
గజ్వేల్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు
గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో పత్తి ఈ సీజన్‌లో రాష్ట్రంలోనే రికార్డు స్థాయి ధర పలికింది. శుక్రవారం ఇక్కడ జరిగిన ఈ – నామ్ కొనుగోళ్లలో క్వింటాల్‌కు గరిష్టంగా రూ.9,040 పలికింది. ఏడుగురు రైతులు 13.29 క్వింటాళ్ల పత్తిని విక్రయించారు.
ఇందులో మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన రైతు కనకయ్యకు చెందిన రెండు క్వింటాళ్ల పత్తిని లక్ష్మీ ట్రేడర్స్ క్వింటాకు అత్యధికంగా రూ.9,040 ధరను కోట్ చేసి కొనుగోలు చేసింది. అత్యల్పంగా రూ.8,750 పలికింది. ఈ విషయాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, కార్యదర్శి జాన్‌వెస్లీలు ధ్రువీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment