
వీడియో దృశ్యం
టైటానిక్ క్లైమాక్స్‌కు సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది...
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ అద్భుతమైన చిత్రం‘ టైటానిక్’. లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్‌లెట్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకుల మదిలో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకుంది. దాదాపు 12 ఏళ్ల పాటు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అగ్ర స్థానంలో నిలిచింది. 11 ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమాలోని ప్రతీ సీను ఓ వజ్రంలా ఉంటుంది. ఈ సినిమా మొదలు కూడా ఓ వజ్రం(హార్ట్ ఆఫ్ ది ఓషన్) కోసం అన్వేషణతో మొదలవుతుంది. ఆ వజ్రానికి సంబంధించిన సీనుతోనే ఎండ్ అవుతుంది. ( టైటానిక్ చూడ్డం అంటే అసహ్యం: హీరోయిన్ )
థియేటర్లలో విడుదలైన టైటానిక్ క్లైమాక్స్‌లో ముసలి రోస్ తన దగ్గర ‘హార్ట్ ఆఫ్ ది ఓషన్’ ఉందన్న సంగతిని ఎవ్వరికీ చెప్పకుండా సముద్రంలో పడేస్తుంది. టైటానిక్ క్లైమాక్స్‌కు సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టైటానిక్ భారీ విజయవాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఈ మరో క్లైమాక్స్ సీన్ వీడియోను డీవీడీ రూపంలో విడుదల చేశారు నిర్మాతలు. ఆ క్లైమాక్స్ సీన్‌లో ఏముందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
The alternate ending to Titanic is hilarious. This would have absolutely ruined the film for me pic.twitter.com/L3vSrSb72e
— Pat Brennan (@patbrennan88) February 16, 2021