యువ హీరో రాజీవ్
కొవ్వూరు రూరల్ : ప్రముఖ సంగీత దర్శకులు కోటికి కుమారుడను, సాలూరు రాజేశ్వరరావుకు మనుమడను అరుునా తనకు సంగీతం అబ్బలేదని అంటున్నాడు యువ హీరో రాజీవ్. సినీ పరిశ్రమలో ఎవరి భవిష్యత్‌ను వారే తీర్చిదిద్దుకోవాలని చెప్పిన తండ్రి మాటలను స్ఫూర్తిగా తీసుకుని హీరోగా, అతిథి పాత్రలలో నటిస్తున్నాడు రాజీవ్. నోట్‌బుక్ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమై ప్రత్యేకత సాధించుకున్నాడు. కుమారదేవంలో టైటానిక్ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో ముచ్చటించాడు.
ప్ర: మీరు నటన వైపు ఎలా వచ్చారు
అదేంటో నాకు సంగీతం అబ్బలేదు. ఇంజినీరింగ్ చదివి అనుకోకుండా హీరో అయ్యూ
ప్ర :మీ సినిమాల్లో మీ నాన్నగారి ప్రభావం
నీ భవిష్యత్తు నీవే నిర్ణయించుకో అని నాన్న అన్నారు. కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు.
ప్ర :నటనలో శిక్షణ తీసుకున్నారా
విశాఖలో సత్యానంద్ వద్ద మూడు నెలలు శిక్షణ పొందాను.
ప్ర :మీరు న టించిన సినిమాలు
నోట్‌బుక్, మంచివాడు, ఆకాశమే హద్దు, చిన్ని చిన్ని ఆశ, ఓరి దేవుడాతో పాటు లవ్ యూ బంగారంలో అతిథి పాత్రలో నటించా. ప్రేమంటే సులువు కాదురా విడుదల కావాల్సి ఉంది. టైటానిక్ చిత్రం నిర్మాణ దశలో ఉంది.
ప్ర :మీ లక్ష్యం
తాతయ్య, నాన్నకు ఉన్న పేరును నిలబెడుతూ మంచి నటుడిగా రాణించడం.
ప్ర :మీ తోబుట్టువుల గురించి
అక్క బబితకు వివాహమైంది. తమ్ముడు రోషన్ సంగీత దర్శకుడిగా గాయకుడు, నిర్మలా కాన్వెంట్ చిత్రాలకు పనిచేశాడు.