్ ఆదివారం యాత్రను ప్రారంభించింది. అయితే మొదలైన రెండు గంటలలోపే కమ్యూనికేషన్ కోల్పోయింది. ప్రమాద సమయంలో సదరు జలాంతర్గామిలో ముగ్గురు పర్యాటకులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నారు. దీంతో తప్పిపోయిన సబ్‌మెరైన్ కోసం.. అమెరికా, కెనడాకు చెందిన కోస్ట్‌గార్డ్, రక్షణ బృందాలు అట్లాంటిక్ మహాసముద్ర జలాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. టైటానిక్ మునిగిపోయిన కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి 400 మైళ్లు (650 కిలోమీటర్లు)దూరంలో 13,000 అడుగుల (4,000 మీటర్లు) నీటి లోతున ఉన్న ఉత్తర అట్లాంటిక్‌లో కోస్ట్‌గార్డ్‌లు గాలిస్తున్నారు. గల్లంతైన టైటానిక్ పర్యాటక జలాంతర్గామిలో 96 గంటలకు సరిపడ ఆక్సిజన్ మాత్రమే ఉందని అధికారులు తెలిపారు. 1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో అత్యంత భారీ నౌక టైటానిక్ మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. అట్లాంటిక్ సముద్రం దిగువన 3,800 మీటర్ల లోతులో ఉన్న టైటానిక్ షిప్ శిథిలాలను 1985లో గుర్తించారు. ఈ షిక్ శకలాలను దగ్గరి నుంచి చూపించేందుకు అమెరికాకు చెందిన ఓషియన్ గేట్ ఎక్స్ పెడిషన్స్ అనే టూరిజం కంపెనీ ఈ టూర్లను నిర్వహిస్తోంది. దీనికోసం చిన్న జలాంతర్గామిని వినియోగిస్తోంది. దీని ద్వారా సముద్రం అడుగుకి వెళ్లి టైటానిక్ శిథిలాలను చూసి రావొచ్చు. కాగా టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లే ఈ యాత్ర టికెట్ ధర 2.50 లక్షల డాలర్లుగా నిర్ణయించింది. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.2 కోట్లకు పైమాటే. ఈ యాత్రలో భాగంగా 400 మైళ్ల దూరం ప్రయాణిస్తారు. ఈ జలాంతర్గామిలో ముగ్గురు ప్రయాణికులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. 6.5 మీటర్ల పొడవున్న ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల బరువు ఉంటుంది. ఇది 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. -
టైటానిక్ ప్యాలెస్!
ఫొటోలో కనిపిస్తున్న టైటానిక్‌ని పోలి ఉండే ఈ ఓడ విరిగిపోదు, మునిగిపోదు. ఎందుకంటే, ఇది అసలు ఓడే కాదు. ఇదొక ఇల్లు, ఈ ఇంటి యజమాని పేరు మింటు రాయ్. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ ఇతని ఊరు. కోల్‌కతాలో చదువుతున్న రోజుల్లో ఒకసారి టైటానిక్‌ని పోలి ఉండే దుర్గాపూజ పెండాల్ని చూసి ఆకర్షితుడయ్యాడు. చాలామంది దేవి కోసం కంటే ఆ నిర్మాణాన్ని చూడటానికి రావడం గమనించి, తన ఇళ్లు కూడా ఇంతే అందంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం చాలామంది ఇంజనీర్లను సంప్రదించాడు. అయితే, వారికి అతను డబ్బు చెల్లించలేడని వారు తప్పుకున్నారు. ఆర్థికంగా స్థిరపడటానికి వివిధ రకాల పనులతో పాటు, కొంతకాలం నేపాల్ వెళ్లి తాపీపని కూడా నేర్చుకున్నాడు. చివరకు 2010లో ఈ ఓడలాంటి ఇంటిపనులు ప్రారంభించాడు. 39 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పుతో తానే ఓ ప్లాన్ తయారు చేశాడు. దాదాపు పదమూడు సంవత్సరాల పాటు అక్కడే నివాసం ఉంటూ, పనులను కొనసాగిస్తూ, తన టైటానిక్ ప్యాలెస్‌ని చివరి దశకు తీసుకువచ్చాడు. ఇప్పటి వరకు రూ. 15 లక్షలు ఖర్చు చేసినట్లు అంచనా. ఇతని కలకు అతని భార్య ఇతిరాయ్, కొడుకు కిరణ్ రాయ్ కూడా తోడున్నారు. ‘వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నా. ఆ తర్వాత ఇదే టైటానిక్ పైఅంతస్తులో ఓ రెస్టారెంట్ నిర్మించి, ఆదాయం పొందుతా’ అని అంటున్నాడు మింటు. చదవండి: ఉడుత సాయం కాదు... ఉడుతకే సాయం! -
టైటానిక్ ఇల్లు కట్టుకున్న రైతు
-
'టైటానిక్ ఓడ లాంటి ఇల్లు' .. చూసేందుకు ఎగబడుతున్న జనాలు
ఇంజనీర్ మాదిరిగా ఓ రేంజ్లో ఇల్లు కడుతున్నాడు రైతు. సాధారణ ఇళ్ల మాదిరిగా కాకుండా అత్యంత వినూత్నంగా కడుతున్నాడు. దాన్ని చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. వచ్చిన ప్రతిఒక్కరు ఔరా! అని ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన డార్జిలింగ్ జిల్లాలోని పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పశ్చిమ బెంగాల్‌లోని నిచ్బారి గ్రామంలో ఉండే మింటు రాయ్(52) అనే రైతు ప్రసిద్ధ రాయల్ మెయిల్ స్టీమర్(ఆర్ఎంఎస్) అనే టైటానిక్ ఓడను పోలి ఉండే మూడంతస్తుల ఇంటిని నిర్మిస్తున్నాడు. దీన్ని ఆ రైతు 2010 నుంచి నిర్మిస్తున్నాడు. తన తండ్రి మనోరంజన్ రాయ్ కోల్‌కతాలోని బౌబజార్ ప్రాంతంలో తనను హాస్టల్ ఉంచాడని, అక్కడ టైటానిక్‌ను పోలి ఉండే దుర్గాపూజ పండల్‌ని తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. అప్పటి నుంచి టైటానిక్ పోలి ఉండే సొంత ఇల్లు నిర్మించుకోవాలని అనుకున్నట్లు వివరించాడు. ఐతే ఈ ఇల్లు కోసం ఇంజనీర్లను సంప్రదిస్తే అందుకు వారు ముందుకు రాలేకపోయారని అన్నాడు. దీంతో తాను తన కలల ఇంటిని నిర్మించేందుకు నేపాల్ వెళ్లి తాపీ పని నేర్చుకున్నట్లు తెలిపాడు. ఆ తదనంతరం తన ఇంటిని నిర్మించేందుకు ఉపక్రమించాడు. అతను సామాన్య రైతు అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తన డ్రీమ్ హౌస్ కోసం ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ కట్టడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు తాను ఎంత డబ్బు ఖర్చు పెట్టింది లెక్కించలేదని, కానీ రూ.15 లక్షలకు తక్కువ ఉండకూడదని భావిస్తున్నట్లు తెలిపాడు. కాగా, మింటుకి ఇతిరాయ్ అనే ఆమెతో వివాహం అయ్యింది. వారికి కాలేజ్‌కి వెళ్లే కుమార్తె, పదోతరగతి చదువుతున్న కొడుకు ఉన్నాడు. తాము చాలా పేదవాళ్లం అని కూతురు పుట్టిన తర్వాతే తమ జీవితాలు మారాయని చెప్పుకొచ్చాడు. తనకి తన అత్తగారి నుంచి కొంత భూమి వచ్చిందని, తేయాకు పండిస్తామని చెప్పాడు. అంతేగాదు తాను మరోవైపు ఆటో కూడా నడుపుతూ కొంత డబ్బు కూడబెట్టినట్లు తెలిపాడు. తాము అధికారికంగా హెలెంచ గ్రామ నివాసితులమని, 30 ఏళ్ల క్రితం ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఫన్సీదేవాకు తరలి వెళ్లినట్లు చెప్పాడు. మింటూ కుటుంబ సభ్యులంతా కలిసి ఈ ఇంటి నిర్మాణ పనుల్లో పాలుపంచుకుని, తన కలను సాకారం చేసుకునేందుకు సహకరిస్తున్నారని ఆనందంగా చెబుతున్నాడు. వచ్చే రెండేళ్లలో ఈ ఇల్లు పూర్తి అయిపోతుందని, ఆ తర్వాత ఆ ఇంటి డెక్‌పై టీ దుకాణం పెడతానని చెప్పుకొచ్చాడు. ఓడ మాదిరిగానే ఈ ఇంటిలో కూడా మెట్ల నిర్మాణం ఉంటుందని మింటు వెల్లడించాడు. ఐతే ఈ ఇల్లుని చూసేందుకు పరిసరా ప్రాంత ప్రజలే గాక సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఫోటోలను తీసుకుని వెళ్తుంటే తనకెంతో సంతోషంగా అనిపిస్తుందని అంటున్నాడు మింటు. (చదవండి: ఎంతపనైపాయే! వార్నింగ్ లైట్ వచ్చిందని విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తే..) -
గ్లోబల్ డ్రీమ్ క్రూయిజ్ షిప్.. టైటానిక్ కంటే దారుణంగా..
వందేళ్ల కిందట టైటానిక్ షిప్ ప్రపంచంలోనే అతి పెద్ద పడవగా రికార్డు సృష్టించింది. కానీ తొలి ప్రయాణం మధ్యలోనే సముద్రంలో ఓ మంచు పర్వతాన్ని ఢీ కొట్టి మునిగిపోయింది. తాజాగా వరల్డ్ రికార్డు సాధించే దిశగా మరో భారీ షిప్‌ను నిర్మించడం మొదలెట్టారు. అయితే తొలి ప్రయాణం చేయడానికి ముందే ఈ భారీ నౌక కూడా అప్పుల భారంలో మునిగి నామ రూపల్లేకుండా కనుమరుగు కానుంది. జర్మనీకి చెందిన వెర్ఫ్‌టెన్ సంస్థ గ్లోబల్ డ్రీమ్ పేరుతో భారీ నౌకలను తయారు చేస్తోంది. ఇందులో గ్లోబల్ డ్రీమ్ 1 పూర్తిగా సిద్ధం అవగా దాన్ని కంటే పెద్దదిగా గ్లోబల్ డ్రీమ్ 2 నిర్మాణ పనులు గత కొన్నేళ్లుగా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పడవలో ఏకకాలంలో 9,000ల మంది ప్రయాణించేంత పెద్దగా దీని నిర్మాణం మొదలు పెట్టారు. ప్రపంచ రికార్డు లక్ష్యంగా ఎక్కడగా వెనక్కి తగ్గలేదు. బ్యాంకుల నుంచి ఎడాపెడా రుణాలు తీసుకున్నారు. కరోనా కాటు షిప్ నిర్మాణం సగం పూర్తైన తర్వాత ప్రపంచాన్ని కరోనా సంక్షోభం చుట్టేసింది. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడిన తర్వాత షిప్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అయితే కరోనా తెచ్చిన కష్టాల కారణంగా ప్రస్తుతం జనం సాధారణ జీవితానికి అలవాటుపడ్డా ఇంకా జనాల్లో పూర్తిగా కలిసేందుకు జంకుతున్నారు. దీంతో గ్లోబల్ డ్రీమ్ వంటి భారీ క్రూయిజ్షిప్లకు డిమాండ్ అస్సలు లేకుండా పోయింది. దివాళా కరోనాకి ముందు మేం కొంటామంటే మేం కొంటామంటూ ముందుకు వచ్చిన కంపెనీలు ఆ తర్వాత పత్తాలేకుండా మాయం అయ్యాయి. దీంతో వెర్ఫ్‌టెన్ సంస్థ దిక్కు తోచని స్థితిలో పడింది. ఓవైపు నిర్మాణం పూర్తి చేసుకుని అమ్ముడుపోని షిప్ మరోవైపు అప్పులిచ్చిన బ్యాంకుల నుంచి ఒత్తిడి. చివరకు ఒత్తిడి తట్టులోకే తాను దివాళా తీస్తున్నట్టు వెర్ఫ్‌టెన్ కంపెనీ 2022 జనవరిలో ప్రకటించింది. అడ్డుగా డ్రీమ్‌లైనర్ దివాళా ప్రక్రియ మొదలైన తర్వాత వెర్ఫ్‌టెన్‌కి చెందిన నౌకల తయారీ కర్మాగారాన్ని తైసన్క్రూప్ అనే నావల్ యూనిట్ దక్కించుకుంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం యుద్ధ నౌకలకు డిమాండ్ పెరిగింది. దీంతో వెర్ఫ్‌టెన్‌కి చెందిన షిప్‌యార్డులో యుద్ధ నౌకలు 2024 నుంచి తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగ్గ మార్పులు షిప్‌యార్డులో చేయాల్సి వచ్చింది. అయితే అందుకు అడ్డుగా ఆ షిప్‌యార్డులో అమ్ముడుపోని గ్లోబల్ డ్రీమ్ 2 క్రూయిజ్ షిప్ ఉంది. చివరికి తుక్కే దిక్కు వెర్ఫ్‌టెన్‌కి అప్పులిచ్చిన బ్యాంకులు గ్లోబల్ డ్రీమ్ 2ను వేలం పాటలో వేసినా కొనేందుకు ఏ కంపెనీ ముందుకు రాలేదు. మరోవైపు యుద్ధ నౌకల కోసం ఈ షిప్‌యార్డులో మార్పులు చేయాల్సి వస్తోంది. దీంతో అమ్ముడుపోని భారీ క్రూయిజ్ షిప్‌ని కనీసం తుక్కుగా అయినా అమ్మేయాలనే ప్లాన్‌లో ఉన్నాయి బ్యాంకులు. కల్లలైన కలలు వేలకోట్లు పోసి అత్యాధుని సౌకర్యాలతో విలాసవంతంగా తయారైన గ్లోబల్ డ్రీమ్ 2 చివరకు తన కలల ప్రయాణం ప్రారంభించకుండానే అప్పులు ఊబిలో కూరుకుపోయి తుక్కుగా మారనుంది. చదవండి: స్టార్టప్‌లకు గడ్డుకాలం.. ఉద్యోగాలన్నీ హుష్ కాకి.. -
‘టైటానిక్’ మరో 12 ఏళ్లే.. ఆ తర్వాత..
‘టైటానిక్’ ఉదంతం చరిత్ర పుటల్లో ఓ దుర్ఘటన. 1912 నవంబర్ 14న అట్లాంటిక్ మహాసముద్రంలో మంచుకొండను ఢీ కొట్టి, మునిగి.. వందల మందిని జలసమాధి చేసిన ఓ విషాదం. 73 ఏళ్ల తర్వాత కెనడాలోని న్యూఫౌండ్ ల్యాండ్‌కు 740 కి.మీ. దూరంలో సముద్ర మట్టానికి 4 వేల మీటర్ల లోతున 2 ముక్కలైన టైటానిక్ అవశేషాలను గుర్తించిన విషయం తెలిసిందే. 109 ఏళ్లు దాటినా ఆ ఓడ అవశేషాలు నేటికీ నీళ్లల్లో పదిలంగానే ఉన్నాయి. అయితే మరికొన్ని ఏళ్లల్లో ఆ ఛాన్స్ కూడా ఉండదట. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఒకరకమైన బ్యాక్టీరియా టైటానిక్ అవశేషాలను వేగంగా తినేస్తోందట.. ‘మరో 12 ఏళ్ల తర్వాత టైటానిక్ అని చెప్పుకోవడానికి నీళ్లల్లో ఒక్క ముక్క కూడా మిగలద’ని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటివరకూ ‘ఆర్ఎంఎస్ టైటానిక్ సంస్థ’ పలు పరిశోధక యాత్రలు చేపట్టి.. దాదాపు 5 వేలకు పైగా.. వెండి పాత్రలు, బంగారు నాణాలు వంటివెన్నో టైటానిక్ శిథిలాల నుంచి బయటకు తీసింది. ఆనాడు ఈ ప్రమాదం నుంచి ఏడు వందల మంది ప్రాణాలతో బయటపడ్డారు. చదవండి: ఇలా చేస్తే.. ఎంత వయసొచ్చినా యంగ్‌గా కనిస్తారు.. -
వైరల్: మీరు ఊహించని టైటానిక్ మరో క్లైమాక్స్
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ అద్భుతమైన చిత్రం‘ టైటానిక్’. లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకుల మదిలో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకుంది. దాదాపు 12 ఏళ్ల పాటు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అగ్ర స్థానంలో నిలిచింది. 11 ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమాలోని ప్రతీ సీను ఓ వజ్రంలా ఉంటుంది. ఈ సినిమా మొదలు కూడా ఓ వజ్రం(హార్ట్ ఆఫ్ ది ఓషన్) కోసం అన్వేషణతో మొదలవుతుంది. ఆ వజ్రానికి సంబంధించిన సీనుతోనే ఎండ్ అవుతుంది. ( టైటానిక్ చూడ్డం అంటే అసహ్యం: హీరోయిన్ ) థియేటర్లలో విడుదలైన టైటానిక్ క్లైమాక్స్‌లో ముసలి రోస్ తన దగ్గర ‘హార్ట్ ఆఫ్ ది ఓషన్’ ఉందన్న సంగతిని ఎవ్వరికీ చెప్పకుండా సముద్రంలో పడేస్తుంది. టైటానిక్ క్లైమాక్స్‌కు సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టైటానిక్ భారీ విజయవాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఈ మరో క్లైమాక్స్ సీన్ వీడియోను డీవీడీ రూపంలో విడుదల చేశారు నిర్మాతలు. ఆ క్లైమాక్స్ సీన్లో ఏముందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. The alternate ending to Titanic is hilarious. This would have absolutely ruined the film for me pic.twitter.com/L3vSrSb72e — Pat Brennan (@patbrennan88) February 16, 2021 -
ఆస్కార్ నటి చేదు జ్ఞాపకాలు
పేరొస్తే పేరుతో పాటు కొన్ని నెత్తి మీదకు వస్తాయి. నువ్వెలా ఉండాలో అందరూ చెప్పేవాళ్లే అవుతారు. ‘నువ్వలా ఎందుకు ఉండవు?’ అని అందరూ అడిగేవాళ్లే అవుతారు. ముఖ్యంగా సినిమాల్లో పేరొచ్చిన వాళ్లకు ఈ ‘పేరు బరువు’ మోయలేనంతగా, వదిలించుకోవాలన్నంతగా ఉంటుంది. కేట్ విన్స్లెట్ కూడా కొన్నాళ్లు ఆ బరువును మోశారు. మీడియా ఆమెపై మోపిన బరువు అది! ‘‘మీడియా నా జీవితాన్ని నరకప్రాయం చేసింది. అస్సలు దయలేకుండా ప్రవర్తించింది. ఆఖరికి నా నీడను కూడా వెంటాడి, దాక్కోడానికి నాకొక చోటు లేకుండా చేసింది. నా నుంచి నేను పారిపోవాలన్నంతగా నన్ను వెంటాడింది’’ అని గురువారం ‘డబ్ల్యూ.టి.ఎఫ్.’ అనే అమెరికన్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన వాయిస్ ఇంటర్వ్యూలో చెప్పారు కేట్. టైటానిక్ చిత్రం తెచ్చిన పేరుతో మీడియా ధోరణి వల్ల తను దాదాపుగా ఒక దుర్భరమైన బతుకునే బతికినట్లు కేట్ చెప్పారు. సినిమాకు బ్రేక్ వస్తే ఎవరైనా సంతోషిస్తారు. కేట్ విన్స్లెట్ మాత్రం సినిమాకు సినిమాకు మధ్య వచ్చిన బ్రేక్‌లో మీడియా కంటపడకుండా సంతోషమైన జీవితాన్ని వెతుక్కున్నారు. ఈ బ్రిటిష్ నటిని చెత్త చెత్త ప్రశ్నలు అడిగి, కల్పించిన ఆరోపణలు, విమర్శలతో వేధించింది బ్రిటన్ మీడియానే! బ్లాక్ బస్టర్ మూవీ ‘టైటానిక్’ 1997లో విడుదలైంది. అందులో హీరోయిన్ కేట్ విన్స్లెట్. ఫస్ట్ డే ఫస్ట్ షోతో ఆమెకు ఉత్తర అట్లాంటిక్ సముద్రమంత ఫాలోయింగ్ వచ్చేసింది. టైటానిక్‌లో ఉత్తమ నటిగా ఆస్కార్‌కు కూడా ఆమె నామినేట్ అయ్యారు. టైటానిక్‌కి ముందు ఐదు చిత్రాల్లో నటించారు కేట్. టైటానిక్ తర్వాత దాదాపు నలభై చిత్రాల్లో నటించారు. అయితే నేటికీ టైటానిక్కే ఆమె ఐడెంటిటీ. తన 21 ఏట జేమ్స్ కామెరూన్ చిత్రం టైటానిక్‌లో నటించిన కేట్ ప్రస్తుతం 45 ఏళ్ల వయసులో జేమ్ కామెరూన్దే అయిన ‘అవతార్ 2’ లో నటిస్తున్నారు. చిత్రం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. విడుదలకు ఇంకో రెండేళ్లు పట్టొచ్చు. కరోనా బ్రేక్ రాకపోయుంటే ఈ ఏడాది (2021) డిసెంబర్లో విడుదలకు రెడీ అవుతూ ఉండేది. అవతార్ 2 లో అండర్ వాటర్ సీన్ కోసం కేట్ ఏడున్నర నిముషాల పాటు నీటి అడుగున ఊపిరి బిగబట్టి ఉన్నారని 2019లో కామెరూన్ మెచ్చుకోలుగా చెప్పారు. అయితే మీడియా విసిగింపులతో తను చాలాసార్లు కోపాన్ని అదుపులో పెట్టుకోవడం కోసం ఊపిరిని బిగబట్టి ఉన్నానని అంటారు కేట్! ∙∙ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఫలానా టార్చర్ అని మీడియా ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు కేట్. తనకు వ్యక్తిగత జీవితం లేకుండా చేశారని మాత్రం పలుమార్లు చెప్పారు. ఒక ఆస్కార్‌ను (‘ది రీడర్’ చిత్రంలో ఉత్తమ నటిగా), ఆరు ఆస్కార్ నామినేషన్లను గెలుచుకున్న కేట్.. టైటానిక్ చివరి సన్నివేశంలో హీరో డికాప్రియో ఇచ్చిన సపోర్ట్‌తో రాత్రంతా నీళ్లపై తేలుతూ ఎలాగైతే ప్రాణాలు కాపాడుకుంటుందో, మీడియా నుంచీ తనను తను అలాగే కాపాడుకుంటూ వచ్చింది. అయితే నిజ జీవితంలో తనే తన హీరో. ప్రస్తుతం భర్త, ముగ్గురు పిల్లలతో సంతోషంగా ఉన్న కేట్కు టైటానిక్‌తో ఆమె సంపాదించిన పేరు ప్రతిష్టలు ఏమంత సంతోషాన్నివ్వలేదు. ‘‘ఆ సినిమా రిలీజ్ తర్వాత నేను ‘పర్సనల్ ఫిజికల్ స్క్రూటినీ’కి గురయ్యాను’’ అని పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు కేట్. ఆ ఫిజికల్ స్క్రూటినీకి కారణం టైటానిక్‌లో కొన్ని క్షణాల పాటు కేట్ కళాత్మకంగానే అయినా, ‘న్యూడ్’గా కనిపించడం. కేట్ ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా చివరికి ఆ సీన్ దగ్గరికే వచ్చే ఆగేవి వాళ్ల ఆరాలు. కథలో భాగమైన ఆ ఇరవై ఏళ్ల అనాచ్ఛాదిత దేహాన్ని ప్రశ్నలతో ఆస్వాదించడం మొదలుపెట్టేవారు. ‘ఏంటమ్మాయ్.. బొత్తిగా సిగ్గు లేకుండా..’ అని విమర్శించిన ప్రేక్షకులూ ఉన్నారు. ‘సిగ్గు లేకుండా’ అనే మాట కేట్‌ని బాధించలేదు కానీ, నిర్భయంగా మీద చెయ్యి వేయడానికి చొరవ చూపిన వారిని దూరంగా ఉంచినందుకు అహం దెబ్బతిని తనపై వారు రాసిన సిగ్గు లేని రాతలు ఆమెను క్రుంగదీశాయి. ‘‘పేరు రావడానికి ప్రతిఫలం ఇదే కనుకైతే అసలు పేరు గురించి ఆలోచించి ఉండేదాన్నే కాదు’’అని కేట్ ఆవేదనగా అన్నారు. ఎప్పుడో పదిహేనేళ్ల వయసులో, తనకన్నా పన్నెండేళ్లు పెద్దవాడైన నటుడు స్టీఫెన్ ట్రైడర్తో ఆమెకున్న రిలేషన్‌ని కూడా తవ్వి తీసేవారు. నివ్వెరపోయేవారు కేట్. స్టీఫెన్ ఆమె గురువు. ఆమె జీవితంపై అతడి ప్రభావం ఎంతగానో ఉంది. 1997లో స్టీఫెన్ బోన్ క్యాన్సర్‌తో మరణించారు. అతడి అంత్యక్రియలకు వెళ్లేందుకు ఆస్కార్ ఆహ్వానాన్ని కూడా పక్కన పెట్టేశారు కేట్. సరే, ఈ గతమంతా ఎలా ఉన్నా.. ‘అమోనైట్’ కేట్ తాజా చిత్రం. అందులో నాయిక పాత్ర. ఆ పాత్ర ఆస్కార్‌కు నామినేట్ అవొచ్చని, అయితే బాగుండునని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. -
టైటానిక్ చూడ్డం అంటే అసహ్యం: హీరోయిన్
‘టైటానిక్’ సినిమాలోని హీరోయిన్ పేరు మనకు తెలియకపోయినా ఆమెను చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తాము. ఆ సినిమాకు ఉన్న క్రేజ్ అలాంటిది. రొమాంటిక్ డ్రామాలలో కల్ట్ క్లాసిక్ మూవీ అది. ఇందులో నటించిన హీరోయిన్ కేట్ విన్స్లెట్కు ఈ సినిమాతో సూపర్ పాపులారిటీ వచ్చింది. ఆస్కార్‌కు నామినేట్ అయింది కూడా. అయితే తనకు ఎంతో పాపులారిటీ తెచ్చిన సినిమాను చూడటం అంటే అసహ్యం అంటోంది కేట్. ఈ సినిమాను ఇప్పుడు సిగ్గుపడకుండా చూడలేనని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ( గ్రామీ అవార్డ్స్ వాయిదా) కాగా, 1997లో రిలీజైన ఈ సినిమాకు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించారు. రెనాల్డో డెకాప్రియో, కేట్ విన్స్లెట్లు ప్రధాన పాత్రల్లో నటించారు. 14 విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్ అయిన ఈ సినిమా 2 అవార్డులను సొంతం చేసుకుంది. ఆ సంవత్సరానికి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దాదాపు చాలా సంవత్సరాల తర్వాత జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అవతార్’ సీక్వెల్లో కేట్ నటిస్తున్నారు. -
టైటానిక్‌ని అవెంజర్స్ ముంచింది: కామెరూన్
'అవెంజర్స్' సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. మార్వెల్ సంస్థ తెరకెక్కించిన సూపర్ హిట్ సిరీస్‌లో చివరి చిత్రమైన ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ ప్రపంచం వ్యాప్తంగా ఏప్రిల్ 26న విడుదలై వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. అవెంజర్స్ ఎండ్‌గేమ్ వసూళ్లపై దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ట్విటర్లో వెరైటీగా స్పందించారు. టైటానిక్ చిత్రంలో ఐస్‌బర్గ్ షిప్‌ను ముంచేస్తే, వసూళ్లలో అవెంజర్స్ టైటానిక్‌ని ముంచినట్టు ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేశారు. మార్వెల్ సంస్థ అధినేత కెవిన్, వారి టీమ్ సభ్యులను పనితీరును కొనియాడారు. 'నిజమైన టైటానిక్‌ని ఓ ఐస్‌బర్గ్ ముంచేస్తే, నా టైటానిక్‌ని మీ అవెంజర్స్ ముంచేసింది. మా నిర్మాణ సంస్థ లైట్ స్టార్మ్ ఎంటర్టైన్మెంట్లోని ప్రతి ఒక్కరూ మీరు సాధించిన విజయానికి సెల్యూట్ చేస్తున్నారు. సినిమా పరిశ్రమ బతికుండటం కాదు చాలా గొప్పగా ఉందని మీరు ప్రూవ్ చేశారు' అని జేమ్స్ ట్వీట్ చేశారు. pic.twitter.com/zfICH1XDCJ — James Cameron (@JimCameron) May 9, 2019 కాగా, 2009లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ‘అవతార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే. అడియన్స్ ఇంట్రెస్ట్‌కు తగ్గట్లే ‘అవతార్ 2,3,4,5’ సీక్వెల్స్ తెరకెక్కిస్తున్నారు జేమ్స్ కామెరూన్. తొలుత ‘అవతార్ 2’ చిత్రాన్ని 18 డిసెంబరు 2020న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ 17 డిసెంబరు 2021లో విడుదల చేయనున్నట్లు తాజాగా జేమ్స్ కామెరూన్ తెలిపారు. -
ప్రేమ, వినోదం కలగలిసిన టైటానిక్
తమిళసినిమా: టైటానిక్ అనగానే హాలీవుడ్ అద్భుత ప్రేమ కధా చిత్రం గుర్తుకొస్తుంది. అయితే అదే టైటిల్‌తో కోలీవుడ్‌లో ఒక వినోదభరిత ప్రేమ కథా చిత్రం తెరకెక్కుతండడం విశేషం. ఇంతకు ముందు కొత్త దర్శకులను పరిచయం చేసి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన తిరు కుమరన్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ అధినేత సీవీ.కుమార్ తాజాగా నిర్మిస్తున్న చిత్రం ఇది. దీని ద్వారా ఎం.జానకీరామన్ అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు బాలా, సుధా కొంగర, బాలాజీ మోహన్ల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారన్నది గమనార్హం. యువ నటుడు కలైయరసన్, కయల్ ఆనంది, ఆస్నాజవేరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో కాళీవెంకట్, జాంగ్రి మధుమిత, రాఘవ్విజయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పూర్తి వినోదభరిత చిత్రంగా ఉన్నా, చిత్రం చూసే ప్రేక్షకుడు చిత్రంలోని పలు సన్నివేశాల్లో తమను చూసుకుంటారన్నారు. ఇప్పటి వరకూ కామెడీ కథా చిత్రాల్లో చూడనటువంటి అచ్చెరువు చెందే సంఘటనలను ఈ టైటానిక్ చిత్రంలో చూస్తారన్నారు. ముఖ్యంగా చిత్ర క్లైమాక్స్ సరి కొత్త అనుభూతిని కలిగిస్తుందని దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఇందులో నటుడు సేతన్, దేవదర్శిని, సుధ అతిథి పాత్రల్లో మెరుస్తారని చెప్పారు. దీనికి తెగిడి, సేతుపతి చిత్రాల ఫేమ్ నివాస్ కే.ప్రసన్న సంగీతం, బల్లు చాయాగ్రహణను అందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
ఒక టైటానిక్.. ఒక కర్పాథియా..
మనకు టైటానిక్ గురించి తెలుసు.. జాక్, రోజ్ల అజరామరమైన ప్రేమ కథ గురించి తెలుసు.. మరి మనకు కర్పాథియా గురించి తెలుసా? ఆ నౌకా సిబ్బంది హీరోచిత గాథ గురించి తెలుసా? తెలీదా.. అయితే.. తెలుసుకుందాం రండి.. టైటానిక్.. దాదాపుగా అందరం చూసిన సినిమానే.. ఇందులో ఆ నౌక భారీ మంచు ఖండాన్ని ఢీకొని మునిగిపోతుంది.. 2,224 మందికిపైగా సిబ్బంది, ప్రయాణికులతో బయల్దేరిన టైటానిక్‌లో 1,500 మందికిపైగా సముద్రంలో మునిగి చనిపోయారు.. మరి మిగిలినవాళ్లు ఎలా బతికారు? ఆర్ఎంఎస్ కర్పాథియా వల్ల.. ఆ నౌకలోని సిబ్బంది వల్ల.. 1912, ఏప్రిల్ 15 తెల్లవారుజామున టైటానిక్ సముద్రంలో మునిగిపోయింది.. ఆ సమయంలో కర్పాథియా న్యూయార్క్ నుంచి ఆస్ట్రియాకు వెళ్తోంది.. ప్రమాద స్థలానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. 15వ తేదీ తెల్లవారుజామున టైటానిక్ నుంచి ప్రమాదానికి సంబంధించిన సిగ్నల్ వచ్చింది.. దీన్ని ట్రాక్ చేసిన కర్పాథియా సిబ్బంది.. హుటాహుటిన రంగంలోకి దిగారు. మంచు ఖండాలతో ప్రమాదకరంగా ఉన్న ఆ మార్గంలో ప్రయాణించి.. అక్కడికి చేరుకున్నారు. వెళ్లే సమయానికే టైటానిక్ మునిగిపోయింది. అయినప్పటికీ.. బతికున్న ప్రతి ఒక్కరినీ కాపాడాలన్న లక్ష్యంతో సుమారు 4 గంటలపాటు సహాయక చర్యలు చేపట్టారు. 705 మంది ప్రయాణికులను కాపాడారు. టైటానిక్ తన తొలి, చివరి ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ఏప్రిల్ 10తో 106 ఏళ్లు అయిన సందర్భంగా.. కర్పాథియా సహాయక చర్యలకు సంబంధించిన కొన్ని అరుదైన చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. అవే ఇవీ.. తానూ టైటానిక్‌లాగే.. టైటానిక్‌కు సంబంధించిన వందల మంది ప్రయాణికులను కాపాడిన కర్పాథియా నౌక కూడా తర్వాతి కాలంలో టైటానిక్‌లాగే మునిగిపోయింది. తొలి ప్రపంచ యుద్ధ సమయంలో.. అంటే 1918, జూలై 17న ఐర్లాండ్ సముద్ర జలాల్లో ఉండగా.. జర్మన్ సబ్‌మెరైన్ దీనిపైకి టార్పెడోలు ప్రయోగించడంతో పేలుడు ధాటికి సముద్రంలో మునిగిపోయింది. -సాక్షి, తెలంగాణ డెస్క్ -
మనం మెచ్చిన హాలీవుడ్!
హాలీవుడ్‌కు ప్రపంచమంతా మార్కెట్ ఉన్న రోజుల్లో, ఆ సినిమాలు ఆడని ఒకే ఒక్క మార్కెట్ ఇండియా అంటారు. అలాంటి ఇండియన్ సినిమా మార్కెట్లోకీ హాలీవుడ్ చొచ్చుకొచ్చి రెండు దశాబ్దాలు దాటింది. ఈ రెండు దశాబ్దాల్లో ఇండియన్ సినిమా అభిమానికి హాలీవుడ్ పంచిన వినోదం అంతా ఇంతా కాదు. ‘జురాసిక్ పార్క్’ చూసి సంబరపడిపోయాం. ‘టైటానిక్’ చూసి అద్భుతం అనేసుకున్నాం. ‘స్పైడర్‌మేన్’ అన్నాం. ‘టెర్మినేటర్’ వెంటపడ్డాం. ‘అవతార్’ ప్రపంచంలో కొట్టుకుపోయాం. ‘ఇంటర్స్టెల్లార్’ను వింతగా చూశాం. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అద్భుతాలు సృష్టించగల పేరున్న హాలీవుడ్ సినిమాలు ఇండియాలోనూ ఆ పేరుతోనే పాపులర్ అయ్యాయి. ఆ జానర్ సినిమాలే ఇక్కడ ఫేమస్. ఇక గతేడాది హాలీవుడ్‌కు ఇండియన్ సినిమా మంచి మార్కెట్‌గా అవతరించింది. 2017లో వండర్‌వుమన్, స్పైడర్‌మేన్ లాంటి సూపర్‌హీరో సినిమాలు ఇండియాలో దుమ్మురేపాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి. యాక్షన్, అడ్వెంచరస్ సినిమాలకే ఇండియాలో ఇప్పటికీ క్రేజ్ కనిపిస్తుందన్నది ఒప్పుకొని తీరాల్సిన విషయం. ఇక 2017కి ఏమాత్రం తగ్గకుండా ఇండియన్ సినిమా అభిమాని టేస్ట్‌కి తగ్గ భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమాలు 2018లోనూ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేందుకు వచ్చేస్తున్నాయి. ఇండియాలో ఈ ఏడాది చాలా సినిమాలే దుమ్మురేపుతాయని ట్రేడ్ భావిస్తోంది. ముఖ్యంగా ‘జురాసిక్ వరల్డ్ 2’, ‘అవెంజర్స్’, ‘డెడ్‌పూల్ 2’, ‘బ్లాక్ పాంథర్’, ‘ఎక్స్ మెన్’ తదితర సినిమాలపై ట్రేడ్ భారీ అంచనాలే పెట్టుకుంది. ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ మార్క్ అన్నది ఇండియాలో హాలీవుడ్ సినిమాకు కామన్ అయిపోయింది. ఈ ఏడాది సరికొత్త రికార్డులు సెట్ చేసే సినిమాలు వస్తున్నాయని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. మరి ఆ అంచనాలను ఈ భారీ బడ్జెట్ సినిమాలు అందుకుంటాయా? చూడాలి! -
వార్ డ్రామాలో టైటానిక్ బ్యూటీ
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ కేట్ విన్స్ లెట్ మరో చాలెంజింగ్ రోల్ లో నటించనుంది. టైటానిక్, హెవెన్లీ క్రీచర్స్, లిటిల్ చిల్డ్రన్, స్టీవ్ జాబ్స్ వంటి చిత్రాల్లో నటించిన ఈ భామ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న వార్ డ్రామాలో నటించేందుకు అంగీకరించింది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఓ విలేఖరి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యుద్ధ సమయంలో సాహసోపేతంగా వ్యవహరించి నాజీల కాన్నన్ ట్రేషన్ క్యాంపులు, అక్కడ వారు విధించే శిక్షలకు సంబంధించిన ఫోటోలను సాధించిన అమెరికా ఫొటోగ్రాఫర్ లీ మిల్లర్ బయోపిక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మిల్లర్ జీవితంపై రాసిన 'ద లైవ్స్ ఆఫ్ లీ మిల్లర్' నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఈవారం విశేషాల రౌండప్
గ్రౌండ్ అప్ పనిలేని దొంగ! వర్జీనియాలోని వేనెస్బరో పోలీసులు, ఆ గ్రామ ప్రజలు కొద్ది రోజులుగా ఒక వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతడు దొరికితే ఒక పట్టుపడదామని చూస్తున్నారు! అయితే ఆ ఆగంతకుడు దొరకడం లేదు సరి కదా, అతడు దొంగిలించి తీసుకెళుతున్న పెంపుడు పిల్లులు మాత్రం సాయంత్రానికో, రెండో రోజు ఉదయానికో క్షేమంగా ఇళ్లకు చేరుతున్నాయి?! మామూలుగా ఇల్లు చేరిన పెంపుడు పిల్లిని ఎవరూ పట్టించుకోరు. మహా అయితే.. ‘ఎక్కడ తిరిగొచ్చావే’ అని ముద్దుగా కోప్పడతారు. అయితే ఈ పిల్లులు.. పొట్ట కింద, కాళ్ల మధ్య భాగంలో వెంట్రుకలు లేకుండా ఇంటికి తిరిగొస్తున్నాయి. అంటే.. ఎవరో వీటికి షేవ్ చేసి పంపిస్తున్నారు. అది కూడా ఆ ఒక్క భాగంలో. ఇలా.. ఏడు సంఘటనలు వరసగా జరగ్గానే.. ఊళ్లో వాళ్లకు అనుమానం వచ్చి, అగంతకుడిపై నిఘా వేశారు. లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ దొంగ దొరకలేదు. వాడి ఉద్దేశం ఏమిటో కూడా అంతచిక్కడం లేదు. పనిలేక పిల్లి తల గొరగడం అనే సామెత ఉంది. ఇక్కడ పనిగట్టుకుని ఆ దొంగ గొరిగి పంపిస్తున్న తీరు వేనెస్బరో పిల్లుల యజమానులకు కోపంతో పాటు నవ్వూ తెప్పిస్తోందట! ఇంకో సంగతి ఏంటంటే... బయటికి వెళ్లి, షేవింగ్ తో వచ్చిన పిల్లులు కాస్త నర్వస్‌గా బిహేవ్ చేస్తున్నాయట. ఆ దొంగ ఎవరో దొరికితే అంతా కలిసి అతడికి తల గొరిగించేలా ఉన్నారు. అల్లారు ముద్దు పాపాయి అతడి పేరు బిలాల్ వాక్. ఆమె పేరు ఎలిజబెత్ హ్యాండీ. వాళ్లిద్దరికీ ఓ ముద్దుల కూతురు. వయసు 22లలు. ఇంకా పేరు పెట్టలేదు. చీకూచింతా లేని ఈ చిన్న కుటుంబం జార్జియాలో ఉంటోంది. జార్జియా అని ఐరోపాలో ఒక దేశం ఉంది. ఆ జార్జియా కాదు. యు.ఎస్‌లో జార్జియా అనే రాష్ట్రం ఉంది. ఆ జార్జియాలో ఉంటున్నారు. పాపకు ఏ పేరైతే బాగుంటుందీ అని దంపతులిద్దరూ దీర్ఘంగా ఆలోచించారు. ‘అల్లా’ అని పేరు పెట్టారు. అయితే అధికారులు ఒప్పుకోలేదు.‘‘తల్లి పేరులో గానీ, తండ్రి పేరులో గానీ ‘అల్లా’ అని లేదు. కనుక జార్జియా చట్టాల ప్రకారం అలా కుదరదు’’ అనేశారు! బిలాల్, ఎలిజబెత్ షాక్ తిన్నారు. ‘మా పాప, మా ఇష్టం’ అన్నారు. పౌరహక్కుల వాళ్లను కలిశారు. కోర్టులో కేసు వేశారు. చివరికి ఏమైంది? కేసు గెలిచారు. వాళ్లు కోరుకున్నట్లే ‘అల్లా’ పేరిట బర్త్ సర్టిఫికెట్ వచ్చింది! అయితే ఇలా అల్లా అనే పేరు ఓకే చెయ్యడం అక్కడి ముస్లిం పెద్దలు కొందరికి నచ్చలేదు. తల్లిదండ్రులు ఇద్దరూ ముస్లింలు కానప్పుడు బిడ్డకు ముస్లిం పేరు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. కోటి... టైటానిక్ కోటు! ఫర్ కోట్.. అంటే.. జంతువుల చర్మంతో చేసిన కోటు. ఆ కోటు ఒకటి ఈవారం యు.కె. వేలంలో 1,50,000 పౌండ్లకు (కోటీ 24 లక్షల 76 వేల రూపాయలు) అమ్ముడుపోయింది. అది వందేళ్ల క్రితం నాటిది. అప్పుడు దాని ధర 80,000 పౌండ్లు. అంటే ఇప్పటి విలువ ప్రకారం 66 లక్షల 54 వేల రూపాయలు. వందేళ్ల క్రితం నాటిది అవడం ఒక్కటే ఈ కోటు ప్రత్యేకత కాదు. మాబెల్ బెనెట్ అనే 33 ఏళ్ల మహిళ కోటు అది. ఆమె ఆ కోటును «ధరించి 1912లో టైటానిక్ నౌక ఎక్కారు. ఆ ప్రయాణంలో నౌక మునిగిపోవడం, సుమారు 1500 మంది మరణించడం తెలిసిందే. ఆ దుర్ఘటనలో బతికి బట్టకట్టినవాళ్లులో మాబెల్ ఒకరు. ఆ తర్వాత ఆమె తన 96 ఏళ్ల వయసులో 1974లో సహజ మరణం పొందారు. అంతకాలం బతికి ఉన్న టైటానిక్ మహిళా సిబ్బంది ఈమె ఒక్కరే. ఇన్ని ప్రత్యేకతలు ఉండడంతో ఈ కోటుకు అంత విలువ దక్కింది. సూర్యుడు చంద్రుడౌతాడు! వచ్చే జూన్‌లో అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది. ఆ సందర్భంగా యు.ఎస్. తపాలా శాఖ త్వరలో ‘టచ్ స్టాంప్’లను విడుదల చేయబోతోంది. వేలితో ఆ తపాలా బిళ్లను టచ్ చేస్తే చాలు.. ఆ వేలు వేడికి గ్రహణం పట్టిన సూర్యుడు.. నిండు చంద్రుడిగా మారిపోతాడు. స్టాంప్ పై నుంచి వేలు తీయగానే మళ్లీ గ్రహణం పట్టిన సూర్యుడు ప్రత్యక్షమైపోతాడు. ‘టెంపరేచర్ సెన్సిటివ్ ఇంక్’ను ఉపయోగించి ఈ టచ్ స్టాప్‌ను తయారుచేస్తున్నారు. ఈ 49 సెంట్ల విలువగల స్టాంపు జూన్‌లో బయటికి వస్తుంది. -
రోమియో... జూలియట్
గ్రౌండ్ అప్ ఈవారం విశేషాల రౌండప్ ఒకే హాస్పిటల్లో, పక్క పక్క వార్డులలో 18 గంటల తేడాతో రోమియో, జూలియట్లు జన్మించిన ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని సంబ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతోంది. మార్చి 19న ఆదివారం నాడు యు.ఎస్.లోని కోస్టల్ కరొలినా హాస్పిటల్లో మధ్యాహ్నం 2 గంటల 6 నిముషాలకు రోమియో జన్మించాడు! తర్వాతి రోజు ఉద్యం 8 గంటల 14 నిముషాలకు జూలియట్ జన్మించింది. ఈ సంగతి వారిద్దరి తల్లిదండ్రులకు తెలియదు. కేసీ క్లేషల్ట్ అనే మహిళా ‘న్యూబార్న్ ఫొటోగ్రాఫర్’ ఎప్పటిలా హాస్పిటల్లో కొత్తగా పుట్టిన పిల్లల్ని ఫొటోలు తీసేందుకు వచ్చినప్పుడు ఈ అపురూపమైన సందర్భంగా గురించి తెలిసింది. అది కూడా అనుకోకుండా. యు.ఎస్.లో ఇంకా ఇతర పాశ్చాత్య దేశాలలో సాధారణంగా బిడ్డ పుట్టకముందే ఒక పేరు అనుకుంటారు. అలా... ‘మీ అబ్బాయి పేరు ఏమిటి? అని కేసీ అడిగినప్పుడు ఈ వార్డు దంపతులు ‘రోమియో ఆర్కెంజల్ హెర్మాండజ్’ అని చెప్పారు. ‘మీ అమ్మాయి పేరు ఏమిటి?’ అని అడిగినప్పుడు ఆ పక్క వార్డు దంపతులు ‘జూలియట్ ఎవాంజిలిన్ షిప్లెట్’ అని చెప్పారు. ఇకనేం ఇద్దరి పేర్లలో రోమియో, జూలియట్లు ఉన్నాయని, ఇద్దరినీ రోమియో–జూలియట్లలాగే ముస్తాబు చేసి, షేక్స్పియర్ కాలం నాటి కావ్య నాయికానాయకులు గుర్తుకు వచ్చేలా ఫొటోలు తీశారు కేసీ. ఎంత ముద్దుగా ఉన్నారో చూశారుగా! టైటానిక్ ట్రిప్! అట్లాంటిక్ సముద్ర గర్భంలో ఉపరితల జలాలకు 4 వేల మీటర్ల అడుగున చిక్కుకుని ఉన్న టైటానిక్ ‘శకల నౌక’ దగ్గరికి... వచ్చే ఏడాది మే నెల నుంచి ఔత్సాహికుల వన్ టైమ్ సాహస యాత్ర మొదలౌతోంది! ఎనిమిది రోజులపాటు భద్రమైన ఒక మానవ జలాంతర్గామిలో సాగే ఈ టైటానిక్ యాత్రను లండన్ ట్రావెల్ కంపెనీ ‘బ్లూ మార్బుల్ ప్రైవేట్’ నిర్వహిస్తోంది. కెనడా లోని న్యూఫౌండ్‌ల్యాండ్ నుంచి ఈ టైటానిక్ సందర్శక ప్రయాణికులు బయల్దేరుతారు. టిక్కెట్ ధర మనిషికి లక్షా 5 వేల 129 డాలర్లు! సుమారుగా 68 లక్షల 20 వేల రూపాయలు. 1912 ఏప్రిల్‌లో ఇంగ్లండ్ లోని సౌథాంప్టన్ నుంచి యు.ఎస్.లోని న్యూయార్క్‌కు బయల్దేరిన టైటానిక్ నౌక మార్గం మధ్యలో మంచుకొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. నౌకలో మొత్తం 2,224 మంది ప్రయాణీకులు (నౌక సిబ్బందితో కలిసి) ఉండగా, వారిలో 1500 మందికి పైగా మరణించారు. నౌక మునిగిన 93 ఏళ్ల తర్వాత రాబర్ట్ బల్లార్డ్, ఆయన అన్వేషకుల బృందం న్యూఫౌండ్లాండ్ దగ్గరి సెయిట్ జాన్స్‌కు 380 నాటికల్ మైళ్ల దూరంలో టైటానిక్ ప్రధాన శకలాన్ని కనుగొంది. ఇప్పుడు అక్కడికే మనవాళ్ల ప్రయాణం. పాదాక్రాంతం ఎడమవైపు ఉన్న ఆవిడ నికోలా స్టర్జన్. స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ (ప్రధాని). కుడివైపు ఉన్న ఆవిడ థెరిసా మే. బ్రిటన్ ప్రధాని. ఇటీవల ఇద్దరూ గ్లాస్గోవ్లో కలుసుకున్నారు. గ్లాస్గోవ్ స్కాట్లాండ్లో ఉంటుంది. ‘ఐరోపా సమాఖ్య’ (ఇ.యు.) నుంచి గత ఏడాది బ్రిటన్ బయటికి వచ్చేసింది. ఇప్పుడు బ్రిటన్ నుంచి విడిపోతానని స్కాట్లాండ్ పట్టుపట్టింది (స్లాట్లాండ్ 1707 నుంచి యు.కె.లో భాగంగా ఉంది). ఈ సమస్యను చక్కబరచుకోవడం కోసమే ఈ ఇద్దరు ప్రధానమంత్రులూ ఇలా ఒకచోట కూర్చున్నారు. విషయం చాలా సీరియస్ అని తెలుస్తూనే ఉంది కదా. అయితే దాన్ని వదిలేసి, బ్రిటన్ పత్రిక ‘డైలీ మెయిల్’ వీళ్లిద్దరి కాళ్లపై దృష్టిని కేంద్రీకరించింది! ఎవరి కాళ్లు అందంగా ఉన్నాయో చెప్పండి అని పేద్ద హెడ్డింగ్ పెట్టింది. పైగా ఈ దేశాధినేతల కాళ్ల విలక్షణతను కూడా వర్ణించింది. నికోలా కాళ్లు... ఏక్దమ్ ఫ్లర్టీ అట! టాంటలైజింగ్లీ క్రాస్డ్ అట!! ఎ డైరెక్ట్ అటెంప్ట్ ఎట్ సెడెక్షన్ కూడానట! కవ్వించేలా, ఆశపెట్టి వేధించేలా, – ఎట్ ద సేమ్ టైమ్– వ్యామోహం మూతి పగలగొట్టేలా ఉన్నాయని దీనంతటికీ అర్థం. ఇక థెరిసా మే. పొంచి ఉన్న తీవ్రవాది బుద్దిగా దగ్గర పెట్టుకున్న ఆయుధాల్లా ఉన్నాయట ఈవిడ కాళ్లు! జనం డెయిలీ మెయిల్‌ను ఎలా తిడుతున్నారంటే... మాటల్లో చెప్పలేం. మహిళలను కించపరిచే వెర్రిరాతల్ని రాయడం తక్షణం మానుకోవాలని ఫోన్ చేసి మరీ... తలా ఒకటి అంటిస్తున్నారు. ట్విటర్లోనైతే ఇక చెప్పలేం. తిట్లే తిట్లు. కరుణ రసం రేయాన్‌కు తొమ్మిదేళ్లు. అకస్మాత్తుగా ఇటీవల ఒక రోజు న్యూ మెక్సికోలోని ఒక రోడ్డు పక్కన నిమ్మరసం అమ్మడం మొదలు పెట్టాడు! రేయాన్కి రిచర్డ్ శాంఛెజ్ అనే తాతగారు ఉన్నారు. ఆ తాతగారిని బతికించుకోడానికే రేయాన్ ఇలా వ్యాపారిగా అవతారమెత్తాడు. తాతగారికి రెండు రకాల క్యాన్సర్లు! అవి రెండూ మూడో స్టేజ్‌లో ఉన్నాయి. డాక్టర్లు ఆయనకు సర్జరీ చేసి కడుపులోని కణితి తొలగించారు. ఇక మిగిలింది కీమో థెరపీ ఇవ్వడం. దానికి డబ్బులు కావాలి. కనీసం 5 వేల డాలర్లన్నా కావాలి. అంత మొత్తం తాత దగ్గర లేదు. మనవడే సంపాదించడానికి పూనుకున్నాడు. నిమ్మరసం అమ్మి అంత డబ్బూ సంపాదించాడు. చిన్న పిల్లవాడు... పెద్ద బిజినెస్‌మ్యాన్‌లా లెమన్ అమ్మడం చూసి ముచ్చట పడినవారితో, వాడి కథ విని హృదయం ద్రవించిన కస్టమర్లతో ఆ రోడ్డంతా కిక్కిరిపోయింది. ఇంకెవరైనా అయితే పోలీసులు అక్కడి నుంచి వెళ్లగొట్టేవారే కానీ, రేయాన్ని చూశాక.. ‘అమ్ముకో’ అని స్పెషల్ పర్మిషన్ కూడా ఇచ్చారు! మహానుభావుడు కర్నాటకలో లీటరు పెట్రోలు 76.28 రూ. లీటరు డీజిల్ 63.16 రూ. పెట్రోలు కన్నా డీజిలు 13.12 రూ. తక్కువ. (నిన్నమొన్న తగ్గిన రేట్లకు ముందు ధరలు). అయితే ఇదే డీజిలు మంగుళూరు ఎమ్మెల్యే మొహియుద్దీన్ బవా చేత లక్షల రూపాయలు ఖర్చుపెట్టింది! ఈ మధ్య ఆయన కోటీ 65 లక్షల రూపాయలు పెట్టి వాల్వో ఎక్స్‌సి90 టి8 హైబ్రిడ్ ఎక్సెలెన్స్ లగ్జరీ కారు కొన్నారు. అది పెట్రోల్ కారు. తన కొడుకు పేరిట కొన్నారు. ఆ పుత్రరత్నం కారును తీసుకెళ్లి, పెట్రోల్ కొట్టమని చెప్పి ఎవరితోనో హస్క్ కొడుతూంటే... పెట్రోల్ బంక్ కుర్రాళ్లు దీనికి డీజిల్ కొట్టేశారు. బండి స్ట్రక్ అయిపోయింది. దాన్ని వేరే ఇంకో వెహికల్లో రిపేర్ కోసం బెంగుళూరు తరలించారు. ఇంత జరిగినా ఎమ్మెల్యే గారికి కొడుకు మీద కానీ, పెట్రోల్ బంకు కుర్రాళ్ల మీద గానీ కోపం రాలేదు! పొరపాట్లు మనుషులు చేయకపోతే, మిషన్లు చేస్తాయా అని నవ్వుతూ అంటున్నారు! నాట్ ఓకే క్రియేటివిటీ కొన్నిసార్లు వికటిస్తుంది. నార్త్ కరోలినాలోని ఒక ఆభరణాల కంపెనీ తన ప్రచార హోర్డింగ్‌లో ఇలాగే మితిమీరిన క్రియేటివిటీని ప్రదర్శించి, అప్రతిష్ట తెచ్చుకుంది. ‘సమ్‌టైమ్స్ ఇట్ ఈజ్ ఓకే టు త్రో రాక్స్ ఎట్ గర్ల్స్’ అని ప్రధాన కూడలిలో ఆ కంపెనీ పెట్టించిన హోర్డింగ్... ఇప్పుడు ఆ కంపెనీ మీదే రాళ్లు పడేలా చేస్తోంది. పాపం ఆ కంపెనీ ఉద్దేశం మంచిదే. అమ్మాయిలకు... అమూల్యమైన రాళ్లు, రత్నాలను కానుకగా ఇవ్వండి అని చెప్పడం. కానీ చెప్పిన విధానమే బాగోలేదు. ‘కొన్నిసార్లు అమ్మాయిల మీద రాళ్లు విసరడం కూడా మంచిదే’ అని సృజనాత్మకంగా రాయించింది! ‘ఉద్దేశాలను పిల్లలు అర్థం చేసుకోలేరు కదా, ఆ మాటల్ని ఉన్నవి ఉన్నట్లే తీసుకుంటే ఎంత ప్రమాదం’ అని ఆ బోర్డును చూసినవాళ్లు చికాకు పడుతున్నారు. తిక్క మనిషా?! బాబ్ డిలాన్ తనకు వచ్చిన నోబెల్ బహుమతిని స్వీకరించడానికి నేటికీ స్వీడన్ వెళ్లలేదు! ఆయన గనుక ఈ జూన్ 10 లోపు స్వీడన్‌లోని స్టాక్హోమ్కి వెళ్లి చిన్న స్పీచ్ అయినా ఇవ్వకపోతే నోబెల్ బహుమతి ద్వారా ఆయనకు వచ్చే 9 లక్షల 10 వేల డాలర్ల నగదు రాకుండాపోతుంది! పెద్ద స్పీచ్ అక్కర్లేదు. ఓ చిన్న పాట కచేరి, ఓ వీడియో, కనీసం ఓ పాట... ఏదైనా సరే, నోబెల్ సందర్భాన్ని గుర్తుచేస్తూ ప్రదర్శిస్తే చాలు ఈ నగదు బహుమతికి ఆయన యోగ్యుడైనట్లే. ఇది సంప్రదాయం కూడా. ఏటా విజేతను అక్టోబర్‌లో ప్రకటిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్10న విజేతకు బహుమతిని ప్రదానం చేస్తారు. ఏ విజేతైనా స్టాక్‌హోమ్‌కు వెళ్లలేని పరిస్థితి ఉంటే... డిసెంబర్ పది నుంచి ఆరు నెలల లోపు వెళ్లి తీసుకోవాలి. కానీ నేటికీ బాబ్ డిలాన్ స్పందించలేదు! నిజానికి అవార్డు విషయంలో మొదటి నుంచి ఆయన పెద్ద ఉత్సాహంతో లేరు! నోబెల్ కమిటీవాళ్లు అవార్డును ప్రకటించిన చాలా కాలం తర్వాత ఎప్పుడో డిలాన్ థ్యాంక్ గివింగ్ నోట్ మాత్రం పంపారు. అంతే తప్ప నోరు తెరిచి ధన్యవాదాలు తెలియజేయలేదు! ఏప్రిల్ 9న స్వీడన్‌లోని లుండ్‌లో డిలాన్ కచేరీ ఉంది. బహుశా అప్పుడేమైనా పెద్ద మనసుతో నోబెల్‌ను స్వీకరిస్తాడేమో చూడాలి. అయితే ఆ కచేరీ... నోబెల్ అవార్డుల ప్రకటనకు చాలా ముందే ఖరారైనది కావడంతో ఒక వేళ డిలాన్... లుండ్కి వచ్చినా, బహుమతి తీసుకోకుండా అటునుంచి అటే వెనక్కు వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు. ఏంటో ఈ తిక్క మనిషి! తొమ్మిది లక్షల పది వేల డాలర్లంటే మాటలా?! ఐదు కోట్ల 90 లక్షల రూపాయాలకు పైమాటే! వేడి భోజనం... వెచ్చటి కబుర్లు! ఈయన పేరు జార్జి లాఫ్టస్. వయసు 100. ఇక ఈయన భార్య ఫిలిస్. ఈమె వయసు 94. ఫిలిస్కు జార్జితో 17 ఏళ్ల వయసులో 1940 ఆగస్టు 10న పెళ్లయింది. ఈ ఏడాది వీళ్లు తమ 77వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. బ్రిటన్‌లో ప్రస్తుతం జీవించి ఉన్న జంటల్లో ఇంత దీర్ఘకాలం ఆరోగ్యంగా, అనందంగా ఉన్న జంట వీళ్లే కావచ్చు. ఎంత దీర్ఘకాలం అంటే.?. పదహారు మంది ప్రధానమంత్రుల ప్రమాణ స్వీకారాలను వీళ్లు చూశారు. రెండేళ్ల క్రితం వీళ్ల 75వ పెళ్లి రోజుకు బ్రిటిష్ మహారాణి రెండవ ఎలిజబెత్ అభినందన లేఖ కూడా పంపారు. ఇంతకీ ఏమిటి వీళ్ల దాంపత్య విజయ రహస్యం? సింపుల్. వేడి వేడిగా భోజనం చేస్తారట. వెచ్చటి కబుర్లు చెప్పుకుంటారట!రుచికరమైన తిండి, శుచికరమైన సంభాషణ ఉంటే భార్యాభర్తల లైఫ్ హ్యాపీగా ఎన్నేళ్లయినా సాగిపోతూనే ఉంటుందట! -
హాలీవుడ్ ప్రముఖ నటుడు కన్నుమూత
లాస్ ఏంజెలిస్: హాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు బిల్ పాక్స్టన్(61) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ది టర్మినేటర్, ఏలియన్స్, టైటానిక్ వంటి ప్రముఖ చిత్రాల ద్వారా ఆయన ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న బిల్ కు డాక్టర్లు సర్జరీ చేస్తుండగానే మృతిచెందారని ఆయన సన్నిహితులు మీడియాకు వెల్లడించారు. ఓ మంచి భర్తగా, తండ్రిగానూ ఆయనకు మంచి పేరుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా హాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బిల్ పాక్స్టన్ ఆపై నటుడిగా, ఫిల్మ్ మేకర్‌గా రాణించారు. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు హాలీవుడ్ ఇండస్ట్రీకి విశేష సేవ చేశారని, నేడు ఓ మంచి వ్యక్తిని కోల్పోయామని ఆయన మృతిపట్ల చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. -
టైటానిక్ మునిగిపోయింది అందుకు కాదా?
-
టైటానిక్ మునిగిపోయింది అందుకు కాదా?
టైటానిక్ ఈ పేరు అందరికీ సుపరిచితమే. కారణం జేమ్స్ కామెరూన్ టైటానిక్ విషాదగాథకు ప్రేమ కథను జోడించి తెరకెక్కించిన చిత్రం. టైటానిక్ ను గురించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సౌథాంప్టన్ నుంచి న్యూయార్క్ బయల్దేరిన టైటానిక్ మునిగిపోయింది. ఈ హృదయ విదారక సంఘటనలో 1,500 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. మంచుకొండను ఢీ కొట్టడం వల్ల ఘటన జరిగిందని మనందరికీ తెలుసు. అయితే, మంచుకొండను ఢీ కొట్టడమే ఈ దుర్ఘటనకు కారణం కాదని పరిశోధకుడు, జర్నలిస్టు సెనాన్ మొలొని చెబుతున్నారు. టైటానిక్ కు సంబంధించిన చిత్రాలను ముప్ఫై ఏళ్లుగా పరిశీలిస్తున్న ఆయన ఓడ అడుగుభాగంలో 30 అడుగులు వెడల్పు ఉన్న నల్లని మచ్చను గుర్తించారు. ఈ మచ్చకు కొద్ది దూరంలోనే మంచుకొండను టైటానిక్ ఢీ కొట్టింది. ఓడను నడపడానికి అడుగుభాగంలో ఇంజన్ ను ఉంచారు. ఇంజన్ కు శక్తినందించేందుకు టన్నుల కొద్దీ బొగ్గును నిరంతరం రగుల్చుతుండటం వల్ల ఆ ప్రాంతంలో వెయ్యి డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉండేదని సెనాన్ చెప్పారు. దీనివల్ల ఓడ అడుగుభాగం బలహీన పడిందని అదే సమయంలో మంచుదిబ్బను ఓడ ఢీ కొట్టడంతో టైటానిక్ కథ విషాదాంతమైందని చెప్పారు. -
టైటానిక్ ప్రమాదం వెనుక...
లండన్: టైటానిక్ నౌక ప్రమాదానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అందరూ భావిస్తున్నట్లుగా మంచు కొండను ఢీకొని టైటానిక్ మునిగిపోలేదని, బాయిలర్‌లో ఏర్పడిన మంటల వల్లనే మునిగి పోయిందని ఐర్లాండ్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్, రచయిత సీనన్ మోలోని తాను రూపొందించిన డాక్యుమెం టరీలో పేర్కొన్నాడు. టైటానిక్ ప్రమాదానికిగల అసలు కారణం తెలుసుకునేందుకుగాను మోలోని గత 30ఏళ్లుగా పరిశోధన చేస్తున్నారు. తన పరిశోధన ప్రకారం టైటానిక్ షిప్‌యార్డ్‌లో ఉండగానే బాయిలర్‌లో ఏర్పడిన ఈ మంటల వల్ల నౌక అడుగుభాగం బలహీనంగా మారిందని, బలహీనంగా మారిన ఓడ భాగాన్నే మంచుకొండ ఢీకొందన్నారు. -
కథల ఎంపికలో నాన్నగారు కల్పించుకోరు
‘నోట్‌బుక్’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు రాజీవ్ సాలూరి. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి వారసునిగా ఇండస్ట్రీకొచ్చినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా రాజీవ్ నటించిన చిత్రం ‘టైటానిక్’. జి.రాజవంశీ దర్శకత్వంలో కె.శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజీవ్ చెప్పిన విశేషాలు... ఈ చిత్రంలో కార్తీక్ అనే కాలేజీ కుర్రాడి పాత్రలో నటించా. నేను, హీరోయిన్ ప్రేమించుకుంటాం. మనస్పర్థలు రావడంతో విడిపోతాం. అప్పుడు హీరోయిన్ను ఆమె మేనమామకు ఇచ్చి వివాహం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయిస్తారు. ఆ పెళ్లి ‘టైటానిక్’ అనే బోట్లో చేయాలనుకుంటారు. ఆ బోట్లోకి హీరో ఎలా ఎంటరయ్యాడు? పెళ్లిని ఎలా ఆపగలిగాడు? అన్నదే కథ గోదావరి నదిలో అంతర్వేది నుంచి అమలాపురం వెళ్లే టైటానిక్ బోట్లో ప్రయాణం కావడంతో ‘టైటానిక్’ అని టైటిల్ పెట్టాం. ‘గోదావరి’ చిత్రం కూడా బోట్లోనే చిత్రీకరించినా, రెండింటికీ పోలిక లేదు. దేనికదే డిఫరెంట్‌గా ఉంటుంది ‘సంగీత దర్శకుడివి అయ్యుంటే అండగా ఉండేవాణ్ణి. కానీ, నువ్వు హీరో అయ్యావు. కథల ఎంపికలో నీ నిర్ణయాలు నువ్వే తీసుకో’ అని నాన్నగారు అన్నారు. ఆయన సలహాలు ఇస్తారే కానీ, ఇన్వాల్వ్ కారు. ‘టైటానిక్’ తర్వాత ‘కేటుగాడు’ డెరైక్టర్ కిట్టు నల్లూరి దర్శకత్వంలో వెంకటేశ్ బాలసాని నిర్మాతగా ఓ చిత్రం చేయనున్నా. -
టైటానిక్‌లో వినోదం!
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి, యామిని భాస్కర్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘టైటానిక్’. ‘అంతర్వేది టు అమలాపురం’ అన్నది ఉపశీర్షిక. చందర్ రావ్ సమర్పణలో జి. రాజవంశీ దర్శకత్వంలో కన్నా సినీ ప్రొడక్షన్స్ పతాకంపై కె. శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలుపుతూ- ‘‘అంతర్వేది నుంచి అమలాపురం వరకు గోదావరి నదిలో లాంచీలో జరిగే ప్రయాణమే ఈ చిత్రం. రాజమండ్రిలో పేరుగాంచిన వశిష్ఠ అనే యాత్ర బోట్‌ను టైటానిక్‌గా రూపొందించి షూటింగ్ జరిపాం. పూర్తి వినోదాత ్మకంగా తెరకెక్కించాం. పెళ్లి బృందం వినోదంతో సినిమా సరదాగా సాగుతుంది. థర్టీ ఇయర్స్ పృథ్వీ ఇందులో పెళ్లి కొడుకుగా, రఘుబాబు విలన్‌గా నటించారు. వినోద్ యాజమాన్య స్వరపరచిన పాటలు, ట్రైలర్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తప్పకుండా ప్రేక్షకులను మా చిత్రం కడుపుబ్బా నవ్విస్తుందనడంలో సందేహం లేదు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: అమర్, సహ నిర్మాత: అట్లూరి సురేష్ బాబు. -
అంతర్వేది టు అమలాపురం
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి, యామినీ భాస్కర్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘టైటానిక్’. ‘అంతర్వేది టు అమలాపురం’ అన్నది ఉపశీర్షిక. రాజవంశీ దర్శకత్వంలో కన్నా సినీ ప్రొడక్షన్స్ పతాకంపై కె.శ్రీనివాసరావు ఈ చిత్రం నిర్మించారు. వినోద్ యాజమాన్య స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి బిగ్ సీడీ ఆవిష్కరించారు. దర్శకుడు ఎన్. శంకర్ పాటల సీడీ విడుదల చేసి, నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్‌కు అందించారు. దర్శక- నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘అంతర్వేది నుంచి అమలాపురం వరకు లాంచీలో జరిగే ప్రయాణమే ఈ చిత్రం. పూర్తి వినోదాత ్మకంగా తెరకెక్కించాం. గోదావరి నదిలో టైటానిక్ లాంచీలో ఏం జరిగిందన్నదే కథ. థర్టీ ఇయర్స్ పృధ్వీ ఇందులో పెళ్లి కొడుకుగా నటించారు’’ అని తెలిపారు. దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, కల్యాణ్ కృష్ణ, బెల్లం రామకృష్ణా రెడ్డి, రాజీవ్ సాలూరి, సంగీతదర్శకుడు కోటి, సహ నిర్మాత అట్లూరి సురేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
టైటానిక్@2018
టైటానిక్.. ఓ అమర ప్రేమ గాథ.. సినిమా స్టోరీ సంగతి పక్కనపెడితే.. సినిమా పుణ్యమానీ మన దగ్గర పల్లెటూర్లలో సైతం టైటానిక్ షిప్ ఫేమస్ అయిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యం కలిగిన షిప్‌గా పేరొందింది. 1912లో మునిగిపోయిన ఈ నౌకలాంటిదాన్నే మళ్లీ నిర్మిస్తామంటూ ఆస్ట్రేలియాకు చెందిన సంపన్నుడు, బ్లూస్టార్‌లైన్ అధినేత క్లైవ్ పామర్ 2012లో ప్రకటించారు. 2016 సరికి టైటానిక్-2 నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. తాజాగా తెలిసిన విషయమేమిటంటే.. నౌక నిర్మాణం మరింత ఆలస్యం కానుంది. టైటానిక్-2 2018లో అందుబాటులోకి వస్తుందని.. అదే ఏడాది చైనాలోని జియాంగ్సూ నుంచి దుబాయ్‌కు తన తొలి ప్రయాణాన్ని మొదలుపెడుతుందని బ్లూస్టార్‌లైన్ ప్రతినిధి తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నౌకల్లో రోబో బార్టెండర్లు వంటి అత్యాధునిక సదుపాయాలెన్నో అందుబాటులోకి వచ్చాయి. టైటానిక్-2లో రక్షణ సదుపాయాల విషయంలో మాత్రమే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నారు. మిగతావన్నీ అచ్చంగా పాత టైటానిక్‌లో ఉన్నట్లుగానే ఉంటాయని చెబుతున్నారు. పాతదానిలో ఉన్నట్లుగానే కొత్త టైటానిక్‌లోనూ మొదటి, రెండు, మూడో తరగతి క్యాబిన్లు ఉంటాయట. అయితే.. పాత టైటానిక్ తరహాలో కాకుండా.. ఇక్కడ లైఫ్బోట్లు ప్రతి ఒక్కరికీ ఉంటాయంటున్నారు. ఇంతకీ టైటానిక్-2 ఎలా ఉండబోతోంది? -
పోతన.. టైటానిక్.. చలికాలం
నెగళ్ల కాలం ఇది. పగళ్లు చాలా చిన్నవైన కాలం. మనుషులు దగ్గరకు కూడే కాలం ఇది. అవయవాలను ఒకదానికి ఒకటి దగ్గరకు చేర్చుకునే కాలం. తేనీటి కాలం ఇది. ప్రాతఃవేళ పొగలు గక్కే వేడినీటిని కోరే కాలం. నిదుర కాలం ఇది. పొడవు రాత్రుళ్లలో మనసు తీరా ముసుగు తన్నే కాలం. చలికాలం. గిలిగిలకాలం. పంటిని పన్ను తాకుతూ కటకటమని తాళం చరిచే కాలం. గీతాంజలి అంటే మొన్నటి దెయ్యం గీతాంజలి కాదు. ఊటీ గీతాంజలి. గిరిజ గీతాంజలి. లేచిపోదాం అన్న మొనగాడా ఎక్కడున్నావ్ అని కాలిని నేలకు తాటించే గీతాంజలి. మణిరత్నం గీతాంజలి. చలిని చూస్తే ఆ సినిమాలో చూడాలి. పచ్చగా ఫ్రెష్‌గా కనిపిస్తున్న కూరగాయల మార్కెట్లో అమ్మాయిని అబ్బాయి పలకరించడం అబ్బాయిని అమ్మాయి గిలిగింతలు పెట్టడం... నాన్ ఏసి థియేటర్లో కూడా స్వెటర్ వేసుకోబుద్ధయ్యే సినిమా. స్వెటర్ చలి నుంచి కాపాడే ఒక వస్త్రం. కాని తెలుగు సినిమా హీరోకు మాత్రం అదో ఫ్యాషన్ స్టేట్మెంట్. తెల్లప్యాంటు పైన రంగురంగుల స్వెటర్ తోడు మఫ్లర్... ఛళ్లున మండే ఎండలో కూడా అవి వేసుకొని మైదానాలలో పాడితేనే అతడికి అందం. ప్రేక్షకులకు చందం. కాశ్మీర్ శాలువాకు ఏం అదృష్టం పట్టిందో మనకు తెలుసు. శరీరానికి వెచ్చదనాన్ని హుందాదనాన్ని ఇవ్వాల్సిన ఆ శాలువ తెలుగు సినిమా బారిన ఒక కేన్సర్ సింబల్ అయ్యింది. లవ్ ఫెయిల్యూర్‌కు లోగో అయ్యింది. నల్లబట్టలు కట్టుకొని గడ్డం పెంచుకొని తెల్ల చెప్పుల్లోకి మారి పైన శాలువా కప్పారా ఏదో ప్రమాదం ముంచుకొచ్చినట్టే లెక్క. ఏదో సినిమాలో ‘ఏప్రిల్ మేలలో పాపల్లేరుగా కాంతి లేదుగా’ అనే పాట ఉంది. ఏప్రిల్ మేలలో కాలేజీలకు సెలవులట. అమ్మాయిలు రారట. కనుక కాంతి లేదుట. ఆమాటకొస్తే డిసెంబర్ జనవరిలో మాత్రం ఏ ఆనందం ఉంది. వంటి నిండా దుస్తులతో ఒకటికి రెండు పై వస్త్రాలతో ఒబేస్ అయినట్టుగా కనిపించే అమ్మాయిలే కదా ఎటు చూసినా. కాని ఒకందుకు ఇదీ మంచిదే. కుదురైన కనుముక్కు తీరేదో కనిపెట్టడానికి ఇదే అదను. కాని చరిత్రలో ఒక చలి ప్రమాదం చాలా విషాదభరితమైనది. మృత్యుశీతలం లేదా శీతల మృత్యువు... అలాంటిదే ‘టైటానిక్’ ఓడ ప్రమాదంలో సంభవించింది. 1912 ఏప్రిల్ పద్నాలుగున అట్లాంటిక్ సముద్రాన్ని దాటుతున్నట్టు ఆ నీళ్లు మృత్యు శీతలంగా ఉన్నాయి. కెరటాలు ఎనిమిది అడుగుల ఎత్తు వరకు ఎగిసి పడుతూ ఓడతో తలపడుతూ ఉన్నాయి. సాయంత్రానికి సముద్రం సద్దుమణిగింది. అతి శీతల గాలులు వీయడం మొదలుపెట్టాయి. అంతకు ముందు రోజు నుంచే ఆ వైపు వెళ్లిన ఓడలు మంచు కొండలు కనపడుతున్నాయి జాగ్రత్త అని టైటానిక్‌కు సందేశాలు పంపుతున్నాయి. కాని టైటానిక్ ఫుల్ స్పీడ్‌తోనే ప్రయాణించింది. రాత్రి 11.40 గంటలకు టైటానిక్ మంచుకొండను ఢీకొట్టింది. నౌక చెల్లాచెదురయ్యింది. 20 లైఫ్ బోట్లు ఉన్నాయి. కాని 700 మందే వాటి వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగారు. వాటి సామర్థ్యం 1,178. మిగిలిన వాళ్లంతా నీటి పాలయ్యారు. లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. ఈదే శక్తి ఉంది. కాని నీళ్లు శీతలం. గాలి శీతలం. రాత్రి శీతలం. మృత్యువు శీతలం. ఒక గొప్ప ప్రయాణాన్ని మొదలెట్టిన ప్రయాణికులు 1500 మంది ఆ కాళరాత్రి చలికి వణుకుతూ వణుకుతూ మృత్యువు ముందు చేతులు ముకుళించారు. సాహిత్యం కూడా చలిని చాలా తీవ్రంగా చూసింది. చలికి భయపడింది. చలితో తలపడింది. ప్రఖ్యాత రష్యన్ రచయిత గొగోల్ రాసిన ‘ది ఓవర్ కోట్’ ప్రఖ్యాతం. ఒక చిన్న ఆఫీస్‌లో క్లర్క్‌గా పని చేసే చిల్లర జీతగాడు జీవితాంతం ఒకే కలను కంటాడు. అదేమిటంటే కొత్త ఓవర్ కోట్‌ను కొనుక్కోవడం. దారుణమైన మంచుకురిసే ప్రాంతంలో ఉన్నవారికి అంతకు మించిన ధైర్యం ఉండదు. కాని అతని దగ్గర డబ్బులు ఉండవు. నెలల తరబడి పోగేసి పోగేసి అతి కష్టం మీద ఒక ఓవర్‌కోట్ కొనుక్కుంటాడు. ఎంతో ఆనందిస్తాడు. ఆ సంతోషంలో కన్నీరు కారుస్తాడు. ఏం లాభం? అతని కంటే దైన్య స్థితిలో ఉన్న కొందరు జులాయిలు అతణ్ణి కొట్టి ఆ ఓవర్‌కోట్‌ను లాక్కుని వెళతారు. మానవత్వం మానవత్వం అని మాటలు చెప్పడం కాదు. భయంకరమైన చలి ఇద్దరు మనుషులు ఒక రగ్గు ఉన్నప్పుడే ఒక మనిషిలోని మానవత్వం బయటపడుతుంది. తెలుగులో ఒక లలితమైన కథ ఉంది. మధురాంతకం రాజారాం రాశారు. దాని పేరు ‘కమ్మతెమ్మెర’. ఒక జంటకు కొత్తగా పెళ్లవుతుంది. కాని సుముహూర్తం లేని కారణాన మొదటిరాత్రికి ఎడం ఉంటుంది. ఈలోపు పెళ్లికొడుకు ఊరెళ్లి కొన్నాళ్లు పనులు చూసుకొని అత్తగారి ఇంటికి వస్తాడు. పెళ్లికూతురిని చూడాలని ఒకటే తహతహ. ఆమె మాత్రం సిగ్గుతో అతడికి కనపడకుండా దాక్కుంటూ ఉంటుంది. చేతులు గాజులు పాదాల నడక ఇవే కనిపిస్తూ ఉంటాయి. పెళ్లికొడుకు నిరాశపడతాడు. రాత్రికి అలసిపోయి అరుగు మీద ఏర్పాటు చేసిన పక్కలో నిదుర పోతాడు. మంచి చలి కాలం. అర్ధరాత్రి చలి వేస్తూ ఉంటుంది. నిద్రలోనే ఒణుకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మృదువైన అందెల రవళితో సున్నితమైన గాజుల సవ్వడితో ఎవరో వచ్చి ఆ పెళ్లి కొడుక్కి వెచ్చటి దుప్పటి కప్పి తుర్రుమంటారు. నిండా కప్పుకున్నా సరే ఒక కమ్మతెమ్మెర తాకినట్టయ్యి పెళ్లికొడుకు పులకింతలు పోతాడు. ఆ జ్ఞాపకం ఇక నూరేళ్లు శాశ్వతం. ‘అహములు సన్నములయ్యె దహనము హితమయ్యె, దీర్ఘదశలయ్యె నిశల్; బహు శీతోపేతంబై ‘యుహు... హుహు’యని వడకె లోకముర్వీనాథా!’ అని పోతన చలి మీద పద్యం చెప్పాడు. హిందీ సినీ కవి ఒకడు ఇలాంటివి లెక్క చేయకుండా మంచి చలికాలంలో ‘ఠండే ఠండే పానీసే నహానా చాహియే’ అని పాటందుకున్నాడు. ‘చలితో నీవు చెలితో నేను చేసే అల్లరులూ’ అని మన తెలుగు కవి వంత కలిశాడు. ఏం పాడుకున్నా ఇవ్వడంలో ఆనందం తెలిపే కాలం ఇది. ఉన్ని వస్త్రాలే ఎందుకు? స్నేహమయమైన వెచ్చని కౌగిలి కూడా ఈ చలికి ఒక ధన్యతను ఇస్తుంది. - సాక్షి ఫ్యామిలీ ఆ నీళ్లు మృత్యు శీతలంగా ఉన్నాయి. కెరటాలు ఎనిమిది అడుగుల ఎత్తు వరకు ఎగిసి పడుతూ ఓడతో తలపడుతూ ఉన్నాయి. సాయంత్రానికి సముద్రం సద్దుమణిగింది. అతి శీతల గాలులు వీయడం మొదలుపెట్టాయి. -
ఆ విషయంలో ఎప్పుడూ అవమానాలే!
కేట్ విన్స్లెట్ పేరు చె బితే ఎవరికైనా గుర్తొచ్చే సినిమా ‘టైటానిక్’. అప్పట్లో కుర్రకారు హృదయాలను మత్తెక్కించిన ఈ భామను చిన్నతనంలో ఎవరూ ఇష్టపడేవారు కాదట. దానికి కారణం పెద్దయ్యాక ఉన్నంత అందంగా కేట్ చిన్నప్పుడు ఉండకపోవడమే. ఇటీవల ఓ సందర్భంలో ఈ బ్యూటీయే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘నా అందం విషయంలో నాకెప్పుడూ అవమానాలు ఎదురయ్యేవి. నా టీనేజ్‌లో నా గురించి కనీసం ఒక్కరు కూడా పాజిటివ్‌గా మాట్లాడిన అనుభవం నాకు లేదు. కొంచెం వయసు పెరిగాక అందంగా తయారయ్యాను. అప్పట్నుంచీ నాకే విసుగు పుట్టేంత అభినందనలు వచ్చాయి. అయితే, ఆ అభినందనలు రాకముందు.. నాలో ఓ పట్టుదల ఉండేది. బాహ్య సౌందర్యం ప్రధానం కాదు.. ప్రతిభే ముఖ్యం అనుకున్నాను. అందుకే, ఏ రంగంలోకి అడుగుపెట్టినా ప్రతిభను నమ్ముకుని పైకి రావాలనుకున్నాను. నా ప్రతిభకు అందం కూడా తోడవ్వడంతో అందరి మెప్పు పొందగలిగాను’’ అన్నారు. -
అదే మ్యాజిక్‌లా పనిచేసింది
హాలీవుడ్లో స్టార్‌గా ఎదగాలనుకుంటే ఆంగ్లం ధారాళంగా వస్తే చాలు అని అంటున్నారు కేట్ విన్స్లెట్. బ్రిటన్ నుంచి వచ్చి, హాలీవుడ్‌లోకి ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన కేట్ ‘టైటానిక్’ అనే ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల హృదయాలను దోచేసుకున్నారు. ఏ భాషా నటులకూ లేని సౌకర్యం ఇంగ్లిషు యాక్టర్స్‌కు ఉందటున్నారామె. ఇప్పటికే హాలీవుడ్‌ను ఏలుతున్న ప్రముఖ నటుల్లో చాలా మంది బ్రిటన్ నుంచి వచ్చి స్థిరపడిన వాళ్లే. ‘‘మొదట్లో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు నా ఇంగ్లీషు ఉచ్చారణ విని నేను అమెరికాకు చెందిన అమ్మాయినేమో అనుకున్నారు. చాలా ట్రైనింగ్ తీసుకుని వచ్చిన అమ్మాయిలా వాళ్లకు కనిపించాను. అదే నా కెరీర్ మీద మ్యాజిక్‌లా పనిచేసింది’’ అని కేట్ చెప్పుకొచ్చారు., -
మా సొంతూరు బూరుగుపల్లి
కొవ్వూరు : జెమిని టెలివిజన్‌లో క్రియేటివ్ డెరైక్టర్‌గా 2003లో చేరిన పాలకొల్లు సమీపంలోని బూరుగుపల్లికి చెందిన నటుడు జెమిని సురేష్‌గా బుల్లి తెరతో పాటు వెండి తెరలో రాణిస్తున్నాడు. కుమారదేవంలో టైటానిక్ షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన సురేష్ విలేకరులతో ముచ్చటించారు. ప్ర : మీ స్వగ్రామం జవాబు : పాలకొల్లు సమీపంలో బూరుగుపల్లి ప్ర : నట ప్రస్థానం ఎలా మొదలైంది జవాబు : 2003లో జెమిని టీవీలో క్రియేటివ్ డెరైక్టర్‌గా చేరి 24 ఫ్రేమ్స్ పేరుతో సుమారు 1,600 మందిని ఇంటర్వ్యూ చేశా. ఇది సౌత్ ఇండియూలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించింది. ప్ర : సినీ రంగ ప్రవేశం జవాబు : 2004లో నటుడు శ్రీహరి ప్రోద్బలంతో శ్రీ మహా లక్ష్మి చిత్రంతో వెండి తెరకు పరిచయమయ్యూ ప్ర : పేరు తెచ్చిన సినిమాలు జవాబు : రెడీ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఆగడు ప్ర : మీ చదువు, కుటుంబ ప్రోత్సాహం జవాబు : ఎంబీఏ చదివాను. అమ్మ సుబ్బలక్ష్మి నన్నెంతగానో ప్రోత్సహించారు ప్ర : మీ లక్ష్యం జవాబు : మంచి నటుడిగా గుర్తింపు పొందాలని ప్ర :ప్రస్తుతం మీరు నటిస్తున్న సినిమాలు జవాబు : సాయిధరమ్ తేజ హీరోగా సుప్రీమ్, బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డిక్టేటర్, కళ్యాణ వైభోగమే, సినిమా హాల్, టైటానిక్ చిత్రాల్లో నటిస్తున్నా. -
అదేంటో.. సంగీతం అబ్బలేదండి
యువ హీరో రాజీవ్ కొవ్వూరు రూరల్ : ప్రముఖ సంగీత దర్శకులు కోటికి కుమారుడను, సాలూరు రాజేశ్వరరావుకు మనుమడను అరుునా తనకు సంగీతం అబ్బలేదని అంటున్నాడు యువ హీరో రాజీవ్. సినీ పరిశ్రమలో ఎవరి భవిష్యత్‌ను వారే తీర్చిదిద్దుకోవాలని చెప్పిన తండ్రి మాటలను స్ఫూర్తిగా తీసుకుని హీరోగా, అతిథి పాత్రలలో నటిస్తున్నాడు రాజీవ్. నోట్‌బుక్ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమై ప్రత్యేకత సాధించుకున్నాడు. కుమారదేవంలో టైటానిక్ చిత్ర షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో ముచ్చటించాడు. ప్ర: మీరు నటన వైపు ఎలా వచ్చారు అదేంటో నాకు సంగీతం అబ్బలేదు. ఇంజినీరింగ్ చదివి అనుకోకుండా హీరో అయ్యూ ప్ర :మీ సినిమాల్లో మీ నాన్నగారి ప్రభావం నీ భవిష్యత్తు నీవే నిర్ణయించుకో అని నాన్న అన్నారు. కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. ప్ర :నటనలో శిక్షణ తీసుకున్నారా విశాఖలో సత్యానంద్ వద్ద మూడు నెలలు శిక్షణ పొందాను. ప్ర :మీరు న టించిన సినిమాలు నోట్‌బుక్, మంచివాడు, ఆకాశమే హద్దు, చిన్ని చిన్ని ఆశ, ఓరి దేవుడాతో పాటు లవ్ యూ బంగారంలో అతిథి పాత్రలో నటించా. ప్రేమంటే సులువు కాదురా విడుదల కావాల్సి ఉంది. టైటానిక్ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ప్ర :మీ లక్ష్యం తాతయ్య, నాన్నకు ఉన్న పేరును నిలబెడుతూ మంచి నటుడిగా రాణించడం. ప్ర :మీ తోబుట్టువుల గురించి అక్క బబితకు వివాహమైంది. తమ్ముడు రోషన్ సంగీత దర్శకుడిగా గాయకుడు, నిర్మలా కాన్వెంట్ చిత్రాలకు పనిచేశాడు. -
ఇండియాలో టైటానిక్ హీరో సీక్రెట్ టూర్
ఎప్పుడు షూటింగ్‌లతో అభిమానులతో బిజీ బిజీగా ఉండే హాలీవుడ్ రొమాంటిక్ అండ్ యాక్షన్ హీరో లియోనార్డో డికాప్రియో భారత్ లో సందడి చేశాడు. వాతావరణ మార్పులపై తెరకెక్కిస్తున్న ఓ డాక్యుమెంటరీ షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చిన డికాప్రియో షూటింగ్ గ్యాప్‌లో తాజ్ మహాల్‌ను సందర్శించాడు. అయితే డికాప్రియో ఇండియా పర్యటన వివరాలను చాలా గోప్యంగా ఉంచారు. శనివారం ఉదయం లియోనార్డో తాజ్‌ను సందర్శించినట్టుగా చెపుతున్నారు. తాజ్ పరిసరాల్లో ఈ హాలీవుడ్ స్టార్ తీసుకున్న సెల్పీ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. లియోనార్డో శనివారం ఉదయం 7గంటల 15 నిమిషాల సమయంలో క్యాప్, బ్లాక్ గాగుల్స్‌తో తాజ్ సందర్శనకు వచ్చాడు. అయితే ముందుగా సమాచారం లేకపోవటం, సెక్యురిటీ పరంగా కూడా ఎలాంటి హడావిడి లేకపోవటంతో చాలా సమయం వరకు అభిమానులను ఆయన్ను గుర్తించలేదు. చాలాసేపటికి లియోనార్డోను గుర్తించిన ఓ అభిమాని ఫోటో తీసే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్న ఆయన సెక్యురిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తాజ్ పరిసరాల్లో ఉల్లాసంగా గడిపిన లియోనార్డో డికాప్రియో తరువాత షూటింగ్ నిమిత్తం ఢిల్లీ వెళ్లిపోయాడు. -
‘టైటానిక్’ బిస్కెట్ రూ.15 లక్షలు
లండన్: ‘టైటానిక్’ బిస్కెట్ వేలంలో 15 వేల పౌండ్లు(రూ.15 లక్షలు) పలికింది. టైటానిక్ ఓడ మంచుకొండను ఢీకొంటున్నప్పుడు తీసిన ఆ కొండ ఫొటో 21వేల పౌండ్లు( రూ.20 లక్షలు)కు అమ్ముడుబోయింది. హెన్రీ అల్డ్రిడ్జ్ అండ్ సన్స్ సంస్థ వీటిని వేలం వేసింది. టైటానిక్ మునిగిన సమయంలో సేకరించిన బాణసంచా, బిస్కెట్లు, లైఫ్బోట్లు లాంటి వన్నీ ఎంతో విలువైనవని పేర్కొంది. వీటిని వేలంలో గ్రీస్‌కు చెందిన సేకర్త దక్కించుకున్నట్లు తెలిపింది. మంచుకొండను తాకినప్పుడు తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫొటో 10 వేల నుంచి 15 వేల పౌండ్లు పలుకుతుందని అంచనా వేయగా 21 వేల పౌండ్లకు కొనుగోలు చేశారన్నారు. ప్రమాద సమయంలో కెప్టెన్ అర్థర్ రోస్ట్రన్.. ధనికులకు బహుమతిగా ఇచ్చిన కప్పును 1.29 లక్షల పౌండ్లకు(రూ. 1.28 కోట్లు ) యూకే సేకర్త దక్కించుకున్నారు. ‘టైటానిక్’కు సంబంధించి ఇప్పటివరకూ నిర్వహించిన వేలాల్లో ఈ కప్పు మూడవ అత్యధిక ధర పలికింది. -
వార్ ఫొటోగ్రాఫర్‌గా!
‘టైటానిక్’ ఫేం కేట్ విన్స్లెట్ ప్రస్తుతం రెండో ప్రపంచ యుద్ధం గురించి తెలుసుకునే పని మీద ఉన్నారు. దానికి కారణం లేకపోలేదు. ఆ యుద్ధం కీలకాంశంగా రూపొందనున్న ఓ చిత్రంలో నటించనున్నారామె. ప్రఖ్యాత మోడల్, ఫొటో జర్నలిస్ట్ ఎలిజబెత్ లీ మిల్లర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ‘వోగ్’ మ్యాగజైన్ తరఫున వార్ ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించారు లీ మిల్లర్.యుద్ధానికి ముందు.. యుద్ధం తర్వాత నెలకొన్న మార్పుల తాలూకు ప్రభావం స్త్రీల పై ఎంత ఉంది? అనే విషయాన్ని కవర్ చేశారామె. అప్పట్లో తన కెమెరాలో ఆమె బంధించిన చిత్రాలు ఓ సెన్సేషన్. లీ మిల్లర్ చనిపోయి 38 ఏళ్లయ్యింది. ఇప్పుడామె జీవితం ఆధారంగా తీయనున్న చిత్రంలో టైటిల్ రోల్‌కు కేట్ విన్స్లెట్ అయితేనే బాగుంటుందని ఈ చిత్రాన్ని నిర్మించనున్న ఆస్ట్రేలియన్ నిర్మాణ సంస్థ హాప్స్కాచ్ ఫ్యూచర్స్ భావించింది. లీ మిల్లర్ తనయుడు ఆంటోని పెన్రోజ్ కూడా తన తల్లి పాత్రకు కేట్ తప్ప వేరే ఎవరూ నప్పరని సదరు నిర్మాణ సంస్థతో అన్నారట. తల్లి జీవితంతో ఆయన రాసిన ‘ది లైవ్స్ ఆఫ్ లీ మిల్లర్’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రదర్శకుణ్ణి ఎంపిక చేసే పని మీద ఉన్నారు. లీ మిల్లర్ చనిపోయేనాటికి కేట్ విన్స్లెట్ రెండేళ్ల చిన్నారి. సో.. ఆమె గురించి కేట్కి పూర్తి అవగాహన ఉండే అవకాశం లేదు. అందుకే, ఆంటోని పెన్రోజ్ రాసిన పుస్తకాన్ని చదువుతున్నారట. అలాగే, లీ మిల్లర్ ఎలా ఉంటారో తెలుసుకోవడానికి ఆమె ఫొటోగ్రాఫ్స్, డైరీలు పరిశీలిస్తున్నారట. -
వారెవ్వా... ప్రపంచంలో ఈ చిత్రాలదే హవా!
ప్రపంచ ప్రేక్షకుల్ని పాదాక్రాంతం చేసుకోవడానికి హాలీవుడ్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందుకే ఎప్పుడూ ఖరీదైన కలలే కంటుంది. వందల, వేల కోట్ల రూపాయలు అలా పోసేసి మరీ హాలీవుడ్ సినిమాలు తీస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే వసూళ్లు కూడా వందల, వేల కోట్లలోనే ఉంటాయి. ఒకదాన్ని మించి ఒకటి వసూళ్ల సునామీ సృష్టిస్తాయి. ఏ రికార్డూ కుదురుగా ఉండదంటే అర్థం చేసుకోండి. హాలీవుడ్లో ఇప్పటివరకూ భారీ వసూళ్లు సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ‘టాప్ టెన్’గా నిలిచిన సినిమాల గురించి స్పెషల్ ఫోకస్. 1. 16వేల కోట్లతో వరల్డ్ నంబర్ వన్ ఫిల్మ్... ‘అవతార్’ ‘టెర్మినేటర్’, ‘టైటానిక్’ లాంటి అద్భుత చిత్రాల దర్శకుడు జేమ్స్ కామరూన్ నుంచి వచ్చిన చిత్రం ‘అవతార్’ (2009). ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అందర్నీ అబ్బురపరిచింది. కామరూన్ కొత్త అవతారాన్నే ఆవిష్కరించారని సాటి ఫిలిం మేకర్లు, ప్రేక్షకులు ముక్తకంఠంతో పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం చేసిన స్పెషల్ ఎఫెక్ట్స్‌లో లోపాలు వెతికినా కనిపించవు. సినిమా చూస్తున్నప్పుడు నిజంగానే మరో ప్రపంచంలో ఉన్న అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగడం ఓ ప్లస్ పాయింట్. ఆరేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం వసూళ్ల రికార్డును ఇప్పటివరకూ వేరే ఏ చిత్రమూ బ్రేక్ చేయలేకపోవడం విశేషం. 278 కోట్ల డాలర్లు (సుమారు 16,680 కోట్ల రూపాయల) వసూళ్లతో ‘నంబర్ వన్’ స్థానంలో నిలిచింది ‘అవతార్’. 2. విషాదాంత ప్రేమకథకు వసూళ్ల మణిహారం ప్రపంచం అంతా మెచ్చుకున్న వెండితెర ప్రేమకావ్యం - ‘టైటానిక్’ (1997). ప్రాంతీయ, భాషా భేదాలు లేకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్న ఈ ప్రేమకథ దర్శకుడు కూడా - జేమ్స్ కామరూనే! ఆయన ఆవిష్కరించిన ఈ ప్రేమకథ అందరి మనసుల్లో ఇవాళ్టికీ చెరగని ముద్రే వేసింది. కథలో టైటానిక్ షిప్ ధ్వంసమవుతుంది. కళ్లెదుటే ప్రియుడు మునిగిపోతాడు. ప్రేయసి ఒంటరిగా మిగిలిపోతుంది. సినిమా పూర్తయ్యాక ఓ రకమైన ఉద్వేగంతో ప్రేక్షకులు బయటికొస్తాడు. అదే ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. ఈ విషాదాంత ప్రేమకథ ప్రపంచం మొత్తం మీద భారీ వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. 218 కోట్ల డాలర్లు (సుమారు 13,080 కోట్ల రూపాయలు) సాధించిందీ చిత్రం. 3. వసూళ్లలో సూపర్ డైనోసార్! బాక్సాఫీస్ వద్ద సత్తా చూపిన మరో అద్భుత దర్శకుడు - స్టీవెన్ స్పీల్బర్గ్. వెండితెరపై ఆయన ఆవిష్కరించిన భారీ డైనోసార్‌ను చూసి, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయారు. ఈ డైనోసార్ చేసే విన్యాసాలను చూడడం కోసం ఆబాలగోపాలం తండోపతండాలుగా థియేటర్లకు వెళ్లారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం నాలుగో భాగం ‘జురాసిక్ వరల్డ్’ (2015)కి కూడా భారీ ఎత్తున ప్రేక్షకాదరణ లభించింది. ఈ సినిమా తాజాగా ప్రపంచం మొత్తం మీద మూడో అతి పెద్ద గ్రాసర్ అయింది. కాలిన్ ట్రెవరో దర్శకత్వంలో క్రిస్ ప్రాట్ నటించిన ఈ లేటెస్ట్ డైనాసార్ ఫిల్మ్ ఇప్పటి దాకా సాధించిన వసూళ్ళే 152 కోట్ల డాలర్లు (సుమారు 9,120 కోట్ల రూపాయలు). అందులో 61.43 కోట్ల డాలర్లు అమెరికాలో వస్తే, ఇతర దేశాలన్నీ కలిపి 90.73 కోట్ల డాలర్లు వసూలైంది. 4. సూపర్ హీరోలకు సూపర్ కలెక్షన్లు సూపర్ హీరో క్యారెక్టర్లను ఇష్టపడనివారుండరు. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి సూపర్ హీరోలు చేసే వీరోచిత పోరాటాలు చూసి, ఆ హీరోల్లో తమను ఊహించుకునే ప్రేక్షకులు కూడా ఉన్నారు. అలా కనెక్ట్ అయ్యే ‘ది ఎవెంజర్స్’ (2012) చిత్రాన్ని తెగ చూశారు. ‘మార్వెల్ కామిక్స్’ బుక్ ఆధారంగా ఈ సినిమా తీశారు. ఈ కామిక్స్‌కి తెరరూపం ఇవ్వడం చాలామందిని థ్రిల్‌కి గురి చేసింది. ఆ థ్రిల్లే వాళ్లని థియేటర్‌కి వచ్చేలా చేసింది. ఫలితంగా ఈ సూపర్ హీరో మూవీ - వసూళ్ల వర్షం కురిపించింది. జాస్ వెడాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 151.9 కోట్ల డాలర్లు (దాదాపు 9114 కోట్ల రూపాయలు) వసూలు చేసి, నాలుగో స్థానం దక్కించుకుంది. 5. యాక్షన్ భేష్... కలెక్షన్స్ శభాష్ హాలీవుడ్లో రూపొందే యాక్షన్ చిత్రాలకు బోల్డంత మంది అభిమానులుంటారు. యాక్షన్ సీక్వెన్సెస్ ఆ స్థాయిలో ఉంటాయి. అందుకే ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ’ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ఆ చిత్రానికి ఏడో సీక్వెల్ అయిన లేటెస్ట్ ఫిల్మ్ ‘ఫ్యూరియస్ 7’ (2015) కూడా వసూళ్ల పరంగా దుమ్ము రేపింది. విలన్లో గ్యాంగ్‌లో ఉండే ఓ అమ్మాయి ఒక నూతన కెమెరా కనిపెడుతుంది. ఆన్ చేయకుండా కూడా రికార్డ్ చేయగల శక్తి దానికి ఉంటుంది. విలన్ గ్యాంగ్ నుంచి బయటికొచ్చి, మంచి మనిషిగా మారుతుందా అమ్మాయి, కానీ, ఆ కెమెరాని తన నుంచి దక్కించుకోవడానికి విలన్ గ్యాంగ్ వెంటపడుతుంది. వారి నుంచి హీరో ఆమెను ఎలా కాపాడాడు? అనేది కథాంశం.జేమ్స్ వాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటి దాకా 151.1 కోట్ల డాలర్లు (సుమారు 9066 కోట్ల రూపాయలు) వసూళ్లు సాధించి, ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానం దక్కించుకుంది. 6. టాక్ ఓకే.. బాక్సాఫీస్ అదుర్స్... ‘ది ఎవెంజర్స్’ (2012)కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘అవెంజర్స్- ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’ (2015). మార్వెల్ కామిక్స్ బుక్ ఆధారంగానే ఈ చిత్రాన్ని కూడా దర్శకుడు జాస్ వెడాన్ రూపొందించారు. ‘ది ఎవెంజర్స్’లో ఉన్నంత ఎగ్జయిటింగ్‌గా యాక్షన్ సీక్వెన్సెస్ లేకపోయినా ఈ సీక్వెల్ కూడా బాగానే ఉందనిపించుకుంది. టాక్ పరంగా ఫరవాలేదనిపించుకున్నప్పటికీ వసూళ్లు బాగానే సాధించింది. దాదాపు 139 కోట్ల డాలర్ల (సుమారు రూ. 8,340 కోట్లు) వసూళ్ళతో బాక్సాఫీస్ వద్ద ఆరో స్థానంలో నిలిచింది. 7. లాస్ట్ హ్యారీ... బెస్ట్ కలక్షన్స్ ‘హ్యారీ పోటర్’ సిరీస్‌లో భాగంగా రూపొందిన చిత్రం ‘హ్యారీ పోటర్ అండ్ ది డెత్లీ హ్యాలోస్’ (2010). ఈ సిరీస్‌లో ఇది ఎనిమిదో చిత్రం. హ్యారీ పోటర్ సిరీస్‌లో ఇదే చివరి చిత్రం కావడం విశేషం. 134 కోట్ల డాలర్ల వసూళ్లతో (సుమారు రూ. 8,040 కోట్ల రూపాయలు) ఈ చిత్రం ఏడో స్థానాన్ని దక్కించుకుంది. 8. అదరగొట్టిన యానిమేషన్ మూవీ యానిమేటెడ్ మ్యూజికల్ ఫ్యాంటసీ మూవీగా రూపొందిన చిత్రం ‘ఫ్రోజెన్’ (2013). పిల్లలతో పాటు పెద్దలను కూడా థ్రిల్‌కు గురి చేసే విధంగా ఉన్న ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదో స్థానం దక్కింది. 127 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 7,620 కోట్లు) వసూళ్లు సాధించిందీ చిత్రం. 9. ఐరన్ మ్యానా... మజాకానా! మార్వెల్ కామిక్స్ బుక్ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఐరన్ మ్యాన్’. ఈ చిత్రానికి అద్భుతమైన ఆదరణ లభించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఐరన్ మ్యాన్ 2’ని కూడా బాగానే చూశారు. ఇక, ‘ఐరన్ మ్యాన్ 3’ (2013) అయితే బంపర్ హిట్. సుమారు 121 కోట్ల డాలర్ల వసూళ్లతో (సుమారు రూ.7,260 కోట్ల రూపాయలు) తొమ్మిదో స్థానంలో నిలిచింది. 10. సైన్స్ ఫిక్షన్ చేసిన మేజిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా రూపొందిన ‘ట్రాన్స్ఫార్మర్స్’కి మూడో సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘టాన్స్‌ఫార్మర్: డార్క్ ఆఫ్ ది మూన్’ (2011). ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. కథ అంత బాగా లేదనే విమర్శ వినిపించింది. కానీ, వసూళ్ల పరంగా అదరగొట్టింది. దాదాపు 112 కోట్ల డాలర్లు (సుమారు రూ. 6,720 కోట్లు) సాధించి ఈ చిత్రం పదో స్థానంలో నిలిచింది. ఇవన్నీ ప్రస్తుతం వసూళ్ళలో టాప్ టెన్ సినిమాలు. ప్రతి శుక్రవారం కొత్త రిలీజ్‌లతో బాక్సాఫీస్ ప్లేసులు మారిపోతుంటాయి కాబట్టి, భవిష్యత్తులో ఈ ‘టాప్ టెన్’ జాబితాను మార్చే సినిమాలు మరిన్ని రావడం ఖాయం. -
విమాన ప్రమాదంలో సంగీత దర్శకుడి మృతి
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు, ఆస్కార్ విజేత జేమ్స్ హోర్నర్ (61) విమాన ప్రమాదంలో మరణించారు. సోమవారం శాంటా బార్బరా వద్ద ఈ ప్రమాదం జరిగింది. సూపర్ హిట్ చిత్రం 'టైటానిక్'కు హోర్నర్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. అవతార్, బ్రేవ్హర్ట్, ఏ బ్యూటిఫుల్ మైండ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు హోర్నర్ సంగీత దర్శకులుగా పనిచేశారు. శాంటా బార్బరాకు 60 మైళ్ల దూరంలో హోర్నర్ ప్రయాణిస్తున్న విమానం కూలినట్టు అధికారులు తెలిపారు. విమానానికి ఆయనే ఫైలట్. హోర్నర్ సొంత అవసరాల కోసం చిన్నపాటి విమానాన్ని కొనుగోలు చేశారు. హోర్నర్ మరణించిన విషయాన్ని ఆయన అసిస్టెంట్ సిల్వియా ధ్రువీకరించారు. ఓ అద్భుతమైన వ్యక్తిని కోల్పోయామని ఫేస్బుక్లో పేర్కొన్నారు. -
ఈ అబ్బాయి అమ్మకూచి!
అమ్మ జ్ఞాపకం సినీరంగంలో ‘అమ్మకూచి’ ముద్ర సాధారణంగా హీరోయిన్లకే ఉంటుంది. అయితే, హాలీవుడ్లో ఓ వెలుగు వెలుగుతున్న ‘టైటానిక్’ హీరో లియొనార్డో డికాప్రియో కూడా అమ్మకూచే. లియొనార్డో బాల్యంలోనే తల్లిదండ్రులు విడిపోయారు. అతడి బాల్యంలో ఎక్కువ కాలం జర్మనీలోని తల్లి పుట్టింట్లోనే గడిచింది. ఐదుసార్లు ఆస్కార్, రెండుసార్లు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు సాధించిన డికాప్రియో, తన తల్లి కారణంగానే ఇన్ని విజయాలు సాధించగలిగానని చెప్పుకుంటాడు. పన్నెండో ఏటనే తాను నటుణ్ణవుతానని చెప్పడంతో తల్లి ఇర్మెలిన్ అతడికి అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేది. బాలనటుడిగా టీవీ సీరియల్స్‌లో నటించిన డికాప్రియో, క్రమంగా హాలీవుడ్లో అడుగుపెట్టాడు. ‘టైటానిక్’ ఘనవిజయం తర్వాత పూర్తిగా అతడి దశ తిరిగిన సంగతి తెలిసిందే. -
టైటానిక్‌ను... తెలుగులో నిర్మించి ఉంటే!
హాస్యం టైటిల్‌ను ‘టైటానిక్’ అని కాకుండా ‘టైటానికా మజాకా!’ అని పెట్టేవాళ్లు ‘టైటానికా మజాకా’ అనే పేరుతో రెండు సంవత్సరాల క్రితమే తాను ఫిలిం ఛాంబర్లో టైటిల్‌ను రిజిస్టర్ చేయించానని, తన టైటిల్‌ను తస్కరించడం అక్రమమని వర్ధమాన నిర్మాత సుబ్బారావు ప్రెస్ మీట్లో మండి పడేవాడు. దీంతో సినిమా టైటిల్‌ను ‘టిక్ టిక్ టిక్... టైటానిక్’(ట్యాగ్‌లైన్: ఎప్పుడు మునుగుతుందో ఎవడికీ తెలియదు) అని మార్చేవారు షూటింగ్ మొత్తం హుసేన్సాగర్ జలాల్లో జరుగుతుంది హీరోహీరోయిన్లతో సాగర్‌లోని ‘రాక్ ఆఫ్ జిబ్రాల్టర్’ దగ్గర డ్యూయెట్ చిత్రించేవారు హుసేన్సాగర్ జలాల్లో టైటానిక్ మునిగిపోగానే... హీరో ముందుగా హీరోయిన్ను రక్షించేవాడు. ఆ తరువాత... బుద్ధ్ద విగ్రహం దగ్గర నిల్చొని తన చొక్కా మీద ఉన్న ‘టై’ని ప్యాంట్‌కు కట్టుకున్న ‘బెల్ట్’ను కలిపి కట్టి దాన్ని టైటానిక్షిప్కు కట్టి, జలాల్లో మునిగిపోతున్న షిప్‌ను పైకిలాగుతాడు. అందరినీ రక్షిస్తాడు. శుభం కార్డు పడుతుంది తమ అప్పు క్లియర్ చేసేవరకు సినిమాను విడుదల చేయవద్దని ఫైనాన్షియర్స్ కోర్టులో దావా వేస్తారు. దీంతో సినిమా విడుదల ఆగిపోతుంది సినిమా విడుదలయ్యే మార్గం లేక నిర్మాత హుసేన్‌సాగర్‌లోకి జంప్ చేస్తాడు. -
కాలం వెంట కరిగిపోని విషాద ప్రేమకథ
అందుకే... అంత బాగుంది : శ్రీను వైట్ల టైటానిక్ (1997) తారాగణం - లియొనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్, బిల్లీ జేన్; ఛాయాగ్రహణం - రస్సెల్ కార్పెంటర్; రచన, నిర్మాణం, దర్శకత్వం - జేమ్స్ కామెరూన్; నిడివి - 194 నిమిషాలు; విడుదల - 1997 డిసెంబర్ 19; నిర్మాణ వ్యయం - 20 కోట్ల డాలర్లు (ఇప్పటి లెక్కలో దాదాపు రూ. 1200 కోట్లు); బాక్సాఫీస్ వసూళ్ళు - 218. 7 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 13,122 కోట్లు) అప్పటికి నేను డెరైక్టర్ని కాలేదు. డెరైక్షన్ కోసం ప్రయత్నాల్లో ఉన్నాను. ఆ రోజు - సికింద్రాబాద్‌లోని సంగీత్ థియేటర్లో ఫస్ట్ షో సినిమాకెళ్లా. అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం. ఓ ఇంగ్లీషు సినిమాకి అంత మంది జనాన్ని చూడడం అదే మొదటిసారి. సినిమా స్టార్ట్ అయ్యింది. ఇక అక్కణ్ణుంచీ నాలో నేను లేను. మనసు టైటానిక్ షిప్ ఎక్కేసింది. ఆ షిప్లో ఉన్న వందల మంది జనంలో నేనూ ఒకణ్ణి అన్నట్టుగా ఉంది. ఆ 194 నిమిషాలూ ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోయాన్నేను. ‘టైటానిక్’... ఈ పేరు తలుచు కుంటేనే ఏదో పులకింత. ఇప్పటి వరకూ బోలెడన్ని హాలీవుడ్ సినిమాలు చూసి ఉంటా. కానీ, నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఏదంటే తడుముకోకుండా చెప్పే పేరు.. ‘టైటానిక్’ (1997). మామూలుగా హాలీవుడ్ సినిమాలకు సంబంధించి హీరో హీరోయిన్లూ, డెరైక్టర్ పేర్లు మాత్రమే గుర్తుంటాయి. కానీ, ఈ సినిమాకు పనిచేసిన అందరు టెక్నీషియన్ల పేర్లు దాదాపుగా నాకు గుర్తున్నాయి. ముఖ్యంగా హీరో లియోనార్డో డికాప్రియో, హీరోయిన్ కేట్ విన్స్లెట్, డెరైక్టర్ జేమ్స్ కామరూన్ పేర్లు అయితే మనం ఎప్పటికీ మరిచిపోలేం. అంతలా వాళ్లు మనతో కనెక్ట్ అయిపోయారు. ఇవాళ్టికీ ఎప్పుడైనా రీచార్జ్ కావాలనుకున్నప్పుడు నేను చూసే సినిమా ఇదే. నేను ఎక్కువసార్లు చూసిన సినిమా ఇదే. టైటానిక్ అనగానే మనకు చరిత్ర పరంగా షిప్ సముద్రంలో మునిగి పోయి, వందల మంది చనిపోయిన ఉదంతం గుర్తుకొస్తుంది. ఆ విషాద దుర్ఘటనకు ఒక అందమైన ప్రేమకథను జోడించడం దర్శకుడి సృజనకు పరాకాష్ఠ. ఆ కథ అందరి హృదయాలను హత్తుకుంది. జాక్ ఒక పేదింటి అబ్బాయి. లాటరీలో రెండు టికెట్లు గెల్చుకుని టైటానిక్ షిప్లో థర్డ్ క్లాస్‌లో ప్రయాణం చేసే అవకాశం దక్కించు కుంటాడు. స్నేహితు నితో సహా ఎంతో హుషారుగా ఆ భారీ ఓడలోకి అడుగు పెడతాడు. అదే ఓడలో ప్రయాణం చేస్తున్న అందాల సుందరి రోజ్ అతని కంటపడుతుంది. ఇద్దరి మనసులూ కలుస్తాయి. రోజ్కి కాబోయే భర్త ఇది గ్రహించేసి జాక్‌ని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అతని కళ్లుగప్పి జాక్, రోజ్ ప్రేమించుకుంటుంటారు. కానీ, విధి విచిత్రమైనది. ఆ ఓడ ఓ బలమైన రాయిని ఢీ కొంటుంది. ఓడ మునిగిపోవడం ఖాయం. వీలైనంతమందిని కాపాడే ప్రయత్నంలో సిబ్బంది ఉంటారు. ఈ ఓడ ప్రమాదంలో జాక్ మునిగిపోతాడు. రోజ్ బతుకుతుంది. ఇదీ కథ. ప్రపంచ చరిత్రలోనే అత్యంత విషాదమైన టైటానిక్ ప్రమాదానికి, ఇలా ఇద్దరు యువ ప్రేమికుల గాఢమైన ప్రేమను ముడిపెట్టి, మునుపెన్నడూ చూడని స్పెషల్ ఎఫెక్ట్‌లతో సినిమాను ఉద్విగ్నభరితంగా తీయడం కామెరూన్‌కే చెల్లింది. ఈ సినిమా సాంకేతికంగా ఎంత అద్భుతంగా ఉంటుందో, ప్రేక్షకుల్ని ఆ పాత్రలు, సన్నివేశాల్లో లీనం చేసి, భావోద్విగ్నభరిత అనుభవంలో ముంచెత్తడంలో అంతకన్నా అద్భుతంగా ఉంటుంది. ఒక క్యారెక్టర్ పాయింటాఫ్ వ్యూలో సినిమాను చూపించడం గొప్ప థాట్. సర్వసాధారణంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టే సినిమాల్లోనూ విమర్శకులు ఏవో తప్పులు చెబుతుంటారు. కానీ, ఈ సినిమాను విమర్శకులు కూడా మెచ్చారు. ఆస్కార్ పురస్కారాల్లో 14 నామినేషన్స్ సాధించిన ఘనత ఈ సినిమాకే దక్కుతుంది. 1950లో ‘ఆల్ ఎబౌట్ ఈవ్’ సినిమాకు కూడా 14 నామినేషన్లు వచ్చాయి. మొత్తానికి ‘టైటానిక్’ చిత్రం ఏకంగా 11 ఆస్కార్లు గెలుచుకుంది. ఒక హాలీవుడ్ సినిమాకు ఇన్ని ఆస్కార్లు రావడమనేది అంతకు ముందు ‘బెన్హర్’ (1959) విషయంలో జరిగింది. వసూళ్ల పరంగా బిలియన్ డాలర్ల మార్కు దాటిన తొలి సినిమా కూడా ఇదే. దర్శకుడు జేమ్స్ కామెరూన్‌కు ఈ సినిమాపై మక్కువ తీరక, ఓడ ప్రమాదం జరిగి వందేళ్ళవుతున్న వేళ ‘టైటానిక్ -3డి’ వెర్షన్‌ను 2012 ఏప్రిల్ 4న విడుదల చేశారు. అది కూడా పెద్ద హిట్టే. అదనంగా 343.6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది ఈ త్రీడీ వెర్షన్. అనేక సినిమాలు వాణిజ్య విజయం సాధిస్తాయి. కానీ, కొన్ని సినిమాలే బాక్సాఫీస్ బద్దలు కొట్టడంతో పాటు చిరకాలం ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. అలాంటి అరుదైన హాలీవుడ్ ఆణిముత్యం - ‘టైటానిక్’. ఈ సినిమా చూస్తుంటే, అప్రయత్నంగా మీకు కన్నీళ్ళొస్తాయి. దూరమైన ఆ ప్రేమ జంటను చూస్తుంటే, గుండె పిండేసినట్లవుతుంది. వెరసి, సినిమా చూసిన అనుభవం నుంచి తొందరగా తేరుకోలేరు. పెపైచ్చు, వీలున్నప్పుడల్లా ఆ కథను మళ్ళీ మళ్ళీ మీకు కావాల్సినవాళ్ళతో కలసి తెరపై చూడాలనిపిస్తుంది. అందుకే, ‘టైటానిక్’ నాకు ఇష్టమైన ఆధునిక హాలీవుడ్ కళాఖండం. సెల్యులాయిడ్ సైంటిస్ట్ ఇవాళ్టి తరానికి జేమ్స్ కామెరూన్ పేరు చెప్పగానే సంచలనాత్మక సైన్స్-ఫిక్షన్ చిత్రం ‘అవతార్’ (2009) గుర్తుకొస్తుంది. కానీ, సినీ రచయిత, దర్శకుడు, నిర్మాత జేమ్స్ ఫ్రాన్సిస్ కామెరూన్ గడచిన మూడున్నర దశాబ్దాల కాలంలో హాలీవుడ్ తెరపై సృష్టించిన అద్భుతం అదొక్కటే కాదు. బాక్సాఫీస్ చరిత్రలో అతి పెద్ద హిట్లుగా ఇప్పటికీ చెప్పుకొనే - సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘టెర్మినేటర్ (1984), విషాదాంత ప్రేమకథ ‘టైటానిక్’ (’97) ఆయన సృష్టే. ‘ఎలియెన్స్’ (’86), ‘ది ఎబిస్’ (’89), ‘ట్రూ లైస్’ (’94) ఆయన అందించినవే. సినిమాలతో పాటు డాక్యుమెంటరీల రూపకల్పనలోనూ కామెరూన్‌ది ప్రత్యేక ముద్ర. నీటి లోపల దృశ్యాలను చిత్రీకరించడం లాంటి విషయాల్లో ఎంతో నైపుణ్యం సంపాదించిన ఆయనకు ‘డిజిటల్ 3డి ఫ్యూజన్ కెమేరా సిస్టమ్’ రూపకల్పనలోనూ భాగం ఉంది. ఇవన్నీ చూసే ఆయనను కొందరు ‘సగం సైంటిస్ట్, సగం ఆర్టిస్ట్’గా పేర్కొంటూ ఉంటారు. కామెరూన్ దర్శకత్వ శైలి హాలీవుడ్‌తో సహా పలువురు చిత్ర దర్శకులపై గణనీయమైన ప్రభావం చూపింది. టైటానిక్ అణువణువూ ఆసక్తికరమే! ఈ చిత్రానికి ముందుగా ‘ప్లానెట్ ఐస్’ అని పేరు పెడదామను కున్నారట! కానీ, చివరకు ‘టైటానిక్’ ఓడ పేరునే సినిమాకూ పెట్టారు వాస్తవికతకు ఎంత ప్రాధాన్యమిచ్చారంటే... టైటానిక్ ఓడను నిజంగా నిర్మించిన ‘వైట్ స్టార్ లైన్’ కంపెనీ మీద పరిశోధనలు చేసిన వారి పర్యవేక్షణలోనే ఈ సినిమా కోసం ఓడనూ, దాని లోపలి హంగూ ఆర్భాటాలనూ తీర్చిదిద్దారు సినిమాలో కథానాయక పాత్ర జాక్ (నటుడు లియొనార్డో డికాప్రియో), కథానాయిక రోజ్ (నటి కేట్ విన్స్లెట్) రేఖాచిత్రాలను గీస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ, ఆ బొమ్మలు గీస్తున్నట్లు సినిమాలో కనిపించేవి హీరోవి కావు - దర్శకుడు కామెరూన్వి. ఆయనే ఆ స్కెచ్బుక్లోని బొమ్మలన్నీ గీశారు ఈ సినిమా కోసం అత్యంత భారీ ఓడ సెట్‌ను వేశారు. ఆ సెట్ మొత్తాన్నీ హైడ్రాలిక్ జాక్స్ మీద ఉంచారు. ఓడ మునిగిపోతూ, ఒరిగిపోతున్న దృశ్యాలు తీసేందుకు వీలుగా దాదాపు 6 డిగ్రీల మేర సెట్టింగ్ మొత్తం పక్కకు ఒరిగేలా అలా సౌకర్యం ఉంచుకున్నారు గ్రాండ్ స్టెయిర్‌కేస్ రూమ్‌లోకి నీళ్ళు చొచ్చుకువచ్చే సీన్‌ను పక్కాగా ప్లాన్ చేశారు. ఎందుకంటే, ఆ నీళ్ళలో మొత్తం సెట్, ఫర్నిషింగ్‌లు పాడైపోతాయి కాబట్టి, ఒకే ఒక్క షాట్లో అనుకొన్న ఎఫెక్ట్ వచ్చేలా చిత్రీకరించాల్సి వచ్చింది డిజిటల్ ప్రదర్శన ఇంకా రాని ఆ రోజుల్లో ఈ సినిమా ఎంత బ్రహ్మాండంగా, ఎన్నేసి రోజులు, ఎన్నేసి ప్రదర్శనలు ఆడిందంటే, ప్రొజెక్టర్‌లో వేసీ వేసీ, రీళ్ళు గీతలు పడిపోవడంతో సినిమా పంపిణీదారులైన ‘పారామౌంట్’ వాళ్ళు కొత్త కాపీలను పంపాల్సి వచ్చిందట! ఒక పక్కన థియేటర్లలో బ్రహ్మాండంగా ఆడుతున్న రోజుల్లోనే జనం డిమాండ్ మేరకు ‘టైటానిక్’ చిత్రం వీడియోగా కూడా విడుదలైపోయింది. అప్పట్లో అలా జరిగిన తొలి చిత్రం అదే! -
ఏ సలహా ఇవ్వకపోవడం కూడా... సలహానే!
తొలి పరిచయం కెమెరా ముందు తొలిసారిగా నిల్చోవడానికి, తొలి సన్నివేశంలో నటించడానికి ఇబ్బంది పడలేదు. భయపడలేదు. కారణం ఏమిటంటే, గతంలో నేను చాలా వాణిజ్య ప్రకటనల్లో నటించాను. నేను షిల్లాంగ్‌లో పుట్టి పెరిగాను. అక్కడ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అలా నేను ఇంగ్లిష్ సినిమాలు చూస్తూ పెరిగాను. ‘టైటానిక్’ ‘ప్రెట్టీ ఉమన్’ నా అభిమాన చిత్రాలు. నేను చూసిన తొలి హిందీ సినిమా ‘కుఛ్ కుఛ్ హోతా హై’. పోటీకి భయపడేవాళ్లు ఆటలో దిగవద్దు. దిగితే భయపడవద్దు. సినీ పరిశ్రమలోనే కాదు ప్రతిచోటా పోటీ ఉంది. ‘ఇతరులు ఏం చేస్తున్నారు?’ అనేదాని కంటే ‘నేనేం చేస్తున్నాను’ అనేదానిపైనే ఎక్కువ దృష్టి పెడతాను. షిల్లాంగ్ నేపథ్యం, సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తొలి చిత్రం విజయం సాధించడం, నాకు గుర్తింపు రావడం... నావరకైతే అతిపెద్ద విజయాలు. ఈ సంతృప్తి చాలు. కెరీర్ మొదట్లో లభించే ప్రశంసలు జీవితకాలం గుర్తుండి పోతాయి. ‘సిటీ లైట్స్’ ప్రదర్శన తరువాత నటి అలియాభట్ నన్ను కౌగిలించుకొని చాలాసేపు మెచ్చుకోలుగా మాట్లాడింది. నాకు స్ఫూర్తి కలిగించిన నటి విద్యాబాలన్ కూడా నన్ను మెచ్చుకున్నారు. షబానా ఆజ్మీ కూడా. ఈ ప్రశంసలతో సంతోషం కంటే ‘బాధ్యత’ ఎక్కువ పెరిగింది. ‘కొత్తనటిని కదా. ఏదైనా సలహా చెప్పండి’ అని ఒక నటుడిని అడిగితే ‘ఏ సలహా ఇవ్వక పోవడం కూడా సలహానే’ అన్నారు నవ్వుతూ. అంతేనేమో! - పత్రలేఖ, హీరోయిన్ (సిటీలైట్స్ ఫేమ్) -
హాలీవుడ్ అందగాడు దుబారాకు నో చెప్పాడు
సంపాదించడం కన్నా దాన్ని కాపాడుకోవడమే కష్టం. మరి కోట్ల కొద్దీ ఆస్తులున్న సెలబ్రిటీలు, కార్పొరేట్లు.. సరదాల కోసం విచ్చల విడిగా ఖర్చు చేసేస్తుంటారా? పొదుపు మంత్రం పఠిస్తుంటారా? అందరూ విజయ్ మాల్యాల్లా ఉంటారా... లేక అజీమ్ ప్రేమ్‌జీని అనుసరిస్తారా?వారి మనీ మేనేజిమెంట్ ఎలా ఉంటుంది? హాలీవుడ్ స్టార్, టైటానిక్ సినిమా ఫేం.. లియొనార్డో డి కాప్రియో తన మనీని ఎలా మేనేజ్ చేస్తారు? ఆయన ఖర్చులెలా ఉంటాయి? దేన్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు? రంగ స్థలం నుంచి సినిమాల్లోకి వచ్చిన డికాప్రియో ఆస్తి ప్రస్తుతం దాదాపు రూ.1200 కోట్లు. ఇక తన మనీ మేనేజ్మెంట్ గురించి ఆయనేమంటారంటే... ‘చిన్నతనంలో అడ్వర్టైజ్మెంట్లు, టీవీ సీరియల్స్ చేశా. కాస్త పెద్దయ్యాక కొన్ని చిన్నా, చితకా సినిమాలు చేసినా, టైటానిక్తోనే నాకు స్టార్డమ్, ఆఫర్లు, సంపద అన్నీ వచ్చాయి. డబ్బొస్తోంది కదాని మనీ మేనేజ్మెంట్ విషయంలో ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు. చేయను కూడా. నేను భారీ ఖర్చుల జోలికెళ్లను. ప్రైవేట్ జెట్లలో తిరగను. నా దగ్గర ఇప్పటికీ ఒకే ఒక్క కారు(టయోటా ప్రియస్) ఉంది. డబ్బు నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే.. డబ్బుంటే నచ్చిన పాత్రల్ని మాత్రమే ఎంచుకునే స్థైర్యం ఉంటుంది. అంతేకాదు... మరింత డబ్బు సంపాదిస్తే.. ఏదో రోజు మరింత మంది ప్రజలకు, పిల్లలకు మరింత మేలు చేసే అవకాశం వస్తుంది. అందుకే నేను పెద్దగా ఖర్చు చేయను. పెట్టుబడుల విషయానికొస్తే... షేర్ మార్కెట్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటాను. రియల్ ఎస్టేట్‌లో బాగానే ఇన్వెస్ట్ చేశా. అలాగే మొబిల్ అనే ఇంటర్నెట్ స్టార్టప్ కంపెనీలోను, హైబ్రిడ్ కార్లు తయారు చేసే ఫిస్కర్ ఆటోమోటివ్ కంపెనీలోనూ ఇన్వెస్ట్ చేశాను. ఆర్థిక భద్రత ఉంది కాబట్టి ధైర్యంగా సినిమాలనూ ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ మధ్యే విడుదలైన ‘ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్’కు సహనిర్మాతగా ఉన్నా. నా వరకు నేను పర్యావరణానికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ఇంటికి సౌర విద్యుత్ అమర్చాను. ఇలాంటి పొదుపు చర్యలు పాటిస్తూనే.. సాధ్యమైనంత వరకూ వన్యప్రాణుల సంరక్షణ వంటి సేవా కార్యక్రమాల కోసం విరాళాలు ఇస్తుంటాను.’ -
కేట్ అంటే నాకెంతో ప్రేమ: డికాప్రియో
తనకు బాగా నచ్చిన అమ్మాయి ఎవరంటే.. టైటానిక్ సినిమాలో తన సరసన నటించిన కేట్ విన్స్లెటే అంటున్నాడు ఆ సినిమా హీరో లియొనార్డో డికాప్రియో. వీరిద్దరి జంట వెండితెరపై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. టైటానిక్ సినిమాలో వీళ్లిద్దరి రొమాంటిక్ డ్రామా బాగా పండటంతో.. ఆ చిత్రానికి కాసుల వర్షం కురిసింది. విన్స్లెట్ చాలా అద్భుతమైన నటి కావడంతో పాటు చాలా గొప్ప వ్యక్తిత్వం గలదని, చాలా నిజాయితీపరురాలని, ఆమె అంటే తనకెంతో ఇష్టమని డికాప్రియో చెప్పాడు. ఆమెకు ఇటీవలే అమ్మాయి పుట్టిందని, ఆమెతో ప్రేమలో కేట్ తలమునకలుగా ఉందని తెలిపాడు. 2008లో వచ్చిన 'రెవల్యూషనరీ రోడ్' చిత్రంలో కూడా డికాప్రియో-విన్స్లెట్ జంట నటించింది. ఇక నెడ్ రాక్ఎన్రోల్ను పెళ్లి చేసుకున్న ఏడాదికే విన్స్లెట్కు మూడో సంతానం కలిగింది. ఇంతకు ముందే ఆమెకు రెండు పెళ్లిళ్లయ్యాయి. -
జేమ్స్ కామరూన్ 3 అవతార్లు
‘ది టెర్మినేటర్’, ‘టైటానిక్’, ‘అవతార్’లాంటి అద్భుతమైన చిత్రాల ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించిన జేమ్స్ కామరూన్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా మూడేళ్ల పాటు సినీ ప్రియులకు మంచి అనుభూతినివ్వడం కోసం ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన ‘అవతార్’కి మూడు సీక్వెల్స్ రూపొందించనున్నారాయన. 2016లో ఒకటి, 2017లో మరొకటి, 2018లో మరో సీక్వెల్‌ను విడుదల చేయాలనుకుంటున్నారు. డిసెంబర్ నెలలోనే ఈ చిత్రాలు విడుదలవుతాయి. కాగా, ఈ మూడు చిత్రాలను న్యూజిలాండ్‌లోనే తీయాలనుకుంటున్నారు. ఎందుకంటే, తొలి భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించినప్పుడు కామరూన్‌కి మంచి అనుభూతి లభించిందట. అందుకని, మూడు సీక్వెల్స్‌ని అక్కడే షూట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాల షూటింగ్ తమ దేశంలో జరగడం గౌరవప్రదంగా భావిస్తున్న న్యూజిలాండ్ ప్రభుత్వం వీలైనన్ని సౌకర్యాలు సమకూర్చాలనుకుంటోంది. అలాగే, లొకేషన్స్‌ని కూడా తక్కువ ధరకే ఇవ్వనున్నారట. ఇదిలా ఉంటే... పండోరా గ్రహం నేపథ్యంలో తొలి భాగం సాగుతుంది. కాగా, ఈ సీక్వెల్స్‌లో ఆ గ్రహంలో గల సముద్ర జలాల అందాలను ఆవిష్కరించాలనుకుంటున్నారట కామరూన్. నీటి లోపలి సన్నివేశాలను కనీవినీ ఎరుగని రీతిలో చిత్రీకరించాలనుకుంటున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారాయన. సాంకేతికంగా ‘అవతార్’ని మించే స్థాయిలో ఈ సీక్వెల్స్ ఉంటాయని ఆయన తెలిపారు. ‘అవతార్’ని నిర్మించిన లైట్‌స్టామ్ ఎంటర్టైన్మెంట్, ట్వంటీయత్ సెంచురీ ఫాక్స్ సంస్థలు ఈ సీక్వెల్స్‌ని నిర్మించనున్నాయి. -
‘అవతార్’కి మరో మూడు సీక్వెల్స్
వరల్డ్ ఫేమస్ డెరైక్టర్ జేమ్స్ కేమరూన్ సినిమా అంటేనే ఓ అద్భుతం. ఆయన ప్రతి సినిమా ఓ క్లాసిక్కే. ‘టైటానిక్’ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే ఇతర చిత్రాలు టెర్మినేటర్, ఏలియన్స్, లేటెస్ట్ ‘అవతార్’ కూడా సెన్సేషనల్ మూవీసే. ప్రస్తుతం ఈ సంచలనాత్మక దర్శకుడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘అవతార్’కి సీక్వెల్స్ రూపొందించాలన్నదే ఆ నిర్ణయం. అవతార్ 2, 3, 4 చిత్రాలను ప్రేక్షకులకు అందించే పనిలో ఉన్నారాయన. 2016లో ఒకటి, 2017లో మరొకటి, 2018లో మరో సీక్వెల్ రానున్నాయట. ‘అవతార్’ ఓ అద్భుతం అయితే, దాన్ని మించేలా ఈ సీక్వెల్స్ ఉండాలనే పట్టుదలతో ఉన్నారట కేమరూన్. ఉన్నత సాంకేతిక విలువలతో, ఊహకందని మలుపులతో ఈ సీక్వెల్స్ ఉంటాయని కేమరూన్ పేర్కొన్నారు. ‘అవతార్’ చిత్రం క్లయిమాక్స్ వరకు ఏయే పాత్రలు బతికి ఉన్నాయో ఈ కొనసాగింపు చిత్రాల్లో ఆ పాత్రలన్నీ ఉంటాయట. మూడేళ్ల క్రితం విడుదలైన ‘అవతార్’ని ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేదు. ఈలోపు ఈ సీక్వెల్స్ ప్రకటన కామరూన్ సినిమాల అభిమానులను ఆనందానికి గురి చేస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.