అమెరికా: అట్లాంటిక్ మహా సముద్రంలో ఇటీవల జరిగిన టైటాన్ జలాంతర్గామి ప్రమాదంలో ఓషన్ గేట్ యజమాని సహా ఐదుగురు యాత్రికులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇందులో పాకిస్తాన్ కు చెందిన వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ అతని కుమారుడు సులేమాన్ ల స్థానంలో తానూ తన కుమారుడు ప్రయాణించాల్సి ఉందని కానీ చివరి నిముషంలో తప్పుకోవడంతో ప్రాణాలు నిలుపుకున్నామాని అన్నారు లాస్ వేగాస్ కు చెందిన పెట్టుబడిదారుడు జే బ్లూమ్.
జీవితంలో ఇలాంటి అనుభూతిని ఒక్కసారైనా పొందాలని, సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ శకలాలను చూడటమంటే అదృష్టముండాలని ఎలాగైనా తనను ఈ సాహస యాత్రకు ఒప్పించే ప్రయత్నం చేశారు ఓషన్ గేట్ అధినేత స్టాక్ టన్ రష్. అయినా కూడా నాకెందుకో ఆ బుల్లి జలాంతర్గామి భద్రత విషయమై ఎక్కడో అనుమానం ఉండేది. రష్ మాత్రం అలాంటిదేమీ లేదని.. ఒక హెలికాఫ్టర్లో ప్రయాణం కంటే ఇది చాలా సురక్షితమైనది చెప్పేవారు.
కానీ ఎందుకో నా మనసు అంగీకరించక నేను చివరి నిముషంలో అతడి అభ్యర్ధనను తిరస్కరించానని చెప్పుకొచ్చారు జే బ్లూమ్. లేదంటే పాకిస్తాన్ వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ స్థానంలో తానూ.. అతని కుమారుడు సులేమాన్ స్థానంలో 20 ఏళ్ల మా అబ్బాయి సీన్ ఉండేవారమని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు బ్లూమ్.
ఓషన్ గేట్ అధినేత స్టాక్ టన్ ఎంతగా చెప్పినా కూడా బ్లూమ్ ఒప్పుకోవకపోవడానికి ఆ వాహనం రిమోట్ ఆపరేటింగ్ వాహనం కావడం కూడా ఒక కారణమని చెప్పారు జె బ్లూమ్. సొంతంగా ఒక హెలికాఫ్టర్ ఉన్న బ్లూమ్ కు టైటాన్ భద్రతా ప్రమాణాలపై చాలా అనుమానాలు ఉండేవి.
ఆరోజు నాకున్న స్పష్టమైన అవగాహన కారణంగానే నేను ఈ యాత్రకు ఒప్పుకోలేదు. అందుకే ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామని, షాహ్జాదా దావూద్ - సులేమాన్ ఫోటోలు చూసిన ప్రతిసారి నాకు అదే గుర్తుకు వస్తోందని అన్నారు.
ఇది కూడా చదవండి: ఈజిప్టులో మోదీ తొలి అడుగు
Comments
Please login to add a commentAdd a comment