సముద్ర అలలతో పోటీపడేలా ఆశలు ఉప్పొంగేవారికి ఇదో అద్భుతమైన అవకాశం. సముద్ర జలాల్లో ప్రయాణానికి ప్రపంచంలోనే అతి పెద్ద నౌక సిద్ధమైంది. టైటానిక్ కంటే ఇది ఐదు రెట్లు పెద్దది. ఈ నౌకలోనే సకల సదుపాయాలు ఉన్నాయి.
ప్రపంచంలోని నౌకల్లో స్వర్గధామంగా మారిన ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’ ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మయామీ పోర్టు నుంచి బయలుదేరి వారం రోజులపాటు సముద్ర జలాలాపై విహరిస్తూ తూర్పు కరేబియన్ దీవులగుండా ప్రయాణించి ఫిబ్రవరి 3న తిరిగి మయామీకి చేరుకోనుంది. రకరకాల ధరల శ్రేణుల్లో ఈ విలాసనౌకలో అద్భుత ప్రయాణానికి ఏర్పాట్లున్నాయి.
ప్రత్యేకతలివీ..
- ఫిన్లాండ్‌లో మెయర్ తుర్కు షిప్‌యార్డ్ ఈ నౌకని నిర్మించింది.
- రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన ఈ నౌక పేరు ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’.
- నౌక పొడవు 1200 అడుగులు, బరువు 2,50,800 టన్నులు.
- ఈ నౌకలో 2,350 మంది సిబ్బంది ఉంటారు. 7,600 మంది ప్రయాణించగలరు.
- ప్రపంచ వ్యాప్తంగా 40 ప్రాంతాలకు చెందిన విభిన్న ఆహార పదార్థాలు ఈ షిప్‌లో లభిస్తాయి.
- నౌకలో వాటర్‌పార్క్‌లు, స్విమ్మింగ్‌పూల్‌లు, ఫ్యామిలీలు ఎంజాయ్ చేసే సకల సదుపాయాలున్నాయి.
- ఈ నౌకలో ప్రపంచంలోనే అతి పెద్ద వాటర్ పార్క్ ఉంది. దీన్ని ‘కేటగిరీ 6’ అని పిలుస్తారు. ఈ వాటర్ పార్కులో ఆరు స్లైడ్‌లు ఉన్నాయి.
- ఒక వాటర్ స్లయిడ్ నుంచి నేరుగా సముద్రంలోకి డైవ్ చేసేలా పెట్టారు. కానీ ప్రయాణికుల భద్రత రీత్యా దీనిని వారికి అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాల్లేవు.
- 2023 జూన్ 22న ఈ నౌక విజయవంతంగా మొదటి ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది.
- నౌకలో ఉద్యానవనాలు ఉన్నాయి. పార్కుల్లోనూ ప్రయాణికులు సేద తీరవచ్చు.
- కాలుష్య నివారణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ)ను ఇంధనంగా వాడుకుంటూ ఈ నౌక ప్రయాణం కొనసాగిస్తుంది.
- ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియెనల్ మెస్సీ ఈ నౌకకు పేరుపెట్టడం విశేషం.
- వివిధ రకాల ప్యాకేజీల కింద ధరలున్నాయి. అన్నింటికంటే తక్కువగా ఏడు రాత్రులు ఓడలో గడపాలంటే 3 వేల పౌండ్ల (కనిష్టంగా దాదాపు రూ.3.2 లక్షలకు పైన) వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
ఇదీ చదవండి: ఈ దేశాల్లో డబ్బులన్నీ వ్యాపార కుటుంబాలవే..
- కరేబియన్‌లో అత్యంత అందమైన దీవులైన బహమాస్, కొజుమెల్, ఫిలిప్స్‌బర్గ్, సెయింట్ మార్టెన్, రోటన్, హోండురస్ వంటి వాటి మీదుగా ఈ నౌక ప్రయాణిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment