సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీస్ కానిస్టేబుల్ బాలకృష్ణ తన భార్య, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ క్రమంలో బాలకృష్ణ మృతిచెందగా.. భార్య, పిల్లలు ప్రాణాల కోసం ఆసుపత్రిలో పోరాడుతున్నారు.
వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలకుంట కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. 17వ బెటాలియన్ చెందిన ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ.. తన భార్య, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వారందరికీ ముందు పురుగుల మందు ఇచ్చిన తర్వాత తాను ఉరివేసుకుని బాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ క్రమంలో బాలకృష్ణ మృతిచెందాడు. పురుగుల మందు తాగిన ఆయన భార్య, పిల్లలను స్థానికులు గుర్తించడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment