గడ్డకట్టే చలిలో గజగజలాడిపోయిన ప్రజలు అని వార్తల్లో వింటుంటాం. అంతెందుకు అందరూ ఇష్టపడే టైటానిక్ మూవీలో 1912 నాటి విపత్తు ఘన చూపించారు. ఆ మూవీలో అంట్లాంటిక్ మహా సముద్రంలో మంచు పర్వతం ఢీకొని టైటానిక్ ఓడ మునిగిపోయిన సీన్‌లోని హృదయవిదారక దృశ్యాలు అందర్ని కంటతడి పెట్టిస్తాయి. అయితే దీని గురించి సినిమాల్లోనూ, వార్తల్లో వినటమే గానీ గడ్డకట్టే చలి ఎలా ఉంటుందో అనేది రియల్‌గా తెలియదు.
ఆ ఫీల్ కావాలనుకుంటే ఈ మ్యూజియం వద్దకు వెళ్లిపోండి. అమెరికాలో టెన్నెస్సీలోని టైటానిక్ మ్యూజియం ఈ సరికొత్త అనుభూతిని సందర్శకులకు అందిస్తోంది. టైటానిక్ ఓడ మునిగినప్పుడు అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఉష్ణోగ్రత(రెండ డిగ్రీల సెల్సియస్)ని చవిచూడొచ్చు. 400కి పైగా టైటానిక్ ప్రామాణిక కళాఖండాలు కలిగి ఉన్న మ్యూజియం సందర్శకులకు ఓ గొప్ప అనుభూతిని అందిస్తోంది.
గడ్డకట్టే నీటిలో అనుభవాన్ని పొందుతున్న సందర్శకులు వీడియోలు నెట్టింట తెగ చక్కెర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలో ప్రతి సందర్శకుడు మంచుకొండను తాకిని ఫీల్ కలుగుతుందని చెబుతుండటం చూడొచ్చు. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి టైటానిక్ ఓడ మునిగిపోయినప్పుడూ చనిపోయిన యాత్రికులు ఎంత బాధ అనుభవించి ఉంటారో అని తలుచుకుంటేనే కన్నీళ్లు వస్తున్నాయి అంటూ పోస్టులు పెట్టారు.
At the Titanic Museum you can find this basin filled with water, set to the exact temperature that the people in the surrounding waters would have had to swim in after the ship sank.
The ocean temperature was about 30°F.pic.twitter.com/38e9jjXjEh— Massimo (@Rainmaker1973) September 11, 2024
(చదవండి: ఈ పీతను కొనాలంటే ఆస్తులుకు ఆస్తులే అమ్ముకోవాలి..!)
Comments
Please login to add a commentAdd a comment