‘అవతార్’కి మరో మూడు సీక్వెల్స్
‘అవతార్’కి మరో మూడు సీక్వెల్స్
Published Mon, Aug 5 2013 1:59 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
వరల్డ్ ఫేమస్ డెరైక్టర్ జేమ్స్ కేమరూన్ సినిమా అంటేనే ఓ అద్భుతం. ఆయన ప్రతి సినిమా ఓ క్లాసిక్కే. ‘టైటానిక్’ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే ఇతర చిత్రాలు టెర్మినేటర్, ఏలియన్స్, లేటెస్ట్ ‘అవతార్’ కూడా సెన్సేషనల్ మూవీసే. ప్రస్తుతం ఈ సంచలనాత్మక దర్శకుడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘అవతార్’కి సీక్వెల్స్ రూపొందించాలన్నదే ఆ నిర్ణయం. అవతార్ 2, 3, 4 చిత్రాలను ప్రేక్షకులకు అందించే పనిలో ఉన్నారాయన. 2016లో ఒకటి, 2017లో మరొకటి, 2018లో మరో సీక్వెల్ రానున్నాయట.
‘అవతార్’ ఓ అద్భుతం అయితే, దాన్ని మించేలా ఈ సీక్వెల్స్ ఉండాలనే పట్టుదలతో ఉన్నారట కేమరూన్. ఉన్నత సాంకేతిక విలువలతో, ఊహకందని మలుపులతో ఈ సీక్వెల్స్ ఉంటాయని కేమరూన్ పేర్కొన్నారు. ‘అవతార్’ చిత్రం క్లయిమాక్స్ వరకు ఏయే పాత్రలు బతికి ఉన్నాయో ఈ కొనసాగింపు చిత్రాల్లో ఆ పాత్రలన్నీ ఉంటాయట. మూడేళ్ల క్రితం విడుదలైన ‘అవతార్’ని ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేదు. ఈలోపు ఈ సీక్వెల్స్ ప్రకటన కామరూన్ సినిమాల అభిమానులను ఆనందానికి గురి చేస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Advertisement
Advertisement