సిడ్నీ: సాధారణంగా మేకలు, గొర్లను మందగా అమ్మితే ఒక రేటు.. విడివిడిగా అమ్మితే ఒకలాంటి రేటు పడుతుంది. వయసు, బరువు ఆధారంగా వాటి ధర ఉంటుంది. ఎంత ఉత్తమ జాతికి చెందిన మేక, గొర్రె అయినా సరే.. మహా అయితే లక్ష రూపాయలు ఖరీదు చేస్తుందేమో. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే వార్త విని మీరు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతారు.
ఎందుకంటే ఇప్పుడు మీరు చూడబోయేది చాలా ప్రత్యేకమైన మేకపోతు. అందుకే అది ఏకంగా 21 వేల డాలర్లు అనగా.. 15,64,983 రూపాయల ధర పలికింది. ఏంటి ఓ మేకపోతు ధర 15 లక్షల రూపాయలా.. ఏంటి దాని ప్రత్యేకత.. అది ఏమన్నా బంగారు ఉన్ని కలిగి ఉందా ఏంటి అనే ప్రశ్నలు తలెత్తక మానవు. ఇక ఇంత ఖరీదు కలిగిన మేకపోతు ఎక్కడ ఉంది.. ఎవరు దానికి అంత ధర చెల్లించారు వంటి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.
(చదవండి: ఈ ‘ఫ్రెండ్‌షిప్’కి నెటిజనులు ఫిదా.. ఏకంగా 13 మిలియన్లకు పైగా వ్యూస్)
ఆస్ట్రేలియాకు చెందిన మర్రకేశ్ అనే పేరు కలిగిన ఈ మేకపోతు ప్రపంచలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. పశ్చిమ న్యూ సౌత్ వేల్స్ పట్టణంలోని కోబార్‌లో బుధవారం ఈ మేక పోతు అమ్మకానికి వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన అత్యంత ఖరీదైన మేక పోతును ఆండ్రూ మోస్లీ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు.
(చదవండి: మేకలతో జూమ్ మీటింగ్... ఆదిరిపోయే ఆదాయం)
‘‘ఈ మేక పోతు చాలా అందంగా, ధ్రుడంగా ఉంది. మరీ పెద్దగా కాకుండా.. మరీ చిన్నదిగా కాకుండా.. మధ్యస్థంగా ఉంది. ఈ మేక పోతు చాలా త్వరగా ఎదుగుతుంది. మందతో చాలా త్వరగా కలసిపోతుంది’’ అని తెలిపాడు. గతంలో ఆస్ట్రేలియాలో ఓ మేక 12 వేల డాలర్లు పలకగా.. తాజాగా మర్రకేస్ ఆ రికార్డును బ్రేక్ చేసింది.
చదవండి: నాతో సెల్ఫీ అంటే మామూలు విషయం కాదు.. దిమ్మతిరిగిందా!
Comments
Please login to add a commentAdd a comment