sink
-
South Atlantic: మత్స్యకారుల పడవ మునక.. ఆరుగురు మృతి
దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రమాదం సంభవించింది. మత్స్యకారుల పడవ మునిగిపోవడంతో ఆరుగురు మృతిచెందగా, ఏడుగురు గల్లంతయ్యారు. ఫాక్లాండ్ దీవుల తీరానికి 200 మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 27 మంది ఉన్నారని, వారంతా చేపలు పట్టేందుకు వెళ్తున్నారని బ్రిటిష్, స్పానిష్ అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన పడవ పేరు అర్గోస్ జార్జియా అని, ఇది దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిందని స్పెయిన్ అధికారులు తెలిపారు. ప్రమాదం బారినుంచి 14 మందిని రక్షించి, లైఫ్బోట్లో ఎక్కించారని తెలిపారు. చేపల వేటకు వెళ్లినవారిలో స్పెయిన్ దేశానికి చెందినవారితో పాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారని సమాచారం. -
టర్కీ భూకంపం.. రెండుగా చీలిన గ్రామం..13 అడుగులు కుంగిన ఇళ్లు
ఇస్తాన్‌బుల్: టర్కీలో ఫిబ్రవరి 6న సంభవించిన భారీ భూకంపం 11 రాష్ట్రాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇప్పటివరకు 46వేల మందికిపైగా మరణించారు. అయితే ఈ భూకంపం కారణంగా హతాయ్ రాష్ట్రంలోని డెమిర్కోప్రు అనే గ్రామం రెండుగా చీలీపోయిది. భూప్రంకనల ధాటికి భారీ పగుళ్లు వచ్చి ఇక్కడి ఇళ్లు భూమిలోకి 13 అడుగుల మేర కుంగిపోయాయి. ఈ కారణంగా భూకంపం ముందు రోడ్డపక్కన కన్పించిన ఇళ్లు ఇప్పుడు మాయమయ్యాయి. 1000 మంది నివసించే ఈ గ్రామంలో ఇళ్లన్నీ కుంగిపోయాయి. ఎటు చూసినా శిథిలాలు, నేలకూలిన చెట్లు, మురికి నీరే కన్పిస్తోంది. తన ఇల్లు 4 మీటర్ల లోతులోకి కుంగిపోయిందని 42 ఏళ్ల మహిర్ కరటాస్ అనే వ్యక్తి వెల్లడించాడు. ఈ గ్రామంలో తొలినాళ్లలోనే ఈయన ఇల్లు కట్టుకున్నాడు. అదృష్టవశాత్తు గ్రామంలో ఎవరూ చనిపోలేదని, కానీ చాలామందికి గాయాలయ్యాయని వివరించాడు. భూకంపం వచ్చినప్పుడు ఈ గ్రామంలోని ప్రజలు ఇళ్ల కిటికీల నుంచి బయటకు దూకేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో పరుగులు తీసి సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు. భూప్రకంపనల వల్ల ఈ గ్రామంలోని ఓ పశువుల కొట్టం కూడా కుంగిపోయింది. దాని మధ్యలో చీలికలు వచ్చాయి. దీంతో ఓ ఆవు అందులోనే కూరుకుపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చదవండి: లీటర్ పాలు రూ.250, కేజీ చికెన్ రూ.780.. పాకిస్తాన్ దివాళా తీసిందని ఒప్పుకున్న మంత్రి.. -
రోడ్డు మధ్యలో...హఠాత్తుగా గొయ్యి! అటుగా వచ్చిన బైకర్..
సాక్షి, శివాజీనగర: బెంగళూరులో గుంతల రహదారులతో సతమతమవుతున్న నగరవాసులకు సింక్ హోల్ తరహా ముప్పు ఎదురైంది. ఆకస్మాత్తుగా రోడ్డు మధ్య భాగంలో నేల కుంగిపోగా, ఆ గుంతలోకి బైకిస్టు పడిపోయి గాయపడిన ఉదంతం గురువారం మధ్యాహ్నం సంభవించింది. గత మంగళవారం మెట్రో పిల్లర్ కడ్డీలు కూలిపడి తల్లీ కొడుకు మృతి చెందిన దుర్ఘటన మరువక ముందే ఈ తరహా సంఘటన కలకలం రేపుతోంది. ఏం జరిగిందంటే అశోకనగర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వ్యాప్తిలో జాన్సన్ మార్కెట్ రోడ్డులో రోజులాగానే వాహనాలు వెళ్తుండగా రోడ్డు హఠాత్తుగా కుంగిపోయి 3 అడుగుల వ్యాసం, 3 మీటర్ల లోతుతో గొయ్యి ఏర్పడింది. వేగంగా వెళ్తున్న ఒక బైకిస్టు అదుపుతప్పి పడిపోవడంతో గాయాలు తగిలాయి. అతనిని ఆస్పత్రికి తరలించారు. నడి రోడ్డులో ఏర్పడిన ఈ సింక్ హోల్ అందరికీ ఆందోళన కలిగించింది. సమాచారం అందుకొన్న తూర్పు విభాగపు డీసీపీ కళా కృష్ణమూర్తి స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సంఘటనతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ఈ రోడ్డు మొత్తాన్ని మూసివేసి ట్రాఫిక్‌ను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. భూగర్భంలో మెట్రో రైల్ సొరంగ మార్గం పనుల వల్ల పైన రోడ్డు ఇలా కుంగిపోయిందని అనుమానం ఉంది. (చదవండి: వీడిన మిస్టరీ.. కూతురు వల్లే ఇలా జరిగిందా?) -
మునిగిన యుద్ధ నౌక.. 31 మంది గల్లంతు..
బ్యాంకాక్: థాయ్‌లాండ్ సముద్రజలాల్లో ఆ దేశ యుద్ధనౌక ఒకటి మునిగిపోయింది. ఆ ఘటనలో 75 మందిని కాపాడారు. అయితే 31 మంది నావికుల జాడ తెలియాల్సి ఉంది. వీరి కోసం థాయ్‌లాండ్ నావికాదళ హెలికాప్టర్లు, నౌకల్లో సైన్యం అన్వేషణ పనుల్లో నిమగ్నమైంది. ప్రచుయాప్ ఖిరి ఖాన్ ప్రావిన్స్‌లోని బాంగ్‌సఫాన్ జిల్లాలోని సముద్ర తీరం నుంచి 32 కిలోమీటర్ల దూరంలో సముద్రజలాల్లో హెచ్‌టీఎంఎస్ సుఖోథాయ్ యుద్ధనౌక గస్తీ కాస్తోంది. ఆ ప్రాంతంలో వేటకొచ్చే చేపలపడవల సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో సహాయక కార్యక్రమాల బాధ్యతలను ఈ నౌక చూసుకునేది. ఆదివారం రాత్రి భారీ అలలు ఈ నౌకను అతలాకుతలం చేశాయి. సముద్రనీరు చేరడంతో నౌకలో విద్యుత్ వ్యవస్థ స్తంభించడంతో నావికులు నౌకను అదుపుచేయడంలో విఫలమయ్యారు. దీంతో పక్కకు ఒరగడం మొదలై పూర్తిగా మునిగిపోయింది. 75 మందిని కాపాడగా మిగతా వారి గాలిస్తున్నారు. చదవండి: పాకిస్తాన్లో రెచ్చిపోయిన తాలిబన్లు.. పోలీస్ స్టేషన్‌ను సీజ్ చేసి.. -
‘టైటానిక్’ మరో 12 ఏళ్లే.. ఆ తర్వాత..
‘టైటానిక్’ ఉదంతం చరిత్ర పుటల్లో ఓ దుర్ఘటన. 1912 నవంబర్ 14న అట్లాంటిక్ మహాసముద్రంలో మంచుకొండను ఢీ కొట్టి, మునిగి.. వందల మందిని జలసమాధి చేసిన ఓ విషాదం. 73 ఏళ్ల తర్వాత కెనడాలోని న్యూఫౌండ్ ల్యాండ్‌కు 740 కి.మీ. దూరంలో సముద్ర మట్టానికి 4 వేల మీటర్ల లోతున 2 ముక్కలైన టైటానిక్ అవశేషాలను గుర్తించిన విషయం తెలిసిందే. 109 ఏళ్లు దాటినా ఆ ఓడ అవశేషాలు నేటికీ నీళ్లల్లో పదిలంగానే ఉన్నాయి. అయితే మరికొన్ని ఏళ్లల్లో ఆ ఛాన్స్ కూడా ఉండదట. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఒకరకమైన బ్యాక్టీరియా టైటానిక్ అవశేషాలను వేగంగా తినేస్తోందట.. ‘మరో 12 ఏళ్ల తర్వాత టైటానిక్ అని చెప్పుకోవడానికి నీళ్లల్లో ఒక్క ముక్క కూడా మిగలద’ని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటివరకూ ‘ఆర్ఎంఎస్ టైటానిక్ సంస్థ’ పలు పరిశోధక యాత్రలు చేపట్టి.. దాదాపు 5 వేలకు పైగా.. వెండి పాత్రలు, బంగారు నాణాలు వంటివెన్నో టైటానిక్ శిథిలాల నుంచి బయటకు తీసింది. ఆనాడు ఈ ప్రమాదం నుంచి ఏడు వందల మంది ప్రాణాలతో బయటపడ్డారు. చదవండి: ఇలా చేస్తే.. ఎంత వయసొచ్చినా యంగ్‌గా కనిస్తారు.. -
ఇంటిప్స్
గిన్నెలు తళతళ మెరవాలంటే తోమడానికి వాడే పొడికి గానీ, సబ్బుకి గానీ ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ కలపాలి. వెనిగర్ గిన్నెలపై ఉండే జిడ్డుని వదలగొట్టి మెరిసేలా చేస్తుంది. ఫ్లోరైడ్ వాటర్ వల్ల షింక్‌లు, బకెట్ల అడుగు భాగంలో తెల్లగా గారపడుతుంటాయి. రెండు కప్పుల వెనిగర్‌ని ఒక గిన్నెలో పోసి సన్న మంట మీద పదినిముషాలు వేడిచేసి దానితో శుభ్రం చేస్తే ఎంత మొండి మరకలైనా ఇట్టే మాయమవుతాయి. -
ఒరాకిల్ కు ఆమె దెబ్బ
న్యూయార్క్ : సిలికాన్ వ్యాలీ దిగ్గజం ఒరాకిల్ షేర్లు అంతర్జాతీయ మార్కెట్లో నాలుగు శాతానికి పైగా కుదేలవుతున్నాయి. ఒరాకిల్ కంపెనీ మాజీ అకౌంటెంట్ పై నమోదైన విజిల్ బ్లోయర్ దావాతో ఈ షేర్లు పతనమవుతున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్ అమ్మకాల డేటాను ఎక్కువగా చేసి చూపించడంతో మాజీ అకౌంటెంట్ స్వెత్లానా బ్లాక్బర్న్ పై ఈ దావా కేసు నమోదైంది. శాన్ ఫ్రాన్సిస్కో లోని అమెరికా జిల్లా కోర్టులో బుధవారం ఈ కేసు నమోదైంది. అమ్మకాల వసూళ్లను అంచనావేసిన దానికంటే మిలియన్ డాలర్లలో ఎక్కువగా రికార్డులో చూపిందనే ఆరోపణలను ఆమె ఎదుర్కొంటున్నారు. ఆమె చూపిన క్లౌడ్ కంప్యూటింగ్ అమ్మకాల డేటా అంతా అశాస్త్రీయమని దావా పేర్కొంటోంది. అయితే ఈ ఆరోపణలను ఒరాకిల్ ఖండించింది. కౌంటర్ దాఖలు చేస్తామని పేర్కొంది. తమ క్లౌడ్ కంప్యూటింగ్ డేటా కచ్చితమైనవని, శాస్త్రీయమైనవని ఒరాకిల్ అధికార ప్రతినిధి డెబోరా హిలింగర్ తెలిపారు. ఈ మాజీ ఉద్యోగి ఒరాకిల్ లో ఏడాది కంటే తక్కువ రోజులే పనిచేసిందని, అకౌంటింగ్ గ్రూప్ లో ఆమె అసలు పనిచేయలేదని పేర్కొన్నారు. పేలవమైన ప్రదర్శనతో తనని ఒరాకిల్ నుంచి తీసివేశామని డెబోరో చెప్పారు. క్లౌడ్ కంప్యూటింగ్ డిపార్ట్ మెంట్ కు బ్లాక్బర్న్ మాజీ సీనియర్ ఫైనాన్స్ మేనేజర్. అయితే ఆమె పదేపదే అశాస్త్రీయమైన లెక్కలు చూపుతుందని ఈ దావా పేర్కొంది. బ్లాక్బర్న్ పై కంపెనీ పలు మార్లు సీరియస్ అయినా కూడా ఆమె ప్రవర్తనలో ఎలాంటి తేడా లేదని వెల్లడించింది. ఈ అశాస్త్రీయమైన రిపోర్టులు నివేదిస్తూ... ప్రజలను, కంపెనీని తప్పుదోవ పట్టిస్తున్నందుకు బ్లాక్బర్న్ పై విజిల్ బ్లోయర్ కింద కేసు నమోదైంది. ఈ దావా కేసు బయటికి పొక్కగానే ఒరాకిల్ షేర్లు 4.6శాతం మేర పడిపోయాయి. -
అమ్మ దెబ్బకి ఢమాల్
ముంబై : ఎగ్జిట్ పోల్ అంచనాలతో స్టాక్ మార్కెట్లో మెరుపులు సృష్టించిన సన్ టీవీ షేర్లు గురువారం ఢమాల్ మని పడిపోయాయి. తమిళనాడులో అన్నాడిఎంకె విజయం దాదాపు ఖాయం కావడంతో గురువారం నాటి ట్రేడింగ్ లో సన్ టీవీ షేర్లు 10శాతం మేర పతనమయ్యయి.. తమిళనాడులో ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ తో అమాంతం దూసుకుపోయిన ఈ షేర్లు, ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ఎన్నికల ఫలితాలు వస్తుండటంతో, పెట్టుబడిదారుల ఆశలన్నీ ఆవిరయ్యాయి. కరుణానిధిపై తమిళ ఒటర్లు కరుణ చూపకపోవడంతో, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. అమ్మ జయలలిత పార్టీ అన్నాడీంఎకే 141 సీట్ల ఆధిక్యంలో దూసుకుపోతోంది. దీంతో సన్ టీవీ షేర్లు కుదేలవుతున్నాయి. కాగా అన్నాడీఎంకే ప్రత్యర్థి, ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధ్యక్షుడు కరుణానిధినే ఈ సారి ఎన్నికల్లో విజయం వరించబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడంతో చెన్నైకు చెందిన ఈ సన్ టీవీ నెట్ వర్క్ షేర్లు జూమ్ అయ్యాయి. డీఎంకే పార్టీ గెలవబోతుందనే సంకేతాలతో సన్ టీవీ షేర్లు గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లో జిగేల్ మనిపించాయి. సన్ టీవీ అధినేత కళానిధి మారన్, డీఎంకే అధినేతకరుణానిధికి మనువడు. పార్టీ హవా కొనసాగుతూ రికార్డు తిరగ రాయడానికి సిద్ధంగా ఉన్న అమ్మ దెబ్బకి సన్ టేవీ బేర్ మంది. -
చైనా బోట్‌ను ముంచేశారు
బ్యూనస్ ఎయిర్స్: చైనా బోట్‌ను అర్జెంటీనా ముంచేసింది. నిబంధనలు అతిక్రమించి తమ దేశ సముద్ర జలాల్లో ప్రవేశించి అక్రమంగా చేపలుపడుతుండటం చూసి ఫైరింగ్ చేసింది. దీంతో ఆ బోట్ సముద్రంలో మునిగిపోయినట్లు స్పష్టం చేసింది. అర్జెంటినా అధికారులు అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య కొంత ఉద్రిక్తపూరిత వాతావరణం నెలకొనే అవకాశం ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. బ్యూనస్ ఎయిర్స్ 1,460 కిలోమీటర్ల దూరంలోని ప్యూరిటో మాడ్రిన్ కోస్తా తీరం దగ్గర తమ దేశ నౌకను ముంచివేసినట్లు అర్జెంటీనా ప్రకటించిందని, దీనిపై తాము తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, సీరియస్‌గా తీసుకుంటున్నామని చైనా ప్రకటించింది. ఈ ఘటనపై విచారణకు కూడా ఆదేశించినట్లు చైనా అధికారులు తెలిపారు. -
ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలోని ఊరచెరువులో మునిగి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. సత్తుపల్లి పట్టణానికి చెందిన ఐదుగురు విద్యార్థులు ఆదివారం చెరువు చూసేందుకు వెళ్లారు. ఈత రాకపోవడంతో అందులో దిగిన తాటి దిలీప్ (12), మాదాస్ ప్రశాంత్(12) ప్రమాదంలో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు మాదాసు ధనుష్ (11) నీటిలో దిగగా ముగ్గురూ మునిగిపోయారు. మరో ఇద్దరు విద్యార్థులు కేకలు వేయగా దగ్గర్లోని వారు స్పందించి వచ్చేసరికి నీట మునిగిన ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ప్రశాంత్, ధనుష్ స్వయానా సోదరులు. మిషన్ కాకతీయలో భాగంగా ఇటీవలే ఊరచెరువులో పూడిక తీయడంలో నీటి మట్టం ఎక్కువగా ఉంది.