developer
-
JioHotstar: కోటి రూపాయలు ఇచ్చారంటే..: అంబానీకే ఆఫర్ ఇచ్చిన విద్యార్థి
ఢిల్లీ : ఓ విద్యార్థి తన ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ప్రతిసారీ ఏదో ఒక కారణంతో విఫలమయ్యేవాడు. కానీ ఈసారి గురి తప్పలేదు. యూ ఆర్ వెల్కమ్ అంటూ కేంబ్రిడ్జీ నుంచి ఆహ్వానం అందింది. త్వరలోనే విద్యార్థి ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సి ఉంది. అందుకే ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీకి ఓ ఆఫర్ ఇచ్చాడు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి? విద్యార్థి ఇచ్చిన ఆఫర్‌ను ముఖేష్ అంబానీ స్వీకరిస్తారా? లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? ఆ కథా కమామిషు ఏంటో ఏంటో తెలుసుకుందాం పదండి.రిలయన్స్,డిస్నీ మీడియా వ్యాపారాల విలీనానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రిలయన్స్, డిస్నీ విలీనానికి కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విలీనానంతరం డిస్నీప్లస్,హాట్‌స్టార్‌లో జియో సినిమాను విలీనం చేయబోతున్నారని, రెండు సంస్థలను కలిసి జియో హాట్‌స్టార్‌గా వ్యవహరించనున్నారని మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.జియోహాట్‌స్టార్ పేరుతో ఈ తరుణంలో ఢిల్లీకి చెందిన ఓ డెవలపర్ జియోహాట్‌స్టార్ పేరుతో డొమైన్ బుక్ చేశాడు. ఆదే జియోహాట్‌స్టార్ పేరు మీద వ్యపారావ్యవహారాలు కొనసాగించాలనుకున్న రిలయన్స్‌కు సదరు డెవలపర్ ఆఫర్ ఇచ్చాడు. జియోహాట్‌స్టార్ డొమైన్ పేరును బుక్ చేసుకుంది తానేనని, అది మీకు కావాలంటే ఇస్తాను. ఇందుకోసం మీరు నాకు రూ.కోటి ఇవ్వాలని రిలయన్స్ సంస్థకు లేఖ రాశాడు.కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ఆ లేఖలో.. నేను 2021లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ యాక్సిలరేట్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన డెవలపర్‌ని. ఐఐటీ పూర్తి చేయలేకపోయాను. అయినప్పటికీ నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకునేందుకు మొగ్గుచూపుతుంటాను. టైర్-2 కాలేజీ నుంచి వచ్చిన తనకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ వచ్చింది. ఆంత్రప్రెన్యూర్‌షిప్ విభాగంలో పూర్తి స్థాయి డిగ్రీని పూర్తి చేసేందుకు అవకాశం కలిగింది. కానీ ఆ డిగ్రీలో చేరాలంటే ఖరీదైన వ్యవహారం. నేను భరించలేను. కోటి ఇవ్వాలంటూఅందుకే జియోహాట్‌స్టార్ విలీనం చివరి దశలోకి వచ్చిందని తెలిసింది. వెంటనే జియోహాట్‌స్టార్.కామ్ డొమైన్‌ను నేను కొనుగోలు చేశారు. విలీనం అనంతరం జియోహాట్‌స్టార్‌గా మీరు వినియోగదారులకు సేవలందించాలంటే నేను కొనుగోలు చేసిన డొమైన మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నేను అడిగినంత మీరు ఇస్తే నా కలను సాకారం చేసినవారవుతారు. ఈ మొత్తం రిలయన్స్ ఖర్చుగా భావిస్తుందేమో కానీ ఇది నాకు జీవితాన్ని మార్చే అవకాశం’అని పేర్కొన్నాడు.మరి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ విద్యార్థి అడిగిన మొత్తం ఇస్తారా? లేదంటే సదరు విద్యార్థిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
ఆశ్చర్యపోయాను!.. భారతీయ విద్యార్థిపై 'టిమ్ కుక్' ప్రశంసలు
యాపిల్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024' (WWDC 2024) జూన్ 10 నుంచి 14 వరకు కాలిఫోర్నియాలో జరుగుతుంది. అయితే ఈ ఈవెంట్ ప్రారంభం కావడానికి ముందు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ గోవాలోని బిట్స్ పిలానీ కేకే బిర్లా కాలేజీలో చదువుతున్న 22 ఏళ్ల అక్షత్ శ్రీవాస్తవను కుక్ కలిశారు.టిమ్ కుక్.. భారతీయ విద్యార్థి, డెవలపర్ అయిన అక్షత్ శ్రీవాస్తవతో జరిపిన పరస్పర చర్యను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో 'స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్'లో గెలిచిన విద్యార్థి డెవలపర్లతో మాట్లాడాను. వారి క్రియేటివిటీ, ప్రదర్శనను చూడటం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు.నేను గత సంవత్సరం భారతదేశాన్ని సందర్శించినప్పుడు చాలా మంది గొప్ప డెవలపర్లను కలిశాను. ప్రజల జీవితాలను మెరుగుపరిచే అనేక మార్గాలు వారిలో ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఈ వారం అక్షత్‌ని కలవడం కూడా అంతే ఆశ్చర్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. క్లాసిక్ గేమ్‌ల పట్ల తనకున్న ప్రేమను తరువాత తరంతో పంచుకోవడానికి సరికొత్త మార్గాన్ని సృష్టించారు అని వెల్లడించారు.శ్రీవాస్తవ యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌లో భాగంగా మైండ్‌బడ్ అనే యాప్‌ను సమర్పించారు. ఇది తన మేనల్లుడితో పంచుకున్న ఉల్లాసభరితమైన క్షణాల నుంచి ప్రేరణ పొంది, ఈ యాప్‌ను రూపొందించినట్లు సమాచారం. మైండ్‌బడ్ పిల్లలు తమ కుటుంబం లేదా స్నేహితులతో కలిసి ఆనందించడానికి రూపొందించిన నాలుగు ఆకర్షణీయమైన చిన్న గేమ్‌లను కలిగి ఉంది.శ్రీవాస్తవ మైండ్‌బడ్‌ని సృష్టించడానికి స్విఫ్ట్‌యుఐ, ఎవికిట్ (ఆడియో), పెన్సిల్‌కిట్, ఫైల్‌మేనేజర్‌లను ఉపయోగించారు. కొత్త టెక్నాలజీలు అనుగుణంగా దీనిని రూపొందించారు.అక్షత్ శ్రీవాస్తవ కోవిడ్ సంక్షోభ సమయంలో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లోని సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పడకలను ట్రాక్ చేయడానికి ఒక యాప్‌ను అభివృద్ధి చేశారు. కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీల మీద ఆసక్తి కనపరిచిన శ్రీవాస్తవ యాపిల్ పార్క్‌లో జరిగే కార్యక్రమానికి 50 మంది విద్యార్థులలో ఒకరుగా వెళ్లారు.Kicking off #WWDC24 in the best way possible—meeting with student developers who won our Swift Student Challenge. It’s amazing to see their creativity and determination on full display! pic.twitter.com/b56k8kcGZs— Tim Cook (@tim_cook) June 9, 2024 -
టైటానిక్ ప్రమాదంలో మరణించిన వ్యాపారవేత్త గోల్డ్ వాచ్ వేలం : ధర తెలిస్తే
ప్రపంచంలోని అత్యంత విషాదాల్లోఒకటి టైటానిక్ నౌక మునిగిపోయిన ఘటన. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక కథనాలు, విశేషాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. టైటానిక్‌లోప్రయాణించిన అత్యంత ధనవంతుడికి బంగారు పాకెట్ వాచ్ రికార్డు ధరకు అమ్ముడు కావడం వార్తల్లో నిలిచింది. టైటానిక్ నౌక ప్రమాదంలో మరణించిన ,న్యూయార్క్‌లోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త , రియల్ ఎస్టేట్ డెవలపర్ జాన్ జాకబ్ ఆస్టర్ (47)కు చెందిన గోల్డ్ పాకెట్ వాచ్ వేలంలో సరికొత్త రికార్డు సృష్టించింది. జేజేఏ అనే లక్షరాలతో రూపొందించిన ఈ వాచ్ అమెరికాలోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ వేలం సంస్థ శనివారం నిర్వహించిన వేలంలో ఈ వాచీని రూ.12.17 కోట్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నారు. గతంలో వాలెస్ హార్ట్లీ బ్యాగ్‌ను , ఓడ మునిగిపోయేటపుడు బ్యాండ్‌మాస్టర్ వాయించిన ప్రసిద్ధ టైటానిక్ వయోలిన్‌ను కూడా వేలం వేశారు. ఏప్రిల్ 15, 1912న సౌతాంప్టన్ నుండి న్యూయార్క్ నగరానికి బయలుదేరిన తొలి ప్రయాణంలో ఓడ మంచుకొండను ఢీకొట్టి ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమంలో1500 మందిమరణించారు. గర్భవతి అయిన జాకబ్ భార్య మడేలిన్ ప్రాణాలతో బయటపడింది. జాకబ్‌పై శరీరంపై గడియారం, బంగారు కఫ్లింక్లు, డైమండ్ రింగ్, డబ్బు, పాకెట్‌బుక్ తదితర వస్తువులను తరువాతి కాలంలో ఆస్టర్ కుమారుడు విన్సెంట్ ఆస్టర్‌కు అప్పగించారు. -
మరో భారీ బ్యాంకు స్కాం: ఏకంగా రూ.3847 కోట్లకు ముంచేశారు
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను వేల కోట్లకు ముంచేసిన స్కాం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ముంబైకి చెందిన డెవలపర్ యూనిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసు నమోదు చేసింది. కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) కిషోర్ కృష్ణ అవర్‌సేకర్, ప్రమోటర్లు అభిజీత్ కిషోర్ అవర్‌సేకర్, ఆశిష్ అవర్‌సేకర్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) అభియోగాలు మోపింది. ముగ్గురు డైరెక్టర్లు, కొంతమంది గుర్తుతెలియని ప్రభుత్వోద్యోగులతోపాటు పలువురు అధికారులపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఎస్బీఐతోపాటు ఇతర, 15 బ్యాంకుల కన్సార్టియంనురూ. 3,847.58 కోట్ల మేరకు మోసం చేశారన్న ఆరోపణలపై సీబీఐఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ముంబైలోని స్ట్రెస్డ్ అసెట్స్ మేనేజ్మెంట్ బ్రాంచ్, ఎస్బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా గురువారం ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదైంది. ముంబైలోని తమవాణిజ్య శాఖలో మోసం జరిగిందని, నిందితులు కల్పిత లావాదేవీలు చేయడం, బ్యాంకును మోసం చేయడం, చట్టవిరుద్ధంగా, మోస పూరితంగా ఖాతాల పుస్తకాలను తారుమారు చేసి బ్యాంకు నిధులను స్వాహా చేశారని ఈ కేసులో, ఆగస్ట్ 17, 2023న, ఎస్బీఐ డీజీఎం (ముంబయి) రజనీకాంత్ ఠాకూర్, యూనిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, దాని డైరెక్టర్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. (మోదీజీ వచ్చే ఏడాదికి గొప్ప బర్త్‌డే గిఫ్ట్: ఫాక్స్‌కాన్ పోస్ట్ వైరల్) మొత్తం 23 బ్యాంకులు.. కానీ మొత్తం 23 బ్యాంకులున్నప్పటికీ, కేవలం 16 బ్యాంకులు మాత్రమే తమ అంచనా నష్టాలను నివేదించాయి. ఇందులో బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానంగా ఉన్నాయి. కాగా 2012లో జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత మంత్రాలయ భవనం పునరుద్ధరణ, కళానగర్‌లో థాకరే కుటుంబ బంగ్లా మాతోశ్రీ నిర్మాణం, దాదర్ టీటీ ఫ్లై ఓవర్, CSM సబ్వే లాంటి నిర్మాణాలకు యూనిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పాపులర్. (పండగ వేళ పసిడి పరుగు, వెండి ఎంత తగ్గిందంటే!) -
ఫోన్ బాధలు పడలేక: పన్నెండేళ్ల బుడతడి అరుదైన రికార్డు!
హరియాణాకు చెందిన బాలుడు అతి పిన్న వయస్కుడైన యాప్ డెవలపర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. పట్టుదల ఉండాలేగానీ, ఏదైనా సాధించవచ్చు అనడానికి నిదర్శనంగా 12 ఏళ్లకే ఈ ఘనతను సాధించాడు కార్తికేయ జఖర్. కేవలం యూట్యూబ్ ద్వారా మూడు లెర్నింగ్ యాప్‌లను స్వయంగా అభివృద్ధి చేయడం విశేషం. దీంతో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన యాప్ డెవలపర్‌గా రికార్డ్ సృష్టించాడు. ఝజ్జర్లోనికార్తికేయ జఖర్ జవవహర్ నవోదయ విద్యాలయంలో 8వ తరగతి చదువు కున్నాడు. ఎలాంటి శిక్షణ లేకుండానే మూడు లెర్నింగ్ అప్లికేషన్లను రూపొందించాడు. అంతేకాదు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీ కంప్యూటర్ సైన్స్‌లో BSc ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, స్కాలర్షిప్ కూడా గెలుచుకున్నాడు. ఇప్పుడు వర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. దీనిపై కార్తికేయ జఖర్ మాట్లాడుతూ కోడింగ్ ప్రక్రియలో మొబైల్ ఫోన్ హ్యాంగ్ అయి పోవడం, ఇలా చాలా సమస్యలు ఫేస్ చేశాను. అయితే యూట్యూబ్ సాయంతో ఫోన్‌ని ఫిక్స్ చేసుకుని మరీ చదువు కొనసాగించానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే జనరల్ నాలెడ్జ్ కోసం ఒకటి లూసెంట్ జి.కె. ఆన్లైన్, రెండోదిగా కోడింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ కోసం రామ్ కార్తీక్ లెర్నింగ్ సెంటర్, శ్రీరామ్ కార్తీక్ డిజిటల్ ఎడ్యుకేషన్ అనే మూడు యాప్‌లు రూపొందించానని తెలిపాడు ప్రస్తుతం 45,000 మందికి పైగా విద్యార్థులకు ఉచిత శిక్షణను అందిస్తున్నాడు. खेल, पढ़ाई व कला के बाद अब म्हारे बच्चे टेक्नोलॉजी में भी पूरे विश्व में हरियाणा का नाम रोशन कर रहे हैं। झज्जर के 12 वर्षीय छात्र कार्तिकेय ने लर्निंग ऐप विकसित कर सबसे कम उम्र के ऐप डेवलपर के रूप में गिनीज वर्ल्ड रिकॉर्ड बनाया है। उनके पूरे परिवार को बधाई एवं शुभकामनाएं। pic.twitter.com/1Twk0ZTW0o — Manohar Lal (@mlkhattar) August 5, 2022 (ఆగస్టు 15న ఓలా మరో సంచలనం: బీ రెడీ అంటున్న సీఈవో) కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆన్లైన్ తరగతులకు సుమారు రూ. 10వేల ఖరీదు చేసే మొబైల్ ఫోన్ కొనిచ్చారట కార్తికేయ తండ్రి. ఈ సమయంలో ఫోన్ స్క్రీన్ పాడై పోవడంతోపాటు, పలు సమస్యలొచ్చాయట. దీంతో తన మేధకు పదును పెట్టి మూడు యాప్స్ అభివృద్ధికి తెరతీశాడని జఖర్ తండ్రి అజిత్ జఖర్ చెప్పారు. తమ గ్రామంలో కరెంటు కోతలు, ఇంటర్నెట్, ఇతర సమస్యల సంక్షోభంలో కూడా అ మరోవైపు అతి పిన్న వయస్కుడైన యాప్ డెవలపర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన జఖర్‌పై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ట్విటర్లో ప్రశంసించారు కేవలం క్రీడలు, సంస్కృతి , కళలు మాత్రమే కాదు, హర్యానా యువత ప్రపంచ స్థాయిలో సాంకేతికతలో ప్రశంసనీయమైన పని చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. -
గూగుల్ కొత్త రూల్స్.. ఇక యాప్‌లు ఇన్స్టాల్ చేసేముందు అది తప్పనిసరి!
స్మార్ట్ ఫోన్లు వాడకం పెరిగినప్పటి నుంచి ప్రతీ సేవలు అరచేతిలోకి వచ్చాయనే చెప్పాలి. మనం ఆ సేవల కోసం ప్రత్యేకంగా సంబంధిత యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అసలు చిక్కంతా ఇక్కడే వచ్చింది. యాప్ ఇన్స్టాల్ చేసుకునే సమయంలో దానికి అవసరమైన అనుమతులను ఇచ్చేస్తాం. ఇలా చేయడం వల్ల యూజర్లకు సంబంధించిన విలువైన సమాచారం సైబర్ నేరాగాళ్ల చేతిలోకి వెళ్తోందని వాదనలు ఇటీవల గట్టిగానే వినిపిస్తున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. యాప్ డెవలపర్స్‌కు డేటా సేఫ్టీ పేరుతో కొత్త నిబంధన తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్ల డేటా భద్రతకు భరోసా కల్పించనుంది. యాప్ డెవలపర్లకు ఇది చేయాల్సిందే.. కొత్తగా విధించిన నిబంధనల ప్రకారం.. యూజర్లు యాప్‌లను ఇన్స్టాల్ చేసే సమయంలో యాప్ డెవలపర్ ఎలాంటి డేటా సేకరిస్తున్నారు, దాన్ని ఎవరితోనైనా పంచుకుంటున్నారా? అనే సమాచారాన్ని తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుంది. అలా డెవలపర్ అందించిన సమాచారాన్ని గూగుల్ చెక్ చేసి నిబంధనలు పాటించిన యాప్‌లను తీసుకుని వాటిని యూజర్‌కు తెలిసేలా ప్లేస్టోర్‌లో ఉంచుతుంది. ఒకవేళ యాప్ డెవలపర్ యూజర్ డేటా విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏ కార్యకలపాలు జరిపినా తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటుంది. అందుకు జూలై 20 నాటికి ప్రతి యాప్ డెవలపర్ డేటా సేఫ్టీ డ్యాకుమెంట్ని సమర్పించాలని గూగుల్ స్పష్టం చేసింది. ఒకవేళ డేటా సేఫ్టీ నిబంధనలను పాటించని యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. చదవండి: Reliance Jio: ట్రాయ్ రిపోర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియో ధన్ ధనా ధన్! -
సత్యా నాదెళ్ళకు సలహా ఇచ్చిన బుడతడు!
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్ళ ఇటీవల ఇండియా సందర్శించిన సందర్భంలో అనేకమంది ప్రముఖలు, పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో చర్చలు జరిపారు. అభివృద్ధికి సహకరించే ఎన్నో ప్రశ్నలు సంధించి సమాధానాలకోసం సహనంతో వేచి చూశారు. అయితే ఆయన ప్రశ్నలకు సమాధానంగాని, సలహాలు గాని ఇచ్చేందుకు పత్రికా ప్రతినిధులు, నిపుణులు వంటివారెవ్వరూ ముందుకు రాలేదు. అయితే ఓ ఎనిమిదేళ్ళ ఏస్ డెవలపర్ మాత్రం సత్యా నాదెళ్ళకు తనదైన శైలిలో సలహాలు, సూచనలను అందించి ఆహూతులనూ అబ్బుర పరిచాడు. సాధారణంగా ఎనిమిదేళ్ళ పిల్లలు అంటే వీడియో గేమ్ లు ఆడటంలో బిజీ బిజీగా గడుపుతుంటారు. కానీ ఈ ఎనిమిదేళ్ళ కుర్రాడు మాత్రం 'లెట్ దేర్ బి లైట్' పేరున ఓ కొత్త గేమింగ్ యాప్ ను అభివృద్ధి చేయడంలో బిజీగా ఉన్నాడు. ఈ గేమ్ లో వినియోగదారులు తమ పట్టణాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, కర్మాగారాల నిర్మాణం, వ్యవసాయ అభివృద్ధి వంటివి చేపట్టేలా రూపొందిస్తున్నాడు. అయితే ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేక స్థానంలో ఉన్న మీరు సైతం పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయం సమతుల్యతను కలిగి ఉండేలా ప్రయత్నిస్తే కాలుష్య పెరుగుదలను నియంత్రించే అవకాశం ఉంటుందని, దీంతో స్థిరమైన అభివృద్ధిని కూడ సాధించవచ్చని ఆ యువ డెవలపర్ తనదైన రీతిలో మైక్రోసాఫ్ట్ సీఈవో కు సలహా ఇచ్చాడు. ఇంకేముందీ... ఆ చిన్నారి మేధావి సలహాకు సరైన సమాధానం ఇవ్వాల్సి పని సత్యా నాదెళ్ళ వంతైంది. అంతేకాక ఆ ఛైల్డ్ డెవలపర్... తాను భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ సీఈవో కావాలని ప్రయత్నిస్తున్నానని, ప్రపంచంలోని అన్ని టెక్నాలజీ కంపెనీలు తన అధీనంలో పనిచేసేట్టు చేస్తానని చెప్పాడా వండర్ బాయ్... -
ఆదాయమే లక్ష్యంగా ‘ఆర్థిక మండలి’
ఐదు ప్రధాన విధులతో సీఎం అధ్యక్షతన ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: అంతర్గతంగా ఆదాయ వనరుల పెంపు, పెట్టుబడుల ఆకర్షణ, సింగపూర్ కంపెనీలకు కొత్త రాజధాని నిర్మాణ మాస్టర్ డెవలపర్ బాధ్యతలను కట్టపెట్టడమే లక్ష్యంగా ఆర్థికాభివృద్ధి మండలిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మండలికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత వహిస్తారు. మండలి కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్నే తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికంటే ముందు కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా ప్రాథమిక ఏర్పాట్లను ముమ్మరం చేయనుంది. ఆర్థికాభివృద్ధి మండలి ప్రధానంగా ఐదు విధులను నిర్వహించనుంది. అందులో భాగంగా ఆదాయ వనరుల సమీకరణతో పాటు నిధి నిర్వహణ సెల్, ప్రాజెక్టు మదింపు సెల్, స్పెషల్ పర్పస్ వెహికల్ సెల్, పెట్టుబడుల ప్రోత్సాహకం-ప్రాజెక్టు కోఆర్డినేషన్ సెల్, వ్యూహాత్మక ప్రణాళిక, విధాన ఆలోచన సెల్ ఉన్నాయి. మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులను ప్రైవేట్ సంస్థలకు కట్టపెట్టడం వంటి వాటిపైనా ఆర్థికాభివృద్ధి మండలి నిర్ణయం తీసుకుంటుంది. ఆదాయ వనరు ల సమీకరణ సెల్ ప్రధానంగా అంతర్గత ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించనుంది. ఇందులో భాగంగా పన్నుల స్థాయి పెంపు, పన్ను రేట్లు పెంపు, యూజర్ చార్జీల వసూలు చేసే మార్గాల గుర్తింపుతో పాటు.. ఆ చార్జీల పెంపు మార్గాలను గుర్తించనుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదాయం రాబట్టే మార్గాలను గుర్తించనుంది. నిధుల సమీకరణపై మండలి దృష్టి.. ప్రత్యేక రాష్ట్ర హోదా, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలపైనా, విదేశీ సంస్థల నుంచి రుణాల సేకరణపైనా ఆర్థికాభివృద్ధి మండలి దృష్టి పెడుతుంది. నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సేవలు, రాజధాని నగరం, స్మార్ట్ సిటీ, పారిశ్రామిక కారిడార్లకు స్పెషల్ పర్పస్ వెహికల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయ, అప్పులను అధ్యయనం చేయడంతో పాటు ఆయా సంస్థల ఆస్తులను విలువ కట్టి, వాటిని తాకట్టు పెట్టి నిధుల సమీకరణను కూడా ఆర్థికాభివృద్ధి మండలి చేయనుంది. రోడ్లు, నీరు, విద్యుత్, ఫైబర్, గ్యాస్ గ్రిడ్లను ఆ మండలి సమన్వయం చేస్తుంది. ప్రైవేట్ రంగం పెట్టుబడుల ద్వారా ఆర్థిక ప్రగతి సాధించడంపైనా మండలి ప్రధాన దృష్టి సారించనుంది. దీర్ఘకాలిక అభివృద్ధిలో భాగంగా వాణిజ్య పరంగా పోటీ పెంచేందుకు సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్‌ప్రైజెస్‌ను కన్సల్టెంట్‌గా నియమించనున్నారు. పాత చట్టమే కొత్తగా.. పదిహేనేళ్ల క్రితం చంద్రబాబు పాలనలో తీసుకొచ్చిన ఇలాంటి చట్టంలోని పలు అంశాలపై పౌరసంఘాలు, ప్రజా సంస్థల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇపుడు ఆ చట్టాన్ని మొత్తంగా తెరపైకి తేకుండా.. కొన్ని అంశాల్ని మళ్లీ అమల్లోకి తీసుకురానున్నారు. 2001లో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్ చట్టం లోని కొన్ని కీలకాంశాల్ని యథాతథంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి చట్టంలోకి తీసుకురావాలని ప్రభుత్వ నిర్ణయించింది. 2001 చట్టంలోని సెక్షన్ 19లో రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీగానీ, స్థానిక అథారిటీగానీ డవలపర్ ఎంపికను నేరుగాగానీ, సంప్రదింపుల ద్వారాగానీ లేదా స్విస్ చాలెంజ్ విధానంలోగానీ, పోటీ విధానంలోగానీ చేయవచ్చునని ఉంది. ఇపుడు ఆ సెక్షన్‌తో పాటు అవసరమైన మరిన్ని సెక్షన్లను తీసుకుని కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ మండలి చట్టం తీసుకురానున్నారు. ఇలా మాస్టర్ డవలపర్ బాధ్యతను సింగపూర్ కంపెనీలకు అప్పగించాలని సీఎం భావిస్తున్నారు. ముసాయిదా రూపకల్పనకు 21 మంది నిపుణులను నియమించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 17వ తేదీ గడువుతో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆర్థిక శాఖ ఈ నెల 2న నోటిఫికేషన్ జారీ చేసింది.