ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ధర ఎక్కువైనా కొనేందుకు యువత ఆసక్తి చూపిస్తుంటారు. యూజర్ల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడల్‌లను యాపిల్ సంస్థ మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ప్రస్తుత తాజా మోడల్ ఐఫోన్ 15 హవా నడుస్తోంది.
అయితే 2007లో విడులైన మొదటి తరం ఐఫోన్ తాజాగా జరిగిన వేలంలో రూ. 1.3 కోట్లకు (158,000 డాలర్లు) అమ్ముడుపోయింది.ఇప్పటివరకు వేలంలో అమ్ముడుపోయిన అత్యంత విలువైన ఐఫోన్‌గా ఇది కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఐఫోన్‌కు టెక్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈ ఫోన్ రూపొందించడంలో పాలుపంచుకున్న ఇంజనీర్‌లలో ఒకరికి చెందినది.
మొదటి తరం ఐఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్, టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్, ఆసక్తికరమైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లను విప్లవాత్మకంగా మార్చారు. కాగా వేలానికి ఉంచిన ఈ ఐఫోన్ 16 ఏళ్లయినా ఇప్పటికీ అంతే కొత్తగా ఉంది. అందుకే వేలంలో అత్యధిక విలువను దక్కించుకుంది.
ఇదీ చదవండి ➤ మొబైల్ నంబర్.. మీకు నచ్చినట్టు..
ఈ ఐకానిక్ ఐఫోన్ 4జీబీ వెర్షన్‌ను ఎల్‌సీజీ సంస్థ వేలం వేసింది. 50,000 డాలర్ల నుంచి 100,000 డాలర్లు (రూ.41 లక్షలు నుంచి రూ.82 లక్షలు) మధ్య అమ్ముడుపోతుందని ఈ సంస్థ అంచనా వేసింది. అయితే అనూహ్యంగా 158,644 డాలర్లకు అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ. 1.3 కోట్ల భారీ ధరను దక్కించుకుని కొత్త రికార్డు సృష్టించింది.
వాస్తవానికి 2007లో విడుదలైన మొదటి తరం ఐఫోన్ 4జీబీ వర్షన్ ధర కేవలం 499 డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 40 వేల కంటే తక్కువే. ఈ ఐఫోన్ మార్కెట్‌లోకి వచ్చిన 16 ఏళ్ల తర్వాత 318 రెట్లు అధిక ధరకు అమ్ముడుపోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment