ప్రపంచంలోని అత్యంత విషాదాల్లోఒకటి టైటానిక్ నౌక మునిగిపోయిన ఘటన. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక కథనాలు, విశేషాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. టైటానిక్‌లోప్రయాణించిన అత్యంత ధనవంతుడికి బంగారు పాకెట్ వాచ్ రికార్డు ధరకు అమ్ముడు కావడం వార్తల్లో నిలిచింది.
టైటానిక్ నౌక ప్రమాదంలో మరణించిన ,న్యూయార్క్‌లోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త , రియల్ ఎస్టేట్ డెవలపర్ జాన్ జాకబ్ ఆస్టర్ (47)కు చెందిన గోల్డ్ పాకెట్ వాచ్ వేలంలో సరికొత్త రికార్డు సృష్టించింది. జేజేఏ అనే లక్షరాలతో రూపొందించిన ఈ వాచ్ అమెరికాలోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ వేలం సంస్థ శనివారం నిర్వహించిన వేలంలో ఈ వాచీని రూ.12.17 కోట్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నారు. గతంలో వాలెస్ హార్ట్లీ బ్యాగ్‌ను , ఓడ మునిగిపోయేటపుడు బ్యాండ్‌మాస్టర్ వాయించిన ప్రసిద్ధ టైటానిక్ వయోలిన్‌ను కూడా వేలం వేశారు.
ఏప్రిల్ 15, 1912న సౌతాంప్టన్ నుండి న్యూయార్క్ నగరానికి బయలుదేరిన తొలి ప్రయాణంలో ఓడ మంచుకొండను ఢీకొట్టి ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమంలో1500 మందిమరణించారు. గర్భవతి అయిన జాకబ్ భార్య మడేలిన్ ప్రాణాలతో బయటపడింది. జాకబ్‌పై శరీరంపై గడియారం, బంగారు కఫ్‌లింక్‌లు, డైమండ్ రింగ్, డబ్బు, పాకెట్‌బుక్ తదితర వస్తువులను తరువాతి కాలంలో ఆస్టర్ కుమారుడు విన్సెంట్ ఆస్టర్‌కు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment