Submerain
-
ఆక్సిజన్ అయిపోయింది.. అయిదుగురి ప్రాణాలపై సన్నగిల్లుతున్న ఆశలు
అట్లాంటిక్ మహా సముద్రం గల్లంతైన టైటానిక్ సబ్‌మెరైన్ ఆచూకీ కోసం భారీ ఎత్తున రెస్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయిదుగురు పర్యాటకులతో ఆదివారం బయల్దేరిన జలంతర్గామి కనిపించకుండా పోయి 96 గంటలు కావొస్తుంది. అయినా దీని ఆచూకీ లభించలేదు. మరో వైపు మినీ సబ్‌మెరైన్‌లోని ఆక్సిజన్ సరఫరా కూడా దగ్గర పడింది. జలాంతర్గామిలో 96 గంటలకు సరిపడా మాత్రమే ఆక్సిజన్ ఉంది. ఆ సమయం కాస్తా గడిచిపోవడంతో సందర్శకుల క్షేమంపై క్షణం క్షణం ఉత్కంఠ కొనసాగుతోంది. ఆక్సిజన్ అయిపోవడంతో వారు ప్రాణాలతో తిరిగొస్తారనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. కాగా టైటాన్ జలాంతర్గామి సముద్ర ఉపరితలం నుంచి 12,500 అడుగుల(3,800 మీటర్లు) లోతున ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీనిని కనుగునేందుకు యూఎస్ కోస్ట్ గార్డుతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెస్క్యూసిబ్బంది రంగంలోకి దిగి పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. అమెరికా, కెనడాకు చెందిన యుద్ధ విమానాలు, ఉపగ్రహాలు, భారీ నౌకలను రంగంలోకి దించిసముద్రాన్నే జల్లెడ పడుతున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన సముద్రపు రోబోలను సైతం మోహరించారు. అయితే గల్లంతైన టైటాన్ సముద్ర గర్భంలో ఏవైనా శకలాల మధ్య చిక్కుకుపోయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన ఈ రోబో జలాంతర్గామి సహాయం తీసుకున్నారు. సముద్రంలో దాదాపు 4 కిలోమీటర్ల లోతు వరకు రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయి. గాలిస్తున్న ప్రాంతం.. అమెరికాలోని ఓ రాష్ట్రంకంటే పెద్దగా ఉంటుందట. అందుకే ఆ ప్రాంతాన్నంతా గాలించడం అత్యంత కష్టంగా మారింది. టైటానిక్ నౌక శిథిలాల ఉన్న ప్రాంతాన్ని మిడ్నైట్ జోన్‌గా పిలుస్తారు. అక్కడ ఉష్ణోగ్రతలు అత్యంత శీతలంగా ఉంటాయి. అంతేగాక పూర్తిగా చీకటి ఉంటుంది. సబ్మెర్సిబుల్లో ఉన్న లైట్లతో కేవలం కొంత దూరం వరకే కనిపిస్తుందని, దాదాపు రెండున్నర గంటల పాటు కటిక చీకల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చదవండి: ఉడికి ఉక్కిరిబిక్కిరవుతున్న జనం.. మొత్తం 9 దేశాలు.. టాప్‌లో మనమే! మరోవైపు టైటానిక్ నౌక శకలాలు ఉన్న 12వేల అడుగుల లోతున వాతావరణ పీడనం అధికంగా ఉటుందని నిపుణులు చెబుతున్నారు. భూ ఉపరితలంతో పోలిస్తే అక్కడి పీడనం 380 రెట్లు అధికంగా ఉంటుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక అయిదుగురు వ్యక్తులతో బయల్దేరిన సబ్‌మెరైన్ కేవలం రెండు గంట్లోనే కమ్యూకేషన్ కోల్పోయిన విషయం విదితమే. ఈ మినీ సబ్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు సంపన్నులు, బ్రిటన్ బిలియనర్ హమీష్ హార్డింగ్ మరో ముగ్గురు ఉన్నారు. వీరి ఆచూకీ కోసం భారీగా రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సిబ్బందికి కొన్ని ప్రాంతాల్లో శబ్దాలు వినిపిస్తున్నప్పటికీ అవి కచ్చితంగా ఎక్కుడనుంచి వస్తున్నాయనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. -
అంతా 'షో'కులే..
సాక్షి, విశాఖపట్నం: అంతన్నారింతన్నారు..చివరకు గ్రామాల్లో తీర్థాల కంటే ఘోరంగా విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. రెండో రోజూ కూడా ఉత్సాహాన్ని పుంజుకోలేదు. విశాఖ జనాన్నే కాదు.. ఇతర ప్రాంతాల వారిలోనూ ఆసక్తిని రేకెత్తించలేదు. గత ఏడాది విశాఖ ఉత్సవ్ మూడు రోజులూ కలిపి నాలుగున్నర లక్షల మంది వచ్చారని అధికారులు అంచనా వేశారు. అంటే సగటున రోజుకు లక్షన్నర మంది హాజరైనట్టు లెక్కకట్టారు. కానీ ఈసారి ఉత్సవ్‌కు తొలిరోజు గురువార, మలిరోజు శుక్రవారం కూడా సందర్శకుల తాకిడి నామమాత్రంగానే ఉంది. ఉత్సవాలను తిలకించడానికి జనం పోటెత్తలేదు. వచ్చిన వారంతా కొత్తగా ఏర్పాటు చేసిన టీయూ–142 యుద్ధవిమానం, సాగరతీరంలో ఉన్న కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియాలను చూడడానికే ఆసక్తి చూపారు. దీంతో పలువురు సందర్శకులు, పర్యాటకులు అక్కడికే పరిమితమయ్యారు. వీటికి ఆనుకుని ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక వద్ద ఒకింత కనిపించారు. ఇక సాంస్కృతిక, సంప్రదాయ కార్యక్రమాల వేదిక వద్ద కూడా జనం అంతగా కనిపించలేదు. అక్కడ సాయంత్రం సద్గురు జగ్గీవాసుదేవన్ కుమార్తె రాధే జగ్గీ శాస్త్రీయ నృత్యంతో పాటు ఫ్యూజన్ రాక్‌బ్యాండ్‌లు ఒకింత ఆకట్టుకున్నాయి. ఇక ఎంతో అట్టహాసంగా ప్రచారం చేసిన ‘పరిమళ’ పుష్ప ప్రదర్శనకు స్పందన అంతంతమాత్రంగానే ఉంది. అయితే గురువారంతో పోల్చుకుంటే ఒకింత జనం పెరిగారు. అక్కడ 70–80 రకాల పూలను ప్రదర్శనలో ఉంచారు. ఇందులో విదేశీ పుష్పాలు కూడా ఉన్నాయి. ఎంజీఎం పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో సందర్శకులను ఆకట్టుకునే రీతిలో వినూత్న పుష్పాలు తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఏటా ఎంతగానో ఆకట్టుకునే దేవాలయాల నమూనాల వద్ద కూడా సందర్శకుల కనిపించలేదు. ఏటా ఈ ఆలయాల వద్ద జనం క్యూ కట్టేవారు. మరోవైపు ఎప్పట్నుంచో ఊరిస్తున్న హెలిటూరిజం తొలిరోజు ఉత్సవ్‌లో ఆఖరి క్షణంలో రద్దయింది. పరువు పోతుందన్న ఉద్దేశంతో దీనిని శుక్రవారం మధ్యాహ్నం రుషికొండ నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు దీనికి శ్రీకారం చుట్టారు. దీంతో కొంతమంది హెలికాప్టర్లో షికారు వెళ్లారు. యధావిధిగా రెండో రోజు కూడా జిల్లా, నగరానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు (గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మినహా) ఎంపీలు, జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడు అటువైపు తొంగిచూడలేదు. -
రానా మరో రిస్కీ ప్రాజెక్ట్!
స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్న దగ్గుబాటి రానా... మరో రిస్కీ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడు. కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి విభిన్న పాత్రలు పోషిస్తున్న దగ్గుబాటి హీరో... తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ తన సత్తా చాటుతున్నాడు. బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ సొంతం చేసుకొని యంగ్ హీరోస్లో వర్సటైల్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇటీవల బాహుబలి సినిమాతో ప్రతినాయకుడి పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా, ఇప్పుడు మరో రిస్కీ ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం 'బెంగళూర్ డేస్' రీమేక్‌లో నటిస్తున్న ఈ కండల వీరుడు పాకిస్తాన్ నేపథ్యంలో సాగే యుద్ధానికి సంబంధించిన ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 1965 , 1971 లలో జరిగిన ఇండియా-పాక్ యుద్ధాలలో ఉపయోగించిన 'పిఎన్యస్ ఘాజీ' సబ్ మెరైన్ ఎలా మునిగిపోయింది అన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంకల్ప్ అనే హైదరాబాదీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గతంలో తనే రచించిన 'బ్లూ ఫిష్' అనే నవల ఆధారంగా ఈ సినిమాను సంకల్ప్ తెరకెక్కిస్తున్నాడు . ఇటీవలే కథ విన్న రానా తన అంగీకారం తెలపటంతో త్వరలోనే సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. కథ సబ్ మెరైన్‌కు సంబందించింది కావటంతో ఎక్కువగా భాగం నీటి అడుగున షూట్ చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి రానా ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట.