12-Year-Old From Haryana Creates 3 Apps and a Guinness World Record - Sakshi
Sakshi News home page

Kartikeya Jakhar: ఫోన్‌ బాధలు పడలేక: పన్నెండేళ్ల బుడతడి అరుదైన రికార్డు!

Published Sat, Aug 6 2022 1:44 PM | Last Updated on Sat, Aug 6 2022 3:33 PM

12 year old from Haryana creates 3 apps and a Guinness World Record - Sakshi

హరియాణాకు చెందిన బాలుడు అతి పిన్న వయస్కుడైన యాప్ డెవలపర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు.  పట్టుదల ఉండాలేగానీ, ఏదైనా సాధించవచ్చు అనడానికి నిదర్శనంగా 12 ఏళ్లకే ఈ ఘనతను సాధించాడు కార్తికేయ జఖర్‌. కేవలం యూట్యూబ్‌ ద్వారా మూడు లెర్నింగ్ యాప్‌లను స్వయంగా అభివృద్ధి చేయడం విశేషం. దీంతో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన యాప్ డెవలపర్‌గా రికార్డ్‌ సృష్టించాడు.

ఝజ్జర్‌లోనికార్తికేయ జఖర్‌ జవవహర్ నవోదయ విద్యాలయంలో 8వ తరగతి చదువు కున్నాడు. ఎలాంటి శిక్షణ లేకుండానే మూడు లెర్నింగ్ అప్లికేషన్‌లను రూపొందించాడు. అంతేకాదు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీ కంప్యూటర్ సైన్స్‌లో BSc ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, స్కాలర్‌షిప్ కూడా గెలుచుకున్నాడు. ఇప్పుడు వర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. 

దీనిపై  కార్తికేయ జఖర్‌ మాట్లాడుతూ కోడింగ్ ప్రక్రియలో మొబైల్ ఫోన్ హ్యాంగ్ అయి పోవడం, ఇలా చాలా సమస్యలు ఫేస్‌ చేశాను. అయితే  యూట్యూబ్‌ సాయంతో ఫోన్‌ని ఫిక్స్‌ చేసుకుని  మరీ చదువు కొనసాగించానని చెప్పుకొచ్చాడు.  ఈ క్రమంలోనే జనరల్ నాలెడ్జ్ కోసం ఒకటి లూసెంట్ జి.కె. ఆన్‌లైన్‌, రెండోదిగా కోడింగ్, గ్రాఫిక్ డిజైనింగ్‌ కోసం రామ్ కార్తీక్ లెర్నింగ్ సెంటర్, శ్రీరామ్ కార్తీక్ డిజిటల్ ఎడ్యుకేషన్ అనే మూడు యాప్‌లు రూపొందించానని తెలిపాడు  ప్రస్తుతం 45,000 మందికి పైగా విద్యార్థులకు ఉచిత శిక్షణను అందిస్తున్నాడు.

(ఆగస్టు 15న ఓలా మరో సంచలనం: బీ రెడీ అంటున్న సీఈవో)

కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ తరగతులకు సుమారు రూ. 10వేల ఖరీదు చేసే మొబైల్ ఫోన్‌ కొనిచ్చారట కార్తికేయ తండ్రి. ఈ సమయంలో ఫోన్ స్క్రీన్ పాడై పోవడంతోపాటు, పలు సమస్యలొచ్చాయట. దీంతో తన మేధకు పదును పెట్టి మూడు యాప్స్‌ అభివృద్ధికి తెరతీశాడని జఖర్‌ తండ్రి అజిత్ జఖర్ చెప్పారు.  తమ గ్రామంలో కరెంటు కోతలు, ఇంటర్నెట్‌,  ఇతర సమస్యల సంక్షోభంలో కూడా అ మరోవైపు అతి పిన్న వయస్కుడైన యాప్ డెవలపర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్  క్రియేట్‌ చేసిన జఖర్‌పై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ట్విటర్‌లో ప్రశంసించారు కేవలం క్రీడలు, సంస్కృతి , కళలు మాత్రమే కాదు, హర్యానా యువత ప్రపంచ స్థాయిలో సాంకేతికతలో ప్రశంసనీయమైన పని చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement