స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్న దగ్గుబాటి రానా... మరో రిస్కీ ప్రాజెక్ట్కు రెడీ అవుతున్నాడు. కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి విభిన్న పాత్రలు పోషిస్తున్న దగ్గుబాటి హీరో... తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ తన సత్తా చాటుతున్నాడు. బాలీవుడ్, కోలీవుడ్లోనూ మంచి మార్కెట్ సొంతం చేసుకొని యంగ్ హీరోస్లో వర్సటైల్ యాక్టర్గా ప్రూవ్ చేసుకుంటున్నాడు.
ఇటీవల బాహుబలి సినిమాతో ప్రతినాయకుడి పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా, ఇప్పుడు మరో రిస్కీ ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం 'బెంగళూర్ డేస్' రీమేక్లో నటిస్తున్న ఈ కండల వీరుడు పాకిస్తాన్ నేపథ్యంలో సాగే యుద్ధానికి సంబంధించిన ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 1965 , 1971 లలో జరిగిన ఇండియా-పాక్ యుద్ధాలలో ఉపయోగించిన 'పిఎన్యస్ ఘాజీ' సబ్ మెరైన్ ఎలా మునిగిపోయింది అన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
సంకల్ప్ అనే హైదరాబాదీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గతంలో తనే రచించిన 'బ్లూ ఫిష్' అనే నవల ఆధారంగా ఈ సినిమాను సంకల్ప్ తెరకెక్కిస్తున్నాడు . ఇటీవలే కథ విన్న రానా తన అంగీకారం తెలపటంతో త్వరలోనే సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. కథ సబ్ మెరైన్కు సంబందించింది కావటంతో ఎక్కువగా భాగం నీటి అడుగున షూట్ చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి రానా ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట.
రానా మరో రిస్కీ ప్రాజెక్ట్!
Published Mon, Aug 31 2015 1:10 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM
Advertisement
Advertisement