
‘టైటానిక్’ ఉదంతం చరిత్ర పుటల్లో ఓ దుర్ఘటన. 1912 నవంబర్ 14న అట్లాంటిక్ మహాసముద్రంలో మంచుకొండను ఢీ కొట్టి, మునిగి.. వందల మందిని జలసమాధి చేసిన ఓ విషాదం. 73 ఏళ్ల తర్వాత కెనడాలోని న్యూఫౌండ్ ల్యాండ్‌కు 740 కి.మీ. దూరంలో సముద్ర మట్టానికి 4 వేల మీటర్ల లోతున 2 ముక్కలైన టైటానిక్ అవశేషాలను గుర్తించిన విషయం తెలిసిందే.
109 ఏళ్లు దాటినా ఆ ఓడ అవశేషాలు నేటికీ నీళ్లల్లో పదిలంగానే ఉన్నాయి. అయితే మరికొన్ని ఏళ్లల్లో ఆ ఛాన్స్ కూడా ఉండదట. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఒకరకమైన బ్యాక్టీరియా టైటానిక్ అవశేషాలను వేగంగా తినేస్తోందట.. ‘మరో 12 ఏళ్ల తర్వాత టైటానిక్ అని చెప్పుకోవడానికి నీళ్లల్లో ఒక్క ముక్క కూడా మిగలద’ని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటివరకూ ‘ఆర్‌ఎంఎస్ టైటానిక్ సంస్థ’ పలు పరిశోధక యాత్రలు చేపట్టి.. దాదాపు 5 వేలకు పైగా.. వెండి పాత్రలు, బంగారు నాణాలు వంటివెన్నో టైటానిక్ శిథిలాల నుంచి బయటకు తీసింది. ఆనాడు ఈ ప్రమాదం నుంచి ఏడు వందల మంది ప్రాణాలతో బయటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment