పుణే: సాధారంగా ఒక గొర్రె కొనుగోలు ధర మహా అయితే రూ.5 నుంచి రూ. 10 వేల మధ్యలో ఉంటుంది. కానీ, మాడ్గల్ జాతి గొర్రె అందుకు భిన్నం అని నిరూపించింది. అది చాలా అరుదైన గొర్రె జాతి, దాని మాంసానికి మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. తాజాగా మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఓ వ్యక్తి రూ.70 లక్షలు పెట్టి మాడ్గాల్ జాతి గొర్రెను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చాడు. కానీ, దాని అమ్మకానికి యజమాని ఒప్పుకోలేదు. సాంగ్లీ జిల్లాలోని మాడ్గల్ గ్రామం ఈ జాతి గొర్రెలుకు చాలా ప్రసిద్ధి. ఆ గొర్రె యజమాని బాబు మెట్కారికి సాంగ్లీ జిల్లాలోని మాడ్గల్ గ్రామంలో సుమారు 200 గొర్రెలను కలిగి ఉన్నారు. కానీ, మాడ్గల్ జాతి గొర్రెను రూ.70 లక్షలకు కొనడానికి ఓ వ్యక్తి ముందుకొచ్చినప్పుడు తనకు చాలా ఆశ్చర్యం కలిగిందని తెలిపారు. కానీ, దాన్ని అమ్మడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నాడు. ఆ గొర్రె అసలు పేరు షార్జా అని కానీ, దానికి మోదీ అని నామకరణం చేశామని తెలిపారు. చదవండి: కృత్రిమ మేధ: మన నట్టిళ్లల్లోకి..
నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటూ చాలా ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. అయితే మాడ్గల్ గొర్రె కూడా అన్ని మార్కెట్లలో తన డిమాండ్‌ను పెంచుకుంటుందని ఆ పేరు పెట్టినట్లు తెలిపారు. అదే విధంగా తన కుంటుంబానికి ఆ గొర్రె చాలా అదృష్టమని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మబోనని చెప్పారు. సదరు వ్యక్తి దాన్ని కొనుగోలు చేయడానికి రూ.75 లక్షలు ఆఫర్ చేశారు. కానీ, తాను రూ. కోటీ 50 లక్షలకు మాత్రమే అమ్ముతానని చెప్పానని తెలిపారు. ఎందుకంటే ఓ గొర్రెను కొనుగోలు చేయడానికి రూ. కోటీ 50 లక్షలు ఖర్చుచేయరని భావించి అమాంతం దాని ధరను పెంచినట్లు తెలిపారు. ఆ గొర్రెను అమ్మడం ఇష్టం లేకనే దాని ధరను పెంచానని పేర్కొన్నారు. చదవండి: ఒక్కో బొమ్మకు ఒక్కో అమ్మాయి పేరు
Comments
Please login to add a commentAdd a comment