టైటానిక్‌ చూడ్డం అంటే అసహ్యం: హీరోయిన్‌ | Hates Watching Titanic Now Says Kate Winslet | Sakshi

టైటానిక్‌ చూడ్డం అంటే అసహ్యం:‌ హీరోయిన్‌

Jan 8 2021 12:23 PM | Updated on Jan 8 2021 12:27 PM

Hates Watching Titanic Now Says Kate Winslet - Sakshi

కేట్‌ విన్‌స్లెట్

‘టైటానిక్‌’ సినిమాలోని హీరోయిన్‌ పేరు మనకు తెలియకపోయినా ఆమెను చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తాము. ఆ సినిమాకు ఉన్న క్రేజ్‌ అలాంటిది. రొమాంటిక్‌ డ్రామాలలో కల్ట్‌ క్లాసిక్‌ మూవీ అది. ఇందులో నటించిన హీరోయిన్‌ కేట్‌ విన్‌స్లెట్‌కు ఈ సినిమాతో సూపర్‌ పాపులారిటీ వచ్చింది. ఆస్కార్‌కు నామినేట్‌ అయింది కూడా. అయితే తనకు ఎంతో పాపులారిటీ తెచ్చిన సినిమాను చూడటం అంటే అసహ్యం అంటోంది కేట్‌. ఈ సినిమాను ఇప్పుడు సిగ్గుపడకుండా చూడలేనని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ( గ్రామీ అవార్డ్స్‌ వాయిదా)

కాగా, 1997లో రిలీజైన ఈ సినిమాకు  జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వం వహించారు. రెనాల్డో డెకాప్రియో, కేట్‌ విన్‌స్లెట్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. 14 విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్‌ అయిన ఈ సినిమా 2 అవార్డులను సొంతం చేసుకుంది. ఆ సంవత్సరానికి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దాదాపు చాలా సంవత్సరాల తర్వాత జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అవతార్‌’ సీక్వెల్‌లో కేట్‌ నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement