అట్లాంటిక్ మహా సముద్రం గల్లంతైన టైటానిక్ సబ్‌మెరైన్ ఆచూకీ కోసం భారీ ఎత్తున రెస్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయిదుగురు పర్యాటకులతో ఆదివారం బయల్దేరిన జలంతర్గామి కనిపించకుండా పోయి 96 గంటలు కావొస్తుంది. అయినా దీని ఆచూకీ లభించలేదు. మరో వైపు మినీ సబ్‌మెరైన్‌లోని ఆక్సిజన్ సరఫరా కూడా దగ్గర పడింది. జలాంతర్గామిలో 96 గంటలకు సరిపడా మాత్రమే ఆక్సిజన్ ఉంది. ఆ సమయం కాస్తా గడిచిపోవడంతో సందర్శకుల క్షేమంపై క్షణం క్షణం ఉత్కంఠ కొనసాగుతోంది. ఆక్సిజన్ అయిపోవడంతో వారు ప్రాణాలతో తిరిగొస్తారనే ఆశలు సన్నగిల్లుతున్నాయి.
కాగా టైటాన్ జలాంతర్గామి సముద్ర ఉపరితలం నుంచి 12,500 అడుగుల(3,800 మీటర్లు) లోతున ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీనిని కనుగునేందుకు యూఎస్ కోస్ట్ గార్డుతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెస్క్యూసిబ్బంది రంగంలోకి దిగి పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. అమెరికా, కెనడాకు చెందిన యుద్ధ విమానాలు, ఉపగ్రహాలు, భారీ నౌకలను రంగంలోకి దించిసముద్రాన్నే జల్లెడ పడుతున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన సముద్రపు రోబోలను సైతం మోహరించారు. అయితే గల్లంతైన టైటాన్ సముద్ర గర్భంలో ఏవైనా శకలాల మధ్య చిక్కుకుపోయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన ఈ రోబో జలాంతర్గామి సహాయం తీసుకున్నారు.
సముద్రంలో దాదాపు 4 కిలోమీటర్ల లోతు వరకు రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయి. గాలిస్తున్న ప్రాంతం.. అమెరికాలోని ఓ రాష్ట్రంకంటే పెద్దగా ఉంటుందట. అందుకే ఆ ప్రాంతాన్నంతా గాలించడం అత్యంత కష్టంగా మారింది. టైటానిక్ నౌక శిథిలాల ఉన్న ప్రాంతాన్ని మిడ్‌నైట్ జోన్‌గా పిలుస్తారు. అక్కడ ఉష్ణోగ్రతలు అత్యంత శీతలంగా ఉంటాయి. అంతేగాక పూర్తిగా చీకటి ఉంటుంది. సబ్‌మెర్సిబుల్‌లో ఉన్న లైట్లతో కేవలం కొంత దూరం వరకే కనిపిస్తుందని, దాదాపు రెండున్నర గంటల పాటు కటిక చీకల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
చదవండి: ఉడికి ఉక్కిరిబిక్కిరవుతున్న జనం.. మొత్తం 9 దేశాలు.. టాప్‌లో మనమే!
మరోవైపు టైటానిక్ నౌక శకలాలు ఉన్న 12వేల అడుగుల లోతున వాతావరణ పీడనం అధికంగా ఉటుందని నిపుణులు చెబుతున్నారు. భూ ఉపరితలంతో పోలిస్తే అక్కడి పీడనం 380 రెట్లు అధికంగా ఉంటుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక అయిదుగురు వ్యక్తులతో బయల్దేరిన సబ్‌మెరైన్ కేవలం రెండు గంట్లోనే కమ్యూకేషన్ కోల్పోయిన విషయం విదితమే. ఈ మినీ సబ్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు సంపన్నులు, బ్రిటన్ బిలియనర్ హమీష్ హార్డింగ్ మరో ముగ్గురు ఉన్నారు. వీరి ఆచూకీ కోసం భారీగా రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సిబ్బందికి కొన్ని ప్రాంతాల్లో శబ్దాలు వినిపిస్తున్నప్పటికీ అవి కచ్చితంగా ఎక్కుడనుంచి వస్తున్నాయనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment