'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత | Titanic And Lord Of The Rings Movies Actor Bernard Hill Passed Away At Age Of 79 | Sakshi
Sakshi News home page

Actor Bernard Hill Death: తుదిశ్వాస విడిచిన 'టైటానిక్' సినిమా నటుడు

Published Sun, May 5 2024 9:12 PM | Last Updated on Mon, May 6 2024 9:24 AM

Titanic Movie Actor Bernard Hill Passed Away

టైటానిక్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సినిమాలతో చాలా పేరు తెచ్చుకున్న నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. వృద్ధ్యాప్య సమస్యల కారణంగా ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈయన అభిమానులు, పలువురు నెటిజన్స్ సంతాపం తెలియజేస్తున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

యూకేకి చెందిన బెర్నార్డ్ హిల్.. దాదాపు ఐదు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. టీవీ, సినిమా, థియేటర్ రంగాల్లో నటుడిగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. హాలీవుడ్‌లో క్లాసిక్ సినిమాలైన 'టైటానిక్'లో షిప్ కెప్టెన్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ట్రాయాలజీలో కింగ్ పాత్రల్లో ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన ఇప్పుడు మనల్ని వదిలి వెళ్లిపోయారు.

(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement