చైనా బోట్ను ముంచేశారు | Argentina: Navy sinks Chinese boat fishing illegally | Sakshi
Sakshi News home page

చైనా బోట్ను ముంచేశారు

Published Wed, Mar 16 2016 9:46 AM | Last Updated on Mon, Aug 13 2018 3:32 PM

చైనా బోట్ను ముంచేశారు - Sakshi

చైనా బోట్ను ముంచేశారు

బ్యూనస్ ఎయిర్స్: చైనా బోట్ను అర్జెంటీనా ముంచేసింది. నిబంధనలు అతిక్రమించి తమ దేశ సముద్ర జలాల్లో ప్రవేశించి అక్రమంగా చేపలుపడుతుండటం చూసి ఫైరింగ్ చేసింది. దీంతో ఆ బోట్ సముద్రంలో మునిగిపోయినట్లు స్పష్టం చేసింది. అర్జెంటినా అధికారులు అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య కొంత ఉద్రిక్తపూరిత వాతావరణం నెలకొనే అవకాశం ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. బ్యూనస్ ఎయిర్స్ 1,460 కిలోమీటర్ల దూరంలోని ప్యూరిటో మాడ్రిన్ కోస్తా తీరం దగ్గర తమ దేశ నౌకను ముంచివేసినట్లు అర్జెంటీనా ప్రకటించిందని, దీనిపై తాము తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, సీరియస్గా తీసుకుంటున్నామని చైనా ప్రకటించింది. ఈ ఘటనపై విచారణకు కూడా ఆదేశించినట్లు చైనా అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement