Sankalp
-
ఏలూరులో బైక్ ర్యాలీ తో పాటు మానవహారం
-
హైటెక్ దందా.. బోర్డు తిప్పేసిన సంకల్ప్ మార్ట్!
మోర్తాడ్(బాల్కొండ): నిత్యావసర సరుకులు, ఎర్రచందనం మొక్కల వ్యాపారంలో పెట్టుబడులు పెడితే లాభాల్లో వాటా పొందవచ్చని, ఉన్నంతలో మనమూ కూడా ఆర్థికంగా ఎదగవచ్చని నమ్మించి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించిన సంకల్ప్ మార్ట్ సంస్థ బోర్డు తిప్పేసింది. రూ. వెయ్యి నుంచి ఎంత మొత్తమైనా పెట్టుబడి పెడితే రోజువారీగా కొంత ఆదాయం డిపాజిట్‌దారుల ఖాతాల్లో జమ చేస్తామని నమ్మించిన సంస్థ ప్రతినిధులు ఇప్పుడు ముఖం చాటేయడంతో సదరు సంస్థలో పెట్టుబడి పెట్టినవారు లబోదిబోమంటున్నారు. కాగా, విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న సంకల్ప్ మార్ట్ సంస్థకు మోర్తాడ్ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రతినిధులుగా వ్యవహరించారు. దాదాపు నాలుగు వందల మందితో రూ. 50లక్షల వరకు డిపాజిట్ చేయించారు. సంస్థలో పెట్టుబడి పెట్టినవారికి ఆన్లైన్లో లాగిన్ కావడానికి ఐడీ, పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసి ఇచ్చారు. కొంత మందికి మొదట్లో రూ. వెయ్యి నుంచి రూ. 1,500ల వరకు లాభాలు వచ్చాయని నమ్మించి ఖాతాల్లో జమ చేయించారు. ఇలా లాభాలు పొందినవారి పేర్లు చెబుతూ తమ ఖాతాదారుల సంఖ్యను భారీగా పెంచుకున్నారు. కొన్ని రోజులపాటు సంస్థ ఆన్లైన్ లాగింగ్ పనిచేయగా గత నెలాఖరులో లాగిన్ పనిచేయడం స్తంభించింది. ఆన్లైన్లో లాగిన్ పనిచేయకపోవడంతో పెట్టుబడి పెట్టినవారికి అనుమానం వచ్చి సంస్థ ప్రతినిధులను ప్రశ్నించారు. సంస్థ యజమానిగా చలామని అవుతున్న వ్యక్తి అరెస్టు అయ్యాడని అతను బైలుపై బయటకు రాగానే సంస్థ కార్యకలాపాలు యథావిధిగా సాగుతాయని ప్రతినిధులు నమ్మిస్తున్నారు. డిపాజిట్లు చేసిన వారు తమ సొమ్ము వాపసు చేయాలని సంస్థ ప్రతినిధులపై ఒత్తిడి తీసుకువచ్చినా ప్రయోజనం లేకపోయింది. ప్రశ్నించినవారు ‘రిమూవ్’.. సంస్థలో చేరిన వారితో ప్రతినిధులు ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు. గ్రూపులో సంస్థ కార్యకలాపాలు ఎందుకు నిలిచిపోయాయి, తమ సొమ్మును ఎవరు వాపసు ఇస్తారు.. తమను చేర్పించిన ప్రతినిధులే బాధ్యత వహించాలని కొందరు సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ఇలా ప్రశ్నిస్తున్న వ్యక్తులను వాట్సాప్ గ్రూప్ నుంచి సంస్థ ప్రతినిధులు తొలగిస్తున్నారని బాధితులు వాపోయారు. మరి కొందరు మాత్రం మున్ముందు ఏమైనా సమాచారం రావచ్చనే ఉద్దేశంతో వాట్సాప్ గ్రూప్‌లో ఉండిపోయారు. ఇదిలా ఉండగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన సంస్థ ఎలాంటిదో యజమానులు ఎలాంటివారో తమకు తెలియదని బాధితులు చెబుతున్నారు. తమకు సదరు సంస్థపై నమ్మకం కలిగించి తమతో పెట్టుబడి పెట్టించినవారే డబ్బులు వాపసు ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ముద్ర అనే సంస్థ డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేయగా ఇప్పుడు సంకల్ప్ మార్ట్ సంస్థ అదే కోవలో బోర్డు తిప్పేయడంతో అమాయకులు మోసపోయారు. -
మోగ్లీ... మన హైదరాబాదీ!
హాలీవుడ్ ‘జంగిల్‌బుక్’కీ, హైదరాబాద్‌కీ సంబంధం ఏంటి? లేదనుకోకండి... ఉంది. తెలుగు, తమిళ, హిందీల్లోకి కూడా అనువాదమై వస్తున్న ఈ చిత్రంలో అడవిలో పెరిగిన పసిబాలుడు మోగ్లీ పాత్రే హీరో. భారత సంతతికి చెందిన నీల్ సేథీ ఆ పాత్ర పోషించారు. విశేషం ఏమిటంటే, తెలుగులో వాయిస్ ఇచ్చింది అక్షరాలా మన హైదరాబాద్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థి - పదేళ్ల సంకల్ప్. హాలీవుడ్ సంస్థ డిస్నీ వరల్డ్ నిర్మించిన ఈ మోగ్లీ పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి చాలామంది పోటీపడ్డారు. చెన్నై సహా పలు ప్రాంతాల్లోని చిన్నారుల వాయిస్‌ను ఆడిషన్ చేశారు. చివరకు క్యాలిఫోర్నియా దాకా వెళ్ళి, సంకల్ప్ వాయిస్ పోటీలో గెలిచింది. సీనియర్ డబ్బింగ్ కళాకారుడైన నాగార్జున వాయుపుత్ర కుమారుడే సంకల్ప్. ఈ పిల్లాడి వాయిస్ మోగ్లీ పాత్రకు బాగా సూట్ అయిందట. దాంతో, చెన్నై దాకా వెళ్ళి డబ్బింగ్ చెప్పారు. యాక్టర్ అవ్వాలని యాంబిషన్‌తో పాటు సంగీతం, డ్రాయింగ్ నేర్చుకుంటున్న సంకల్ప్ ‘‘తొలిసారిగా డబ్బింగ్ చెబుతున్నా, సంకల్ప్ గొంతు బాగుంది. మంచి అవుట్‌పుట్ ఇచ్చాడు’’ అని డిస్నీవరల్డ్ ప్రశంసించడం విశేషం. తండ్రి బాటలో నడుస్తున్న ఈ పసివాడికి ఆల్‌ది బెస్ట్. అన్నట్లు ఈ శుక్రవారమే ‘జంగిల్ బుక్’ తెలుగు వెర్షన్ రిలీజ్. -
రానా మరో రిస్కీ ప్రాజెక్ట్!
స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్న దగ్గుబాటి రానా... మరో రిస్కీ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడు. కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి విభిన్న పాత్రలు పోషిస్తున్న దగ్గుబాటి హీరో... తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ తన సత్తా చాటుతున్నాడు. బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ సొంతం చేసుకొని యంగ్ హీరోస్లో వర్సటైల్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇటీవల బాహుబలి సినిమాతో ప్రతినాయకుడి పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా, ఇప్పుడు మరో రిస్కీ ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం 'బెంగళూర్ డేస్' రీమేక్‌లో నటిస్తున్న ఈ కండల వీరుడు పాకిస్తాన్ నేపథ్యంలో సాగే యుద్ధానికి సంబంధించిన ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 1965 , 1971 లలో జరిగిన ఇండియా-పాక్ యుద్ధాలలో ఉపయోగించిన 'పిఎన్యస్ ఘాజీ' సబ్ మెరైన్ ఎలా మునిగిపోయింది అన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంకల్ప్ అనే హైదరాబాదీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గతంలో తనే రచించిన 'బ్లూ ఫిష్' అనే నవల ఆధారంగా ఈ సినిమాను సంకల్ప్ తెరకెక్కిస్తున్నాడు . ఇటీవలే కథ విన్న రానా తన అంగీకారం తెలపటంతో త్వరలోనే సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. కథ సబ్ మెరైన్‌కు సంబందించింది కావటంతో ఎక్కువగా భాగం నీటి అడుగున షూట్ చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి రానా ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. -
పేరు పెట్టింది.. నిజాం నవాబు
టేస్ట్ స్పెషలిస్ట్: తండ్రి చనిపోయే సమయానికి మహ్మద్ హుస్సేన్‌కి 15 ఏళ్లు. అతని తండ్రి నిజాం సైన్యంలో పనిచేసేవాడు. తండ్రి మరణానంతరం ఈ స్వీట్ షాప్ పెట్టాడాయన. కారణం తెలియదు కానీ... అది ‘వితవుట్ నేమ్’ స్వీట్‌షాప్. నేమ్ బోర్డ్ లేకపోయినా నిదానంగా ఆ స్వీట్‌షాప్ ప్రాచుర్యంలోకి రావడం మొదలైంది. దాని మిఠాయిలు ఇప్పుడు పాతబస్తీ కేంద్రంగా చవులూరిస్తున్నారుు. పాలు, నెయ్యి, పంచదార, కుంకుమపువ్వు... మరికొన్ని కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసిన దినుసులు కలిపి తయారు చేసే జౌజిహల్వా ఇక్కడ సూపర్ ఫేమస్. దీన్ని కట్టెల పొయ్యి మీద తక్కువ మంటతో 8 నుంచి 10 గంటల దాకా వండుతారు. కొద్దిగా జౌజిహల్వా నోట్లో వేసుకుంటే దాని రుచి చాలా సేపు మన నోటిని వదలదు. ఇక ఇక్కడి కేసరి లడ్డూ రుచి అద్భుతం అంటారు స్వీట్లవర్స్. ఇలాంటి వినూత్న రుచులనే ఆధారం చేసుకుని ఈ స్వీట్‌షాప్ పేరు శరవేగంగా విస్తరించింది. ఆ పేరంటే గుర్తొచ్చింది. ఈ షాప్‌కి తర్వాతి కాలంలో పేరు కూడా పెట్టారు. అది కూడా నామకరణం చేసింది ఎవరనుకున్నారు! ఏకంగా నిజాం నవాబు. దాని వెనుక ఓ చిన్న కథ ఉంది... ఈ షాప్ పేరు ఆ నోటా ఈ నోటా విన్న నిజాం నవాబు సైతం ఈ స్వీట్షాప్ని విజిట్ చేశాడట. అక్కడ మిఠాయిలు రుచి చూశారట. అద్భుతం అన్నారట. అంతేకాకుండా అంత టేస్టీ స్వీట్స్ విక్రయించే షాప్ అలా పేరు లేకుండా ఉండడం నచ్చక... అలా తిరిగి వెళ్లాక ఆ షాప్‌ని అభినందిస్తూ పురస్కారం పంపడమే కాక తన పుత్రుల్లో ఒకరి పేరును ఆ షాప్‌కి పెట్టమని అభ్యర్థిస్తూ స్వయంగా ఒక ఉత్తరం కూడా రాశాడట. అలా ‘హమీది కన్ఫెక్షనర్స్’ పేరు బోర్డెక్కిందట. నిజాం రాసిన ఉత్తరం, ఆయన పంపిన పురస్కారం ఆ షాప్‌లో మనకి ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి. ‘మేం ప్రారంభించినప్పుడు (దాదాపు తొంభై ఎనిమిదేళ్ల క్రితం) ఇక్కడ ఈ షాప్ ఒక్కటే ఉండేది. దీనికి వచ్చిన ప్రాచుర్యంతో మరికొన్ని వెలిశాయి. మేం షాప్ పెట్టిన కొంత కాలానికి ఇక్కడ మొజంజాహి మార్కెట్ ప్రారంభమైంది’ అంటూ షాప్ నిర్వాహకులు పాషా చెప్పుకొచ్చారు. - సంకల్ప్ -
టేస్ట్ స్పెషలిస్ట్
ఎంతటి నలభీములు వండిన పాకమైనా.. ముందు ఆయన టేస్ట్ చేయాల్సిందే.. ఆ నాలుక మెచ్చి.. ఆహా ఏమి రుచి అంటేనే.. దానికి ఆమోదముద్ర పడుతుంది. స్టార్ హోటళ్లు సైతం ఆయన ఓకే అంటే గానీ కొత్త వంటలను మెనూలో చేర్చుకోవు. రుచి చూడటమే ఆయన అభి‘రుచి’. ఇప్పుడదే ఆయన వృత్తి. నగరంలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లకు ఆయున విశిష్ట అతిథి. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు ఏం చేయకపోయినా.. ఈ టేస్ట్ స్పెషలిస్ట్ బడా చెఫ్లకే రుచుల పాఠాలు చెబుతున్నారు. రుచుల వేటలో ఐటీ ఉద్యోగాన్ని కూరలో కరివేపాకులా తీసిపారే సిన.. టేస్ట్ స్పెషలిస్ట్ సంకల్ప్ సిటీప్లస్‌తో పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే.. చిన్నప్పటి నుంచి తినడం అలవాటు చిన్నప్పటి నుంచి తినడం అలవాటుగా ఉండేది. స్కూల్లో చదివే రోజుల్లో ఈఎస్ఐ ఆస్పత్రి, వెంగళరావునగర్ ఏరియాలో నేను వెళ్లని హోటల్ లేదు. ఏ హోటల్‌కు వెళ్లినా.. ఏ రెసిపీని ఎలా తయారు చేస్తారో వంటగదిలోకి వెళ్లి చెఫ్‌లను అడిగి మరీ తెలుసుకునేవాడిని. నాకు నచ్చిన వంటకం గురించి ఇంటర్నెట్లో సమీక్షలు రాయడం ప్రారంభించాక గుర్తింపు మొదలైంది. మన నగరంలో వంటకాలపై పర్ఫెక్ట్ సమాచారం ఇవ్వాలనేది నా అభిమతం. ‘జొమాటో’ తొలి వేదిక పరపంచవ్యాప్తంగా విభిన్నమైన వంటకాలు, అవి దొరికే రెస్టారెంట్లపై సమాచారం ఇచ్చే వెబ్సైట్ ‘జొమాటో’ నా తొలి వేదిక. బయట తిన్న ప్రతిసారీ ‘జొమాటో’లో విశ్లేషణలు రాసేవాడిని. కొద్దిరోజులకే ఫాలోవర్స పెరిగారు. నగరంలో దాదాపు 500 పైగా హోటళ్లు, రెస్టారెంట్లలో లభించే వంటకాలపై సమీక్షలు రాశాను. దీంతో ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు నన్ను టేస్టింగ్ సెషన్సకు పిలుస్తున్నాయి. నా సూచనల మేరకు రెసిపీని మారుస్తారు. హైదరాబాద్‌లోనే కాదు, బెంగళూరు, చెన్నై, పుణే, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లోనూ టేస్టీ సెషన్స్‌కు వెళ్లాను. పలు కుకరీ షోలకు న్యాయ నిర్ణేతగానూ వ్యవహరించాను. త్వరలోనే హోటల్ పెడతా వండటం తెలుసా అని ప్రశ్నించే వారూ ఉన్నారు. త్వరలోనే ఒక హోటల్ పెడుతున్నా. రకరకాల వంటకాలు రుచి చూస్తున్నా.. దేవుడి దయ వల్ల ఇంతవరకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు రాలేదు. రోజూ ఉదయం 8 కిలోమీటర్లు పరిగెత్తుతాను. రాత్రి గ్లాసెడు మజ్జిగ తాగుతాను. ఎన్ని రుచులు చూసినా, ఇంట్లో అమ్మచేతి వంటకు సాటిరావు. అమ్మ వండిన టమాటా పప్పు, వంకాయ కూరకు మించిన రుచి మరొకటి ఉండదు. తినిపించడంలోనే ఆనందం తినిపించడంలోనే అసలైన ఆనందం ఉందని నమ్ముతా. హోటళ్లలో మిగిలిపోయిన వంటకాలను అనాథలకు పంచాలనే ఆలోచనను ఆర్గనైజ్డ్గా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా. ఇప్పటికే కొన్ని హోటళ్లు కూడా ఇందుకు ముందుకొచ్చాయి.