యూఎస్: ఇటీవల అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లి దురదృష్టవశాత్తూ అటునుంచటే అనంత లోకాలకు వెళ్ళిపోయారు ఐదుగురు. వారిలో పాకిస్తాన్ వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ అతని కుమారుడు కూడా ఉన్నారు. దావూద్ తన కుమారుడితో చివరిగా మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు ఆయన భార్య క్రిస్టీన్ దావూద్.
గంటలు గడిచే కొద్దీ..
పాకిస్తాన్ వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ అతని కుమారుడు సులేమాన్ దావూద్ సముద్ర గర్భంలోకి సాహసయాత్రకు వెళ్లగా వారు యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని తిరిగి వస్తారని పోలార్ ప్రిన్స్ (టైటాన్ జలాంతర్గామికి అనుబంధ పడవ) పైన క్రిస్టీన్ కూతురితో ఎదురుచూస్తూ ఉన్నారు. టైటాన్ జలాంతర్గామి తప్పిపోయిందనగానే ఏమాత్రం భయపడని ఆమె గతంలో కూడా ఒకసారి తన భర్త విమాన ప్రమాదం నుండి తప్పించుకున్నారని తాను ధైర్యం కూడదీసుకుని అందరికీ ధైర్యం చెప్పారు. కానీ ఎప్పుడైతే 96 గంటలు గడిచాయో అప్పుడే ఆశలు వదులుకున్నట్లు ఆమె తెలిపారు.
అమ్మా గిన్నిస్ రికార్డు సాధిస్తా..
ఈ సందర్బంగా చివరిగా తన భర్త, కుమారుడితో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ.. టైటానిక్ శకలాలను చూడటానికి వెళ్తున్నానని సులేమాన్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. తనతో పాటు రూబిక్ క్యూబ్ ని తీసుకుని వెళ్లి సముద్రగర్భంలో రూబిక్ క్యూబ్ అమర్చిన మొట్టమొదటిగా వ్యక్తిగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలని సంబరపడ్డాడని, అందుకోసం దరఖాస్తు కూడా చేశాడని తెలిపారు. ఆ సన్నివేశాన్ని రికార్డ్ చేయాలని తన భర్త తనతోపాటు కెమెరాని కూడా తీసుకు వెళ్లినట్లు చెప్పారు.
చివరికి..
వారు వెళ్లి 96 గంటలు గడిచాయని చెప్పగానే నాకు కీడు శంకించింది, విపత్తును గ్రహించాను. కానీ నా కూతురు మాత్రం వాళ్ళు తిరిగి వస్తారని నమ్మకంతోనే ఉంది. తీర రక్షక దళాలు జలాంతర్గామి శకలాలు కనిపించాయని చెప్పాక గాని తను నమ్మలేదని చెప్పి భావోద్వేగానికి గురయ్యారు.
Christine Dawood wanted to talk to the BBC and pay tribute to the son and husband she lost. #Titan
— Nomia Iqbal (@NomiaIqbal) June 25, 2023
Longer interview running on @BBCWorld on-air and online
🎥 @robtaylortv @EloiseAlanna pic.twitter.com/q1LW946xpn
ఇది కూడా చదవండి: ఒక్కరి కోసం రెండు విమానాలు.. అదే వెరైటీ..
Comments
Please login to add a commentAdd a comment