టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రమాదం తీవ్ర విషాదాన్నినింపింది. అట్లాంటిక్ మహాసముద్రంలో వందేళ్ల క్రితం మునిగిన టైటానిక్ షిప్ శిథిలాలను చూసేందుకు వెళ్లి పేలిపోయిన టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లోని ఐదుగురూ మరణించినట్లు యుఎస్ కోస్ట్ గార్డ్ గురువారం ధృవీకరించింది.
చనిపోయిన వారిలో ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ సీఈఓ స్టాక్‌టన్ రష్, బ్రిటీష్ బిలియనీర్ హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ డైవర్ పాల్ హెన్రీ నార్గోలెట్ పాకిస్థాన్ బిలియనీర్ షహజాద్ దావూద్, ఆయన కుమారుడు సులేమాన్ ఉన్నారు. యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసిన ఈ ప్రమాదంలో తండ్రీ కుమారులిద్దరూ ప్రాణాలు కోల్పోయారనే అంచనా మరింత విషాదాన్ని నింపింది. అయితే చనిపోయారని భావిస్తున్న దావూద్‌కి సంబంధించి ఒక వార్త వెలుగులోకి వచ్చింది.
పాకిస్తానీ టైకూన్ షాజాదా దావూద్, భార్య ప్రకారం భయంకరమైన విమాన ప్రమాదం నుండి బయట పడ్డారు. ది డైలీ బీస్ట్ రిపోర్ట్ మేరకు క్రిస్టీన్ దావూద్ జనవరి 2019లో జరిగిన సంఘటన గురించి బ్లాగ్ పోస్ట్‌లోరాశారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. విమానం అటూ ఇటూ ఊగిపోవడంతో క్యాబిన్ మొత్తం ఒక్కసారిగా కేకలు పెట్టింది. బాక్సర్‌ని అన్ని దిక్కుల నుండి పంచ్‌లు కొట్టినట్లుగా అనిపించింది. చివరకు సురక్షితంగా ల్యాండ్ అయ్యేంత వరకు ఆ క్షణాలు ఎలా గడిచాయో తెలియదని క్రిస్టీన్ వెల్లడించింది. ఈ ఫ్లైట్ నా జీవితంలో మరచిపోలేని భయకంరమైన వాటిలో ఒకటి అని చెప్పుకొచ్చారు. అయితే ఏ విమానంలో, ఎక్కడికి పోతుండగా జరిగిందనేది ఆమె వివరించలేదు. (రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్)
అంతేకాదు ఈ యాత్రకు సులేమాన్ వెళ్లాలని అనుకోలేదని, బలవంతంగా వెళ్లాడని హజాద్ సోదరి, సులేమాన్ అత్తయ్య అజ్మే దావూద్ ప్రమాదానికి ముందు చెప్పుకొచ్చారు. అసలు టైటాన్‌లో సముద్రగర్భంలోకి వెళ్లడానికి సులేమాన్ బాగా భయపడ్డాడని కూడా తెలిపారు. అయితే ఫాదర్స్ డే సందర్భంగా తండ్రికి యాత్ర చాలా ముఖ్యం కావడం తోనే తాను వెళ్లడానికి అంగీకరించాడట. చివరకు వీరి సాహస ప్రయాణం విషాదాంతమైంది. (అపుడు కరోడ్‌పతి షో సెన్సేషన్: మరి ఇపుడు)
Comments
Please login to add a commentAdd a comment