
టైటానిక్ చిత్రంలో ఓ దృశ్యం
తమిళసినిమా: టైటానిక్ అనగానే హాలీవుడ్ అద్భుత ప్రేమ కధా చిత్రం గుర్తుకొస్తుంది. అయితే అదే టైటిల్‌తో కోలీవుడ్‌లో ఒక వినోదభరిత ప్రేమ కథా చిత్రం తెరకెక్కుతండడం విశేషం. ఇంతకు ముందు కొత్త దర్శకులను పరిచయం చేసి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన తిరు కుమరన్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ అధినేత సీవీ.కుమార్ తాజాగా నిర్మిస్తున్న చిత్రం ఇది. దీని ద్వారా ఎం.జానకీరామన్ అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు బాలా, సుధా కొంగర, బాలాజీ మోహన్‌ల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారన్నది గమనార్హం. యువ నటుడు కలైయరసన్, కయల్ ఆనంది, ఆస్నాజవేరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో కాళీవెంకట్, జాంగ్రి మధుమిత, రాఘవ్‌విజయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.
చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పూర్తి వినోదభరిత చిత్రంగా ఉన్నా, చిత్రం చూసే ప్రేక్షకుడు చిత్రంలోని పలు సన్నివేశాల్లో తమను చూసుకుంటారన్నారు. ఇప్పటి వరకూ కామెడీ కథా చిత్రాల్లో చూడనటువంటి అచ్చెరువు చెందే సంఘటనలను ఈ టైటానిక్ చిత్రంలో చూస్తారన్నారు. ముఖ్యంగా చిత్ర క్‌లైమాక్స్ సరి కొత్త అనుభూతిని కలిగిస్తుందని దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఇందులో నటుడు సేతన్, దేవదర్శిని, సుధ అతిథి పాత్రల్లో మెరుస్తారని చెప్పారు. దీనికి తెగిడి, సేతుపతి చిత్రాల ఫేమ్ నివాస్ కే.ప్రసన్న సంగీతం, బల్లు చాయాగ్రహణను అందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment