record price
-
టైటానిక్ ప్రమాదంలో మరణించిన వ్యాపారవేత్త గోల్డ్ వాచ్ వేలం : ధర తెలిస్తే
ప్రపంచంలోని అత్యంత విషాదాల్లోఒకటి టైటానిక్ నౌక మునిగిపోయిన ఘటన. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక కథనాలు, విశేషాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. టైటానిక్‌లోప్రయాణించిన అత్యంత ధనవంతుడికి బంగారు పాకెట్ వాచ్ రికార్డు ధరకు అమ్ముడు కావడం వార్తల్లో నిలిచింది. టైటానిక్ నౌక ప్రమాదంలో మరణించిన ,న్యూయార్క్‌లోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త , రియల్ ఎస్టేట్ డెవలపర్ జాన్ జాకబ్ ఆస్టర్ (47)కు చెందిన గోల్డ్ పాకెట్ వాచ్ వేలంలో సరికొత్త రికార్డు సృష్టించింది. జేజేఏ అనే లక్షరాలతో రూపొందించిన ఈ వాచ్ అమెరికాలోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ వేలం సంస్థ శనివారం నిర్వహించిన వేలంలో ఈ వాచీని రూ.12.17 కోట్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నారు. గతంలో వాలెస్ హార్ట్లీ బ్యాగ్‌ను , ఓడ మునిగిపోయేటపుడు బ్యాండ్‌మాస్టర్ వాయించిన ప్రసిద్ధ టైటానిక్ వయోలిన్‌ను కూడా వేలం వేశారు. ఏప్రిల్ 15, 1912న సౌతాంప్టన్ నుండి న్యూయార్క్ నగరానికి బయలుదేరిన తొలి ప్రయాణంలో ఓడ మంచుకొండను ఢీకొట్టి ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమంలో1500 మందిమరణించారు. గర్భవతి అయిన జాకబ్ భార్య మడేలిన్ ప్రాణాలతో బయటపడింది. జాకబ్‌పై శరీరంపై గడియారం, బంగారు కఫ్లింక్లు, డైమండ్ రింగ్, డబ్బు, పాకెట్‌బుక్ తదితర వస్తువులను తరువాతి కాలంలో ఆస్టర్ కుమారుడు విన్సెంట్ ఆస్టర్‌కు అప్పగించారు. -
ఆర్ఎన్ఆర్ ధాన్యం @ రూ.3,545
సాక్షి, హైదరాబాద్: ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర రికార్డు సృష్టించింది. క్వింటాల్ ధర రూ.3,545 పలికింది. మహబూబ్‌గర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ చర్రితలో ఎన్నడూలేని విధంగా భారీ స్థాయి లో రేట్లు పలుకుతున్నాయి. గత సీజన్లో క్వింటాకు రూ.2,600 మాత్రమే పలికింది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ. 2,203 ఉండగా... మార్కెట్లో రూ. వెయ్యి నుంచి రూ.1,200 అధికంగా వస్తున్నది. బీపీ టీని అంతగా సాగు చేయకపోవడంతో సన్నాలకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్, మిర్యాలగూడతోపాటు ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి అవుతోంది. అన్ని మార్కెట్లలోనూ పెద్ద మొత్తంలో ధర లభిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు జిల్లా వరకే ఈ సీజన్లో 1.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 3.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. రాష్ట్ర మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ధరలు పలుకుతుండటం, రైతులు మార్కెట్‌కు క్యూ కట్టారు. దీంతో మార్కెట్‌కు ధాన్యం పెద్దఎత్తున అమ్మకానికి వస్తోంది. ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఆర్ఎన్ఆర్ సన్నరకాలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు ధరలను పెంచి కొనుగోలు చేస్తున్నారు. ఆర్ఎన్ఆర్ (తెలంగాణ సోన) ఈరకం బియ్యం సన్నగా ఉండటం, క్వాలిటీ బాగా ఉండటం, నూనె శాతం తక్కువ, షుగర్ పేషంట్లకు బాగుంటుందని డిమాండ్ పెరింగింది. గతంలో వేసే బీపీటీ (సోనా రకం) ధాన్యాన్ని రైతులు అంతగా సాగుచేయకపోవడం కూడా ఈ సన్నాలకు డిమాండ్ అధికంగా వస్తున్నది. అయితే యాసంగిలో ఎక్కువశాతం 1010 దొడ్డురకం ధాన్యం సాగుచేసే అవకాశం ఎక్కువగా ఉండటంతో వచ్చే సీజన్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు సన్నరకాలకు ధరలు అధికంగా పెట్టి కొనుగోలు చేస్తున్నారు. -
బీపీటీకి భలే గిరాకీ
అవనిగడ్డ: బీపీటీ ధాన్యానికి రికార్డు స్థాయిలో ధర పలుకుతుండడంతో ‘దివిసీమ’ రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా వర్షాభావ పరిస్థితుల్లో సైతం అధిక దిగుబడులు రావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి మండలాల్లో ఈ ఏడాది 62,548 ఎకరాల్లో బీపీటీ–5204 వరి రకాన్ని సాగు చేశారు. ఈ సంవత్సరం సరిగా వర్షాలు పడకపోయినా ఇరిగేషన్‌శాఖ అధికారులు రైతులను సమన్వయ పరచి వంతుల వారీ విధానం ద్వారా సాగునీరు అందించారు. దివిసీమలోని పలు ప్రాంతాల్లో నాలుగు రోజుల నుంచి యంత్రాలతో వరికోత పనులు ముమ్మరం చేశారు. గతేడాది కంటే ఈ సంవత్సరం ఎకరాకు ఐదు బస్తాల దిగుబడి పెరిగినట్లు కోడూరుకు చెందిన రైతులు తెలిపారు. 2014తో పోలిస్తే రెట్టింపైన ధర.. 2014–15 చంద్రబాబు పాలనలో సాధారణ వరి రకం క్వింటా రూ.1,360 ఉండగా, బస్తా ధాన్యం రూ.850కి కొనుగోలు చేశారు. ఏ గ్రేడ్ రకం క్వింటా రూ.1,400 ఉండగా బస్తా ధాన్యం రూ.950కి కొన్నారు. 2022–23 నాటికి సాధారణ రకం రూ.2,040 ఉండగా, ఏ గ్రేడ్ రకం రూ.2,060 ఉంది. 2023–24లో సాధారణ రకం రూ.2,183 ఉండగా, ఏ గ్రేడ్ రకం రూ.2,203 ఉంది. అంటే 2014తో పోలిస్తే సాధారణ రకానికి క్వింటాల్‌కు రూ.823 ధర పెరగ్గా, ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్‌కు రూ.803 ధర పెరిగింది. 2014తో పోలిస్తే సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో బస్తాకు ధర రెట్టింపు స్థాయిలో పెరిగింది. కాగా, గతేడాది «కోతల తరువాత నాలుగైదు నెలలకు బస్తా రూ.1,800 ధర పలకగా, నేడు యంత్రాలతో కోసిన ధాన్యాన్ని కల్లంలోనే రూ.1,820కు కొంటుండడంతో రైతులు పట్టరాని ఆనందంలో ఉన్నారు. మిషన్కోత ధాన్యం ఇంత ధర పలకడం ఎప్పుడూ చూడలేదు.. ఆరున్నర ఎకరాల్లో వరిపంట సాగు చేశాం. మిషన్‌తో వరికోత కోశాం. ఎకరాకు 35 బస్తాల దిగుబడి వచి్చంది. బస్తా ధాన్యం రూ.1,820కి అమ్మేశాం. మిషన్కోత ధాన్యం ఇంత రేటు పలకడం నేను ఎప్పుడూ చూడలేదు. –మాలే రాధాకృష్ణ, ఇస్మాయేల్బేగ్పేట, కోడూరు మండలం ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు.. రెండెకరాలు కౌలుకు సాగు చేశాను. గతేడాదితో పోలిస్తే ఖర్చులు తగ్గి.. దిగుబడులు పెరిగాయి. యంత్రాలతో కోసిన ధాన్యంను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తున్నారు. గతేడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువ ధరకు కొంటున్నారు. – జుజ్జువరపు రామస్వామి, కౌలురైతు, వెంకటాపురం, మోపిదేవి మండలం -
కోట్ల ధర పలికిన జత ఎద్దులు
-
ఎకరానికి వంద కోట్లు.. కోకాపేట వేలంలో ఆల్‌టైం రికార్డు!
సాక్షి, హైదరాబాద్: నిధుల సమీకరణలో భాగంగా గండిపేట మండలం కోకాపేటలో హెచ్ఎండీఏ చేపట్టిన భూముల అమ్మక ప్రక్రియ సంచలనాలకు నెలవైంది. కోకాపేట నియోపోలీస్ లే అవుట్ భూముల ధరలు అంచనాలకు మించి పలికాయి. అత్యధిక ధరతో ఆల్ టైం రికార్డు నెలకొల్పడమే కాకుండా.. హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక రేటుకి భూమి అమ్ముడుపోయిన రికార్డూ నెలకొన్నట్లు తెలుస్తోంది. కోకాపేట భూముల్లోని నియోపోలీస్ లే అవుట్‌లోని 6,7,8,9, 10, 11, 12, 13, 14 ప్లాట్లకు గురువారం వేలం వేసింది హెచ్ఎండీఏ. ప్లాట్ నెంబర్ 10లో 3.60 ఎకరాలు ఉండగా.. ఎకరాకి రూ. 100.75 కోట్లు వేలంలో పలికింది. ఈ ఒక్క ప్లాట్‌తోనే రూ.360 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక భూమి రేటుగా భావిస్తున్నారు. అత్యల్పంగా ఎకరానికి రూ.67.25 కోట్లు వచ్చాయి. ఈ ప్లాట్లలోని భూముల్లో ఎకరానికి.. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర రూ. 35 కోట్లుగా ఉంది. అయితే.. కోటాపేట భూముల్లో.. గజం ధర సరాసరి రూ.1.5 లక్షలు పలికింది. మొత్తంగా 45 ఎకరాల్లో(45.33 ఎకరాలు) ఉన్న ఏడు ప్లాట్లతో రూ.2,500 కోట్ల వరకు సమీకరించుకోవాలనుకుంది హెచ్ఎండీఏ. కానీ, సగటున రూ.73.23 కోట్లతో మొత్తంగా రూ.3,319 కోట్లు సమీకరించుకోగలిగింది. -
మదనపల్లి మార్కెట్ యార్డులో కిలో టమాటా రూ.196
సాక్షి, మదనపల్లె: మదనపల్లె మార్కెట్ చరిత్రలో పాత రికార్డులన్నింటినీ బద్దలు కడుతూ.. తాజాగా టమాటా కిలో రూ.196 ధర పలికింది. టమాటా ధర మరింత పెరుగుతూ రికార్డుల మోత మోగిస్తోంది. మార్కెట్లో ఇప్పటికే ఆకాశాన్ని అంటిన టమాటా ధర.. తాజాగా శనివారం మరింత పెరిగింది. మొదటి రకం టమాటాకు ఈ రేటు పలకగా.. నాణ్యత కాస్త తక్కువగా ఉన్న టమాటాలకు కిలో రూ.140 పలికింది. మార్కెట్‌కు తక్కువ మొత్తంలో సరుకు రావడంతో ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దేశం మొత్తం మీద ప్రస్తుతం టమాటా మదనపల్లె, పలమనేరు, పుంగనూరు, గుర్రంకొండ, అంగళ్లు, ములకలచెరువు.. కర్ణాటకలోని కోలారు, వడ్డిపల్లె మార్కెట్లలో మాత్రమే లభ్యమవుతోంది. దేశవ్యాప్తంగా టమాటాకు ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా ఢిల్లీ, పశ్చిమబెంగాల్, చత్తీస్గడ్, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఈ ప్రాంతాల్లో మకాం వేసి అధిక ధరలకు టమాటాను కొనుగోలు చేస్తున్నారు. వచ్చిన సరుకు వచ్చినట్లే అధిక ధరలకు అమ్ముడవుతుండటంతో తీసుకొచ్చిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బాబు అండ్ బ్యాచ్ ఓవరాక్షన్.. నిర్మల సీతారామన్ చెప్పింది విన్నారా? రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో మదనపల్లె మార్కెట్లో రైతుల నుంచి సగటున కిలో రూ.104 చొప్పున టమాటా కొనుగోలు చేసి రైతు బజార్లలో సబ్సిడీ ధరలకు కిలో రూ.50 చొప్పున విక్రయిస్తోంది. ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలు మరో నెలవరకు ఇలాగే కొనసాగుతాయని, అప్పటికి మదనపల్లె మార్కెట్లో సీజన్ పూర్తయితే అనంతపురం, డోన్, గుత్తి మార్కెట్లలో సరుకు లభ్యత వస్తుందన్నారు. -
కాకినాడలో కాస్ట్లీ చేప.. వేలంలో రికార్డు ధరకి!
సాక్షి, కాకినాడ: కుంభాభిషేకం రేవు వద్ద అరుదైన చేప సందడి చేసింది. ఔషధ గుణాలుండే కచ్చిడి చేప వేలంలో 3 లక్షల 10 వేలు ధర పలికింది. ఈ వేలంలో మధ్యవర్తికి రూ.25 వేల రూపాయలు దక్కింది. సముద్రంలో అరుదుగా లభిస్తుంది ఈ కచ్చిడి చేప. మత్స్యకారులు దీన్నొక వరంగా భావిస్తారు. ఈ చేప లోపల ఉండే బ్లాడర్కి డిమాండ్ ఉండడంతో ధర ఎక్కువగా వస్తుంటుంది. అందుకే.. పాతిక కేజీల బరువున్న చేపను అత్యధికంగా మూడు లక్షలకు పైగా వెచ్చించి కొనుగోలు చేశాడు. గతంలోనూ ఇదే తరహాలో అమ్ముడుపోయినా.. ఈ స్థాయిలో అమ్ముడుపోవడం ఇదే తొలిసారని చెబుతున్నారు. అనేక వ్యాధులకు తయారు చేసే ఔషధాల్లో ఈ కచ్చిడి చేపను వాడతారు. పిత్తాశయం, ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులకు మందులు తయారీకి చేప లోపల ఉండే బ్లడర్ ఎక్కువ ఉపయోగిస్తారని డాక్టర్లు చెబుతున్నారు. -
16 ఏళ్ల నాటి ఐఫోన్ రూ. 1.3 కోట్లు.. దీని ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ధర ఎక్కువైనా కొనేందుకు యువత ఆసక్తి చూపిస్తుంటారు. యూజర్ల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడల్లను యాపిల్ సంస్థ మార్కెట్లోకి తీసుకొస్తోంది. ప్రస్తుత తాజా మోడల్ ఐఫోన్ 15 హవా నడుస్తోంది. అయితే 2007లో విడులైన మొదటి తరం ఐఫోన్ తాజాగా జరిగిన వేలంలో రూ. 1.3 కోట్లకు (158,000 డాలర్లు) అమ్ముడుపోయింది.ఇప్పటివరకు వేలంలో అమ్ముడుపోయిన అత్యంత విలువైన ఐఫోన్‌గా ఇది కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఐఫోన్‌కు టెక్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈ ఫోన్ రూపొందించడంలో పాలుపంచుకున్న ఇంజనీర్లలో ఒకరికి చెందినది. మొదటి తరం ఐఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్, టచ్‌స్క్రీన్ ఇంటర్ఫేస్, ఆసక్తికరమైన ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను విప్లవాత్మకంగా మార్చారు. కాగా వేలానికి ఉంచిన ఈ ఐఫోన్ 16 ఏళ్లయినా ఇప్పటికీ అంతే కొత్తగా ఉంది. అందుకే వేలంలో అత్యధిక విలువను దక్కించుకుంది. ఇదీ చదవండి ➤ మొబైల్ నంబర్.. మీకు నచ్చినట్టు.. ఈ ఐకానిక్ ఐఫోన్ 4జీబీ వెర్షన్‌ను ఎల్సీజీ సంస్థ వేలం వేసింది. 50,000 డాలర్ల నుంచి 100,000 డాలర్లు (రూ.41 లక్షలు నుంచి రూ.82 లక్షలు) మధ్య అమ్ముడుపోతుందని ఈ సంస్థ అంచనా వేసింది. అయితే అనూహ్యంగా 158,644 డాలర్లకు అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ. 1.3 కోట్ల భారీ ధరను దక్కించుకుని కొత్త రికార్డు సృష్టించింది. వాస్తవానికి 2007లో విడుదలైన మొదటి తరం ఐఫోన్ 4జీబీ వర్షన్ ధర కేవలం 499 డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 40 వేల కంటే తక్కువే. ఈ ఐఫోన్ మార్కెట్లోకి వచ్చిన 16 ఏళ్ల తర్వాత 318 రెట్లు అధిక ధరకు అమ్ముడుపోవడం విశేషం. -
పులస సీజన్ వచ్చేసింది.. రికార్డులు షురూ
సాక్షి, కాకినాడ: అత్యంత అరుదైన.. విలువైందిగా భావించే చేప ‘పులస’ సీజన్ మొదలైంది. యానాం గోదావరికి ఎర్ర నీరు పోటెత్తిన సమయంలోనే పులసలు లభ్యమవుతాయని తెలిసిందే. ఈ క్రమంలో మార్కెట్లోకి మొదటి చేప వచ్చి.. మాంచి రేటుకే అమ్ముడుపోయింది. తాజాగా కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు వారం తర్వాత మొట్టమొదటి పులస వలకి చిక్కిందట. రెండు కేజీల దాకా బరువు ఉన్న దీనిని రూ.15 వేల రూపాయలకు అమ్మినట్లు మహిళ చెబుతోంది. పులసల కోసం కాకినాడ, రాజమండ్రి నుంచే కాదు.. హైదరాబాద్ నుంచి కూడా జనం వస్తుంటారని సదరు మహిళ అంటోంది. దీంతో ఈ ఏడాది పులస గరిష్టంగా ఏ రేటుకు అమ్ముడుపోతుందో అనే ఆసక్తి నెలకొంది. గోదావరి జిల్లాల్లో ‘పుస్తెలు అమ్మినా సరే.. పులస తినాలి’ అని నానుడి. పులస చేప దొరకడమే చాలా అరుదు.. అందుకే జీవితంలో ఒక్కసారైనా పులస చేపను తినాలని భావిస్తుంటారు. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. దీంతో ఎంత రేటైనా కొనుగోలు చేసేందుకు జనం వెనుకాడరు. పులసలు.. గోదావరి నదిలో మాత్రమే లభిస్తుంటాయి. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస చేప’ అంటారు. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. గోదావరి వరదనీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. వలలో పడిన వెంటనే చనిపోవడం, రెండురోజులైనా పాడవకుండా ఉండడం కూడా పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారి పులసగా మారుతోంది. అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి. -
కర్నూలు మిర్చికి రికార్డు ధర.. క్వింటా రూ.50,618..
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి ధర బంగారంతో పోటీగా పెరుగుతోంది. ఈ నెల 18న గరిష్టంగా క్వింటా మిర్చి ధర రూ.48,699లు పలకగా, దానిని అధిగమిస్తూ సోమవారం రికార్డు స్థాయిలో రూ.50,618లకు చేరింది. వెల్దుర్తి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన మోహన్ అనే రైతు క్వింటా మిర్చిని మార్కెట్‌కు తెచ్చారు. మార్కెట్లో 309 లాట్లు ఉండగా.. మోహన్‌కు చెందిన లాట్‌కు రూ.50,618 ధర లభించింది. మద్దూరుకు చెందిన ప్రవీణ్ అనే రైతు తీసుకొచ్చిన మిర్చి క్వింటా రూ.49,699లు పలికింది. కర్నూలు మార్కెట్ యార్డులో సోమవారం క్వింటాకు కనిష్టంగా రూ.3,519, గరిష్టంగా రూ.50,618, మోడల్ ధర రూ.20,589లు చొప్పున నమోదైంది. రోజురోజుకూ ధర అనూహ్యంగా పెరుగుతుండటంతో గోడౌన్లలో నిల్వ చేసిన మిర్చిని రైతులు పెద్దఎత్తున మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. మిర్చి ధరలు 2021–22 నుంచి ఆశాజనకంగా ఉండటంతో 2022–23లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1.28 లక్షల ఎకరాల్లో మిర్చి సాగుచేశారు. చదవండి: చుక్కల భూములపై.. రైతులకు పూర్తి హక్కులు -
ఆకాశమే హద్దురా.. అక్కడి ప్లాటు ధరలకు రెక్కలు.. ఏకంగా 5 రెట్లు పెరగడంతో..
ముంబై: రియల్ ఎస్టేట్ రంగం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో ప్రాపర్టీ డిమాండ్ బట్టి కోట్లు సంపాదిస్తారు, ఒక్కో సారి కొనేవాళ్లు లేక అదే స్థాయిలో నష్టపోతూ ఉంటారు.అయితే ఇటీవల ప్రజలు సొంత ఇళ్లు లేదా ఫ్లాట్ కొనుగోలుపై ఆసక్తి చూపడంతో రియల్టర్ల పంట పండుతోంది. తాజాగా నేవీ ముంబైలోని ఫ్లాట్ల ధరలకు రెక్కలు రావడంతో అవి ఒక్క సారిగా ప్రారంభ ధర కంటే 5 రేటు పెరిగి అందరనీ ఆశ్చరపరిచింది. బాబోయ్.. ప్లాటు ధరలకు రెక్కలు సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) నవీ ముంబైలోని ఓ ప్రాంతానికి సంబంధించిన 28 ప్లాట్లను బ్లాక్‌లో ఉంచింది. అయితే ఊహించని విధంగా ఆ ప్లాటు ఒక చదరపు మీటరుకు రూ. 5.54 లక్షలు వసూలు చేసింది. ఇ-వేలం ఈ ఇరవై ఎనిమిది ప్లాట్లు గాను సిడ్కో దాదాపు రూ.1,365 కోట్లను ఆర్జించనుంది. గతంలో దీని ప్రారంభ ధర రూ.1.14 లక్షలుగా నిర్ణయించగా ప్రస్తుతం రయ్ అంటూ దూసుకుపోయి ఐదు రెట్లు ఎక్కువగా పలుకుతోంది. సెక్టార్ 20, పామ్ బీచ్ రోడ్, సన్పాద వద్ద ఉన్న సుమారు 1.3 ఎకరాల ప్లాట్ (5,526 చదరపు మీ) రూ. 306 కోట్లు బిడ్‌ను దక్కించుకుంది. ఈ బిడ్‌ను గెలుచుకున్న బిల్డర్ డీపీవీజి వెంచర్స్‌కి చెందిన యజమానులు మాట్లాడుతూ.. పామ్ బీచ్ రోడ్లో సముద్రానికి ఎదురుగా ఉన్న ప్రధాన ప్లాట్లలో ఇది చివరిది. అందుకే ఇది రికార్డు ధర పలికిందన్నారు. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. వాటికి చెక్, ఈ–కామర్స్ కంపెనీలు ఇలా చేయాల్సిందే! -
స్టీవ్ జాబ్స్ పాత చెప్పులు వేలం: రికార్డు ధర
న్యూఢిల్లీ: యాపిల్ కోఫౌండర్ దివంగత స్టీవ్ జాబ్స్ పాత చెప్పులు రికార్డ్ ధరకు అమ్ముడు బోవడం విశేషంగా నిలిచింది. అమెరికాలో జూలియెన్స్ ఆక్షన్ కంపెనీ ఆదివారం నిర్వహించిన వేలంలో స్టీవ్ జాబ్స్ ధరించిన బిర్కెన్‌స్టాక్ కంపెనీ సాండల్స్ అత్యధిక ధరను దక్కించుకున్నాయి. 2,20,000 వేల డాలర్లు (సుమారు రూ.1.78 కోట్లు) ఒక వ్యక్తి వీటిని సొంతం చేసుకున్నారు. (అరిగిపోయిన చెప్పులకు అన్ని వేల డాలర్లా? ఎవరివో గుర్తు పట్టగలరా?) 1970ల మధ్యకాలంలో స్టీవ్ జాబ్స్‌కి ఎంతో ఇష్టమైన బ్రౌన్ స్వెడ్ బిర్కెన్‌స్టాక్ సాండిల్స్ అత్యధిక ధరతో రికార్డు సృష్టించాయని జూలియన్స్ ఆక్షన్ పేర్కొంది. వేలంలో వీటికి 60 వేల డాలర్ల ధర వస్తుందని భావించారు. ఈ సాండల్స్‌కి నాన్ ఫంజిబుల్ టోకెన్ ధర 2,18.750 డాలర్లుగా నిర్ణయించారు. అయితే, రికార్డు స్థాయిలో రెండు లక్షల ఇరవై వేల డాలర్లు వచ్చాయి. అయితే ఈ సాండల్స్‌ని కొనుగోలు చేసిన ఎవరు కొనుగోలు చేశారు అనే వివరాలను మాత్రం జూలియెన్స్ కంపెనీ వెల్లడించ లేదు. 1976లో స్టీవ్ వోజ్నియాక్ కలిసి కాలిఫోర్నియాలో యాపిల్ కంపెనీని ప్రారంభించారు స్టీవ్ జాబ్స్. ఆధునిక టెక్నాలజీతో, పాపులర్ యాపిల్ ఉత్పత్తులతో ఆధునిక టెక్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న స్టీవ్ జాబ్స్ క్యాన్సర్‌తో 2011లో కన్నుమూశారు. ఇదీ చదవండి: ElonMusk బ్లూటిక్ బాదుడు పక్కా,ముహూర్తం ఫిక్స్ -
తెల్ల బంగారం భళా
గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో పత్తి ఈ సీజన్లో రాష్ట్రంలోనే రికార్డు స్థాయి ధర పలికింది. శుక్రవారం ఇక్కడ జరిగిన ఈ – నామ్ కొనుగోళ్లలో క్వింటాల్‌కు గరిష్టంగా రూ.9,040 పలికింది. ఏడుగురు రైతులు 13.29 క్వింటాళ్ల పత్తిని విక్రయించారు. ఇందులో మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన రైతు కనకయ్యకు చెందిన రెండు క్వింటాళ్ల పత్తిని లక్ష్మీ ట్రేడర్స్ క్వింటాకు అత్యధికంగా రూ.9,040 ధరను కోట్ చేసి కొనుగోలు చేసింది. అత్యల్పంగా రూ.8,750 పలికింది. ఈ విషయాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, కార్యదర్శి జాన్‌వెస్లీలు ధ్రువీకరించారు. -
ప్రకృతి అద్భుతం.. వెల కూడా అదే రేంజ్!
జెనీవా: ప్రకృతిలోని నిజమైన అద్భుతం అది. అందుకే వెల కూడా అదే స్థాయిలో రాబట్టింది. మంగళవారం స్విట్జర్లాండ్ జెనీవాలో క్రిస్టీస్ సంస్థ నిర్వహించిన వేలంపాటలో రికార్డుస్థాయిలో దాదాపు రూ.231 కోట్ల ధర($28.8 millions) పలికింది ఫార్చూన్ పింక్. అత్యంత అరుదైన రత్నం ఇది. ఆసియాకు చెందిన ఒక వ్యక్తి దీనిని సొంతంచేసుకున్నారు. ఆ వ్యక్తి వివరాలు వెల్లడించేందుకు క్రిస్టీస్ జ్యువెలరీ విభాగపు అధినేత మాక్స్ ఫావ్కెట్ నిరాకరించారు. అయితే.. పదిహేనేళ్ల కిందట బ్రెజిల్ గనుల్లో ఆ వజ్రాన్ని సేకరించినట్లు తెలిపారు. ఇక ఇక్కడో ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రపంచంలోనే మొట్టమొదటి పింక్ డైమండ్ ఇండియాలోని గోల్కొండ గనుల్లో 16వ శతాబ్ధంలో బయటపడ్డాయి. ఆపై ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, రష్యా గనుల్లో వీటిని గుర్తించారు. న్యూయార్క్, షాంగై, సింగపూర్, తైవాన్ తర్వాత జెనీవాలో పింక్ డైమండ్స్ వేలం నిర్వహిస్తున్నారు. -
వేలంలో రికార్డ్ ధర పలికిన అస్సాం మనోహరి టీ పొడి.. కిలో ఎంతంటే..
దిస్పూర్: అమ్మాయిలు-అబ్బాయిలు, పేదవారు-ధనికులు, చిన్న- పెద్దవాళ్లు అనే ఏ తేడా లేకుండా అందరూ ఇష్టపడి తాగేది చాయ్(టీ).. మిగతా దేశాలతో పోలిస్తే భారతీయులకు టీ మీదున్న మక్కువ అంతా ఇంతా కాదు.. ఏ పనిలో ఉన్నా ఎక్కడున్న కచ్చితంగా రోజుకు ఒకసారైనా కప్పు టీ తాగాల్సిందే. టీ అనగానే గుర్తొచ్చిది అస్సాం రాష్ట్రం. ఎందుకంటే అక్కడ ఉత్పత్తయ్యే టీ పొడి ఎంతో ప్రత్యేకం. అస్సాంలో ఉత్పత్తి అయిన టీ పొడికి భలే డిమాండ్ ఉంటుంది. అందుకే ఏటా పలు సంస్థలు అరుదైన రకానికి చెందిన కొన్ని టీ పొడులను వేలం వేస్తాయి. ఈ క్రమంలో తాజాగా మనోహరి గోల్డ్ టీ తన రికార్డును తానే బద్దలు కొట్టి మరోసారి చరిత్ర సృష్టించింది. గువాహతి టీ ఆక్షన్ సెంటర్లో జరిగిన వేలంలో మనోహరి గోల్డ్ టీ కిలో టీ పొడి రూ. 99,999కు అమ్ముడుపోయింది. గతేడాది వేలంలో ఈ ధర రూ.75,000గా ఉంది. సౌరవ్ టీ ట్రేడర్స్అనే సంస్థ మంగళశారం ఉదయం కిలో టీ పొడిని రూ. 99,999కు కొనుగోలు చేసింది. చదవండి: షాకింగ్: బార్లో సీక్రెట్ రూమ్.. అద్దం పగలగొడితే 17 మంది యువతులు.. ఈ సందర్భంగా మనోహరి టీ ఎస్టేట్ యాజమాని రాజన్ లోహియామాట్లాడుతూ.. టీ వేలంలో మరోసారి చరిత్ర సృష్టించామన్నారు. టీ పొడి నాణత్యలో రాజీపడమని స్పష్టం చేశారు. అస్సాం టీకి కీర్తిని తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా ప్రస్తుతం అస్సాంలో మొత్తం 800కి పైగా టీ తోటలు ఉన్నాయి. ఏటా 650 మిలియన్ కిలోల టీని అసోం ఉత్పత్తి చేస్తుంది. ఇది దేశంలోని టీ ఉత్పత్తిలో 52 శాతం. చదవండి: రోడ్డు ప్రమాదానికి గురైన ఆరోగ్యశాఖ మంత్రి .. ఆసుపత్రికి తరలింపు -
ఇదేం మేకపోతురా నాయనా.. ఏకంగా రూ. 15లక్షలు పలికింది
సిడ్నీ: సాధారణంగా మేకలు, గొర్లను మందగా అమ్మితే ఒక రేటు.. విడివిడిగా అమ్మితే ఒకలాంటి రేటు పడుతుంది. వయసు, బరువు ఆధారంగా వాటి ధర ఉంటుంది. ఎంత ఉత్తమ జాతికి చెందిన మేక, గొర్రె అయినా సరే.. మహా అయితే లక్ష రూపాయలు ఖరీదు చేస్తుందేమో. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే వార్త విని మీరు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడబోయేది చాలా ప్రత్యేకమైన మేకపోతు. అందుకే అది ఏకంగా 21 వేల డాలర్లు అనగా.. 15,64,983 రూపాయల ధర పలికింది. ఏంటి ఓ మేకపోతు ధర 15 లక్షల రూపాయలా.. ఏంటి దాని ప్రత్యేకత.. అది ఏమన్నా బంగారు ఉన్ని కలిగి ఉందా ఏంటి అనే ప్రశ్నలు తలెత్తక మానవు. ఇక ఇంత ఖరీదు కలిగిన మేకపోతు ఎక్కడ ఉంది.. ఎవరు దానికి అంత ధర చెల్లించారు వంటి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే. (చదవండి: ఈ ‘ఫ్రెండ్షిప్’కి నెటిజనులు ఫిదా.. ఏకంగా 13 మిలియన్లకు పైగా వ్యూస్) ఆస్ట్రేలియాకు చెందిన మర్రకేశ్ అనే పేరు కలిగిన ఈ మేకపోతు ప్రపంచలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. పశ్చిమ న్యూ సౌత్ వేల్స్ పట్టణంలోని కోబార్‌లో బుధవారం ఈ మేక పోతు అమ్మకానికి వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన అత్యంత ఖరీదైన మేక పోతును ఆండ్రూ మోస్లీ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. (చదవండి: మేకలతో జూమ్ మీటింగ్... ఆదిరిపోయే ఆదాయం) ‘‘ఈ మేక పోతు చాలా అందంగా, ధ్రుడంగా ఉంది. మరీ పెద్దగా కాకుండా.. మరీ చిన్నదిగా కాకుండా.. మధ్యస్థంగా ఉంది. ఈ మేక పోతు చాలా త్వరగా ఎదుగుతుంది. మందతో చాలా త్వరగా కలసిపోతుంది’’ అని తెలిపాడు. గతంలో ఆస్ట్రేలియాలో ఓ మేక 12 వేల డాలర్లు పలకగా.. తాజాగా మర్రకేస్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. చదవండి: నాతో సెల్ఫీ అంటే మామూలు విషయం కాదు.. దిమ్మతిరిగిందా! -
టన్ను బత్తాయి ధర ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభ సమయంలో డిమాండ్ పెరగడంతో బత్తాయికి రికార్డు స్థాయిలో ధర లభించింది. హోల్‌సేల్ మార్కెట్లో టన్ను బత్తాయి ధర రూ.లక్ష పలుకుతోంది. సామాన్యులు మార్కెట్లో కొనుగోలు చేయాలంటే కిలో బత్తాయి రూ.100 కు విక్రయిస్తున్నారు. ఈ ధర గతంలో ఎప్పుడూ లేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. విటమిన్–సి పుష్కలంగా ఉండడంతో డాక్టర్లు కోవిడ్ పేషెంట్లను బత్తాయి తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో చాలా మంది బత్తాయి పండ్లను కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ కొత్తపేట్‌లో శుక్రవారం గతంలో ఎన్నడూలేని విధంగా టన్ను లక్ష రూపాయలు పలికింది. మరోవైపు రోజు మార్కెట్‌కు 800 టన్నుల బత్తాయి దిగుబడి రావాలి. కానీ గత నెల నుంచి డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక కూడా ధరలు విపరీతంగా పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం కేవలం 300 టన్నుల బత్తాయి మాత్రమే మార్కెట్‌కు దిగుమతి అవుతోందని మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. కరోనా కాలంలో కొత్తపేట పండ్ల మార్కెట్ నుంచి బత్తాయి ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ధర టన్ను బత్తాయి ధర రూ.లక్ష పలకడం కొత్తపేట మార్కెట్ చరిత్రలోనే రికార్డు. కోవిడ్ నేపథ్యంలో బత్తాయి వినియోగం దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగింది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు ఇక్కడి మార్కెట్ నుంచే ఎగుమతులు అవుతాయి. ఈ ఏడాది బత్తాయి పూత సమయంలో వర్షాలతో పూత రాలి దిగుబడి తగ్గింది. దీంతో కూడా డిమాండ్‌కు మేర సరుకు లేక ధర పెరిగింది. – సయ్యద్ అఫ్సర్, హోల్‌సేల్ వ్యాపారి, కొత్తపేట చదవండి: అమ్మ నా ‘బత్తాయో’..! ధర అంతేంటి? -
బాప్రే.. బంగారు నాణేనికి రూ.142 కోట్లు!
అమెరికా బంగారునాణెం ‘డబుల్ ఈగల్’కు వేలంలో రికార్డు స్థాయిలో రూ.142 కోట్ల ధర పలికింది. ఫ్యాషన్ డిజైనర్ స్టువార్ట్ వీట్జమన్‌కు చెందిన ఈ నాణేన్ని మంగళవారం వేలం వేశారు. 20 డాలర్ల ఈ బంగారు నాణేలను 1933లో తయారుచేసినా... తీవ్ర ఆర్థిక మంద్యాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ డబుల్ ఈగల్ నాణేలను చలామణికి విడుదల చేయకుండా ఆపేశారు. నాణేలను కరిగించమని ఆదేశించారు. అప్పుడు బయటికి వచ్చి రెండింటిలో ఇదొకటి. డబుల్ ఈగిల్‌పై ఒకవైపు లేడీ లిబర్టీ, రెండో వైపు అమెరికన్ ఈగిల్ బొమ్మలు ముద్రించి ఉన్నాయి. 1794కు చెందిన ‘ఫ్లోయింగ్ హెయిర్’ వెండి నాణేం 2013లో 73 కోట్లకు అమ్ముడుపోయి అత్యధిక ధర పలికిన నాణేంగా రికార్డులకెక్కింది. మంగళవారం డబుల్ ఈగిల్ రూ.142 కోట్లు పలికి ఈ రికార్డును తిరగరాసింది. చదవండి: 24 వేల ఏళ్ల తర్వాత బతికొచ్చాయి! World Oceans Day: ‘ప్లాస్టిక్’ సముద్రాలు! -
అరుదైన బౌల్.. ధర 3.6 కోట్లు!
ఓ పింగాణీ బౌల్ ధర ఎంతుంటుంది. మహా అయితే ఓ వంద, లేదంటే ఓ వెయ్యి రూపాయల వరకూ ఉండొచ్చు. మరింత కళాత్మకమైతే మరికాస్త ఎక్కువగా ధర పలకవచ్చు. కానీ అమెరికాలో వేలానికి వచ్చిన ఓ పింగాణీ బౌల్ ధర చూస్తే.. కళ్లు చెదరక మానవు. ఆ బౌల్ ధర సింపుల్‌గా రూ. 3.6 కోట్ల వరకూ ఉంటుందని వేలంపాట నిర్వాహకులు అంచనా వేశారు. ఎందుకు ఇంత ధర అంటే.. ఆ పాత్రకు కనీసం ఆరు వందల ఏళ్ల వయసు ఉంటుందట. ఈ పురాతన కప్పును ఈనెల 17న న్యూయార్క్‌లో సోథేబీ కంపెనీ వేలంపాటలో విక్రయించనుంది. అది చైనీస్ కప్పు కనెక్టికట్‌కు చెందిన ఓ పాత వస్తువుల వ్యాపారి గతేడాది ఆ బౌల్‌ను రూ. 2,500కు కొనుగోలు చేశాడు. కొంతకాలం తన దగ్గర ఉంచుకున్నాక దానిలో ఏదో ప్రత్యేకత ఉందని కనిపెట్టాడు. వెంటనే సోథేబీ కంపెనీని సంప్రదించాడు. ఆ బౌల్ చరిత్ర చెప్పాలని, విలువ కట్టాలని కోరాడు. బౌల్‌ను పరిశీలించిన కంపెనీ వాళ్లు కంగుతిన్నారు. ఇది అరుదైన బౌల్ అని, వేలం వేస్తే 5 లక్షల డాలర్ల వరకూ పలుకుతుందని చెప్పారు. దీంతో ఆ వ్యాపారి ఉబ్బితబ్బిబయ్యాడు. ఆ పాత్రను లోటస్ బౌల్‌గా పిలుస్తారు. ఆ బౌల్ 1403 నుంచి 1424 వరకూ చైనాను ఏలిన యోంగిల్ చక్రవర్తి కాలం నాటిది. ఇలాంటి కప్పులు మరో ఆరు మాత్రమే ఇప్పుడు ఉన్నాయని సోథేబీ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. తైపీలోని నేషనల్ మ్యూజియంలో రెండు, లండన్ మ్యూజియంలో రెండు, టెహ్రాన్ మ్యూజియంలో ఒకటి అలాంటి కప్పులు ఉన్నాయట. అందమైన ఆర్టు అందమైన ఆర్టుతో ఉన్న ఈ బౌల్‌ను చూస్తే.. వావ్ అద్భుతం అనకుండా ఉండరేమో. 6 అంగుళాల తెల్లటి పాత్ర లోపల, బయటా నీలం రంగులో కళాత్మకంగా తీర్చిదిద్దిన పూల బొమ్మలతో ఆకట్టుకుంటుంది. ఆ బౌల్‌ను పట్టుకుంటే ఎంతో సున్నితంగా, సిల్కును తలపిస్తోంది. 15వ శతాబ్దపు రంగులు, డిజైన్లు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆ పాత్ర ఎంతో అద్భుతంగా ఉందని సోథేబీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మెక్ అటీర్ అన్నారు. పాత్ర పెయింటింగ్, షేప్ ఎంతో యునిక్‌గా ఉందని ఆయన ముచ్చట పడుతూ చెప్పారు. ఇంత పురాతన వస్తువు పాత వస్తువుల వ్యాపారి వద్దకు ఎలా వచ్చిందనేది తెలియడం లేదన్నారు. తరతరాలుగా వారసుల చేతులు మారుతూ ఇక్కడికి వచ్చి ఉంటుందని, దాని విలువ తెలియక పోవడంతో వారు అమ్మేసుకుని ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి వస్తువులు ఇంకా ఉండటం సంతోషమని, దాని వేలం నిర్వహించడం గొప్పగా భావిస్తున్నామని తెలిపారు. -
జత ఎద్దుల ధర రికార్డు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని మాలూరు తాలూకా తేర్నహళ్లి గ్రామంలో శ్రీ సఫళాంబ దేవి జాతరలో ఆదివారం పశువుల విక్రయాలు జోరుగా సాగాయి. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఎద్దులతో తరలివచ్చారు. బెంగళూరు రూరల్ జిల్లా దేవనహళ్లి తాలూకా రెడ్డిహళ్లి గ్రామానికి చెందిన రైతు వెంకటరెడ్డికి చెందిన జత ఎద్దులు 10 లక్షల రూపాయలకు అమ్ముడు పోయి రికార్డు సృష్టించాయి. -
ఈ గొర్రె ధర రూ. 70 లక్షలు
పుణే: సాధారంగా ఒక గొర్రె కొనుగోలు ధర మహా అయితే రూ.5 నుంచి రూ. 10 వేల మధ్యలో ఉంటుంది. కానీ, మాడ్గల్ జాతి గొర్రె అందుకు భిన్నం అని నిరూపించింది. అది చాలా అరుదైన గొర్రె జాతి, దాని మాంసానికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. తాజాగా మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఓ వ్యక్తి రూ.70 లక్షలు పెట్టి మాడ్గాల్ జాతి గొర్రెను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చాడు. కానీ, దాని అమ్మకానికి యజమాని ఒప్పుకోలేదు. సాంగ్లీ జిల్లాలోని మాడ్గల్ గ్రామం ఈ జాతి గొర్రెలుకు చాలా ప్రసిద్ధి. ఆ గొర్రె యజమాని బాబు మెట్కారికి సాంగ్లీ జిల్లాలోని మాడ్గల్ గ్రామంలో సుమారు 200 గొర్రెలను కలిగి ఉన్నారు. కానీ, మాడ్గల్ జాతి గొర్రెను రూ.70 లక్షలకు కొనడానికి ఓ వ్యక్తి ముందుకొచ్చినప్పుడు తనకు చాలా ఆశ్చర్యం కలిగిందని తెలిపారు. కానీ, దాన్ని అమ్మడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నాడు. ఆ గొర్రె అసలు పేరు షార్జా అని కానీ, దానికి మోదీ అని నామకరణం చేశామని తెలిపారు. చదవండి: కృత్రిమ మేధ: మన నట్టిళ్లల్లోకి.. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటూ చాలా ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. అయితే మాడ్గల్ గొర్రె కూడా అన్ని మార్కెట్లలో తన డిమాండ్‌ను పెంచుకుంటుందని ఆ పేరు పెట్టినట్లు తెలిపారు. అదే విధంగా తన కుంటుంబానికి ఆ గొర్రె చాలా అదృష్టమని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మబోనని చెప్పారు. సదరు వ్యక్తి దాన్ని కొనుగోలు చేయడానికి రూ.75 లక్షలు ఆఫర్ చేశారు. కానీ, తాను రూ. కోటీ 50 లక్షలకు మాత్రమే అమ్ముతానని చెప్పానని తెలిపారు. ఎందుకంటే ఓ గొర్రెను కొనుగోలు చేయడానికి రూ. కోటీ 50 లక్షలు ఖర్చుచేయరని భావించి అమాంతం దాని ధరను పెంచినట్లు తెలిపారు. ఆ గొర్రెను అమ్మడం ఇష్టం లేకనే దాని ధరను పెంచానని పేర్కొన్నారు. చదవండి: ఒక్కో బొమ్మకు ఒక్కో అమ్మాయి పేరు -
పావురాల యందు ‘న్యూకిమ్ పావురం’ వేరయా
చూస్తా ఉంటే.. హైదరాబాద్ సిటీలో గల్లీగల్లీలో తిరిగే పావురంలాగే ఉంది కదా.. కానీ న్యూకిమ్ అనే ఈ రెండేళ్ల రేసు పావురం ధర వింటే.. మనం కిమ్మనం.. ఎందుకంటే.. దీని ధర రూ.8 కోట్లకు పైనే.. ఈ మధ్యే బెల్జియంకు చెందిన రేసు పావురాల పెంపకందారుడు తన దగ్గర ఉన్న పావురాలను ఆన్లైన్లో వేలం వేస్తే.. చైనాకు చెందిన ఓ వ్యక్తి న్యూ కిమ్‌కు ఈ వెల చెల్లించి పాడుకున్నాడు. రెండేళ్లే కానీ.. ఈ పావురం చాలా రేసుల్లో పాల్గొని గెలిచిందట.. దీని అమ్మ, అక్క కూడా రేసుల్లో గెలిచినవేనట.. అయితే ఇంత ధర ఇచ్చి.. దీన్ని రేసుల్లో వాడకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే.. అక్కడ గాయపడినా.. ఏం జరిగినా.. ఇంత సొమ్మూ బూడిదలో పోసినట్లు అవుతుందని.. ఇలాంటి మేలు జాతి పావురాల పునరుత్పత్తికి దీన్ని వినియోగించవచ్చని చెబుతున్నారు. ఏ ఫిష్ అండ్ ద ఫిషర్ మ్యాన్ గొంతులో చేప ముల్లు ఇరుక్కోవడం కామనే.. కానీ ఏకంగా చేపే ఇరుక్కుంటే.. ఏమవుతుంది? ఏమో మనకేం తెలుస్తుంది.. ఈజిప్టుకు చెందిన మత్స్యకారుడిని అడిగితే తెలుస్తుంది.. శ్వాస అందక.. మాట రాక.. తెగ ఇబ్బందిపడిపోయాడట.. కాస్త ఆగితే.. పోయేటట్లు ఉన్నాడని వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన బెనీ సుయిఫ్ పట్ట ణంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ అలీ అల్ హజ్రీ అనే డాక్టరుగారు.. మంచి హస్తవాసి.. ఆయనే ఎండోస్కోపీ సాయంతో ఇదిగో ఇలా గొంతులోని చేపను బయటకు తీశారు.. కొంచెం లేటైనా.. ఇతడి ఫొటోకు దండ పడేదని.. సమయానికి తేవడంతోనే ప్రాణాలు కాపాడగలిగామని డాక్టర్‌గారు చెప్పారు. ఇంతకీ ఇతడి గొంతులోకి చేప ఎలా వెళ్లిందో తెలుసా? నైలు నది ఒడ్డున ఎర వేసి చేపలు పడుతున్న మనోడికి ఈ చిన్న ఫిష్ చిక్కిందట. దాన్ని ఓ చేత్తో పట్టుకుని.. ఉన్నంతలోనే మరో ఎరకు కూడా చేప చిక్కిందట.. దీన్ని చేత్తో పట్టుకుని.. తీయాలంటే అవడం లేదు.. దాంతో ఆ చేపను మిస్ చేయకూడదని.. ఈ చేపను అలా నోట్లో పెట్టుకున్నాడట.. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో.. మేం మీకు చెప్పాలా ఏంటి.. ఈ చిన్నది చిక్కదు దొరకదు వలలో ఎంత పెద్ద చేప పడితే.. అంత గొప్ప.. మరీ చిన్న చేప పడిందనుకోండి.. ఇక చిన్నతనమే అన్నట్లు.. జపాన్‌లో మాత్రం అలా కాదు.. అక్కడ ఎంత చిన్న చేప పట్టగలిగితే.. అంత గొప్ప అన్నట్లు.. ఎందుకంటే.. సూక్ష్మ కళలో జపానోళ్లు సుప్రసిద్ధులు కదా.. గార్డెనింగ్ నుంచి ఇటు ఆర్కిటెక్చర్ వరకూ.. అందరికీ తెలిసిందే.. అలాగే చేపలు పట్టడం విషయంలోనూ.. అక్కడ నువ్వు ఎంత చిన్న చేపను పట్టగలిగితే.. నీకు అంత నైపుణ్యం ఉన్నట్లన్నమాట. దీన్ని టనాగో ఫిషింగ్ అంటారు.. చేపలు పట్టడంలో జపాన్‌లో ఇదో పురాతన ప్రక్రియ. అలాగని.. వీటిని పట్టడం అంత ఈజీ కానే కాదు.. అందుకే వీటికి ప్రత్యేకమైన ఎరలు సిద్ధం చేస్తారు. బోలెడంత ఓపిక, నైపుణ్యం అవసరం.. ఇక్కడెలా ఉన్నా.. అతి చిన్న చేప పట్టావంటే.. నువ్వక్కడ తోపు అన్నట్లే.. సో.. స్మాల్ ఈజ్ బ్యూటీఫుల్ -
గాంధీ కళ్లద్దాలకు రూ. 2.55 కోట్లు
లండన్: మహాత్మాగాంధీ ధరించాడని భావిస్తున్న బంగారుపూత పూసిన కళ్లద్దాలు బ్రిటన్‌లో రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. ఈస్ట్ బ్రిస్టల్ ఆక్షన్స్ సంస్థ నిర్వహించిన వేలంలో ఈ కళ్లజోడు 2,60,000 పౌండ్ల (రూపాయలు 2.55 కోట్లు)కు అమ్ముడైంది. దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ పెట్రోలియంకు పనిచేస్తున్న సమయంలో, 1910– 1930 మధ్యకాలంలో బ్రిటన్ దేశస్తుడికి ఇవి బహుమతిగా వచ్చాయి. తర్వాత ఆయన తన బంధువులకు వీటిని అందజేశారు. సౌత్ గ్లూసెస్టర్‌షైర్‌లో నివసించే వ్యక్తి 50 ఏళ్లుగా తమ ఇంట్లో ఉన్న ఈ కళ్లజోడును వేలం వేయాల్సిందిగా కోరారు. 10 నుంచి 15 వేల పౌండ్లు పలుకుతాయని భావించారు. అయితే ఏకంగా రెండు లక్షల అరవై వేల పౌండ్లకు అమెరికాకు చెందిన ఒక వ్యక్తి దీన్ని సొంతం చేసుకున్నాడు. భారత్, ఖతార్, అమెరికా, రష్యా, కెనడాల నుంచి పలువురు వేలం పాటలో పాల్గొన్నారు. ఇంత ధర పలకడంతో వేలానికి పెట్టిన వ్యక్తి ఆనందంతో తబ్బిబ్బయ్యారు. ఈ సొమ్మును కూతురుతో పంచుకుంటానని చెప్పారు. -
అద్భుత కళాఖండం.. ధరెంతో తెలిస్తే!!
ప్రఖ్యాత ఫ్రెంచ్ చిత్రకారుడు క్లాడ్ మోనెట్ కుంచె నుంచి జాలువారిన ఓ కళాఖండం వేలంలో రికార్డు ధర పలికింది. మ్యూల్స్‌గా నామకరణం చేసిన ఈ పెయింటింగ్ మంగళవారం 110.7 మిలియన్ డాలర్ల(దాదాపు 778 కోట్ల రూపాయలు)కు అమ్ముడు పోయింది. తద్వారా అత్యధిక ధరక పలికిన ఇమ్‌ప్రెసినిస్ట్ పెయింటింగ్‌గా చరిత్ర సృష్టించింది. హేస్టాక్ కలెక్షన్లో భాగంగా ఓ సంస్థ ఈ ఏడాది నిర్వహించిన వేలంలో మ్యూల్స్ సహా కేవలం మూడు పెయింటింగులు మాత్రమే అమ్ముడుపోయాయి. కాగా ఫ్రాన్స్‌లో రూపుదిద్దుకున్న ఫ్రెంచ్ ఇమ్‌ప్రెనిజమ్(సంప్రదాయేతర పద్ధతిలో, విభిన్న కోణాల్లో పెయింటింగ్‌లు వేయడం)కు క్లాడ్ మోనెట్‌ను ఆద్యుడిగా పేర్కొంటారు. ఆయన పెటియింగ్‌లకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. అనేక మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన 86 ఏళ్ల వయస్సులో 1926లో మరణించారు. ఇక తన పొరుగింటి వ్యక్తికి చెందిన కోతకొచ్చిన గోధుమ పంటను 25 రకాల పెయిటింగ్‌లలో మోనెట్ అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సిరీస్‌లో భాగమైన ఓ పెయింటింగ్‌కు మ్యూల్స్ అని పేరు పెట్టారు. మోనెట్ కుంచె నుంచి జాలువారిన అద్భుత కళాఖండాలను హేస్టాక్ కలెక్షన్ అని పిలుస్తారు. కాగా మంగళవారం నాటి వేలంలో భాగంగా కేవలం 8 నిమిషాల్లోనే మ్యూల్స్ అమ్ముడుపోయింది. అయితే మ్యూల్స్‌ను సొంతం చేసుకున్న వ్యక్తి వివరాలను నిర్వాహకులు వెల్లడించలేదు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ‘పెయింటింగ్‌కు ఇంత ధరా. నమ్మలేకపోతున్నాం రా బాబూ’ అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. -
పొగాకు @181
♦ కొండపి వేలం కేంద్రంలో రికార్డు ధర నమోదు ♦ ఏపీలోనే అత్యధికం అంటున్న అధికారులు కొండపి: నియోజకవర్గ కేంద్రమైన కొండపిలోని పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం మేలి రకమైన పొగాకుకు రికార్డు ధర లభించింది. అత్యధికంగా కిలో 181 రూపాయలు పలికింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వేలం కేంద్రాల్లోకి ఇదే అత్యధిక ధర అని వేలం కేంద్రం నిర్వహణ అధికారి మధుసూదనరావు తెలిపారు. కొండపి వేలం కేంద్రం పరిధిలోని అక్కచెరువుపాలెం, గోగినేనిపాలెం, పైడిపాడు, చతుకుపాడు, అగ్రహారం గ్రామాల నుంచి శుక్రవారం రైతులు 692 బేళ్లు అమ్మకానికి తీసుకొచ్చారు. వ్యాపారులు అందులో 482 బేళ్లు కొనుగోలు చేశారు. అత్యధిక ధర కిలో 181 రూపాయలు పలకగా అత్యల్ప ధర కేజీ 74 రూపాయలు పలికింది. సరాసరి ధర కేజీ 141.91 రైతుకు దక్కింది. ఇదిలా ఉండగా ఒకటీఅరా బేళ్లకు అత్యధిక ధర చూపుతున్న వ్యాపారులు మిగతావి తక్కువ ధరలకు కొంటున్నారనేది రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు.